Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పర్యావరణం! | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

పర్యావరణం!

Sun 06 Nov 03:37:07.092545 2022

           రుతువులు గతి తప్పాయి. మంచు పర్వతాలు కరగడం మొదలెట్టాయి. ఓజోన్‌ పొరకు రంధ్రాలు పడ్డాయి.సముద్ర జలాలు తీరం వైపు ఎన్నడూ లేని రీతిలో ముంచుకొస్తున్నాయి. అనేక జీవులు అంతరించిపోయాయి. ఇంకా చాలా జీవులు ఆంతరించే జాబితాలో చేరిపోయాయి.సృష్టిలో గొప్పదైన జీవ వైవిద్యానికి ముప్పు మొదలైంది.ఇటువంటి వైపరీత్యాలు అన్నింటికీ కారణం వాతావరణం మార్పులే. కానీ ఈ మార్పులకు కారణం మాత్రం నిస్సందేహంగా మనిషే. తన అవసరాలు పెరిగే కొద్దీ ప్రకృతి అందించిన సహజ వనరులను మితిమీరి వినియోగించడం మొదలు పెట్టిన నాటి నుంచి పర్యావరణంలో సమతూకం దెబ్బతినడం ఆరంభమైంది. ప్రధానంగా అభివృద్ధి పేరిట బొగ్గుపులుసు వాయువును ఉత్పత్తిచేసే బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను విస్తృతంగా వాడటం వల్ల వాతావరణంలో ఉద్గారాలు రోజు రోజుకూ పేరుకుపోతున్నాయి. ఇది భూతాపానికి ప్రధాన హేతువుగా నిలచింది. ఫలితంగా వాతావరణంలో మార్పులు సంభవించి దాని ప్రభావానికి ప్రపంచం అంతా నష్టపోతోంది.
            ఆధునిక జీవనశైలితో సౌకర్యాలు, విలాస వస్తువుల వాడకం పెరిగి కార్బన వాయువుల ఉత్పత్తి అపరిమితమై భూమి వేడెక్కిపోతోంది. మన చర్యల వలన ఈ భూమండలం యావత్తూ కర్బన ఉద్గారాలు వ్యాపించి, మానవాళితో పాటు అన్ని జీవరాశులకు ప్రస్తుతం మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. పారిశ్రామిక విప్లవంతో మొదట్లో వచ్చిన ప్రగతి చూసి అందరూ గర్వపడ్డారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామనుకుని సంతోషించారు. అత్యున్నత ఆవిష్కరణలను కనిపెడుతున్నామని అనుకున్నారు. కానీ మానవ చర్యల కారణంగా కాలుష్యం పెరిగి వాతావరణంలో పెనుమార్పులు 'సంభవించి మానవ మనుగడకే ముప్పు వాటిల్లు తోందని గుర్తించలేక పోయారు. మనం గుర్తించని ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించడమే కాదు హెచ్చరించారు కూడా. వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలే భూతాపానికి కారణం అని ఎప్పటినుంచో పర్యావరణవేత్తలు కూడా గగ్గోలు పెడుతు న్నారు. కాలుష్యాన్ని కార్బన్‌ ఉద్గారాలను తగ్గించకపోతే ప్రళయం తప్పదని నాసా నివేదిక కూడా హెచ్చరించింది.
ఐక్యరాజ్య సమితి ఎప్పటికప్పుడు పర్యావరణానికి జరుగుతున్న ప్రమాదాన్ని నివేదికల రూపంలో వివరిస్తూ మన బాధ్య తలను గుర్తు చేస్తూనే ఉంది.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు, మరెందరో పర్యావరణ నిపుణులు రానున్న పర్యావరణ విపత్తు గురించి తమ నివేదికలలో హెచ్చరిస్తున్నారు. ఇవి అన్నీ కూడా చెప్పేది ఒక్కటే ఇప్పటికైనా నివారణ చర్యలు చేపట్టకపోతే భూతాపం ముప్పునకు మనం భారీ మూల్యం చెల్లించక తప్పదని. ఇంత విపత్తు ముంచుకొ స్తున్నదని తెలిసినా ప్రపంచ దేశాలు మాత్రం ఆర్భాటంగా చర్చలు, సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ కార్యాచరణలో అమలు జరిగింది మాత్రం అత్యల్పం. ప్రతి ఒక్కరి చర్యల వలన ప్రపంచం నష్టపోయేది ఎంత అంటూ తమ వంతుగా పర్యావరణానికి తూట్లు పొడు స్తూనే ఉన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఈ భూతాపాన్ని అదుపు చేయలేకపోతే భావి తరాల వారి ప్రయోజ నాలు విషయం పక్కన పెడితే ప్రస్తుత తరం ప్రశార్థకం కాబోతోంది. ఈ విషయం తెలిసినా మనలో స్పందన అంతంత మాత్రమే. విచారించదగ్గ విషయం ఏమిటంటే ఈ పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని కోట్లాది మూగ జీవరాశులు కూడా మూల్యం చెల్లిస్తున్నాయి. అయినప్పటికీ కర్బన ఉద్గారాల విడుదల ఆగడం లేదు.
