Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నయవంచన | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

నయవంచన

Sun 20 Nov 00:06:13.559473 2022

           రోజురోజుకూ పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, హత్యల నుంచి మహిళలు ఎలా రక్షించుకోవాలోనని ఓ వైపు మదనపడుతుంటే మరోవైపు మృతదేహాలతో కూడా శృంగారం చేసే వికృతచేష్టలు రావడం దౌర్భగ్యకరం. నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏదో ఒక సెక్షన్‌లో ఉన్న లొసుగుతో నిందితులు తప్పించుకోవడం ఆందోళన కలిగించే అంశం. 19 ఏండ్ల యువతిపై గ్యాంగ్‌రేప్‌ చేసిన వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పునివ్వడం విచారకరం.
           దారుణం.. కిరాతకం.. ఉన్మాదం.. ఇలాంటివి ఎన్ని పదాలు వాడినా ఈ భయంకరమైన ఘటనకు తక్కువే. నమ్మివచ్చిన ప్రియురాలు పెండ్లిచేసుకోమ్మని అడిగినందుకు హత్యచేశాడో నయవంచకుడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని రంపంతో 35 ముక్కలుగా నరికాడు. దాన్ని భద్రపరిచేందుకు కొత్త ఫ్రిజ్‌ను కొన్నాడు. ఇంట్లో వాసన రాకుండా ఆగర్‌బత్తీలను అంటించాడు. ఆ తర్వాత అనుమానం రాకుండా రోజుకొక చోట ఆ ముక్కల్ని పారవేస్తూ వచ్చాడు. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? సరిగ్గా ఆరు నెలల తర్వాత ఈ నెల 15న దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఈ హత్యోదంతంతో మహిళాలోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యలు, రేప్‌లు చేసిన దుర్మార్గులు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే తప్పు చేయని వారు మాత్రం రహస్యంగా బతకాల్సిన దుస్థితి వచ్చింది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ నేరాలు, ఘోరాలకు అడ్డుకట్ట వేసే బాధ్యత ఎవరిది?
           మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన 28 ఏండ్ల యువతి శ్రద్ధ వాకర్‌. ముంబై ప్రాంతం మలాడ్‌లోని ఓ ప్రయివేటు కంపెనీ కాల్‌సెంటర్‌లో జాబ్‌చేసేది. అక్కడే అప్తాబ్‌ అమీన్‌ పూనావాలాతో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇదే అదనుగా ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఢిల్లీలోనే కొంతకాలం సహజీవనం చేశాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి మతాలు వేరు కావడంతో పెండ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తాను నమ్ముకున్న అప్తాబ్‌తో ఢిల్లీకి వచ్చేసింది శ్రద్ధ. వచ్చినప్పటి నుంచి పెండ్లి గురించి ఇద్దరి మధ్య విబేధాలు. అప్తాబ్‌ ప్రతిసారీ దాటవేస్తూ రావడంతో గట్టిగా నిలదీసింది. దీంతో శ్రద్ధను గొంతు నులిమి చంపేశాడు. అంతటితో ఆగకుండా అమెరికన్‌ క్రైం షో 'డెక్స్‌టర్‌' ప్రేరణతో డెడ్‌బాడీని ముక్కలుగా నరికేసి అడవుల్లో అక్కడక్కడ విసిరేశాడు. ప్రేమించినందుకు ఇంత ఘాతుకానికి ఒడిగడతాడా? ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ప్రియుడిని నమ్మడమేనా? నమ్మితే అతను చేసిందేంటి నయవంచన. ప్రేమించి పెండ్లి చేసుకోవాలనుకున్న ఆమె ఆశ తీరలేదు. కూతుర్ని ప్రయోజకురాలిగా చూడాలను కున్న తల్లిదండ్రుల కోర్కె నెరవేరలేదు. తానే సర్వస్వమని నమ్మివచ్చినందుకు శారీరకంగా వాడుకుని ఆ తర్వాత కసాయిలా మారాడు ఆ క్రూరుడు. ఇది బయటకు వచ్చి నాలుగు రోజులవుతోంది అంతే. మథురైలో మరో ఘటన. యమునా ఎక్స్‌ప్రెస్‌వే పక్కన ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన యువతి మృతదేహం లభ్యమైంది. బాడీపై బుల్లెట్‌ గాయం, రక్తం, ఎవరో అగంతకులు ఆమెను కాల్చి ట్రాలీబ్యాగ్‌లో కుక్కి అక్కడ పడేశారు. ఇలాంటి విషాదాలు రోజూ ఏదో ఓ చోట నిత్యకృతమవుతుంటే మనసులో తెలియని ఆవేదన నిత్యం వెంటాడుతోంది.
           రోజురోజుకూ పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, హత్యల నుంచి మహిళలు ఎలా రక్షించుకోవాలోనని ఓ వైపు మదనపడుతుంటే మరోవైపు మృతదేహాలతో కూడా శృంగారం చేసే వికృత చేష్టలు రావడం దౌర్భాగ్యకరం. నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏదో ఒక సెక్షన్‌లో ఉన్న లొసుగుతో నిందితులు తప్పించుకోవడం ఆందోళన కలిగించే అంశం. 19 ఏండ్ల యువతిపై గ్యాంగ్‌రేప్‌ చేసిన వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పునివ్వడం విచారకరం. 25 ఏండ్లుగా నడుస్తున్న బిల్కిస్‌బానో కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే ఈ విధంగా తీర్పురావడం బాధాకరం. ఇలాంటి తీర్పే న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది.'దేశంలో న్యాయపరంగా ఇలాగే నిరాశ కొనసాగితే గనుక మహిళలకు ఆయుధాలు ఇవ్వాల్సిన సరైన సమయం ఇదే కావచ్చు' అని ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇదే నిజం. పొరుగు దేశం నుంచి ప్రమాదముందని, మన దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వల్లెవేస్తున్న నాయకులు స్వదేశంలోని మహిళలకు భద్రత కల్పించకుంటే వీరి పాలన ఎవరికోసం, ఎందుకోసం?.
           ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపే సినిమాలు హత్యలకు ప్రేరేపించడం, సరాదాలు, సంతోషాలతో సాగే స్నేహాలు ప్రేమవైపు దారి మళ్లడం జరుగుతున్న కొన్ని అనార్థాలకు సజీవ సాక్ష్యాలు. ప్రేమించేటప్పుడు వ్యక్తితో పాటు వారి మనస్తత్వాన్ని ఆలోచనలు పసిగట్టలేక పోవడం వల్ల జరిగే నష్టం భరించలేనది. దానికి ఉదాహరణ అర్థంతరంగా ముగిసిన శ్రద్ధ జీవితం. ఎవరినీ సహజంగా నమ్మొద్దని, ఆచితూచి అడుగేయాలని అమ్మాయిలను హెచ్చరించే ఘటనిది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బహిష్కరణ!
రాజ్యాంగ శోకం
ఆంక్షల కత్తి
సంస్కృతి
మద్యపాణం
కొత్తకాంక్ష
పుస్తక మహోత్సవం
ఉన్మాదం
అందరివాడు
మానని గాయం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.