Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్య-మూలం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

సమస్య-మూలం

Sun 06 Nov 02:45:32.165758 2022

ధర్మవరం గ్రామంలోని పాఠశాలకు శంకరయ్య మాష్టారు బదిలీపై వచ్చారు. ఆయన తెలుగు భాషోపాధ్యాయుడు. ఆయన విద్యారంగంలో అందించిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు. అందమైన గదులు, విశాలమైన ఆటస్థలం, స్వచ్ఛమైన చల్లని గాలిని అందించే రకరకాల పచ్చని చెట్లతో ఆ పాఠశాల ఆయనను ఎంతగానో ఆకర్షించింది.
నాలుగు రోజుల తర్వాత శంకరయ్య మాష్టారు ప్రధానోపాధ్యాయుడితో ''మాష్టారూ! మన పాఠశాలలో కొందరు పిల్లలు మాసిన దుస్తులతో, చింపిరి జుట్టుతో వస్తున్నారు. శుభ్రంగా రావాలని ప్రార్థన సమయంలో వివరిస్తే బాగుంటుంది కదా'' అన్నాడు.
ఈ విషయం అనేకసార్లు చెప్పాను. చెప్పి చెప్పి విసిగిపోయి వదిలేశాను. వాళ్లు మారరు. మీరూ ప్రయత్నించండి'' అన్నాడు ప్రధానోపాధ్యాయుడు.
శుభ్రత పాటించని వారిని తన వద్దకు పిలిచి కారణం అడిగాడు శంకరయ్య మాష్టారు.
''ఉదయమే పనికి వెళ్లి సాయంకాలం ఇల్లు చేరే అమ్మకు దుస్తులు శుభ్రం చేయడానికి సమయం దొరకదు మాష్టారూ!'' అని చెప్పారు కొందరు పిల్లలు.
''ఇంటిలో బట్టల సబ్బు లేదు. అద్దం లేదు. మాష్టారూ!'' అన్నారు మరి కొందరు. ఇంకొందరు దువ్వెన లేదన్నారు. రకరకాల కారణాలు చెప్పారు.
ఆయన బట్టల సబ్బు తెప్పించి దుస్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో, సబ్బును పొదుపుగా ఎలా వాడాలో ఒక్క రోజులో విద్యార్థులకు నేర్పాడు. సబ్బు లేదన్న పిల్లలకు సబ్బులు తెచ్చి ఇచ్చాడు. ప్రతి తరగతి గదిలో అద్దం, దువ్వెన ఏర్పాటు చేశాడు. అమ్మ, నాన్న తిను బండారాల కోసం ఇచ్చే డబ్బులో కొంత పొదుపు చేసి అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చో నేర్పాడు.
పిల్లలు విశ్రాంతి సమయంలో పాఠశాల బయటకు వెళ్లి అంగడిలో ప్లాస్టిక్‌ కవర్లలోని పదార్థాలను కొని తెచ్చుకోవడం గమనించా డు.పిల్లలందరినీ సమావేశపరిచాడు. ''ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి సమావేశ మయ్యాము. మొక్కలకు ఆకులు, పువ్వులు ఎంత అందాన్ని ఇస్తాయో మనకు ఉతికిన దుస్తులు అంత అందాన్ని ఇస్తాయి. కాబట్టి ఆదివారం రోజు ఇంటివద్ద మీ దుస్తులు మీరే శుభ్రం చేసుకోండి. సబ్బులేని వారు నన్ను అడిగితే ఇస్తాను. మనిషికి చదువు ఎంత అవసరమో పొదుపు అంతే అవసరం. పొదుపు ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. రాజులకు కిరీటం, మనకు శుభ్రంగా దువ్వుకున్న తల అందాన్ని, హూందాతనాన్ని ఇస్తాయి. అద్దం, దువ్వెనలు తరగతి గదుల్లో ఉంచాము. చింపిరి జుట్టుతో, మాసిన దుస్తులతో ఏఒక్కరూ కనిపించవద్దు. మీరు ప్లాస్టిక్‌ కవర్లలోని పదార్థాలు కొన్ని తెచ్చుకుని తింటున్నారు. అవి పాడవకుండా చాలా కాలం నిల్వ ఉండడానికి రసాయనిక మందులు కల్పుతారు. అవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి. భవిష్యత్తులో జబ్బులు వస్తాయి. పండ్లు మంచి ఆరోగ్యాన్నిస్తాయి. కాబట్టి ఈ రోజు నుండి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వారు సపోట, జామ, ఉసిరి, దోస, చీనీ మొదలగు పండ్లను తక్కువ ధరలో అమ్ముతారు. వాటిని శుభ్ర పరుచుకుని తినండి. ఆహారపదార్థాల మీద ఈగలు, మీ మీద దోమలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు'' అని వివరించి చెప్పారు.
ఆ రోజు నుండి పిల్లల్లో మార్పు వచ్చింది. ''ఇంత మార్పును మేము తీసుకు రాలేకపోయాము'' అన్నారు ప్రధానోపాధ్యాయుడు.
''మీరు పిల్లలను మారమని మాత్రమే చెప్పారు. నేను సమస్యల మూలాలను సరిదిద్దాను.'' అన్నారు శంకరయ్య మాష్టారు.
సమస్యకు మూలమేమిటో తెలుసుకుని సరిదిద్దినప్పుడే సమస్య పూర్తిగా సమసిపోతుందని గ్రహించారు అందరూ.

- డి.కె.చదువులబాబు, 9440703716

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కన్నీటి వెన్నెల
రేన్వన్ల చెట్టుకాడ !
రైతులకు సాయం
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు
సివంగి
పచ్చలహారం
చేపల కూర
నాన్నా పులి
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.