Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఐదు దశాబ్దాల సహజత్వం జయసుధ సినీ ప్రస్థానం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

ఐదు దశాబ్దాల సహజత్వం జయసుధ సినీ ప్రస్థానం

Sat 17 Dec 22:38:11.865082 2022

      సినీరంగంలో యాబై వసంతాలుగా అందం, అభినయం కలబోసిన అగ్రనాయికగా, తర్వాత అందమైన ఆంటీగా, ఈ మధ్య మమత, అనురాగం పండించే సిసలైన సుందర మాతమూర్తిగా నడివయసు దాటిన వారి ఇల్లాలుగా నటిస్తోన్న 'అభినవతార,సహజనటి జయ సుధ'. అమాయకమైన అమ్మాయిగా వెండితెరపైకి వచ్చి వైవిధ్యం ఉన్నపాత్రల్లో నటిస్తూ, కుటుంబ పరమైన చిత్రాలతో ప్రేక్షకుల హదయాలలో స్థానం సంపాదించుకుని నవరసాలను ఒలికిస్తున్న మహానటి. అల్లరి.. ఆనందం.. ఆవేశం.. ఆవేదన.. ఆక్రోశం.. విరహం.. విన్నపం.. విషాదం.. ఇలా ఏ అంశానికి సంబంధించిన సన్నివేశంలోనైనా పాలలో పంచదారలా జయసుధ కలిసిపోయారు. ప్రేక్షకుల మనసు పాత్రలోకి మంచుబిందువులా జారిపోయి, కాలానుగుణంగా వయస్సుకు తగ్గపాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న జయసుధ, సుప్రసిద్ధ నటులతో నటించిన అనుభవంతో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేస్తూ, పండంటి కాపురం నుంచి ఈనాటికీ విజయపరంపరలో దూసుకువెళ్తూ, ఎన్టీఆర్‌ నుంచి చిరంజీవి వరకు ఎంతో మంది సరసన హీరోయిన్‌ గా నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా అమ్మ, అత్త పాత్రలతో అలరిస్తున్న జయసుధ మధ్యలో కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్‌ ఇచ్చినా ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు. నట గానే కాకుండా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా రాణించింది. 300లకు పైగా తెలుగు సినిమాల్లో నటించిన జయసుధ 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 1 కన్నడ సినిమా, 3 హిందీ సినిమాలలో నటించి, ప్రేక్షకులను మెప్పించినప్పటికీ మేనత్త, సుప్రసిద్ధ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల తనకు ఆదర్శం అంటున్న జయసుధ సినీ పరిశ్రమ కి వచ్చి ఇటీవల ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'సోపతి' పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం.

           జయసుధ 1958 డిసెంబర్‌ 17న నిడదవోలు రమేష్‌ చందర్‌, జోగా బాయి దంపతులకు ఇంటికి పెద్దబిడ్డగా జన్మించింది. రమేష్‌ చందర్‌ మద్రాస్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తుండగా, జోగాబాయి బాలానందం సభ్యురాలుగా ఉండేది. జయసుధ మద్రాసులో పుట్టి పెరిగినా మాత భాష తెలుగే... అయినప్పటికీ, తెలుగులో మాట్లాడటం తప్ప రాయడం, చదవడం ఇప్పటి వరకు నేర్చుకో లేదు. నటి, దర్శకురాలు విజయనిర్మల జయసుధకు స్వయానా మేనత్త. ఆమె ప్రభావం జయసుధపై ఎక్కువగా ఉండడం వల్ల అత్తతో షూటింగ్‌లకు వెళ్ళేది. అలా సినిమాలపై మక్కువ పెంచుకున్న జయసుధకు పన్నెండేళ్ల వయసులో 'పండంటి కాపురం' సినిమాలో బాల నటిగా ఎస్వీ రంగారావు, జమున, కష్ణ, విజయనిర్మల, గుమ్మడి, ప్రభాకర్‌ రెడ్డి లాంటి అగ్ర నటులతో కలిసి నటించే అవకాశం వచ్చింది. జయసుధ మొదటి పేరు సుభద్ర... అది అంత బాగాలేదనుకుని, కొంత కాలానికి 'సుజాత' గా మార్చారు. కానీ సినిమాలలోకి వచ్చాక సుజాత పేరుతో అప్పటికే ఒక నటి అగ్రనాయికగా వెలుగొందుతుండడంతో సుజాత పేరును జయసుధగా మార్చారు.
