Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సెలవులందు వేసవి సెలవులు వేరయా!! | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

సెలవులందు వేసవి సెలవులు వేరయా!!

Sun 15 May 04:48:28.627122 2022

            నిర్విరామంగా పని చేసే ప్రతిజీవి కొద్దికాలం విరామం తీసుకుని తద్వారా లభించిన శక్తితో నూతనోత్సాహం పెంచుకుని మరింత వేగంగా పరిణితితో పనులు చేసుకుపోవడం పరిపాటి. అంటే విరామం అనే విశ్రాంతిలో అంతటి విలువుంది అని తెలుసుకోవాలి. అందుకేనేమో ''కష్టపడేవారికే విశ్రాంతి విలువ తెలుస్తుంది'' అనే నానుడి కూడా వచ్చింది.
వ్యక్తిగతంగా తీసుకునే విశ్రాంతినే సామాజికంగా సెలవులుగా పరిగణించుకుంటున్నాము. ఇక సెలవుల విషయానికి వస్తే పండుగలు, జాతీయ పర్వదినాలతో పాటు దసరా, సంక్రాంతి పండుగలు పురస్కరించుకుని వచ్చే సెలవులు, వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సుమారు యాభై రోజుల పాటు ప్రకటించబడే ''వేసవి సెలవులు''.
            పండుగలు, పర్వదినాల సెలవులన్నీ ఒక లక్ష్యంతో ఒక ఎత్తు అయితే, వేసవి సెలవులు అన్నీ మరో లక్ష్యంతో మరొక ఎత్తు అని చెప్పాలి.
పండుగల సందర్భంగా ప్రకటించే సెలవులు విద్యార్థుల్లో ఆయా ప్రత్యేక పర్వదినాల ప్రాశస్థ్యం పరమార్థాలు తెలవడం కోసం నిర్ణయిస్తే, విద్యా సంవత్సరం పూర్తి అయ్యాక కొత్త విద్యాసంవత్సరానికి ముందుగా ప్రకటించే దీర్ఘకాల సెలవులు ''వేసవి సెలవులు''. ఇవి కేవలం విద్యార్థులకే సొంతం.
ఇటీవల సంభవించిన కరోనా విపత్తు కారణంగా విద్యాలయాలకు ప్రకటించిన భారీ సెలవుల దృష్ట్యా ఈ విద్యార్థులకు ప్రస్తుత సెలవుల పట్ల అంతగా థ్రిల్లింగ్‌ కనిపించకపోయినా!
ఆనాటి తరం వారికి అదో అనంతమైన మధురానుభూతి. కాలంతో పాటు వస్తున్న మార్పుల్లో భాగంగా గత పదేళ్లుగా ఈ వేసవి సెలవుల్లోనూ మార్పులొచ్చి పడ్డాయి. లక్షణాలతో పాటు లక్ష్యాలు మారిపోతున్నాయి.
ఓ యాభై ఏళ్ల కిందటి రోజుల్లో ''వేసవి సెలవులు'' ఎంత గొప్పగా వుండేవో!? ఎపుడెపుడు వేసవి సెలవులు వస్తాయా!? అని వేయి కళ్లతో ఎదురు చూసేవారు అప్పటి పిల్లలు. ఈ సెలవుల్లో గ్రామీణ ప్రాంతం వారు పట్టణాలకు, పట్టణాల వారు గ్రామీణ ప్రాంతాల్లో వుండే అమ్మమ్మ, నాయనమ్మలు ఇతర బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. ఇందులో భాగంగా పెళ్లిళ్లు మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఆయా ప్రాంతాల విధానాలు, సంస్కృతి సంప్రదాయాలు ఒకరికి ఒకరు తెలుసుకునే వీలుంటుంది. తద్వారా పిల్లల్లో అనుభవ జ్ఞానంతో పాటు ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ ఆనాటి పిల్లలు స్వేచ్ఛా వాతావరణంలో అనుభవించే వారు.
ఇక ఆటల విషయంలో కూడా నాటి వేసవి సెలవులు ప్రత్యక్ష వేదికలు అయ్యేవి. ఊరి చివరి చెరువులు, బావుల్లో ఈత సరదా తీర్చుకోవడమే గాక ఆరుబయట ఆడే కోతి కొమ్మచ్చి, సిర్రగోని, కబడ్డీ తదితర ఆటలు కేవలం వినోద ప్రధానంగా ఆడుకునేవారు. తద్వారా సరదాతో పాటు చక్కటి శారీరక వ్యాయామం లభించి ఆరోగ్యాలకు కారకాలయ్యేవి.
ఆటలేగాక ఆయా కాలాలలో లభించే మామిడి, పనస, ఈత వంటి పళ్లుస్వయంగా సేకరించుకుని అందరూ కలిసి తినడంలో కూడా చెప్పలేని అనుభూతి ఆనంద ఆరోగ్యాలు సొంతం అయ్యేవి.