ఉష్ణోగ్రతలు ఉధృతం..
గ్రీన్‌హౌస్‌ వాయువులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఉష్ణోగ్రతలు ఉధృతమవుతున్నాయి. ఈ శతాబ్ది చివరికి భూమి సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వదశకంటే రెండు డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించి పెరిగితే అడ్డుకోలేని విపత్కర వాతావరణ మార్పులు తప్పవని శాస్త్రవ్రేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం భూగోళం ఒక డిగ్రీ సెంటిగ్రేడ్‌ అధికంగా వేడెక్కింది. ఇంత వరకూ చరిత్రలో చూస్తే 2014 అత్యంత వేడిమి చూసిన ఏడాదిగా నమోదైంది. ఒక డిగ్రీ పెరుగుదలకే ప్రపంచం అల్లాడిపోతుంటే 21వ శతాబ్దం అంతానికి 4.5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరగవచ్చనే అంచనాలు ఉహించడానికే భయం వేస్తోంది. ప్రస్తుతం మనకు ఎదురవుతున్న వాతావరణ మార్పును '21వ శతాబ్దపు అతిపెద్ద ప్రపంచ ఆరోగ్య ముప్పు'గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.
గ్రీన్‌హౌస్‌ వాయువులు... భూతాపం
వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ హెక్సాఫ్లోరైడ్‌ మొదలైన నాలుగింటిని గ్రీన్‌హౌస్‌ వాయువులు అంటారు. ఇవి విడుదల చేస్తున్న హైడ్రోఫ్లోరోకార్బన్స్‌, పెర్‌ఫ్లోరోకార్బన్స్‌ వంటి రెండు రకాల వాయువుల వలన కర్బన ఉద్గారాలు అధికమై భూతాపం పెరగడంతో పాటు పర్యావరణంలో సమతూకం లోపించి ప్రకృతిలోని సమస్త జీవ కోటికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అందుచేత ఈ కర్బన ఉద్గారాలు అదుపు చేయాలి. వీటిని శూన్య స్థితికి తీసుకు రావడం అంటే కర్బన వ్యర్థాలు విడుదల కాకుండా చేయడం కాదు. వాటి విడుదల ఆపివేస్తే మొత్తం అభివృద్ధి కుంటు పడిపోతుంది. అందుచేత కర్బన్‌ ఉద్గారాలు విడుదల అయినప్పటికీ ఆ ఉద్గారాలను గ్రీన్‌హౌస్‌ వాయువులను చెట్లు, అడవులు గ్రహించే విధంగా అటవీ విస్తీర్ణాన్ని ఎక్కువ చేయడం లేదా భవిష్యత్‌ సాంకేతికతలను ఉపయోగించి వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ భౌతికంగా తొలగించడం ద్వారా భర్తీ చేయబడే స్థితినే కార్బన్‌ న్యూట్రాలిటీ లేదా నికర సున్నా ఉద్గారాలు అంటారు. ప్రపంచంలో ఈ గ్రీన్‌హౌస్‌ వాయువులను కొన్ని దేశాలు ఎక్కువుగా విడుదల చేస్తూ ఉంటే దాని ఫలితాన్ని మాత్రం అన్ని దేశాలు అనుభవి స్తున్నాయి. దీనిని కట్టడి చేసే బాధ్యతను మాత్రం అన్ని దేశాలకు అప్పగిస్తున్నారు. ఇది సమంజసం కాదంటూ వర్ధమాన దేశాలు ఎప్పటి నుంచో తమ అభ్యంతరాలు చెబుతూనే ఉన్నాయి. ఈ విపత్తుకు ప్రబల కారణం ధనిక దేశాల వ్యవహారశైలి కావడమే. అయినప్పటికీ ఈ డిమాండ్‌ను పట్టించుకున్న దాఖలాలు లేవు.
ధనిక దేశాలదే భూతాపం..