పండంటి కాపురంతో సినీరంగ ప్రవేశం
           1972లో లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో వచ్చిన 'పండంటి కాపురం' చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన జయసుధ ఆ తర్వాత బాలచందర్‌ తీసిన తమిళ చిత్రం 'అపూర్వ రాగంగళ్‌' లో కమలహాసన్‌, శ్రీవిద్య లతో కలిసి ప్రధాన పాత్రలో నటించగా, రజనీ కాంత్‌ ఇందులో తొలి సారిగా ఒక పాత్ర వేశారు. అనంతరం తెలుగులో 'లక్ష్మణ రేఖ' సినిమా ద్వారా జయసుధ తొలిసారి హీరోయిన్‌గా పరిచయమైన, 1976లో రాఘ వేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జ్యోతి సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో నటిగా జయసుధకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ తర్వాత నటిగా జయసుధ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పదహారేళ్ల వయసులోనే ఆమె 'జ్యోతి' సినిమాలో అసమానమైన నటన ప్రదర్శించిది. ఇప్పటికీ ఈ సినిమాలోని.... ''సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లె నవ్వు'' తదితర పాటలు ఎంతో హిట్‌ సాంగ్స్‌గా నిలిచి పోయాయి. 'జ్యోతి' వంటి బరువైన పాత్రలో... నాయిక ప్రాధాన్యత కలిగిన కథలో మెప్పించడం జయసుధ నటనా పటిమకు నిదర్శనమని చెప్పొచ్చు. ఆ తరువాత చేసిన 'శివరంజని' సినిమా జయసుధ కెరియర్‌కి మరింత బలాన్నిచ్చింది. కాగా జ్యోతి సినిమాలో జ్యోతిగా జయసుధ నటనను చూసి అక్కినేని నాగేశ్వరరావు జయసుధని పిలిచి, తన భార్య అన్నపూర్ణ ఈ సినిమా చూసిందనీ, ఆమెకు నీ నటన చాలా నచ్చిందనీ జయసుధను అభినందించారట. ఈ సినిమాలో మంచి నటిగా గుర్తింపు రావడంతో ఆ తర్వాత 'అందాల రాముడు, డ్రైవర్‌ రాముడు' లాంటి సినిమాలలో నటించి
కమర్షియల్‌ హీరోయిన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో కమర్షియల్‌ సినిమా అవకాశాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు గ్లామర్‌ సినిమాలు చేస్తునే, లేడి ఒరియేంటెడ్‌ సినిమాలలో నటించి తన సత్తా చాటు కుంది. 'ప్రేమ లేఖలు', 'ఆమె కథ', 'ఇది కాథ కాదు' లాంటి సినిమాలు జయసుధకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ''జ్యోతి, ప్రేమ లేఖలు, ఇధి కథ కాదు, సోగ్గాడు, మల్లెపువ్వు, అమర దీపం, అడవి రాముడు, ఆమె కథ, శివరంజని, కల్యాణి, ఇంటింటి రామాయణం, డ్రైవర్‌ రాముడు, గోపాలరావు గారి అమ్మాయి, ప్రేమాభిషేకం, ఇల్లాలు, మేఘ సందేశం, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, భార్యమణి, తాండ్ర పాపారాయుడు, కాంచన సీత, కలికాలం, ఒంటరిపోరాటం, గహ ప్రవేశం, ధర్మాత్ముడు, కుంకుమ తిలకం, నా మొగుడు నాకే సొంతం, మగధీరుడు'', లాంటి ఎన్నో చిత్రాలు నాయికగా ఆమె నట వైదుష్యాన్ని చూపి సావిత్రికి వారసురాలిగా నిలిచింది. ''జైలర్‌గారి అబ్బాయి, బావ బావమరిది, మనీ, మనీ-మనీ, ఆంటీ, హేండ్సప్‌, అక్క పెత్తనం చెల్లిలి కాపురం'' తదితర చిత్రాలు రెండవ దశలో ఆమె నటనకు మరిన్ని మెరపులద్దాయి. ''అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, స్టైల్‌, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం,
           సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోవిందుడు అందరి వాడేలే'' చిత్రాలు కెరీర్‌లో మరో గుర్తింపు తెచ్చాయి. అందుకే ఆమె ప్రేక్షకుల హదయాలలో ''జనసుధ, అభిమాన సుధ, అందాల సుధ స్థానం సంపాదించుకుంది.
