Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'జూబ్లీ గర్ల్‌' ఆశా పరేఖ్‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'జూబ్లీ గర్ల్‌' ఆశా పరేఖ్‌

Sun 09 Oct 03:46:27.237599 2022

        1952లో విడుదలైన ''ఆస్మాన్‌'' సినిమాతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్‌, ఆ తర్వాత రెండేళ్లకు 1954లో వచ్చిన ''బాప్‌ బేటి'' చిత్రం సక్సెస్‌ సాధించక పోవడంతో తాత్కాలికం గా సినీ రంగం నుండి వైదోలిగింది. ఆ తర్వాత ఆశా పరేఖ్‌ తన పదహారవ ఏట హీరోయిన్‌గా తిరిగి అరంగేట్రం చేయాలని నిర్ణయించుకుని, నాసిర్‌ హుస్సేన్‌ దర్శకత్వంలో 1959లో వచ్చిన ''దిల్‌ దేకే దేఖో'' సినిమాలో షమ్మీ కపూర్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం ఆమెని గొప్ప స్టార్‌గా నిలబెట్టింది. ఐదు దశాబ్దాలు సినిమా రంగంలో నటిగా, 95 చిత్రాల్లో నటించిన ఆశా పరేఖ్‌ను గుర్తు చేసుకుంటే 'కటీ పతంగ్‌', 'జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై', 'తీస్రీ మంజిల్‌', 'బహారోంకే సప్నే', 'ప్యార్‌ కా మౌసమ్‌', 'కారవాన్‌'... ఈ సూపర్‌ హిట్స్‌ అన్నీ గుర్తుకొస్తాయి. 'జూబ్లీ గర్ల్‌' 'హిట్‌ గర్ల్‌' ఆశా బిరుదులు. ఆమె నటిస్తే సినిమాకు శకునం బాగుంటుందని నమ్మే వారు. సినిమా రంగంలో సుదీర్ఘమైన ఆమె కృషికి 1992లో పద్మశ్రీ అవార్డు తో పాటు ఈ ఏడాది 'దాదా సాహెబ్‌ఫాల్కే' అవార్డు పొందింది. కేంద్ర సెన్సార్‌ బోర్డుకు తొలి మహిళా చైర్మన్‌గా పని చేసిన ఆశా పరేఖ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కేతో సినిమా రంగంలో తన ఖ్యాతిని సంపూర్ణం చేసుకుంది.
కుటుంబ నేపథ్యం
బొంబాయిలోని శాంటాక్రజ్‌లో నివాసం ఉండే గుజరాతీ కుటుంబానికి చెందిన బచ్చుభారు పరేఖ్‌, బోహ్రా ముస్లిం కుటుంబానికి చెందిన సల్మా లఖ్ఖడ్‌వాలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సల్మా పేరు సుధా అయ్యింది. కాగా ఈ దంపతులకు 1942వ సంవత్సరం అక్టోబర్‌ 2న ఆశా జన్మించింది. తల్లి సుధా పరేఖ్‌ ఆమెను చిన్న వయస్సులోనే భారతీయ శాస్త్రీయ నత్య తరగతుల్లో చేర్పించగా, ఆశా పరేఖ్‌ పండిట్‌ బన్సీలాల్‌ భారతితో సహా చాలా మంది ఉపాధ్యాయుల వద్ద శాస్త్రీయ నత్యం నేర్చుకుంది.
