Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆశ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

ఆశ

Sun 27 Nov 04:55:56.834939 2022

'నాన్నా! జాతరకు పోదామని'' పిల్లలు బలవంత పెట్టడంతో సతీసమేతంగా బయలుదేరక తప్పలేదు. జాతర దగ్గర జనం తండోపతండాలుగా ఉన్నారు. అక్కడ ఉగ్రరూపంతో నున్న అమ్మవారిని శాంతపర్చడానికి పరాయి తలలు తాకట్టుపెడుతున్నారు. తాకట్టుపెట్టిన మూగ తలలు మౌనంగా తెగి దూరంగా పడి, మొండాలు మాట్లాడాలని గింజుకుంటున్నాయి. తల మాట్లాడలేనప్పుడే, కాళ్ళు కొట్లాడుతాయి. మాట పెగలని నోటిని అందుకుందామని చేతులు ప్రయత్నం చేస్తూ కళ్ళు లేక కనబడక అటూ ఇటూ పునుకులాడుతున్నాయి. ఆ దృశ్యం వెగటుగా కంటే ఆలోచనాత్మకంగా ఉంది. అక్కడ పచ్చి నెత్తుటి వాసనకు అలవాటయిన ఈగలు గుంపుగా ఆ చోటంతా చేరి, జిబ్బుమంటున్నాయి. తోసుకోవడం, కొట్టుకోవడం, దాచుకోవడం వాటికి తెలియనట్టుంది. ఏదో అప్పటి ఆకలికి నెత్తుటిపై వాలి ఆకలి తీర్చుకుంటున్నాయి. వాటి ఆకలి తీర్చడానికి ఆ బలిజరగలేదని వాటికి తెలియదు. అయినా అవి అక్కడికి పిలవని బంధువుల్లా చేరి ఆ రక్తంపై వాలాయి.
అవిలయ్య ప్రేమతో సాదుకున్న గొర్రెపోతు. దాని మెడకు పల్పుకట్టి గుడి ఎదురుగా బలిపీఠం దగ్గరకు బలవంతంగా లాక్కొని పోతుండు. నెత్తుటివాసనను పసిగట్టిన మేక ఎనక పట్టుపట్టింది. గొర్రెను బలిస్తే నరదిష్టిపోయి భార్య రోగం నయమవుతుందని సిద్ధాంతి చెప్పాడు. అదే ఆశతో గొర్రెపోతును బలిపీఠం దగ్గరకు బలంగా లాగుతుండు. గొర్రెపోతు రానని గింజుకుంటుంది. దానిది సావుతెలివి. ఎలాగైనా బతకాలని దానికి ఆశ.
పొద్దు నెత్తిమీదకు వస్తుంది. అవిలయ్య పట్టువదల్లేదు. బుద్దిబలం చూపాడు. గొర్రె చెవులనందుకుండు. మనిషి బలం ముందు జంతువు బలం చిన్నది. అతని చేతిల ఆకలిగొన్న కత్తి, గొర్రె అరుపులపై కనికరం చూపలేదు. గొర్రె అరుపులు వినీవినీ అలవాటయిన కత్తి ఆశకు తెగిన గొర్రె తల ఎగిరి అమాంతం అంత దూరంలో పడింది.
ఆశకు అంతులేదు. నిరాశకు చింతలేదు. అదంతా చూసిన మనసు కొద్దిగా చలించింది.
ఇంతలో బుడ్డోడు ''డాడీ... అటూ చూడు అక్కడ... అంటూ రంగుల రాట్నం చూపించి అక్కడికి పోదాం'' అనడంతో అటు వెళ్ళక తప్పలేదు. రంగుల రాట్నం బుడ్డోడితో పాటు ఎక్కి కూర్చున్నాక మనసులో ఆలోచనలు, కాలం గిర్రున తిరిగాయి.
ఆర్నెల్లకు అయిలయ్య హాస్పిటల్లో కనిపించాడు. 'ఏమిటి ఇలా వచ్చావు?' అనడిగితే 'భార్య ఆరోగ్యం కోసం' అని చెప్పాడు. సిద్ధాంతికి దొరికిన ఆ గొర్రె కష్టాలు ఇంకా తీరనేలేదు. నా కళ్ళ ముందు వెఱ్రి గొర్రె కనబడింది. మొండెంతో బలిపీఠం దగ్గర తిరుగుతూనే ఉన్నట్టు కన్పించింది.