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన తల్లి జోగాభాయి నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాలచందర్‌, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు నేతత్వంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అగ్ర నటిగా పేరు పొందిన జయసుధ శారద.., వాణిశ్రీ వంటి సీని యర్‌ స్టార్‌ హీరో యిన్ల పోటీని తట్టుకుంటూ, మరో వైపున జయప్రద, జయచిత్ర, శ్రీదేవి వంటి తోటి కథానాయికల దుకుడును దాటు కుంటూ ముందుకు వెళ్లారు. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 25 సిని మాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించిన జయసుధ ఒక ఏడాది ఆమె నటించిన 25 సినిమాలు విడుదల కావడం ఒక రికార్డు. దాదాపుగా తెలుగులో అగ్ర హీరో లందరితో నటించిన జయసుధ, హీరోయిన్‌ అంటే కేవలం అందమే కాదు అభినయం ఉండాలని నిరూపించిన నటి. అందుకే గ్లామర్‌తో పాటు నటనకూ అవకాశ మున్న అనేక పాత్రలు ఆమెను వెతు క్కుంటూ వచ్చాయి. అలాంటి పాత్రలకు జయసుధ తప్ప వేరే ఆప్షన్‌ లేకుండా చేసుకున్నారు. ఎన్టీఆర్‌తో 16 సినిమాల్లో నటించిన జయసుధ కష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు, కమల్‌హాసన్‌, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మోహన్‌ బాబు, చిరంజీవి, దాసరి, ప్రకాష్‌ రాజ్‌ వంటి వారి సరసన నటించి అందరి అభిమానుల ఆదరణ పొందగలిగింది. తెలుగు చదవడం రాకున్న ఎంత పెద్ద డైలాగులైనా పేజీల కొద్దీ ఉన్నా, ఒకసారి, రెండుసార్లు కళ్ళు మూసుకుని వినేసి ఒక టేక్‌లో డబ్బింగ్‌ చెప్పే సామర్థం జయసుధకు వుంది. అందుకే ఇప్పటికీ తెలుగు రాయడం చదవడం పట్ల ఆసక్తి కనబరచలేదు. అయితే ఆమె నటించిన 'జ్యోతి' చిత్రంలో ''సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లె నవ్వు, చిరుగాలి తరగల్లె మెలమెల్లగా... సెలయేటి నురగల్లె తెలతెల్లగా'' పాటలలో అమాjకత్వంతో కూడిన నవ్వులు చిందించిన జయసుధ సరిగమలు తగ్గట్టుగా 'గోపాల రావు గారి అమ్మాయి' లో 'సుజాతా ఐ లవ్‌ యు సుజాత, నిజంగా ఐ లవ్‌ యూ సుజాత', పిల్ల జమీందార్‌ లో 'నీ చూపులోన విరజాజి వాన ఆ వాన లేక నేను తడిసేనా హాయిగా, నీ నవ్వులేక రతనాల వాన ఆ వానలేక నేను తడిచేనా తీయగా' అంటూ 'దప్పి కుండదు, పక్క కుదరదు, నిదుర పట్టదు, ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు' పాటలో 'గేరు మార్చు స్పీడు పెంచు చకచక పోనీ కారు' పాటలో, గీతా ఓ గీతా డార్లింగ్‌ మై డార్లింగ్‌, మనసార నీతో మాటాడుకోనీ పాటలలో ఆమె ప్రణయ భంగిమలు, రెచ్చగొట్టే విధానం కనిపిస్తాయి. త్రిశూలం లో 'రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా' పాటలో ఆర్తి, ఆరాధన, అభిమానం ఆమె భావాల్లో వ్యక్తం అవుతాయి. ఇలా ఎన్నో పాటలో ఆమె వైదుష్యాన్ని గుర్తు చేస్తాయి.