సినీరంగ ప్రవేశం
ప్రఖ్యాత చిత్ర దర్శకుడు బిమల్‌ రారు ఒక స్టేజ్‌ ఫంక్షన్‌లో ఆశా డ్యాన్స్‌ని చూసి పదేళ్ల వయసులో 1952లో ''మా'' చిత్రంలో బాలనటిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత బిమల్‌ రారు తిరిగి 1954లో ''బాప్‌ బేటీ'' సినిమాలో ఆవకాశమివ్వగా, ఆ చిత్రం ఫెల్యూర్‌ అయి, ఆమెను నిరాశ పరిచింది. అనంతరం మరికొన్ని చిన్న పాత్రలు చేసినప్పటికీ, సినీ రంగం నుండి వైదొలగిన ఆశా తన విద్యను కొనసాగించింది. పాఠశాల విద్య తర్వాత 16వ ఏట 1959లో నాసిర్‌ హుస్సేన్‌ రూపొందించిన ''దిల్‌ దేకే దేఖో'' సినిమాలో షమ్మీకపూర్‌ సరసన హీరోయిన్‌గా తిరిగి తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ సినిమా సక్సెస్‌ సాధించడంతో ఆశాతో దేవ్‌ ఆనంద్‌ తమ్ముడు విజరు ఆనంద్‌ దర్శకత్వంలో 1961 లో దేవ్‌ ఆనంద్‌ హీరోగా 'జబ్‌ ప్యార్‌ కిసీసే హౌతాహై' సినిమాను రూపొందించాడు. అప్పటి వరకూ దర్శకుడుగా ఉన్న నాసిర్‌ హుసేన్‌ ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ రోజుల్లో ప్రేక్షకుల మనసు దోచిన 'సౌసాల్‌ పెహెలే ముఝే తుమ్‌ సే ప్యార్‌ థా...' పాట ఈ చిత్రంలోనిదే. దేవ్‌ ఆనంద్‌ వంటి సీనియర్‌ పక్కన ఆశా నిభాయించుకుని నటిగా రాణించడంతో, ఈ చిత్రం తర్వాత 1963లో నాసిర్‌ హుసేన్‌ 'ఫిర్‌ వహీ దిల్‌ లాయాహూ' తీశాడు. ఇందులో జారు ముఖర్జీ హీరో, ఆశా పారేఖ్‌ హీరోయిన్‌. ఈ సినిమా పెద్ద హిట్‌ సాధించినా, ఆశా పరేఖ్‌ 'స్టార్‌డమ్‌'కు చేరుకున్నది మాత్రం 1966లో వచ్చిన 'తీస్రీ మంజిల్‌' చిత్రంతోనే. దీనికి నిర్మాత నాసిర్‌ హుసేన్‌. దర్శకుడు విజరు ఆనంద్‌. హీరో షమ్మీ కపూర్‌. ఈ సినిమాలో షమ్మీ కపూర్‌ సరసన ఆశా జంట పూర్తిగా పండింది. 'ఓ మేరే సోనరే సోనరే సోనరే...' పాటతో ఆశా పరేఖ్‌ సినిమా రంగానికి బంగారం అని స్థిరపడి, 'జూబ్లీ గర్ల్‌' 'హిట్‌ గర్ల్‌' గా పేరు సంపాదించుకుంది. ఆశా, హుస్సేన్‌ల కాంబినేషన్‌లో పలు హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఇందులో 1967లో వచ్చిన 'బహరోన్‌ కే సప్నే' చిత్రంతో ఆశా, హుస్సేన్‌ల సుదీర్ఘ అనుబంధం ప్రారంభమయింది. 1969లో 'ప్యార్‌ కా మౌసం', 1971లో 'కారవాన్‌', 1984లో 'మంజిల్‌ మంజిల్‌' చిత్రాలు ఆశాకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. హుస్సేన్‌ ఆశా నటించిన 21 చిత్రాల పంపిణీలో సైతం ప్రదాన భూమిక పోషించాడు. దర్శకుడు రాజ్‌ ఖోస్లా చిత్రాలలో ఆశా పరేఖ్‌ గ్లామర్‌ గర్ల్‌గా, అద్భుతమైన నర్తకిగా, టామ్‌బారుగా పేరు పొందారు. ఆమెకు ఇష్టమైన మూడు చిత్రాలు 'దో బదన్‌', 'చిరాగ్‌', 'మెయిన్‌ తులసి తేరే ఆంగన్‌ కి' లలో విషాద పాత్రల్లో నటించడం ద్వారా ఆశా గొప్ప ఇమేజ్‌ని పొందింది. దర్శకురాలు శక్తి సమంతా రూపొందించిన 'పగ్లా కహిన్‌ కా', 'కటి పతంగ్‌' సినిమాలలో ఆశా పరేఖ్‌కు గంభీరమైన, నాటకీయ పాత్రలలో నటించింది. ఈ చిత్రాలలోని నటన ద్వారా ఆశాకు మంచి గుర్తింపు లభించింది. 'కటి పతంగ్‌' చిత్రంలోని నటనకు ఆశా ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకుంది.
పలు భాషల్లో...