                                      *******
హాస్పిటల్‌ నుండి బయటకొచ్చి రోడ్డుమీద నడుస్తుంటే, ''రండమ్మా... రండి.. మంచి తరుణం మించినా దొరకదు. మీ కన్నులకు కనికట్టు చూడండి. నచ్చితే మీకు తోచింది ఇవ్వండి. లేకపోతే చప్పట్లు కొట్టి వెళ్ళిపోండి.'' అని గారడీ చేసే ఇంద్రజాలికుడు రోడ్డున పోయే అందరినీ పిలుస్తున్నాడు.
చిన్న వస్త్రం కిందపరిచి, మధ్యలో తన బిడ్డను నిలబెట్టి, ఆమె మీద తెల్లని వస్త్రాన్ని కప్పాడు. తన కుడిచేతిలో నున్న పొడవాటి కర్రను ఆమెపై గుండ్రగా తిప్పాడు. వస్త్రం పైభాగాన ఎడమచేతితో బట్టను అమాంతం లాగి పైకి ఎగరేశాడు. ఆ అమ్మాయి మాయమైంది. జనం చప్పట్లు చరిచారు. రోడ్డున పోయే వారికి జనమే వింత. అలాంటిది ఆ జనమే చప్పట్లు చరవడంతో ఆ వింత రెట్టింపై అటుపోయే జనం ఆసక్తిగా అక్కడికి పరుగులు తీశారు. గారడీ కార్యక్రమం కొనసాగుతుంది. గంట దాటింది. ఎండనెత్తి మీదకు వస్తుంది. గుమిగూడిన జనం నోరెళ్ళబెట్టి మరీ చూస్తున్నారు. కార్యక్రమం చివరికి వచ్చింది. తన భార్యను చూపిస్తూ అనారోగ్యానికి వైద్యం చేయించాలని సాయం చేయమని భుజాన ఉన్న
తువ్వాలను జోలె పట్టి ముందుకు చాపుతూ ప్రార్ధించాడు ఇంద్రజాలికుడు. ఆమె మొఖంలో నీరసం, చావుకళ స్పష్టంగా ఉంది. చిల్లర మూటను చూసి తండ్రీ బిడ్డలకు ఆనందం అద్దంలో మెరిసిన సూర్యుని వెలుగులా తళుక్కుమంది. చుట్టూ ఒకసారి తిరిగి వచ్చిన చివర డబ్బును మూటకట్టి భార్య దగ్గర పెట్టాడు. ఈ డబ్బుతో అమ్మరోగం నయమవుతుంది. ఇక నేను బడికివెళ్లి చదువుకోవచ్చని ఆ చిన్ని మనసుకు పెద్దాశే కలిగింది. రెట్టించిన ఉత్సాహంతో ప్రదర్శనను ఇంకో పది నిమిషాలు పొడిగించారు. అది పూర్తయ్యాక తమ సామాన్లు సర్దుకుంటూ భార్యవైపు చూశాడు ఇంద్రజాలికుడు.
''ఒక్క మెతుకు కాస్త గంజిలో పోయినట్టు'' తువాలలో కట్టిన చిల్లర సొమ్ము కనబడలేదు. భార్య కండ్లు నీరసంతో ఎప్పుడో మూతపడ్డాయి. బయట ఇంద్రజాలికులకు కొదవలేదు.
దొంగాశ ఇంకా పెద్దది. ఆ రోజుకు అదే గెలిచింది.
                                      *******