సినిమాలు తీసి ఆస్తులు పోగొట్టుకున్న జయసుధ
           జయసుధ హీరోయిన్‌గా అలరిస్తూనే మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాతగా, భర్త నితిన్‌ కపూర్‌తో కలిసి జె.ఎస్‌.కె. కంబైన్స్‌ నిర్మాణ సంస్థను నెలకొల్పి దాసరి నారాయణరావు దర్శకత్వంలో తీసిన 'ఆత్మబంధువు'తో పాటు 'కాంచన సీత', 'కలికాలం' సినిమాలు హిట్‌ సాధించాయి. ఆ తర్వాత తీసిన ''వింత కోడలు, అదష్టం'', హిందీలో రూపొం దించిన 'మేరాపతి సిరఫ్‌ మేరా హై', 'హ్యాండ్సప్‌' వంటి సినిమాలు ప్లాప్‌ అయి జె.ఎస్‌.కె.కంబైన్స్‌కు తీవ్ర నష్టాలు తెచ్చి పెట్టాయి. దీంతో జయసుధ అప్పటి వరకు సంపాదించిన తన ఆస్తుల్ని చాలావరకూ అమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత చిత్ర నిర్మాణానికి దూరమయిన జయసుధ నటిగా కొనసాగుతూనే, చీరలకు డిజైనింగ్‌ చేస్తూ ఏడాదికి ఒకసారి ఎగ్జిబిషన్‌ నిర్వహించగా వచ్చిన ఆ ఆదాయంలో కొంత సేవలకు కేటాయిస్తుంది.
క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా
           పెళ్లి అనంతరం వచ్చిన గ్యాప్‌తో 'ఆంటీ' పాత్రలో నటించి ప్రేక్షకు లను మెప్పించి, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారింది. అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో పాత్ర లతో మెప్పించింది. దీంతో హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుందో.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా అలాంటి గుర్తింపే తెచ్చుకుంది. ఫలానా క్యారెక్టర్‌ అనగానే జయ సుధ పేరు గుర్తు కు వచ్చేలా చేసుకుంది. పూరి జగ న్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'అమ్మానాన్న ఓ తమిళమ్మాయి' కొత్త ఒరవడి తీసుకు వచ్చింది. అప్పటివరకు అమ్మపాత్ర అంటే మూస పద్ధతిలో ఉండేది. ఈ సినిమా అనంతరం ఓ ఫ్రెండ్‌గా, గైడ్‌గా అమ్మపాత్రలు వచ్చాయి. 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్టో సిరి మల్లె చెట్టు', 'ఎవడు', 'శతమానం భవతి', 'గోవిందుడు అందరి వాడే', 'శ్రీనివాస కళ్యాణం', 'మహర్షి', 'బ్రహ్మోత్సవమ్‌' లాంటి చిత్రాలలో అమ్మగా చేసి, తెలుగు సినిమాలలో అమ్మ పాత్రలు చేయాలంటే జయసుదే చేయాలి అనే పేరు తెచ్చుకుంది.
బొమ్మరిల్లు అమ్మ
           'ఆంటీ' చిత్రంతో విభిన్న పాత్రలు చేయడం మొదలు పెట్టిన జయసుధ అమ్మ పాత్ర వేసిన 'బొమ్మరిల్లు' సినిమాలో పాత్ర చిన్నదే అయినా చివర్లో 'తిట్టేస్తా' అన్న డైలాగు అందరికీ గుర్తుండిపోయింది. బొమ్మ రిల్లు విడుదల అయ్యాక జయసుధ పిల్లలు ఆమెని ప్రకాష్‌ రాజ్‌ స్ట్రిక్ట్‌ నువ్వు మాత్రం ఇంట్లో 'బొమ్మరిల్లు అమ్మవే' అని అంటున్నజయసుధ మాత్రం 'అమ్మా నాన్న ఓ తమిళ మ్మాయి' సినిమాలలో లాగా వారి అబ్బాయిలతో స్నేహంగా ఉంటారు. 'కొత్త బంగారులోకం, పరుగు' లో ఇంట్లో సహజంగా ఉండే పాత్రలు పోషించిన జయసుధ 'సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, ఎవడు' రెండు ఒకే సారి చిత్రీ కరణ జరుపుకున్న ఒక దాంట్లో ప్రేమ కురిపించే అమ్మగా, ఇంకో దాంట్లో పగ సాధించే రామ్‌ చరణ్‌ తల్లిగా నటించింది. ఆ తర్వాత ''గోవిందుడు అందరి వాడేలే, ఊపిరి, మహర్షి, బ్రహ్మోత్సవమ్‌'' చిత్రా లలో తల్లిగా నటించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రాజకీయాల్లోకి..
           వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కోరిక మేరకు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికలలో తిరిగి సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందిన ఆమె, ఆ తర్వాత మళ్ళీ పోటీ చేయలేదు. 2016లో కాంగ్రెస్‌ పార్టీ వీడి చంద్రబాబు నాయకత్వంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆ పార్టీలో తగిన గుర్తింపు లభించక పోవడంతో 2019లో వైస్సార్‌ పార్టీలోకి వెళ్లారు.
పెళ్ళితో సినిమాలకు కొంతకాలం దూరం
           నితిన్‌ కపూర్‌తో పరిచయం ప్రేమగా చిగురించి, పెద్దల అంగీకారంతో పెళ్ళి జరిగింది. ఆ తర్వాత పిల్లలు, వారి ఆలనా పాలన కోసం సినిమాలకు కొంతకాలం దూరంగా వుంది. పిల్లలు పెద్దవాళ్ళయి, జీవితంలో స్థిరపడ్డారు. అయితే పిల్లలు పెద్దవారయ్యారని సంతోషం పొందుతున్న సమయంలో ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది. భర్త నితిన్‌ కపూర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో జయసుధ చలించి పోయింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిన, పడిలేచిన కెరటంలా తర్వాత పూర్తిగా సినిమాలకే సమయం కేటాయిస్తువచ్చింది.
పురస్కారాలు
           జయసుధ 1976 లో జ్యోతి, 1979 లో ఇది కథ కాదు, 1981 లో ప్రేమాభిషేకం, 1982 లో మేఘ సందేశం, 1983 లో ధర్మాత్ముడు చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకుంది. ''జ్యోతి, ఆమె కథ, గహప్రవేశం'' చిత్రాలలోని నటనకు ఫిల్మ్‌ ఫేర్‌ ఉత్తమనటి పురస్కారాలకు ఎంపికయిన జయసుధ, ''అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, కొత్త బంగారు లోకం'' చిత్రాలకు ఉత్తమ సహాయ నటి అవార్డులు అందుకుంది. వీటితోపాటు 1982 లో మేఘసందేశం చిత్రానికి కళాసాగర్‌ ఉత్తమనటి గా అవార్డును ఇచ్చి సత్కరించింది. 2007 లో భారత సినిమా గౌరవ పురస్కారాన్ని, 2008 లో ఆంధ్ర ప్రదేశ్‌ చలనచిత్ర సంఘం, జీవన సాఫల్య పురస్కారం, అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం, 2010 లో ఫిల్మ్‌ ఫేర్‌ జీవన సాపల్య పురస్కారాన్ని సైతం జయసుధ అందుకున్నారు. 2014 లో టి. సుబ్బరామిరెడ్డి -టివి 9 జీవన సాఫల్య పురస్కారం, 2019 లో సుబ్బరామిరెడ్డి కళాపీఠం జయసుధకు 'అభినయ మయూరి అవార్డు' ఇచ్చి సత్కరిం చింది. 2022లో ఎన్టీఆర్‌ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ''ఎన్టీఆర్‌ శతాబ్ధి చలన చిత్ర పురస్కారం'' అందుకుంది. 2012 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ నంది అవార్డుల జ్యూరికి ఛైర్‌ పర్సన్‌గా వ్యవహరించారు.
           సహజ నటనలో సావిత్రి తరువాత అంతటి పేరు తెచ్చుకున్న నటి జయసుధ. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయే అతికొద్ది మంది నటుల్లో జయసుధ ఒకరు. అల్లరి పిల్లైనా, బాధ్యత గల భార్య అయినా, కరుణరసం ఒలికించే అమ్మ అయినా ముందుగా గుర్తుకువచ్చే పేరు జయసుధ. జయసుధ ఒకసారి పాత్రలో లీనమైతే.. ఆమె ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. అందుకే ఆమెను సహజనటి అన్నారు. తనదైన అభినయంతో రెండు దశాబ్దాల కిందటి వరకూ హీరోయిన్‌గా తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలిన నటి జయసుధ. ప్రస్తుతం, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అంతే సహజమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు.