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ముందే కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా వెదజల్లి పర్యావరణాన్ని పాడు చేశాయి. కర్బన ఉద్గారాల్లో ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాలదే మెజార్టీ వాటా. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్పవంటూ... ఆ త్యాగం పేద దేశాలు, వర్ధమాన దేశాలు చేయాలన్నది అభివృద్ధి చెందిన దేశాల వాదన. వాస్తవానికి ఈ భూతాపానికి తొలి వరుస ముద్దాయిలు అభివృద్ధి చెందిన దేశాలు. ఇవి విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాలు మొత్తం వాటిలో 46 శాతం. కింది 100 దేశాల వాటా 3 శాతం మాత్రమే. ఈ స్థితిలో ధనిక దేశాలు తగిన బాధ్యత చేపడుతున్నాయా అంటే అదీ లేదు. మిగతా దేశాలకు ఉద్గారాలు తగ్గించడానికి అవసరమైన సాయమూ, టెక్నాలజీ అందించింది లేదు. చేయాల్సిన నష్టమంతా చేసి బాధ్యత మాత్రం అందరం సమానంగా పంచుకోవాలంటూ ఉద్బోధలు చేస్తున్నాయి. ఇది వర్ధమాన దేశాలకు భారంగా పరిణమిస్తున్నది. ఇంత వరకూ ప్రపంచ దేశాల్లో అత్యధికంగా కర్బన ఉద్గారాలు సృష్టిస్తున్న అమెరికా తరువాత స్థానంలో భారత్‌ ఉంది. తర్వాత ఐరోపా యూనియన్‌, ఆస్ట్రేలియా ఉన్నాయి. భూతాపం అదుపునకు తక్షణ చర్యగా భూతాపం పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మించకుండా అడ్డుకట్ట వేయగలగాలి. ఈ విషయాన్ని ప్రపంచానికి శాస్త్రజ్ఞులు 1975లోనే హెచ్చరించారు. దీనిని అడ్డుకోకుంటే గత 3 లక్షల ఏండ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. భూతాపం రెండు డిగ్రీలు దాటకూడదంటే ఈ భూమీద సృష్టిస్తున్న కర్బన వాయు అవశేషాలన్నీ కూడా ఏటా లక్ష టన్నులు దాటకూడదని ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ధరిత్రీ సదస్సు
భూతాప వ్యాప్తిలో అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలన్నింటిదీ.. ఇందులో అమెరికా, భారత్‌, ఐరోపా, ఆస్ట్రేలియా ముందువరసలో ఉన్నాయి. ప్రపంచ ఉద్గారాల్లో వీటి వాటా 91శాతం. ఈ తరుణంలో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనంటూ ఐరాస తొలిసారి 1992లో ధరిత్రీ సదస్సు నిర్వహించింది. యూఎన్‌డీపీ, యూఎన్‌ఎఫ్‌సీసీసీ, ఐపీసీసీ విభాగాలను ఏర్పాటు చేసింది. 1992 నుంచి ఐరాస ఆధ్వర్యంలో 'కాప్‌' సదస్సులు, పర్యావరణ సదస్సులు నిర్వహిస్తున్నారు. 1995లో బెర్లిన్‌లో పర్యావరణహిత విధానాల అమలుపై వివిధ దేశాల సామర్థ్యంపై సమీక్ష కూడా చేశారు. 1996 జనీవాలో పర్యావరణ మార్పులపై శాస్త్రీయ నివేదికకు ఆమోదం కూడా లభించింది. చట్టబద్ధంగా కట్టుబడాల్సిన మధ్యకాలిక లక్ష్యాలను గుర్తించారు. 1997లో క్యోటో సదస్సులో కర్బన ఉద్గారాల నియంత్రణపై నిర్ధిష్టకాల నిబంధనలు రూపొందించారు. 1998లో బ్యూనస్‌ ఎయిర్స్‌లో క్యోటో ప్రోటకాల్‌ అమలుకు రెండేండ్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు. 2001లో బాన్‌ సదస్సులో ఉద్గారాల నియంత్రణ వ్యవస్థల ఏర్పాటులో కొంత ముందడుగు వేశారు. 2002 న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు సాంకేతిక సాయానికి పెద్ద దేశాలు ముందుకొచ్చాయి. 2003లో మిలన్‌లో వర్ధమాన దేశాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. 2010లో కాన్‌కూన్‌లో జరిగిన సమావేశాల్లో పదివేల కోట్ల డాలర్లతో హరిత నిధిని ఏర్పాటు చేయాలని అంగీకరించారు. ఇలా అనేక ఒప్పందాలు, సదస్సులు జరిగాయి. 2030 నాటికి ఏ దేశం ఎంతమేరకు కాలుష్య ఉద్గారాలు తగ్గిస్తాయో పేర్కొంటూ ప్రతిజ్ఞ చేశాయి.
పారిస్‌ ఒప్పందం ఏమైంది?