మరుసటి ఏడాది జాతర. మళ్ళీ పిల్లలతో వెళ్ళక తప్పలేదు. అది ఎన్నికల వేళ. జాతరలో అయితే స్వామికార్యం, స్వకార్యం రెండూ జరుగుతాయని బాగా పేరున్న రాజకీయ నాయకుడు అక్కడికి వచ్చాడు. అతను మా ఇంటికి దగ్గరే. అతని రాకతో రోడ్డుపై ట్రాఫిక్‌ భారీగా నిలిపేసి ఉంది. కార్యకర్తలు దండుగరావు నాయకుని రథం వెంట పెద్దర్యాలీగా వెళ్తున్నారు. ర్యాలీ ఘనంగా ముందుకు సాగుతుంది. టపాసులు పేలుతున్నాయి. కార్యకర్తలు మొఖాలకు తమ నాయకుని పార్టీ రంగును సంబురంగ పులుముకుంటున్నారు. ''ఏ రోటికాడ పాట ఆడనే పాడేవాళ్ళు'' చాలా మందే ఉన్నారు. ఆ రోజుకు వచ్చిన సామాన్య జనం కూడా ఉన్నారు. వాళ్ళ తలకు విలువ ఉంది. తల ఒక్కంటికి రెండు వేలు, బిర్యాని పొట్లం, మద్యం సీసా.
గత ఏడాది బలిపీఠం దగ్గర గొర్రెపోతు గుర్తుకొచ్చింది. జాతరకొచ్చిన ప్రజలకు ఆ నాయకుడు దండాలు బెడుతున్నాడు. అభిమానులు దండలుకొని అతని మెడలో వేస్తున్నారు. 'ఎలాగైనా ఈ సారి గెలిచి, ఈ ఖర్చునంతా పార్టీ మారి తన తలకు ధర రాబట్టాలని మనసులో ఆశబడుతున్నాడా నాయకుడు. ఎన్ని'కలలో..' జాతరకొచ్చిన జనాన్ని నమ్మించే వాగ్దానాలన్నీ రాసుకొచ్చి మరీ గుప్పించాడు. జాతరకొచ్చి ఆ రోజుకు నమ్మారు. తరువాత మర్చిపోయారు. ఇంకో నాయకుడు వచ్చి మరికొన్ని మత్తు వాగ్దానాలను ఇచ్చాడు. తరువాత ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. దండుగరావు ఓడిపోయాడు. దండలు ఈసారి విజేత మెడను వెతుక్కుంటూ వెళ్ళాయి. దండల ఆశ దండలది. ఎరను వేసి చేపను పడుదామనుకున్న దండుగరావు మొఖంలో రంగులన్నీ వెలిసిపోయాయి. తన రంగు ఓడిపోయింది. జనాల అసలు రంగు బయటపడ్డది. తగిలిన ఎదురుదెబ్బను తట్టుకోలేక పోయాడు. చివరికి ఫొటోలో దండతో మిగిలిపోయాడు.
                                      *******
మరుసటి ఏడాది జాతరకు పోయినపుడు మరో గమ్మత్తైన సంగతి. జాతరకు దగ్గరలో ఊర్వసి టాకీసు ఉంటుంది. అది సందులోకి ఉన్నట్టు ఉంటుంది. టాకీసు గోడపైన అందాల హీరోయిన్‌ టకీల బొమ్మ పెద్దగా నవ్వుతూ పిలుస్తున్నట్టు ఉంది. లేతమీసాల నుండి తెల్ల మీసాల దాక పోస్టరును చూసి చొంగ కారుస్తున్నారు.
అరవింద్‌ వాళ్ళ ఇల్లు మా ఇంటికి నాలుగో ఇల్లు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే. చదువుకోసమని అరవింద్‌ను ప్రైవేటు హాస్టల్లో వేసి, పేరున్న కాలేజీలో చదివిస్తున్నారు. ఆ రోజు అరవింద్‌ పుట్టినరోజు. ఆ సందర్భంగా అరవింద్‌ ఉదయమే ఇంటికి వచ్చి స్వీట్లు ఇచ్చి వెళ్ళాడు. సినిమాకు పోదామని అరవింద్‌ మిత్రులు ఒత్తిడి చేసినట్టున్నారు. మిత్రులతో కలిసి టాకీసు సందులో కనబడ్డాడు. ఆ వేళ వారికి అవుట్‌ పాస్‌ దొరకదు. ఎలా వచ్చారో కానీ పదిమంది మిత్రులతో కనబడ్డాడు. ఆసక్తి కలిగి అటూ పోదామనుకున్నా వెంట కుటుంబసభ్యులు ఉండడంతో ముందుకు కదిలాను. తరువాత తెలిసింది వారు ఆ రోజు కళాశాల గోడ దూకి అక్కడికి వచ్చారట.
