Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పిల్లకాకి | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • చైల్డ్ హుడ్
  • ➲
  • స్టోరి

పిల్లకాకి

Sun 12 Jun 05:46:32.555805 2022

ఒకసారి ఒక పిల్లకాకి పక్షులు కూర్చుని కబుర్లు చెప్పుకునే, జామతోపుకు వెళ్లింది. అక్కడ చిలుక, పావురం, నెమలి, కోడి - రకరకాల పక్షులు ఉన్నాయి. పిల్లకాకి వాటితో మాట్లాడాలని ఎంతో ఉబలాటపడింది. కానీ ఏ ఒక్క పక్షీ దాన్ని పట్టించుకోలేదు. మర్నాడు విచారంగా కనిపిస్తున్న పిల్లకాకిని కోకిల పలకరించింది. విషయం తెలుసుకుని ఆ సాయంత్రం పిల్లకాకిని పక్షులు కబుర్లు చెప్పుకునే జామతోపు వద్దకు తీసుకెళ్ళింది. అక్కడున్న పక్షులకు పిల్లకాకిని పరిచయం చేసింది కోకిల. అది వేసవికాలం. తను పట్టుకెళ్ళిన మామిడి పళ్ళను, మామిడి చిగుళ్ళను ఆ పక్షులకు ఇచ్చింది పిల్లకాకి.
''కోకిలా, తీయగా పాడుతావు కనుక నువ్వు నల్లగా ఉన్నా మేం నిన్ను గౌరవిస్తాం. ఏ ప్రత్యేకతా లేని కాకులను పట్టించుకోం. ఏదో పలకరిస్తాం. అంతే'' అంది తెల్లని పావురం.
చిలుక, నెమలి, కోడి - పక్షులన్నీ కూడా ఆ మాటలకు విరగబడి నవ్వుతూ ''అవును మేం కూడా కాకులను పెద్దగా పట్టించుకోం'' అన్నాయి. కోకిల వారిస్తున్నా ''మీకున్న ఎక్కువతనం ఏమిటి? నాకున్న తక్కువతనం ఏమిటి?'' అని అడిగింది పిల్లకాకి ఆవేశంగా. ''నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు చిన్న కాకిపిల్లవి. ముందు ఇక్కడి నుండి పో'' అన్నాయి పక్షులు. ''నేను చిన్నపిల్లని కావచ్చు. కానీ నాకూ ఆలోచన ఉంది. నిజంగా మీరు గొప్పవారు అయితే మీ గొప్పతనం ఏమిటో నాకు వివరించండి. లేకపోతే మీరూ, నేనూ సమానం అని ఒప్పుకోండి'' అని సవాలు విసిరింది పిల్లకాకి.
''సరే అయితే. నీ సవాలును మేం స్వీకరిస్తున్నాం. మేం నీకు వివరించి చెప్పటం కాదు - రేపు ఉదయం ఇక్కడికి దగ్గర్లో ఉన్న ఊళ్ళోకి వెళ్లాం. అక్కడి మనుషులే చెపుతారు - ఏ పక్షుల విలువ ఏమిటో'' అన్నాయి ఆ పక్షులు. మర్నాడు ఉదయాన్నే పక్షులతో కలిసి పిల్లకాకి అక్కడికి దగ్గర్లో ఉన్న ఊళ్లోకి వెళ్ళింది. ఊళ్ళో తిరుగుతూ వివిధ వ్యక్తులు పక్షులను గురించి ఏమి అనుకుంటున్నారో పరిశీలించ సాగాయి.
ఒక ఇంటి దగ్గర ఒక వ్యక్తి పావురాలను పెంచుకుంటున్నాడు. దాన్ని ఎంతో విలువైన పనిగా భావిస్తున్నాడు. తను పెంచే పావురాలకు నీరు, మేత, నివాసం ఏర్పాటు చేశాడు. అది చూసి ''చూశావా నా గొప్పతనం - మనుషుల్లో నాకు ఎంత విలువ ఉందో'' అంది పావురం పిల్లకాకి వంక చూసి. మరో ఇంటి దగ్గర ఒక వ్యక్తి చిలుకను పెంచుకుంటున్నాడు. ఆ చిలుకకు మాటలు నేర్పి ఆ మాటలు వింటూ ఎంతో ముచ్చటపడి పోతున్నాడు. ''పక్షులలో మాట్లాడగలిగే శక్తి గలవి చిలుకలు మాత్రమే'' అంది చిలుక గొప్పగా.
అనేకమంది విద్యార్థినీ విద్యార్థులు తమ పుస్తకాల్లో నెమలి ఈకలను భద్ర పరచుకుంటున్నారు. నెమలి బొమ్మలు చిత్రించి ఎంతో సంతోషిస్తున్నారు. అది చూసి ''నెమలి అందాన్ని మనుషులు ఎంతగా ఆరాధిస్తారో చూశావా'' అంది నెమలి. గుడ్ల కోసమేగానీ, మాంసం కోసమేగానీ దాదాపుగా ప్రతి ఇంట్లోనూ కోళ్లను పెంచుకుంటున్నారు. అది చూసి గర్వ పడింది కోడి.
ఈలోగా మధ్యాహ్నం అయింది. ఇళ్ళు, ఆఫీసులు, పాఠశాలు, వివిధ పనులు జరిగే ప్రదేశాలు - అన్నిచోట్లా మనుషులు భోజనాలు చేశారు. ఎంగిలి మెతుకుల కోసం వస్తున్న కాకులను ఛీ కొడుతున్నారు. అలా ఛీకొట్టటాన్ని ఆ పక్షులన్నీ కాకిపిల్లకి చూపించాయి. ''పిండాలు, ఎంగిలి మెతుకులు తినటానికి తప్ప కాకులు ఎందుకూ పనికిరావు'' అని నవ్వాయి.
'ఇప్పుడు చెప్పు, ఏ మనిషి అయినా కాకిని మెచ్చుకుంటున్నాడా?'' అని పక్షులన్నీ పిల్లకాకిని అడిగాయి. పిల్లకాకి తలదించుకుంది. పిల్లకాకితో సహా ఆ పక్షులన్నీ చెట్లు బాగా ఉన్న ఒక పాఠశాల వద్ద ఆగాయి. ఆ చెట్ల పళ్ళు తిని అక్కడ విశ్రాంతి తీసుకోసాగాయి. ఆ పాఠశాలలో ఒక తరగతి గది కిటికీ పక్కన ఉన్న చెట్టు మీద ఉన్నాయి ఆ పక్షులు. అంతలో ఆ తరగతిలోకి ఉపాధ్యాయుడు ప్రవేశించాడు. పిల్లలు అందరూ నిశబ్దంగా లేచి నిలబడ్డారు. ఉపాధ్యాయునికి నమస్కరించారు. ఉపాధ్యాయుడు కూర్చోమనగానే కూర్చున్నారు.
ఇదంతా ఆ తరగతి కిటికీ పక్కనున్న చెట్టు మీదున్న ఆ పక్షులకు స్పష్టంగా కనిపిస్తోంది, వినిపి స్తోంది. ''పిల్లలూ, నిన్న నేను మిమ్మల్ని ఏదైనా
ఒక పక్షి గురించి వ్యాసం రాసుకురమ్మన్నాను. అందరూ అందమైన, ఆకర్షణీయమైన పక్షుల గురించి రాశారు. ఒకే పక్షి గురించి నలుగురైదుగురు కూడా రాశారు. కానీ కాకిని గురించి ఒక్క విద్యార్థి మాత్రమే వ్యాసం రాశాడు. కాకికి ఏదైనా ఆహారం కనపడగానే అది వెంటనే తినదు. ఇతర కాకులను పిలుచుకొచ్చి వాటితో కలిసి ఆ ఆహారాన్ని తింటుంది. అలాగే ఏదైనా ఒక కాకికి ఆపద వస్తే కాకులన్నీ అక్కడికి చేరి ఆ కాకిని రక్షించటానికి ప్రయత్నిస్తాయి. సాధారణంగా మనుషులు కాకులను కసిరి కొడతారు. అసహ్యించుకుంటారు. కానీ కలిసికట్టుగా జీవించటం గురించి మనుషులు కాకుల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. కాకి గొప్పతనాన్ని గుర్తించి తన వ్యాసంలో వివరించిన విద్యార్థి రవిని అభినందిస్తున్నాను'' అన్నాడు ఉపాధ్యాయుడు.
ఆ తరగతి గది కిటికీ పక్కనున్న చెట్టు మీద ఉన్న పావురం, చిలుక, నెమలి, కోడి ఉపాధ్యాయుని మాటలు విన్నాయి. తమ తప్పు తెలుసుకున్నాయి. అదే చెట్టు మీద ఉన్న పిల్లకాకిని క్షమించమన్నాయి. సమానత్వం కోసం తను చేసిన ప్రయత్నం ఫలించినందుకు పిల్లకాకి ఎంతో సంతోషించింది. ఆ ఉపాధ్యాయునికి పిల్లకాకి తన మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది.