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచం చేపడుతున్న యజ్ఞంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు ఆర్థిక సహాయమందిస్తామని యూఎన్‌ఎఫ్‌సీసీ సాక్షిగా మాటిచ్చాయి. పారిస్‌ ఒప్పందం 2015 ప్రకారం 2020 నాటికి ఏటా వంద బిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్మానం చేశాయి. అది కాగితాలకే పరిమితమ య్యాయి. గతేడాది గ్లాస్గోలో జరిగిన కాప్‌ 26 సదస్సులో ఈ తీర్మానాన్ని గుర్తు చేస్తూ కనీసం 2025 నాటికన్నా సహాయం అందించే ఏర్పాట్లు చేయ మని వేడుకున్నారు. వాతా వరణ మార్పులను కట్టడి చేయడానికి తీర్మానాలు చేస్తే సరిపోదు. ఆ లక్ష్యాల సాధనకు నిధుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే నేటికి కూడా జీ7 దేశాలు ఈ అంశంపై నోరు మెదపడం లేదు. ప్రస్తుతం ఈజిప్ట్‌లో జరగనున్న సదస్సుకు సంబంధించి ఖరారైన ఎజెండా ప్రకారం చూస్తే భూతాపం పెరుగుదలకు కారణమవుతున్న దేశాలు చారిత్రక బాధ్యత వహించాలని, వాతావరణ న్యాయం పాటించే విషయంలో సభ్య దేశాలు పాటించే నియమాల గురించి. దీని వల్ల నష్టం, నష్టపరిహారం అనే విషయాలపై ప్రధానంగా విస్తృత చర్చ చేపడతామని సదస్సు ప్రకటించింది. భూతాపం పంచే కొన్ని ధనిక దేశాలైతే సదస్సుకు రాకుండా ఒప్పందాల నుంచి బయటపడుతున్న సందర్భాలూ లేకపోలేదు. ఒకవేళ ఒప్పందం చేసుకున్న వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్న దాఖలాలు తక్కువేం కాదు. భారత్‌ మాత్రం వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించేందుకు గతేడాది జరిగిన కాప్‌ 26వ సదస్సులో మాత్రం కొన్ని లక్ష్యాలను ప్రకటించింది. దీని ప్రకారం 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్యస్థితికి చేర్చాలి. అంతే కాదు, స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలతో ఎక్కువయ్యే కర్బన ఉద్గారాలను 2005 నాటి స్థాయిలో 45 శాతం వరకూ తగ్గించాలి. దానితో పాటు విద్యుదుత్పత్తి మొత్తంలో 2030 నాటికి శిలాజేతర ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తి (సౌర, పవన) సగం ఉండాలి. 2030 నాటికి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 450 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం కీలకమైంది. ఈ లక్ష్యాల ప్రకటన ఆచరణలో చెప్పినంత సులభం కాదు ఆచరణలో పై లక్ష్యాన్ని సాధించాలి అంటే పటిష్ట కార్యా చరణలోని ప్రణాళికలు అమలుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే సౌరశక్తిని వినియోగించుకునే విషయంలో కాప్‌ 26 సదస్సులో ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అదే ఒకే ప్రపంచంచ ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్‌ కార్యక్రమం. సౌరశక్తి పూర్తిగా పరిశుభ్రమైనదైతే అది పగటిపూటే అందుబాటులో ఉండటం, వాతావరణంపై ఆధార పడటం పెద్ద సవాలుగా నిలిచింది. భారత్‌ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తే సౌరశక్తిని సులభంగా ఎప్పుడైనా, ఎక్కడికైనా సరఫరా చేయవచ్చునని భారత ప్రధాని గత కాప్‌ 26 సమావేశంలో ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు.. స్టోరేజీ సామర్థ్యం తగ్గడం సహా సోలార్‌ ప్రాజెక్టులకు ఊతమంది స్తుందన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భారత్‌ లైఫ్‌
వాతావరణ మార్పులతో కలిగే వినాశనకరమైన పర్యవసానాల నుంచి భూ గ్రహాన్ని రక్షించేందుకు భారత్‌ నేతృత్వంలో అంతర్జాతీయ కార్యాచరణకు మరో అడుగు పడింది. అదే మిషన్‌ లైఫ్‌ (ఎల్‌ఐఎఫ్‌ఇ) లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ది ఎన్విరాన్‌మెంట్‌. అంటే పర్యావరణ పరిరక్షణను ఒక సామూహిక ఉద్యమంగా మార్చే దిశగా ప్రజలందరూ తమ జీవన శైలిని మార్చుకోవడం. ముఖ్యంగా పర్యావరణ విధ్వంసానికి ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎక్కువ కారణం కాగా దాని ఫలితాన్ని మాత్రం అన్ని దేశాలు భరిస్తున్నాయి. ఈ విషయంలో సదస్సుల పేరిట ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్ధలు చర్చలు చేయడం లక్ష్యాలు ప్రకటించడం తప్ప వాస్తవంలో వాతావరణ మార్పులను అరికట్టగలగడం అనేది జరగడం లేదనే చెప్పవచ్చు. ఈ విషయంలో ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేసి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల జీవనశైలిని మార్చుకోవడం తప్పనిసరని వారిని చైతన్యవంతులను చేయగలిగితే మంచి ఫలితాలు సాధించగలం అనేది లైఫ్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
భారత్‌ దృష్ట్యా చూస్తే..