ఆ రోజు జరిగిన సంఘటనను చూసిన ఒక మిత్రుడు కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఆ రోజు వాళ్ళు చేసిన సందడి మామూలుది కాదట. ప్యాంటు జేబుల్లో చేతులు బెట్టుకొని ఆట ఎప్పుడు మొదలవుతుందాని పదేపదే పోస్టరును చూస్తూ పచ్చి జోకులేసుకుంటున్నారట. ఇంతలో సినిమా హాలు బయట బెల్లుమోగింది. మొదటాట అయిపొయింది. సినిమా హాలు నుండి జనం బయటకు తోసుకొని వస్తున్నారు. అప్పటికే టికెట్‌ తీసుకున్న అరవింద్‌ మిత్రులతో కలిసి హాలు లోపలికి పరుగెత్తాడు. తెర మీద ఆట ప్రారంభమైంది.
బయట ఆటోస్టాండు దగ్గర ఓ పద్నాలుగేళ్ళ అమ్మాయి. మొఖంలో తెలివిలేదు. అమాయకత్వమే ఉట్టిపడుతుంది. కొప్పులో మల్లెపూలు. అందంగా ఉండాలని ముఖాన తెల్లపౌడరును నలుపుపై మందంగా అద్దుకుంది. పెదాలకు ఎర్రని రంగు పులుముకుంది. లేత అందాలు పైకి కనబడే విధంగా బట్టలు వేసుకుంది. బస్టాండులో భార్యను బస్సు ఎక్కించి తిరుగు పయనంలో ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకున్నాడు అరవింద్‌ నాన్న. క్షణక్షణానికి తెరమీద విలువలు హీరోయిన్‌ వలువల్లా వదులైపోతున్నాయి. ప్రేక్షకులు ఉద్విగత అంతకంతకూ రెట్టింపవుతుంది. తెరపై విరామం రావడంతో లైట్లు వెలిగాయి.
పెద్ద నిట్టూర్పు శబ్దం చేస్తూ, చేతులు పైకెత్తి పక్క సీటులోకి చూసిన అరవింద్‌ బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. పక్క సీటులో అరవింద్‌ బాబుగారున్నారు. ఆయనా వెనక్కి చూసి ఉలిక్కిపడ్డాడు. ఎవరో కొత్త వ్యక్తి చేతిలో భార్య నలిగిపోతూ ఉంది. విలువలు లేనిది తెరమీద కాదు. అందరూ నిశ్శబ్దంగా బయటకు నడిచారు. ఎద్దు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. కడుపునిండా తిందామనుకున్న ఆ పద్నాలుగేళ్ళ అమ్మాయి ఆశ కూడా పెద్దాశే. తీరలేదు. రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్‌ జరిగి తీవ్రగాయాలతో ప్రభుత్వాసుపత్రిలో కనబడింది.
                                      *******
జాతర సందర్భంగా సాహితీప్రియులు ఎవరో కవి సమ్మేళనం జరుపుతున్నారు. తెలుగు సాహిత్యం అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. హాస్పిటల్లో డ్యూటీ అయిపోయాక కవిత్వం విందామని ఆశగా అటు వెళ్లాను. ప్రముఖకవినని చెప్పుకునే కిరాతకరత్న రాసిన ''అమాయకత్వం'' అనే పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. ఆ కవిత్వమేంటో, ఆ సభ ఏంటో అస్సలు అర్ధం కాలేదు. అప్పటికే గంట గడిచింది. మరో అరగంట చూద్దాం అని ఓపిక పట్టి చూశాను. సభలో వక్తల నాలికకు ఎముక లేదు. 