ఆశా పరేఖ్‌ హిందీతో పాటు గుజరాతీ, పంజాబీ, కన్నడ సినిమాలు కూడా చేసిన ఆశా ఇప్పటివరకు 95కి పైగా చిత్రాల్లో నటించారు. ఆశా పరేఖ్‌ బాలీవుడ్‌లో అగ్రనటిగా వెలుగొందుతున్న సమయంలో తన మాతభాష అయిన గుజరాతీ చిత్రాలలో నటించింది. వీటిలో 1963లో వచ్చిన 'అఖండ సౌభాగ్యవతి' భారీ విజయాన్ని సాధించింది. 1971 లో ధర్మేంద్ర సరసన 'కంకన్‌ దే ఓహ్లే', 1976లో దారా సింగ్‌తో కలిసి 'లంభర్దార్ని' సినిమాలలో నటించింది. 1989 లో ఆశా నటించిన 'శరవేగద సరదార' కన్నడ చిత్రం హిట్‌ సాధించింది. ఈ చిత్రాలతో పాటు కొన్ని పంజాబీ చిత్రాలలో కూడా నటించింది. 70-80వ దశకం తరువాత ఆమె వెండితెరను వదిలి బుల్లి తెరలోకి ప్రవేశించింది. ఇందులో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆమె 1990లో గుజరాతీ సీరియల్‌ జ్యోతికి దర్శకత్వం వహించారు. 'పలాష్‌ కే ఫూల్‌', 'బాజే పాయల్‌', 'కోరా కాగజ్‌', 'దాల్‌ మే కాలా' వంటి షోలను నిర్మించింది. 1998 నుంచి 2001 వరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ కి చైర్‌పర్సన్‌గా కూడా పని చేశారు. ఆ పదవిలో నియమితులైన మొదటి మహిళ ఆశా పరేఖ్‌. 1998 నుండి 2001 వరకు ఈ పదవిలో ఉన్నారు. చైర్‌పర్సన్‌గా ఉన్నంత కాలం ఆమె ఎటువంటి జీతం తీసుకోలేదు, అయితే చిత్రాలను సెన్సార్‌ చేయడం, శేఖర్‌ కపూర్‌ 'ఎలిజబెత్‌' చిత్రానికి క్లియరెన్స్‌ ఇవ్వకపోవడం వంటి అనేక వివాదాలు వచ్చాయి.
ఆశా పరేఖ్‌ కోడలుగా, తల్లిగా సహాయక పాత్రలు పోషించిన కొన్నాళ్ళ తర్వాత ఆ పాత్రలలో నటించడం మానేసింది. ఆశా సినిమా రంగంలో నటిగా లేకపోయినా డిస్ట్రిబ్యూటర్‌గా, సినిమా నటుల అసోసియేషన్‌కు నాయకురాలిగా, టీవీ ప్రొడ్యూసర్‌గా ఎప్పుడూ సినిమా రంగంలోనే ఉంది. వహీదా రెహమాన్‌, హెలెన్‌ ఈమెకు మంచి స్నేహితులు. వహీదా రెహమాన్‌తో కలిసి అలాస్కా వెళ్లి ఆ గడ్డకట్టే మంచులో ఆ మధ్య 21 రోజులు ఉండి వచ్చింది. అప్పుడప్పుడు ఈ సీనియర్‌ నటీమణులంతా సముద్రంలో రోజుల తరబడి గడుపుతుంటారు.
జీవితాంతం ఒంటరిగా ..
తెరపై తన అందాలతో కోట్లాది మంది హృదయాలను దోచుకున్న ఆశా పరేఖ్‌ ప్రేమ ఫెయిల్యూర్‌ కారణంగానే వివాహం చేసుకోలేదని అంటూ ఉంటారు. అప్పట్లో జరిగిన ప్రచారం మేరకు ఆశా పరేఖ్‌ ఆ రోజుల్లో ప్రముఖ దర్శకుడు నాసిర్‌ హుస్సేన్‌తో రిలేషన్‌ ఉన్నారు. కానీ నాసిర్‌కు అప్పటికే పెళ్లయింది, ఈ విషయలన్నింటిని ఆశా, ఖలీద్‌ మొహమ్మద్‌ సహ-రచయితగా 2017లో ''ది హిట్‌ గర్ల్‌'' పేరుతో వెలువరించిన ఆమె ఆత్మకథలో అప్పటికే వివాహం చేసుకున్న దర్శకుడు నాసిర్‌ హుస్సేన్‌తో ప్రేమలో పడ్డారని ప్రచారాన్ని ధృవీకరించాయి. అయితే వారి రెండు కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆశా హుస్సేన్‌ని వివాహం చేసుకోలేక పోయింది. ఆశా పరేఖ్‌ తనకు చిరకాల బారుఫ్రెండ్‌ ఉన్నాడని మాత్రమే ''ది హిట్‌ గర్ల్‌''లో పేర్కొనడం జరిగింది. అయితే ఆ సంబంధాన్ని వివరించడానికి నిరాకరించిన ఆశా, ''ఇది కొనసాగినంత కాలం బాగుంది'' అని మాత్రమే పేర్కొంది. ఆశా నాసిర్‌ హుస్సేన్‌ను అతని జీవితంలో చివరి సంవత్సరంలో చూడలేదని, అతని భార్య మరణం కారణంగా అతను ఏకాంతంగా మారాడని అయితే 2002లో అతను చనిపోయే ముందు రోజు ఆమె అతనితో మాట్లాడినట్లు ఇందులో పేర్కొంది. ఆశా నాసిర్‌ హుస్సేన్‌తో ఎంత ప్రేమలో ఉందంటే ఆమె ఆయనని తప్ప మరొకరిని తన జీవితంలో ఊహించుకోలేక జీవితాంతం ఒంటరిగా ఉండిపోయింది.