రీయూజ్‌, రెడ్యూస్‌, రీ సైకిల్‌ అనేవి... మన సంస్కృతిలో ఎప్పటి నుంచో భాగంగా ఉన్నప్పటికీ క్రమేపీ వాటికి తిలోదకాలు ఇస్తూ వస్తుండటంతో నేడు వాతావరణంలో ప్రతికూల మార్పులు చవిచూస్తున్నాం. ఈ మార్పులు ప్రభావాన్ని అరికట్టాలి అంటే ప్రజల ఆలోచనలు ప్రపంచంతో పంచుకుని మార్గదర్శకంగా నిలవాలి అనేది భారత ప్రభుత్వ ఆశయం. దీనికి ప్రకృతి పట్ల చూపే సంప్రదాయాలకు సాంకేతికతను జోడించి చేయడం ద్వారా మిషన్‌ లైఫ్‌ ఉద్యమ లక్ష్యం సఫలీకృతమవుతుంది అని భారత్‌ భావన. ఏమైనప్పటికీ పర్యావరణ పరిరక్షణ విషయంలో సమిష్టి పోరు ఫలితాలు ఇస్తుంది తప్ప కొన్ని దేశాలు పాటించి మరికొన్ని దేశాలు విస్మరిస్తే కలిగే పర్యావరణ నష్టం మాత్రం అందరూ భరించవలసి ఉంటుంది. ఈ ఆశయంతోనే భూతాపంపై కలసికట్టుగా పోరు చేయడానికి సదస్సులు ఏర్పాటు చేసుకున్నాం. రియోతో మొదలై నేటి కాప్‌ 27వ సదస్సుకు చేరుకున్న అద్భుత ఫలితాలు మాత్రం సాధించలేకపోయాం. కారణం అభివృద్ధి చెందిన దేశాలు తమ సంకుచిత, స్వార్ధపూరిత వైఖరిని విడనాడకపోతే వాతావరణ మార్పుల విపత్తుకు సమర్ధవంతమైన సమాధానం దొరకదు. రెండు దశాబ్దాలుగా భూతాపంపై చర్చ జరుగుతున్నా, ప్రపంచం అంతా ఏకతాటిపైకి వచ్చి నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించనిదే చెప్పుకోదగిన ప్రగతి సాధించలేం. దీనిని బట్టి కాప్‌ సదస్సు అనేది 12 రోజులు వేడుక తప్ప పర్యావరణ పరిరక్షణ విషయంలో ఈ సదస్సులు ద్వారా అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ సదస్సులో మరొక ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే సదస్సు నిర్వహణ విషయమై స్పాన్సర్‌ చేయడానికి ముందుకొచ్చిన కంపెనీలలో పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో నెలకొని ఉన్న బహుళజాతి సంస్థ కోకోకోలా కంపెనీకి అవకాశం కల్పించడం ఆందోళన కలిగించే విషయం.
మన దేశంలో చర్యలేవి?
కోకాకోలా నిజంగా ప్లాస్టిక్‌,వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరిం చాలనుకుంటే, దాని ప్లాస్టిక్‌ ట్యాప్‌ను ఆపివేయాలి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు కోకాకోలా వ్యసనాన్ని అంతం చేయడం శిలాజ ఇంధనాల నుంచి దూరంగా ఉండటం, సమాజాలను రక్షించడం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ముఖ్యమైన భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు. పైగా మా కంపెనీ ఉత్పత్తులు పర్యవరణానికి హాని కలిగించవని అంతే కాదు 2050 నాటికి నెట్‌ జీరో కార్బన్‌ స్థాయిలను అందుకుంటా మని, 2030 నాటికా 25 శాతం ఉద్గారాలను నియంత్రిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే గ్రీన్‌వాషింగ్‌లో భాగంగానే కోకాకోలా ఈ లక్ష్యాలను ప్రకటించిందని, కాప్‌ 27వ సదస్సు స్పాన్సర్‌ షిప్‌ నుండి దానిని తొలగించాలని పర్యావరణ ప్రేమికులు ఎంత మొత్తుకున్నప్పటికి నిర్వాహకులలో మాత్రం స్పందన లేదు. మా ఉత్పత్తులు ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్‌, సస్టైన్‌బుల్‌ అనే పద బంధాలు ఉపయోగిస్తూ తమ ఉత్పత్తులను మోసగించి అమ్ముతున్నాయి. అమెరికా యూరప్‌ కెనడా దేశాలు మాత్రం గ్రీన్‌ వాషింగ్‌ పేరు చెప్పి అక్రమ అమ్మకాలు చేస్తున్న సంస్థలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ భారత్‌ వంటి వర్ధమాన దేశాలు మాత్రం గ్రీన్‌ వాషింగ్‌ పేరిట పర్యావరణానికి హాని చేస్తున్న సంస్ధలపై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. భూతాపం కట్టడి చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంతేకాదు విపత్తు ముప్పు ముంచుకొస్తుందని శాస్త్రవేత్తల నివేదికలతో పాటు మనకు అనేక సంకేతాలు ప్రత్యక్షంగా పర్యావరణంలో కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఇప్పటి కిప్పుడు తక్షణ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టినా పూర్వపు పరిస్థితులకు చేరుకోవడం చిన్న విషయం కాదనే చెప్పవచ్చు.