- కళ్ళేపల్లి తిరుమలరావు
   9177074280

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిచ్చి ఏనుగు
రాముడు భీముడు
నిర్ణయం
మనిషే గొప్ప
రోగానికి సేవ
పత్రంతో ఛత్రం
వృద్ధ దుప్పి సలహా
రాము - కుక్కపిల్ల
గీయించిన బొమ్మ
సాధించాలి

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
07:03 PM

రేపు టీఎస్ ఎంసెట్‌ ఫలి‌తాలు విడుదల

06:36 PM

స్నేహితులను హత్యచేసిన నిందితుడు అరెస్ట్

06:04 PM

నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ఆదేశాలు జారీ

05:50 PM

ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాలి : రేవంత్ రెడ్డి

05:35 PM

యమునా నదిలో పడవ బోల్తా..!

05:18 PM

డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసిన మంత్రులు

05:16 PM

న‌గ‌రి కోర్టుకు హాజ‌రైన సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌

05:03 PM

ఆ పదాలను నిషేధించిన ఏపీ ప్రభుత్వం..!

04:58 PM

ఏపీలో దారుణం..కోడ‌లిని చంపి..త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌

04:47 PM

కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

04:46 PM

ప్రగతి భవన్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం..

04:40 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:57 PM

ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

03:54 PM

గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత

03:49 PM

మాలిలో 42 మంది సైనికులు మృతి

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.