Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏం సమాజమిది! | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

ఏం సమాజమిది!

Sun 08 May 06:21:44.222576 2022

'చుట్టూ పదిమంది వున్నారు. పది మంది కాళ్లూ పట్టుకన్నాను. కాపాడమని, వాళ్ళతోనూ మొరపెట్టుకున్నాను. ఎవరూ నా దీన వేడుకోలును వినిపించుకోలేదు. ఇప్పుడెందుకు వస్తున్నారు? ఎవరైనా నాగరాజును తీసుకొస్తారా! ఛీ! సమాజం మీద ఉమ్ముతున్నాను!' కన్నీళ్లు గుండెల్లోంచి ఉబికి రాగా గద్గద స్వరంతో ఆశ్రిన్‌ సుల్తానా పలికిన పలుకులివి. ఆ సన్నివేశం చూస్తుంటే కన్నీళ్లు రానివారుండరు. అంతటి హృదయవిదారక దృశ్యమది. దు:ఖంలో, ఆవేశంతో అన్నమాటలయినప్పటికీ, చాలా సమంజసమయిన మాటలు. ఎందుకంటే సమాజం అంతటి గడ్డకట్టిన, స్పందనలేని స్థితిలోకి వచ్చేసినట్లే వుంది. ఇతరుల దు:ఖాల పట్ల, పరుల ప్రాణాల పట్ల ఏ కోశాన బాధపడలేని జడ పదార్థంగా సమాజం మారిపోయిందనే ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
మొన్న హైద్రాబాద్‌ నగరంలో నడిరోడ్డుపైన ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు ఆశ్రిన్‌ సుల్తానాలు బైక్‌పై వెళ్తుండగా ఆపి, నాగరాజును దారుణంగా కొట్టి చంపుతోంటే, ఆశ్రిన్‌ చుట్టూ వున్న వారిని ఎంత వేడుకున్నా ఎవరూ ఆపలేకపోయారు. అందుకే ఆ అమ్మాయి తూ... అంటూ సమాజంపై ఉమ్మి వేసింది. చంపింది ఎవరో కాదు.. ఆశ్రిన్‌ సోదరుడే. మతాంతర వివాహం, వద్దన్నా వినకుండా చేసుకుందన్న కక్షతో పథకం ప్రకారం హత్య చేశారు. ఇది మతాంతర హత్యేకాదు, ఇందులో కుల కోణం కూడా వుంది. నాగరాజు దళితుడు. ఇస్లాం మతాన్ని స్వీకరించేందుకూ ఇష్టపడ్డాడు. అయినా దారుణంగా చంపబడ్డాడు. ఈ పరువు హత్య కొత్తదేమీ కాదు. మొన్నీమధ్యనే భువనగిరిలోనూ జరిగింది. అంతక్రితం అనేకమూ జరిగాయి. మన సమాజంలో తరాలుగా కులపీడన, కుల వివక్షత, కుల అసమానతలు కొనసాగుతూ వున్నాయి. నేటికీ ఆ జాడ్యం వొదలలేదు. మతాల్లోనూ కులాలున్నాయి. వ్యవస్తీకృతమై మరీ సాగుతున్నవి. పాలక వర్గాలూ దీన్ని పెంచి పోషిస్తూ వున్నాయి. ఇప్పుడు మత విద్వేషాలూ రెచ్చగొట్టబడుతున్నాయి.
సమాజాన జీర్ణించుకుపోయిన కుల దురహంకారం అమానవీయంగా ప్రవర్తిస్తుంది. మిర్యాలగూడలో ప్రణరుని, మంథనిలో మధుకర్‌ని దారుణంగా చంపింది. ఇక్కడ ఇప్పుడు మత దురహంకారమూ తోడు చేరింది. మతమైనా, కులమైనా ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకమయిన పితృస్వామిక సమాజం ఇది. అంత విశాలంగా కుటుంబ వ్యవస్థ ఎదగలేదింకా. ఈ సంఘటనను మత విద్వేషంగా మార్చటానికి అందులోంచి ప్రయోజనాలను ఆశించే శక్తులూ వున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మన సమాజంలో వున్న ప్రతి మతంలోనూ ఉచ్ఛ, నీచ, అగ్ర, అథమ వర్గాలుగా ప్రజలు చీల్చబడే వున్నారు. ఆ రకమైన భావాలతోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది మతపరమైన ద్వేషపు హత్యయితే, ఒకే మతంలో ఎందుకు ద్వేషం వెల్లువెత్తుతోంది? ఎందరు లేరు కులమతాలకతీతంగా జీవనాన్ని సాగిస్తున్నవారు! ప్రతి మతంలోనూ మూఢత్వం, అవివేకం, ఛాందసత్వం వుంటుంది. దాంతో ఎప్పటికీ ఘర్షణా వుంటుంది. అందుకే ఆధునిక కాలానికి అనుగుణంగా మతాలను సంస్కరించేందుకు ఎంతో మంది కృషి చేశారు. మేధావి వర్గం, ప్రజాస్వామికవాదులు నిరంతరం వాటిపై పోరాడుతూనే వున్నారు.
ఇక ప్రతి సమూహంలోనూ మూఢులు, మూర్ఖులు, దుర్మార్గులు వుంటారు. ప్రజాస్వామికవాదులు, విశాల హృదయులు, వివేకవంతులూ వుంటారు. కాబట్టి ఒక దుష్టత్వాన్ని కానీ, రాక్షసత్వాన్ని కానీ మొత్తం ఆ సమూహానికి ఆపాదించడం సరి అయినది కాదు. అలాగే మంచిని కూడా. ఎక్కడ దుర్మార్గముంటే దాన్ని ముక్త కంఠంతో ఖండించాలి తప్ప సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టకూడదు. ఇక నేటి సంఘటనలో సమాజ నిర్లిప్తతను మనం చూస్తున్నాము. కుల, మత, వర్గ బేధాలకతీతంగానే నేటి తరంలో ప్రతిస్పందించే లక్షణం సన్నగిల్లుతోంది. పక్కవాడి బాధ పట్ల, దు:ఖం పట్ల సహానుభూతి కొరవడి పోతున్నది. వస్తు వినిమయ సంస్కృతిలో పడి మానవ సంబంధాలు మృగ్యమయి పోతున్నవి. మార్కెట్‌ లాభాల మాయాజాలంలో మనకెందుకు అనే తత్వం పెరిగిపోతున్నది. హృదయాలు సున్నితత్వాన్ని కోల్పోతున్నాయి. ఇది నయా ఉదారవాద విధానాల దుష్ప్రభావం. దీనికి వ్యతిరేకంగా పురోగామి శక్తులు కృషి చేయవలసి వున్నది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడిపాట్లు
నాన్న
చే జీవితం యువతకు ఉత్తేజం!
అందాల కాశ్మీరు..!
ఏమిటీ ఉన్మాదం!
నిఖత్‌ భారత్‌ మహాన్‌
తిండిగలిగితె...
భాషకు ద్వేషం లేదు
దారి మళ్ళింపు
ఎటుపోతున్నం!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.