రోజురోజుకూ కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు వెలువడకుండా పూర్తిగా ఆపివేసినప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు వెంటనే ఆగకపోవచ్చు. కొన్ని ప్రభావాలను తప్పక చవిచూడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా చేస్తే కొంతైనా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశముందంటున్నారు. ఇప్పటికైనా కాలుష్య ఉద్గారాలను దూకుడుగా తగ్గించడం ద్వారా, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తీవ్రమైన పరిణామాలను కొంతైనా నివారించవచ్చు. దీని కోసం గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను అదుపు చేయడం, ముఖ్యంగా కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాన్ని తగ్గించడం ఒక్కటే మార్గం. అప్పుడే ఈ ఉష్ణోగ్రతలు తగ్గటం మాట అటుంచి కనీసం పెరగకుండా ఉంటాయి.
ధనిక దేశాలదే ప్రధాన బాధ్యత..
ఈ విషయంలో ధనిక దేశాలు ప్రధాన పాత్ర వహించాల్సి ఉంది.ఈ విషయంలో ఈ దేశాలు తప్పించుకునే ధోరణి మాని అందరి తరపునా బాధ్యత తీసుకుంటేనే అది సాధ్యం. ప్రస్తుత పరిస్ధితులలో ఆ భరోసా కనిపించడం లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భూతాపాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా చూసుకోవడం నేడు ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాలుగా నిలిచింది. దానికి ప్రధాన కారకులు అభివృద్ధి చెందిన దేశాలే అని చాటిచెప్పడానికి కాలక్రమంలో వర్ధమాన దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ విష యమై ప్రపంచ దేశాల మధ్య యుద్ధ ప్రాతిపదికన సమగ్ర, నిష్పాక్షిత ఒప్పందానికి రావాలి. దానికి కాప్‌ 27వ సదస్సును ఉపయోగించు కోగలితే ప్రయోజనం దక్కుతుంది. అంటే ఇక్కడ కర్బన ఉద్గారా లను తగ్గించడంలో పూర్తి మిన హాయింపు ఇవ్వాలని వర్ధమాన దేశాలు కోరడం లేదు. ఎక్కువ బాధ్యతను ధనిక దేశాలు చేపట్టాలని వాటి డిమాండ్‌. కర్బన ఉద్గారాల శూన్యతకు సంబంధించి ఆధునిక సాంకేతికతను వర్ధమాన దేశాలకు అందించడంలో సంపన్నదేశాలు వాటికి పూర్తిస్థాయిలో తోడ్పడవలసిన అవసరముంది. ఇది ఆ దేశాల కర్తవ్యం కూడా. దీనికి భిన్నంగా కార్బన్‌ ఉద్గారాలు మితిమీరి పోతున్నాయని వర్థమాన దేశాలను తప్పు పడితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదు. అభివృద్ధే ధ్యేయంగా ఇప్పటి వరకు శిలాజ ఇంధనాలను మితిమీరి వాడి అభివృద్ధి సాధించిన సంపన్న దేశాలు లాగే వర్ధమాన దేశాలకు కూడా అభివృద్ధి ముఖ్యమనే నిజాన్ని గుర్తించాలి. పారిశ్రామిక విప్లవం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానంతరం, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో వాతావరణ నష్టమే బాగా ఎక్కువ. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేసిన, చేస్తున్న ఉద్గారాలు, వెదజల్లిన కాలుష్యాలు, ప్రకృతి వనరుల దోపిడీకి లెక్కేలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని పేద దేశాలపై నెపం వేయడం, లక్ష్యాలు నిర్ణయించడం కాకుండా సుస్ధిర అభివృద్ధి సాధనకు సంపన్న దేశాలు ఆధునిక సాంకేతి కతను పేద దేశాలకు అందివ్వాలి.దాంతో పాటు పునరుత్పాదక వనరుల వినియోగించుకోవడంలో పరిజ్ఞానాన్ని పేద దేశాల కందిస్తూ దానికయ్యే వ్యయంలో భాగంగా ధనిక దేశాలు ఒక నిధిని ఏర్పాటు చేయాలి.పునరుత్పాదక వనరుల వాడకమే సుస్థిరాభివృద్ధి సాధనకు శాశ్వత పరిష్కారం. తిరిగి పొందలేని వనరుల వినియోగమే ఈ కాలుష్యానికి ప్రధాన కారణమని ప్రపంచం గుర్తించింది.దానికి పరిష్కారం పునరుత్పాదక వనరుల వినియోగం ఒక్కటే. ఈ వినియోగానికి ఉపయోగించే సాంకేతికత అత్యంత ఖరీదైనది. దీనికి ధనిక దేశాలు సహకరించాలి. తక్కువ సమయంలోనే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వినియోగానికి తరలిపోవాలి. లేనిపక్షంలో అతి సమీపంలోనే ఎదురయ్యే పర్యావరణ ముప్పును ప్రపంచం అంతా ఎదుర్కోక తప్పదు.