ఇక రాత్రి వేళ ఆరుబయట అందరూ కూర్చుని రోజంతా చేసిన అల్లరి పనులు నెమరువేసుకుంటూ కలిసి భోజననాలు చేయడం ఆ తరువాత డాబాల మీదనో ఆరుబయట మంచాల మీదో పిల్లలంతా కబుర్లాడుకోవడంతో పాటు తాతయ్యలు, మావయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు.
నాటి పిల్లల్లో వారు చేసే ప్రతి పనిలో సంఘటితం, సహకారం, ఐకమత్యం సమపాళ్లలో ఉంది. బేధాభిప్రాయాలు లేకుండా వుండేవారు. ఒక వేళ అలాంటివి వచ్చినా పెద్దలు వెంటనే సర్ది చెప్పి బుద్ధి చెప్పేవారు. ఆచరణతో జీవించే నాటి తరం పెద్దలంటే పిల్లలకు భయంతో కూడిన గౌరవం వుండేది. ఒక చక్కని దృక్పథంతో భయభక్తులతో ''పరిధులు గల స్వేచ్ఛ''తో పరమానంద భరితమైన బాల్యం అనుభవించేవారు ఆనాటి పిల్లలు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే నాటి వేసవి సెలవులు కేవలం 'ఆటవిడుపు వినోదాలకే' కాకుండా విలువైన నైతిక భావాలు నింపే రోజులుగా కూడా చెప్పవచ్చు.
నేటికాలపు వేసవి సెలవులు
కాలంతో పాటు జీవన విధానంలో వచ్చిన మార్పుల్లో భాగంగా బాల్యంలో కూడా మార్పులొచ్చాయి. నేటి తరం ఆధునిక వేసవి సెలవులు మొక్కుబడి శిక్షణల సెలవులుగా తయారయ్యి ''సమ్మర్‌ కోచింగ్‌''ల పేరున సెలవులు సైతం పాఠశాలల పనిదినాలను తలపింపజేస్తున్నాయి.
తల్లిదండ్రుల ఆలోచనా విధానం, పిల్లల భవితకు రుద్దబడి, యాంత్రిక జీవనవిధానానికి అలవాటు పడి, సంకుచిత ధోరణి, ఆర్థిక హౌదాలతో ముడిబడిన అసమానత మురికి ఆధునిక బాల్యానికి రుద్దబడింది. తద్వారా శారీరక శ్రమలేని ఆటలు, కేవలం ఇళ్లకే పరిమితమైన క్రీడాంశాలు, అవి కూడా వినోదం కోసం కాక విత్త సంబంధమైన పోటీలుగా రూపాంతరం చెంది ఆటల లక్ష్యమే మారిపోయింది.
''జూదం''ను తలపింపజేసి ఆటల ద్వారా రావాల్సిన ఐక్యతేభావం స్థానంలో గెలుపే లక్ష్యం అన్నచందంగా తయారయ్యింది. ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలకు సంబంధించిన మూసధోరణి ఆటల వైపే నేటి బాల్యం చూపు వుంది.
విద్యార్థి బాలబాలికల్లో విద్యేతర విషయాల్లో శిక్షణల పేరున పిల్లల ఇష్టాలతో పని లేకుండా వేసవి సెలవుల్లో సైతం తరగతులను తలపింపజేసే ''శిక్షణా శిభిరాలు'' విపరీతంగా వెలుస్తున్నాయి.
అందులో భాగంగా పదవ తరగతి వంటి పబ్లిక్‌ పరీక్షలు రాసే పిల్లలకు ''ముందస్తు పై తరగతుల శిక్షణలు'' వేసవి సెలవులను హరించి వేస్తుండగా... అది చాలదన్నట్టు కంప్యూటర్‌ కోచింగ్‌, డాన్స్‌, స్విమ్మింగ్‌ వంటి పరిమిత అంశాల్లో మాత్రమే శిక్షణలు లాంటివి ఇప్పించడంతో నేటి కాలపు వేసవి సెలవులు కరిగిపోతున్నాయి.
పిల్లల పట్ల తల్లిదండ్రులకు గల అతి మమకారం వల్ల, పరాయి ఇళ్లల్లో సౌకర్యాల లేమితో కష్టపడిపోతారో అనే భయంతో నేటి తల్లిదండ్రులు పిల్లలను బంధువుల ఇళ్లకు పంపడం తగ్గించేశారు. దరిమిలా నేటి పిల్లలకు ''వేసవి సెలవుల ప్రమాణాలు'' పరిమితం అవ్వడమేగాదు, పూర్తిగా తగ్గిపోయాయి అనవచ్చు!! తద్వారా బంధుత్వాలు ఐక్యతా భావాలు నేటి బాలల్లో సన్నగిల్లిపోయాయి. నిస్వార్థం ఆవిరయ్యి స్వార్థం వచ్చి చేరుకుంది. దరిమిలా పిల్లల ఆలోచనా తీరు మారిపోయింది.
ఇక ఆహారపు అలవాట్లు కూడా ఆధునిక విధానంలో ఉండి ప్రకృతికి దూరంగా అంతా కృత్రిమంగా మారిపోయి, చిన్నతనంలోనే అనేక అనారోగ్య సమస్యలతో బంగారు బాల్యం సతమతమైపోతుంది. మన్ను స్పర్శకు దూరమైన ఆధునిక మనిషి జీవనం అనారోగ్యాల మయంగా మారిపోయింది.
ఆధునిక వేసవి సెలవులు ఎలా వుండాలి?!
మనిషికైనా, సమాజానికైనా మార్పు, ఆధునికవిధానం, అత్యవసరం. అయితే అది భవిష్యత్‌ను అంతం చేసేదిగా వుండకూడదు. ఆరోగ్యకరమైన ఆధునిక మార్పు మనం అందరం పాటించాలి. కోరుకోవాలి.
