Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తలపోత | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

తలపోత

Sun 09 Oct 02:11:40.114354 2022

        ఇక మా ఊర్లో దసరా పండుగ భలే సరదాగా సాగుతుంది. దేవుళ్ల రథాలు వివిధ బస్తీల నుండి ఊరేగింపుగా వచ్చి ఒకే ప్రాంగణానికి చేరుతాయి. దీపాలు, రంగురంగుల అలంకరణలు, ఒక నెల రోజుల ముందు నుండే ఏదో ఒక దేవుని కాన్సెప్ట్‌ తీసుకుని ఈ షావాలను సిద్ధం చేస్తారు. ఎవరి బస్తీ షావా బాగుందో చూసి ఎంపిక కమిటి బహుమతులూ ఇస్తుంది. జమ్మి పూజలూ, అదే ప్రాంతంలో జరుగుతాయి. పట్టణంలోని ప్రజలందరూ అక్కడికి చేరతారు. పెద్ద జన సందోహంతో ఊరు ఊరంతా ఉత్సవంలా మారుతుంది. మిత్రులు, పరిచయమున్న అందరూ అక్కడ కలుసుకుని జమ్మి పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేను చిన్నప్పటి నుండీ ఈ సరదాను చూస్తూనే వున్నాను. కానీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అధికార పార్టీ ప్రచార కేంద్రంగా కూడా ఇది మారింది. ఒక వేదిక ఏర్పాటు చేసి రాజకీయ ఉపన్యాసాలు, ప్రజాప్రతినిధుల హడావిడి పెరిగింది.
          పండుగల సందర్భంగా చాలా మంది పనిచేస్తున్న పట్టణాల నుండి సొంతూరుకు వెళ్లి వస్తారు. ఇది సాధారణ విషయమే. నేనూ హైదరాబాదు నుండి మా పుట్టినూరుకు వచ్చాను. బొగ్గుట్టగా పేరొందిన ఇల్లందు అది. ఇప్పుడు దీన్నీ పట్టణమనే అంటారు. పల్లెకూ పట్నానికి మధ్య రకంగా వుంటుంది. చాలా ప్రాచీనమైనదే ఊరు. ప్రతి ఊరికి ఓ చరిత్ర ఉన్నట్లే ఈ ఊరికీ ఘనమైన చరిత్రే వుంది. ఆ వివరాలు మరోసారి చెప్పుకుందాం. ఊర్లోకి వెళ్లగానే బయట ఆడీ ఆడీ అమ్మవొడిలోకి వెళ్లినంత స్వాంతన ఎప్పుడూ కలిగినట్లుగానే ఈ సారీ అంతే ఫీలింగ్‌. దానికి ఇంకా బలమైన కారణం అమ్మ కూడా అక్కడే వుంది. మేమొస్తామనే ఎదురుచూపులు మదినిండా నింపుకుని. కాళ్లూ చేతులు చురుగ్గా కదలడం లేదు గానీ ఆలోచనలూ జ్ఞాపకాలూ ఇంకా చైతన్యవంతంగా కదులుతూనే వున్నాయి అమ్మలో. మా చిన్నప్పటి, నాన్న ఉన్నప్పటి జ్ఞాపకాలతో, తన అడుగుల పాదముద్రల్లోనే అడుగులేస్తూ, ఎనభై ఐదేండ్ల స్మృతుల్ని, అక్కడి గాలి, వెలుతురు, మట్టి, నీరు స్పృశిస్తూనే జీవనం సాగిస్తున్నది. తన ఘనమైన గొంతును వినిపిస్తూనే వుంది.
ఇవన్నీ నా వ్యక్తిగతమైన విషయాలే అయినప్పటికీ ఒక సామాజిక విషయాన్ని నా ముందుకు తెచ్చింది. వృద్ధుల బాగోగులకు, వారి ఆహ్లాద జీవనానికి బాధ్యత వహించగలిగే వ్యవస్తమనకు లేదు. పిల్లలు చూసుకోవటమనేది అంతంత మాత్రంగానే వుంటోంది. రేపు మనకూ ముసలితనం వస్తుంది. భర్తో, భార్యో ముందో వెనకో వొదిలి పోతారు. అప్పుడు తోడు ఎవరూ లేని జీవితం ఎంత బాధాకరంగా వుంటుందో! పిల్లలు, వాళ్ల పిల్లలు, వారి వారి పనులు, వొత్తిళ్లు, భవిష్యత్తు చింతనలో పడి సతమతమవటం చూస్తూనే వున్నాము కదా! చివరి మజిలీలో సాఫీగా సాగటం కష్టతరమైన విషయంగానే తయారవుతున్నది. ఒక వయసు దాటిన తర్వాత పెద్ద వాళ్లతో విషయాలు పంచుకునే వాళ్లూ వుండరు. అదే పెద్ద వెలితిగా వారికి తయారవుతుంది. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు సరేసరి. కాళ్లు లేవవు, చేతులు పట్టు తప్పుతాయి. కండ్లు కనపడవు. చెవులు వినపడవు. స్పర్శా అంతంత మాత్రమే. గట్టిగా అరచి చెప్పలేక ఎవరూ మాట్లాడటమే లేదనే బాధ ఒక్క అమ్మదే కాదు. అనేకమంది అమ్మలది, నాన్నలది. పనికిరాని వస్తువును చూసినట్టుగానే మనుషులనూ చూస్తున్న సమాజపు ఆధునికతను చూస్తున్నాం మనం. వాళ్లకేమో ఎప్పుడూ వాళ్లతో వుంటూ మాట్లాడే వాళ్లు కావాలి. ఎవరున్నారు? ఎవరుంటారు? ఇది పెద్ద సమస్య.
ఇక మా ఊర్లో దసరా పండుగ భలే సరదాగా సాగుతుంది. దేవుళ్ల రథాలు వివిధ బస్తీల నుండి ఊరేగింపుగా వచ్చి ఒకే ప్రాంగణానికి చేరుతాయి. దీపాలు, రంగురంగుల అలంకరణలు, ఒక నెల రోజుల ముందు నుండే ఏదో ఒక దేవుని కాన్సెప్ట్‌ తీసుకుని ఈ షావాలను సిద్ధం చేస్తారు. ఎవరి బస్తీ షావా బాగుందో చూసి ఎంపిక కమిటి బహుమతులూ ఇస్తుంది. జమ్మి పూజలూ, అదే ప్రాంతంలో జరుగుతాయి. పట్టణంలోని ప్రజలందరూ అక్కడికి చేరతారు. పెద్ద జన సందోహంతో ఊరు ఊరంతా ఉత్సవంలా మారుతుంది. మిత్రులు, పరిచయమున్న అందరూ అక్కడ కలుసుకుని జమ్మి పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేను చిన్నప్పటి నుండీ ఈ సరదాను చూస్తూనే వున్నాను. కానీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అధికార పార్టీ ప్రచార కేంద్రంగా కూడా ఇది మారింది. ఒక వేదిక ఏర్పాటు చేసి రాజకీయ ఉపన్యాసాలు, ప్రజాప్రతినిధుల హడావిడి పెరిగింది. అంతేకాదు, సెలబ్రెటీస్‌ను పిలవటం, డీజేలు పెట్టటం, సినిమా డాన్సులు, పాటలు, పిచ్చి జోకులు పెరిగిపోయాయి. కార్యక్రమమంతా స్పాన్సర్డ్‌ ఈవెంట్‌గా మారిపోయింది. ఉత్సవంలో సజీవత, హృదయపూర్వత సన్నగిల్లింది. జమ్మి పెట్టుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం అసలు కనపబటమే లేదు. జన సందోహమంతా లైట్లు, రంగులు, అలంకరణలు, డ్యాన్సులు, పాటల కోసమే తప్ప మనుషుల్ని, స్నేహితుల్ని కలవటానికి రావటం లేదు. ఇక నా చిన్నప్పుడు లేని రావణాసురుని బొమ్మను దహనం చేయటం కొత్తగా వచ్చి చేరింది. ఏదిఏమైనా మనుషుల్ని కలవడం, పలకరించుకోవడం, ఆత్మీయతను పంచుకోవడమే అసలైన పండుగ. అందుకే నేను మా ఊరికిపోయేది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆంక్షల కత్తి
సంస్కృతి
మద్యపాణం
కొత్తకాంక్ష
పుస్తక మహోత్సవం
ఉన్మాదం
అందరివాడు
మానని గాయం
పాటకు జేజేలు
నయవంచన

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.