Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిజాయితీ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

నిజాయితీ

Sun 30 Oct 01:43:43.577549 2022

ఎర్రమట్టి దిబ్బల దగ్గరున్న వటవృక్షం కింద నక్క పచారీ దుకాణం ప్రారంభించింది. సమస్త అటవీ ఉత్పత్తులను సమీకరించి, అమ్మకానికి పెట్టింది. అన్ని సరుకులు ఒకేచోట దొరకటంతో అడవి జంతువులు నక్క కొట్టుకి విపరీతంగా వచ్చేవి. అందువల్ల అక్కడ ఎప్పుడూ రద్దీగా ఉండేది. దాంతో నక్క ధరవరలు పెంచి, కల్తీలు చేసి, బాగా సంపాదించింది. నక్క దగ్గర ఖాతాదారుల్లో ఒక పేద కుందేలు ఉంది. అది వారంపాటు వెచ్చాలు తీసుకుని, వారాంతంలో బాకీ తీర్చేది. ఇలాంటి అరువు పద్దులకు నక్క అదనపు వెల విధించి వసూలు చేసుకునేది. ధనం నష్టపోతున్నా 'పోన్లే అరువు ఇస్తోంది!'' అని జంతువులు సర్దుకుపోయేవి.
ఒకసారి కుందేలు బాకీ తీర్చి, మళ్ళీ వారపు సంత ఇవ్వమని అడిగింది. కానీ నక్క తిరస్కరించింది. ''అదేంటి మామా! చాన్నాళ్ళుగా నీ దుకాణానికి వస్తున్నాను. బాకీ విషయంలో ఏనాడైనా తేడా వచ్చిందా? పువ్వుల్లో పెట్టి డబ్బులు సమయానికి ఇస్తున్నాగా! ఇప్పుడెందుకు మొండికేస్తున్నావు'' అంది ఆక్రోశంగా. నక్క తాపీగా చూసి ''చూడు అల్లుడూ! ఇక నుండి అరువు ఎవరికీ ఇవ్వదలుచుకో లేదు. చాలామంది బాకీలు ఎగవేసారు. వసూలుకు వెళితే గొడవ పడుతున్నారు. అందుకే గోడ మీద ''అరువు రేపు'' అని హెచ్చరిక రాయించాను. వెళ్ళి ధనం తీసుకురా! లేకపోతే దినుసులు ఇచ్చేది లేదు'' అని ఖండితంగా చెప్పేసింది.
దాంతో కుందేలు గుండె గుభిల్లుమంది. ఉన్న సొమ్ము జమ చేసేసింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. నక్క మాట తప్పింది. ''ఇప్పుడెలా?'' అని బాధపడింది. కుందేలు చేతులు పట్టుకుని ''మామా! వారాంతానికి గాని, నా చేతికి రొఖ్ఖం అందదు. ఈసారికి అప్పు పెట్టు. మళ్ళీ వారం నుండి పైకమిచ్చి, సరుకులు తీసుకుంటా'' అని ప్రాధేయ పడింది. కానీ నక్క అందుకు అంగీకరించలేదు. ''పోనీ ఈ ఒక్క రోజుకైనా కాసిని కేరట్లు, విప్పపూలు ఇవ్వు మామా! పండగపూట పిల్లలు ఆకలితో మాడిపోతారు'' అని కాళ్ళు పట్టుకోబోయింది. అయినా నక్క మనసు కరగలేదు. వెచ్చాలలో కలిపే రాళ్ళలో ఒకటి చేరినట్టు దాని గుండె బండ బారిపోయింది, 'ససేమిరా' అంది. పాపం కుందేలు ఉసూరుమంటూ వెనుదిరిగింది. ఎక్కడా అప్పు పుట్టక పిల్లల ఆకలి గుర్తొచ్చి, దుఃఖిస్తూ పోతుంటే దారిలో ఒక ఒక కోతి కనిపించి ''ఎందుకంత దిగులుగా ఉన్నావు'' అని పలకరించింది.
కుందేలు జరిగింది చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. కోతి ''ఆ నక్క ఆగడాలు ఎక్కువయ్యాయి. దానికి తగిన శాస్తి చేసి తీరాలి. నాతో రా'' అంటూ కుందేలుని ఎర్రమట్టి దిబ్బల వెనుక ఉన్న గుబురు పొదల్లోకి తీసుకువెళ్ళింది.అక్కడ ఒక గన్నేరు చెట్టు ఉంది. దాని మొదట్లో ఉన్న చెత్తాచెదారం తొలగించి, కొద్దిగా మట్టిని తొలగించింది. అక్కడ జాగ్రత్తగా కప్పి పెట్టి ఉంచిన పెద్ద కడవ కనిపించింది. కోతి మూత తీయగానే, చూసిన కుందేలుకి కళ్ళు చెదిరిపోయాయి. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ ''ఎవరిది ఈ నిధీ?'' అంది విస్మయంగా. కోతి చిన్నగా నవ్వి ''ఇంకెవరిదీ పచారీ కొట్టు నక్కదే. అక్రమ సంపాదనంతా ఇక్కడ దాచి పెడుతుంది. ప్రతీ నెలా మొదటి రోజున వచ్చి, రాబడి వరహాలు ఇందులో వేస్తుంది. మళ్ళీ మాసం వరకూ ఈ ఛాయలకు రాదు. కాబట్టి నువ్వు ప్రతీనెలా ఇక్కడికి వచ్చి పది వరహాల చొప్పున తీసుకుని వాడుకో. నక్కకి అనుమానం రాదు'' అని సూచించి, పది వరహాలు తీసి కుందేలు చేతిలో ఉంచి, కడవని యధావిధిగా కప్పేసింది.