ఆసుపత్రి నిర్వహణ
ముంబై శాంటా క్రజ్‌లో ఆశా పరేఖ్‌ నడిపే ఆసుపత్రి ఉంది. వంద పడకల ఆసుపత్రి అది. పేదవారికి తక్కువ ఫీజుతో, కట్టగలిగే వారికి మామూలు ఫీజుతో వైద్యం చేస్తారక్కడ. జనంలో ఆ హాస్పిటల్‌కు మంచి పేరు ఉంది. ఎందుకంటే ఆశా పరేఖ్‌ దాని వ్యవహారాలు శ్రద్ధగా పట్టించుకుంటుంది. చిన్నప్పుడు పరేఖ్‌కు డాక్టర్‌ కావాలని ఉండేది. హైస్కూల్లో చదివేప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్‌ చూసి అక్కడంతా రక్తం పారి ఉంటే డాక్టర్‌ అయితే ఇంత రక్తం చూడాలి కదా అని ఆ ఆలోచన విరమించుకుంది. అయితే సినిమాలలో నటించడం మానేసిన తర్వాత ఆశా ఈ ఆసుపత్రి నిర్వహణకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
ప్రముఖ హీరోలందరితో..
ఆశా పరేఖ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలంలో హిట్స్‌ ఇచ్చింది. కలర్‌ వచ్చాక హిట్స్‌ ఇచ్చింది. మహిళా అభిమానులు విపరీతంగా ఉన్న దేవ్‌ ఆనంద్‌తో నటించింది. ఆ తర్వాత అంతకు మించిన ఫ్యాన్స్‌ను చూసిన రాజేశ్‌ ఖన్నాతో నటించింది. రాజేశ్‌ ఖన్నాతో కలిసి ఆశా నటించిన 'బహారోంకే సప్‌నే', 'ఆన్‌ మిలో సజ్‌నా', 'కటీ పతంగ్‌' సూపర్‌ హిట్‌ అయ్యాయి. 'కటీ పతంగ్‌' లో వితంతువుగా నటిస్తూ తన ప్రేమను వ్యక్తపరచలేక సతమతమయ్యే ఆశాపరేఖ్‌ను ప్రేక్షకులు మెచ్చారు. రాజేశ్‌ ఖన్నాతో ఆశా పాడిన 'ఆజా పియా తుజే ప్యార్‌ దూ...', 'అచ్ఛా తో హమ్‌ చల్తే హై'... ఎవరూ మరువలేదు. మోహన్‌ సెగల్‌, పి. జైరాజ్‌ లతో కలిసి అనేక చిత్రాలలో నటించిన ఆశా పరేఖ్‌ దిలీప్‌ కుమార్‌తో తప్ప ఆనాటి ప్రముఖ హీరోలందరితో నటించింది. ధర్మేంద్రతో నటించిన 'ఆయే దిన్‌ బహార్‌ కే', 'ఆయా సావన్‌ ఝూమ్‌ కే' సూపర్‌హిట్లు. తాగి షూటింగ్‌ చేస్తే సెట్స్‌కు రాను అని ధర్మేంద్రకు వార్నింగ్‌ ఇచ్చి మరీ నటించింది ఆశా. మనోజ్‌ కుమార్‌తో చేసిన 'ఉప్‌కార్‌', జితేంద్రతో చేసిన 'కారవాన్‌', శశి కపూర్‌తో 'ప్యార్‌ కా మౌసమ్‌' పెద్ద హిట్లయ్యాయి. అలాగని అన్నీ తేలిక పాత్రలే ఆశా చేయలేదు. 'మై తులసీ తేరే ఆంగన్‌ మే', 'చిరాగ్‌' వంటి సినిమాలలో గంభీరమైన పాత్రలు చేసింది. ఆశా సహాయ నటిగా 1981లో వచ్చిన 'కాలియా' చిత్రం అమితాబ్‌ బచ్చన్‌తో స్క్రీన్‌ స్పేస్‌ను పంచుకున్న ఏకైక చిత్రం. ఆశా పరేఖ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు సాయిరా బాను, వహీదా రెహమాన్‌, నూతన్‌, మాలా సిన్హా వంటి వారు పోటీకి వచ్చేవారు. కలర్‌ సినిమాలు వచ్చాక గ్లామర్‌ పాత్రలు చేసే ముంతాజ్‌, హేమమాలిని వచ్చి గట్టి పోటీ ఇచ్చారు. అయినా ఆశా తన నటనతో బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగింది.