నేటి నుంచి ఈజిప్ట్‌లో కాప్‌ 27వ సదస్సు
            నవంబర్‌ 6 నుంచి 18 వరకు 12 రోజుల పాటు ఈజిప్టు దేశ రాజధానిలో కాప్‌ 27వ సదస్సు ఏర్పాటు చేశారు. ఎర్రసముద్రం తీర ప్రాంతంలోని షామ్‌-ఎ-షేక్‌లో నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం, ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై అంతర్‌ ప్రభుత్వ సంఘం 1988లో ఏర్పాటైంది. దీంట్లో అనేక దేశాలకు చెందిన వేలాది మంది శాస్తవ్రేత్తలు , సాంకేతిక నిపు ణులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. వీరితో వాతావరణ శాస్త్రం, పర్యావరణ, ఆర్ధిక, వైద్య, సముద్ర శాస్త్రాల రంగాలకు చెందిన శాస్తవ్రేత్తలు పనిచేస్తున్నారు. సైన్స్‌ చరిత్రలోనే ఐపిసిసి అంతటి విస్తృతమైన శాస్త్ర పరిశోధన లేదని చెప్పవచ్చు.దీనిలో 199 దేశాలు సభ్యత్వం పొందాయి. ఇది ఎప్పటికప్పుడు పర్యావరణంపై నివేదికలను విడుదల చేస్తుంది. భూతాపంపై వాతావరణ మార్పులపై ప్రపంచస్థాయి చర్చలకు ఈనివేదికలే ప్రధానమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ మార్పు ఆధ్వర్యంలో భూతాపం తగ్గించడానికి కాప్‌ సదస్సులు నిర్వహిస్తూ పర్వ్యవరణాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలపై చర్చలు జరుపుతూ ప్రపంచ దేశాలకు భూతాపం వలన వాతావరణంలో ఏర్పడే మార్పులను కట్టడి చేసేందుకు లక్ష్యాలను తెలియచేస్తూ రావడం జరిగింది.పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం, ప్రతి భూభాగం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంగీకరించి సంతకం చేసిన ఒక అంతర్జాతీయ ఒప్పందమే కాప్‌.దానిపై సంతకాలు చేసిన దేశాల సమావేశాన్ని 'కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌)'గా వ్యవ హరిస్తున్నారు. ఈ సమావేశం 1995లో తొలిసారి జరిగింది. ఇందులో 2015 పారిస్‌లో జరిగిన సమావేశంలో సభ్య దేశాలు అంగీకరించిన ఒప్పందం చాలా కీలకమైనదిగా పేర్కొంటారు.