శిక్షణాశిభిరాలలో పిల్లలు వేసవి సెలవులు గడిపే బదులు తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలు గమనించాలి. వారి ఇష్టాలకు అనుగుణంగా చిత్రలేఖనం, రచనలు, అల్లికలు, కుట్లు, పాటలు తదితర విషయాల్లో వారికి అవగాహనతో కూడిన తర్ఫీదు అందించాలి. కేవలం పిల్లలకు విద్యకు అనుబంధంగా వుండే విషయాల్లోనే శిక్షణలు ఇవ్వడంతో పాటు జీవితానికి ఉపయోగపడే విషయాల గురించి వివరించాలి.
వీడియోగేమ్‌లు, కార్టూన్‌ బొమ్మలతో పాటు సందర్భం చూసి పాతకాలం నాటి ఆటల గురించి అవగాహన కలిగించడంతో పాటు అందులో ముడిబడి వున్న ఆరోగ్య సూత్రాలు వివరించాలి.
బోధనా మాధ్యమాలు మాతృభాషేతరం కావడం వల్ల పిల్లల వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన 'అమ్మ భాషలోని బాల సాహిత్య' సొగసులు ప్రత్యక్షంగా అందుకోలేక ఎంతో నష్టపోతున్నారు.
విలువైన చదువులు విద్యార్థులకు సార్థకత చేకూర్చబడాలంటే చదువు అనే ప్రధాన పంటలో అంతర్గత పంటగా వుండాల్సిన ''నైతిక విద్యా విలువలు'' భావిపౌరులకు అత్యవసరంగా అందించాలి.
ఏడాది పొడవునా పాఠ్యాంశాలు పరీక్షలు అనే యాంత్రిక విద్యా జీవనంలో సతమతం అవుతున్న వారికి కనీసం ఈ వేసవి సెలవుల్లోనైనా జీవిత లక్ష్యాలు, ఉపాధి మార్గాలు గురించిన ఆసక్తి కలిగించాలి.
సాధ్యమైనంతలో కొత్త ప్రాంతాలను పరిచయం చేయడం, మనలాంటి మనుషులే మరికొన్ని ప్రాంతాల్లో ఎలా మనుగడ సాగిస్తున్నారో, ప్రకృతి సాక్షిగా చూపించడం చేయాలి. ఏడాది పొడవునా జీవించిన జీవనానికి కాస్త భిన్నంగా ఆధునిక విధానంలోనే వేసవి సెలవులు గడపడానికి ప్రణాళికలు సిద్ధం చేయించాలి.
ఆత్మస్థైర్యం పెంచుకోవడంతో పాటు సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అవగాహన కలిగించాలి. భాషా లేమితో నేటి పిల్లలు పాఠ్యేతర విషయాలు చదవడానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. అందుకని చదివి వినిపించడం ద్వారా స్వంతంగా చదివే స్థాయికి ఎదిగేట్టు చేయాలి.
ముఖ్యంగా పిల్లలు ఇష్టాలను గమనించి ఆయా విషయాల్లో అవగాహనలు కల్పించాలి. వేసవి సెలవులు అంటే ''రోజువారి తీరుకు భిన్నంగా నిత్య నూతనంగా ఉండాలి. పిల్లల్లో అంతర్గతంగా దాగి వున్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసే వేదికలుగా వుండాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా అత్యున్నత స్థాయిలో ఉండాలి అని ఎలా అశిస్తున్నారో అలాగే సామాజికంగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని భావించాలి. మన భావి తరానికి కావాల్సింది గొప్ప వ్యక్తులే కాదు, మంచి వ్యక్తులు కూడా. మానవత్వం నిండిన మనుషుల అత్యవసరం, చదువులు మార్కుల కోసమే కాదు పిల్లల్లోని ప్రవర్తనా మార్పుల కోసం ఈ కాలపు వేసవి సెలవులు సాయపడాలని కోరుకుందాం.

- డా|| అమ్మిన శ్రీనివాసరాజు, 7729883223

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
12:17 PM

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

12:10 PM

దేవుళ్ల చిత్రాల పేపర్లలో చికెన్ విక్రయం.. వ్యక్తి అరెస్టు

11:58 AM

హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

11:52 AM

తెలంగాణలో డిఎస్పీల బదిలీలు

11:45 AM

ఆర్‌ నారాయణమూర్తికి మాతృవియోగం

11:37 AM

యాంకర్ రోహిత్ అరెస్టు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.