అవార్డులు
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ''దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు'' 2020 సంవత్సరానికిగాను ఈ ఏడాది ఆశా పరేఖ్‌ అందుకున్నారు. కాగా 1992 లో సినిమా రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు ''పద్మశ్రీ'' పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది. ఆశా పరేఖ్‌ ఈ పురస్కారాలతో పాటు పలు అవార్డులు పురస్కారాలు అందుకున్నారు. వాటిలో....
- 1963లో అఖండ సౌభాగ్యవతికి ఉత్తమ నటిగా గుజరాత్‌ రాష్ట్ర అవార్డు.
- 1971 లో కటి పతంగ్‌ కి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు
- 2002 లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌
- 2003 లో ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశిష్ట సహకారానికి సత్కారం
- 2004 లో కళాకర్‌ జీవితకాల సాఫల్య పురస్కారం
- 2006 లో భారతీయ సినిమాలో అత్యుత్తమ విజయానికి అంతర్జాతీయ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డు
- 2006 లో గుజరాతీ అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా-జీవితకాల సాఫల్య పురస్కారం
- 2007 లో పూణే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
- 2007 లో బాలీవుడ్‌ జీవితకాల సాఫల్య పురస్కారం
- 2007 లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ-లివింగ్‌ లెజెండ్‌ అవార్డు.
- 2008 లో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా గోల్డెన్‌ జూబ్లీ వేడుక వేడుకలో పరేఖ్‌కు సత్కారం
- 2009 లోనాసిక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
- 2009 లో నత్యంతో పాటు నటనకు పరేఖ్‌ చేసిన కషికి 'లచ్చు మహరాజ్‌ పురస్కార్‌'
- 2009 లో 40వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా హిందీ సినిమాలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు పరేఖ్‌కు సత్కారం.
- 2009 లో ఇమ్మోర్టల్‌ మెమోరీస్‌ ఈవెంట్‌-'లెజెండ్స్‌ లివ్‌ ఫరెవర్‌ అవార్డు'
- 2011 లో జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
- 2012 లో ఆశ్రమ ఆర్ట్స్‌ అకాడమీ భీష్మ అవార్డు
- 2015 లో స్టార్‌డస్ట్‌-లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
- 2017 లో హిందుస్థాన్‌ టైమ్స్‌-లైఫ్‌టైమ్‌ మోస్ట్‌ స్టైలిష్‌ స్టైల్‌ ఐకాన్‌ అవార్డు
- 2019 లో బిమల్‌ రారు మెమోరియల్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
- 2020 లో గ్లోబల్‌ సినిమా ఫెస్టివల్‌-లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
- 2022 లో దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ''సినిమా పరిశ్రమకు అత్యుత్తమ సహకారం'' అవార్డు
- 2022లో ''సినిమా రంగంలో అంకితమైన సేవలకు'' మాస్టర్‌ దీనానాథ్‌ పురస్కారం

-పొన్నం రవిచంద్ర, 9440077499

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
సంక్రాంతి సంద‌డి
కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి
పుస్త‌క‌మేవ జ‌య‌తే
ఐదు దశాబ్దాల సహజత్వం జయసుధ సినీ ప్రస్థానం
హస్తకళల పట్టుకొమ్మలు.. నిర్మల్‌ కొయ్యబొమ్మలు
నాటి నవ్వుల కలలరాణి షర్మిలా ఠాగూర్‌
అవగాహన! అప్రమత్తత!!
ఆన్‌లైన్‌లో తెవెలుగు
రిషి సునాక్‌ మన ''వాడా'' బ్రిటీష్‌ మనిషా!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.