'గాడిద అందానికి, గుర్రం అబ్బురపడ్డట్టు' కవిగారి రచనా కౌశలాన్ని గుక్క తిప్పుకోకుండా ఒకరి తరువాత మరొకరు ఉపన్యాసంలో దంచికొడుతున్నారు. నోరారా దవడకండరాలు అలిసిపోయేట్టుగా పొగుడుతున్నారు. భజన నడుస్తుండగానే భోజనాలు మొదలయ్యాయి. అక్కడ వివిధ రకాల వాసనలు ఆకలిని గుర్తు చేస్తున్నా ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏంటో అసలు చూద్దా మని పట్టుదలతో కూర్చున్నాను. ఇందాకటి నుండి గేటు దగ్గరే ఒక బిచ్చగత్తె జుత్తు పీక్కుంటూ నిలబడి లోపలికి రావాలని చూస్తూ ఉంది. ఆమె పిచ్చిది. ఆమెకో కథ ఉంది. అప్పుడప్పుడూ హాస్పిటల్‌కు తీసుకువస్తారు. నాది సాహిత్య అభిలాషతోనున్న ఆకలి. తనది క్షుద్భాధ. వేదిక మీద ఉన్నవారిది ఒకరకం పిచ్చి అయితే ఆమెది మరోరకం.
ఇలా ఆలోచన్లలో ఉన్న నాకు నిర్వాహకుల అరుపులు గట్టిగా వినబడ్డాయి. అటు చూశాను. ఆమె లోనికి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆమెను నిలువరించడానికి కవిగారి మనుషులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆమె చూస్తుండగా ఎంగిలి విస్తర్లు తీసుకెళ్ళి దూరంగా విసిరేశారు. ఆమెను నిలువరించడానికి అదొక ఎత్తుగడ. ఆమె వీరోచితంగా కుక్కలతో పోరాడి చివరికి ఒక ఎంగిలాకును సాధించింది.
పాపం కుక్క. తినాలన్న ఆశ నెరవేరకపోవడంతో పాలు తాగాలని దగ్గరికొచ్చిన కుక్కపిల్లను నోటపట్టి అంతదూరంలో విసిరేసింది. ఆకలి ఎంత పిచ్చిది. ఆకలి ఆశకు హద్దు ఉంది. కానీ మనిషి పిచ్చికే మందులేదు. ఆ సంఘటనతో నాకు తినాలన్న ఆశ చచ్చిపోయింది.
                                      *******
- శీలం భద్రయ్య, 9885838288

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కన్నీటి వెన్నెల
రేన్వన్ల చెట్టుకాడ !
రైతులకు సాయం
ప్రకృతి పండు.. ఆరోగ్యం మెండు
సివంగి
పచ్చలహారం
చేపల కూర
నాన్నా పులి
గుణపాఠం
కచ్చీరు కాడి తీర్పు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
07:11 PM

నాగశౌర్య 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' టీజర్

07:03 PM

ప్రగతిభవన్‌ గేట్లను.. కచ్చితంగా బద్దలు కొడతాం : రేవంత్‌ రెడ్డి

06:51 PM

ప్రధాని మోడీ డిగ్రీ కేసు..తీర్పు రిజర్వ్‌ చేసిన గుజరాత్‌ హైకోర్టు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.