కుందేలు వరహాలు తీసుకుని కోతితో దుకాణానికి వచ్చింది. ఒక వరహా నక్కకి ఇచ్చి కావలసిన వస్తువులు తీసుకుంది. నక్క మొహాన నవ్వు పులుముకుని ''ఏంటల్లుడూ! తొందరగానే అప్పు సంపాదించావు. ఈ కోతి ఇచ్చిందా?'' అంటూ మేలమాడింది. కానీ అప్పటికే కుందేలుని అపరాధభావం వెంటాడుతోంది. నక్క చేసింది తప్పయితే తాను చేస్తున్నది మాత్రం ఒప్పు ఎలా అవుతుందీ? నక్కకీ, తనకీ తేడా ఏమిట''ని తర్కించుకుంది. కుందేలులో మానసిక సంఘర్షణ ఎక్కువై చివరికి తాను చేసింది సరికాదని వివేకం వెన్ను తట్టింది. పస్తులతో మాడి చనిపోయినా ఫరవాలేదు కాని, నమ్ముకున్న నీతిని విడనాడకూడదని పశ్చాత్తాపపడింది.
వెంటనే తేలిక పడిన మనసుతో సరుకులు వెనక్కి ఇచ్చేసి ''మామా! ఇది అప్పు కాదు నీ సొమ్మే'' అంది మెల్లగా. ఆ మాటకి తుళ్ళి పడిన నక్క ''నా సొమ్మా? కొంపదీసి నా ఇంటికి కన్నం వేసావా?'' అంది తీవ్రమైన స్వరంతో. కుందేలు నిదానంగా చూసి ''లేదు మామా! గన్నేరు చెట్టు కింది కుండలోంచి తీసాను'' అంటూ తన దగ్గరున్న మిగిలిన తొమ్మిది వరహాలను అందించింది. ఆ మాటతో అంతెత్తున ఎగిరింది నక్క. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ ''అక్కడ నిధి ఉందని నీకెలా తెలుసు. అందులోని వరహాలన్నీ దోచేసావా? నిన్ను ఊరికే వదలను. మృగరాజుకి ఫిర్యాదు చేసి నీ అంతు చూస్తాను. నువ్వు తస్కరించిన ధనాన్ని కక్కిస్తాను'' అంటూ చిందులు వేసింది.
కుందేలు ప్రశాంతంగా ''నక్క మామా! పరాయి సొమ్ముకి ఆశ పడటం తప్పని గ్రహించి, నిజం చెప్పాను. ఆయాచితంగా వచ్చిన డబ్బుని సొంతం చేసుకోవటానికి మనసొప్పలేదు. ఈ పది వరహాలు మినహా మిగిలిన ధనమంతా కడవలో నిక్షేపంగా ఉంది. ఇక అది అక్కడ ఉండటం క్షేమం కాదు. వెంటనే ఇంటికి తరలించు. నా తప్పి దాన్ని మన్నించమని వేడుకుంటున్నాను'' అని చేతులు జోడించింది. తన పైకం జాగ్రత్తగానే ఉందని విన్నాక నక్క కాస్త శాంతించింది.
అంతలో కోతి ఇలా అంది. ''నిజానికి నీ సొమ్ము ముట్టుకోవ టానికి కుందేలు ఇష్టపడలేదు. నా బలవంతం వల్లనే తీసుకుంది. కానీ తన మనసుకి సర్దిచెప్పుకోలేక అంతర్మథనానికి గురైంది. పిల్లల ఆకలికి తల్లడిల్లి తాత్కాలిక భ్రమకి లోనైంది. అంతేగాని కపటమైన ప్రవత్తితో కాదు. కాబట్టి కుందేలు పరివర్తనని అర్ధం చేసుకుని, క్షమించమని ప్రార్ధిస్తున్నాను'' అంది. అప్పటికి కుందేలు నిజాయితీ అవగతమైన నక్క తన ప్రవర్తనకీ, అక్రమ సంపాదనకీ సిగ్గుపడింది. నిర్మలమైన మనసుతో ''అల్లుడూ, నువ్వు యధావిధిగా నా దగ్గర ఖాతా కొన సాగించు. డబ్బు నిమిత్తం నిన్ను ఇంకెప్పుడూ ఒత్తిడి చేయను. నీ మంచితనానికి మెచ్చి, ఈ పది వరహాలను బహుమతి గా ఇస్తున్నాను. తీసుకో'' అంది. అది చూసి దుకాణానికి వచ్చిన పశుపక్ష్యాదులన్నీ హర్షధ్వానాలు చేసాయి.
- కౌలూరి ప్రసాదరావు, 9346700089

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రేన్వన్ల చెట్టుకాడ !
రైతులకు సాయం
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు
సివంగి
పచ్చలహారం
చేపల కూర
నాన్నా పులి
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు
అందరూ మూర్ఖులే!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.