సంపూర్ణ సౌర విద్యుత్‌ గ్రామం
పర్యావరణ మార్పులపై పోరులో భాగంగా శుద్ధ ఇంధనాల బాట పడుతున్న భారత్‌ తాజాగా కీలక మైలు రాయిని దాటింది. గుజరాత్‌లోని మొథేరా దేశంలోని తొలి సంపూర్ణ సౌర విద్యుత్‌ గ్రామంగా అవతరించింది. వాతావరణ మార్పులు ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్న ఈ తరుణంలో మొదేరా పూర్తి స్థాయి సౌర గ్రామంగా మారడం గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. దీంతో పాటు తాజాగా మిషన్‌ లైఫ్‌ పేరిట పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి తాజాగా భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
27వ సదస్సుకు కోకోకోలా స్పాన్సర్‌షిప్‌
తాగిన తరువాత విసిరి పడేసే కూల్‌డ్రింక్స్‌ బాటిల్స్‌.. విభిన్న ఉత్పత్తులకు ఉపయోగించే ప్లాస్టిక్‌ ప్యాకింగ్స్‌ ఇవన్నీ పర్యా వరణ హితమేనా అని ప్రశ్నిస్తే అవును అవి పక్కా ఆర్గానిక్‌ అంటూ చెబుతున్నాయి బహుళ జాతి సంస్థలు. ఇవన్నీ పర్యావరణానికి కీడు చేసేవే. కానీ తమ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రభుత్వ ఆంక్షలు అడ్డురాకుండా తప్పించుకునేందుకు అనేక వ్యూహలను ఈ సంస్థలు అనుసరిస్తున్నాయి.అటువంటి వ్యూహలను అనుసరించే కంపెనీలలో అగ్రభాగాన కోకోకోలా కంపెనీ నిలిచింది.వాతావరణ మార్పులను అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలసి కట్టుగా చర్చించి కార్యాచరణ చేయడానికి ఉద్దేశించిన కాప్‌ సదస్సుల నిర్వహణకు ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొన్ని కంపెనీలు ముందుకు వచ్చి స్పాన్సర్‌ చేస్తూ ఉంటాయి.అదే పంథాలో నేడు జరుగుతున్న 27వ సదస్సు స్పాన్సర్‌ చేసే అవకాశాన్ని బహుళ జాతి సంస్థ కోకోకోలా చేజిక్కించుకుంది. ఇది పెద్ద విశేషంగా అనిపించక పోవచ్చు.కానీ పర్యావరణాన్ని కాపాడటానికి అంతర్జాతీయంగా చర్చలు జరిపి పరిష్కారాన్ని చేపట్టే ఈ సదస్సుకు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్న కోకోకోలా కంపెనీకి అవకాశం కల్పించడంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రపంచంలో నంబర్‌ వన్‌ ప్లాస్టిక్‌ కాలుష్యకారిగా కోకాకోలాను చెబుతూ ఉంటారు. 200 దేశాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ఈ బహుళ జాతి సంస్ధ కేవలం ఒక సంవత్సరంలో మూడు మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు స్వయంగా 2019లో ప్రకటించింది. మరొక ముఖ్య విషయం ఈ కంపెనీ నిమిషానికి 2 లక్షల బాటిళ్లను ఉత్పత్తి చేస్తుంది. విచ్ఛలవిడిగా భూగర్భ జలాలను వినియోగిస్తూ ఉంది. ముఖ్యంగా 120 బిలియన్ల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లతో ప్రపంచవ్యాప్తంగా నదులు, మహాసముద్రాలు భూమిని కలుషితం చేస్తోంది, భూగర్భ జలాలను విపరీతంగా వాడి జల కాలుష్యానికి కారణంగా నిలిచింది. 2019లో ఆ సంస్థ అధికారికంగా సంవత్సరానికి 5 వేల మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. 2021లో గణాంకాల ప్రకారం కోకాకోలా విడుదల చేస్తున్న గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 8 శాతం పెరిగాయి. ఒక అంచనా ప్రకారం ఏడాదికి 120 బిలియన్ల (12 వేల కోట్ల) సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లను ఆ సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది .కెన్యా, ఉగాండా తో సహా అన్ని గ్లోబల్‌ బ్రేక్‌ ఫ్రీ ఫ్రమ్‌ ప్లాస్టిక్‌ బ్రాండ్‌ ఆడిట్‌లలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్‌ కాలుష్య కారకమైన కోకా-కోలా అని నిర్దారించింది. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టలేదంటూ 2020 సెప్టెంబర్‌ నెలలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ దాదాపుగా 51 కోట్ల రూపాయల అపరాధ రుసుమును ఈ సంస్థకు విధించింది. ఆ మొత్తాన్ని కూడా కోకాకోలా చెల్లించలేదు. అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఈ కంపెనీ పై ఇన్ని అభియో గాలున్నప్పటికీ కాప్‌ స్పాన్సర్‌షిప్‌ కోకోకోలాకి కట్టబెట్టడం ఆశ్చర్యంగా పరిణమించింది.దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
సంక్రాంతి సంద‌డి
కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి
పుస్త‌క‌మేవ జ‌య‌తే
ఐదు దశాబ్దాల సహజత్వం జయసుధ సినీ ప్రస్థానం
హస్తకళల పట్టుకొమ్మలు.. నిర్మల్‌ కొయ్యబొమ్మలు
నాటి నవ్వుల కలలరాణి షర్మిలా ఠాగూర్‌
అవగాహన! అప్రమత్తత!!
ఆన్‌లైన్‌లో తెవెలుగు
రిషి సునాక్‌ మన ''వాడా'' బ్రిటీష్‌ మనిషా!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.