           ఆమె నవ్వు సిరిమల్లె పువ్వులా, చిన్నరి పాపలా ఉంటుంది. ఆమె చీర కట్టిన చందమామ... ఎవ్వరైనా ఆ అందానికి వందనం అభివందనం అనాల్సిందే. అందంతో పాటు అభినయమూ తోడైన సహజనటి ఆమె. రెండు దశాబ్దాలకు పైగా తన సహజ నటనతో హీరోయిన్‌ గా తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలిన నటి, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అంతే సహజమైన నటనతో ఆకట్టుకుంటున్న నటి జయసుధ. 'శివరంజని' చిత్రంలో నటిస్తున్నప్పుడే దాసరి నారాయణరావు ఆమెకు 'సహజ నటి' అని బిరుదునిచ్చారు. అది ఒక అవార్డుగా కాపాడుకుంటూ వచ్చిన జయసుధ ఈ పాత్ర బాగా చేయలేదు, అనే మాట ఇప్పటి వరకు అనిపించుకోలేదు. ''జ్యోతి, ఆమె కథ, ఇది కథ కాదు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ధర్మాత్ముడు'' చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకుంది.
           ఆ రోజుల్లో కథా నాయిక ఓరియంటెడ్‌ సినిమాలు వచ్చాయి. భిన్నమైన కథాంశాలతో సిని మాలు నిర్మించేవారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ ఇండిస్టీలో కథానాయికలుగా ఉండేవారు. సడన్‌గా జయప్రద, శ్రీదేవి బాలీవుడ్‌కు వెళ్ళిపోవడంతో వారు చేయాల్సిన సినిమాలు జయసుధ చెయ్యాల్సి వచ్చింది. గ్లామర్‌, సెంటిమెంట్‌ పాత్రలతో పాటు ఆక్రందన, దుర్గాదేవి, ఆడపులి, కాంచన సీత వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిం చింది. సంభాషణకి, సందర్భాన్ని బట్టి ప్రేమ, అనురా గాలు, కోపం, ఆసూయ, అహంకారం, ఆభిజాత్యం వినబడేలా ఉచ్ఛరించడం, అభిన యంతో సన్ని వేశ ప్రాధాన్యతననుసరించి నవరసాలు మోములో పలీకించడం, శరీర కదలి కల్లో చూపడం ఆమె నిబద్దతకు నిదర్శనంగా నిలుస్తుంది.
           1973లో బాల చందర్‌ 'అరంగేట్రం' తమిళ చిత్రం నుంచి 'ఆంటీ' తెలుగు చిత్రం వచ్చే వరకు అందాలను ఆరబోసి నాయికగా, ప్రణయ సన్నివేశాల్లో అలరించే ముగ్ధగా, విషాద సన్నివేశాల్లో సానుభూతి పొందే మూర్తిగా, ప్రేమాను రాగాలు పంచే సన్నివేశాల్లో అనురాగమూర్తిగా కనిపించి యువతరానికి, నడి వయసు దాటిన వారిని స్వప్న నాయికగా అలరించింది జయసుధ. తర్వాత అందాల 'ఆంటీ' గా కుర్రకారు గుండెల్లో లయ పెరిగేలా చేసి, ఇప్పుడు అందమైన అమ్మగా రాణిస్తున్నారు. అయితే ఆమెకు ఆమెలోని ప్రతిభను పూర్తిగా వెలువరించే పాత్ర ఇంకా దక్క లేదనే అనిపిస్తుంది.

- పొన్నం రవిచంద్ర, 9440077499

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రంగ‌స్థ‌ల‌మే ఆయుధం
చైత్రారంభ‌మే ఉగాది మ‌న ఆశ‌ల‌కు కొత్త పునాది
మొదటి అడుగు వినియోగదారునిదే
ఏ వెలుగులకీ పిలుపులు?
సైన్స్- ప్ర‌జ‌ల చేతిలో ఒక ఆయుధం
'రెడ్‌ బుక్స్‌ డే'కు జేజేలు!!
భూ ప్ర‌ళ‌యం... జ‌న విల‌యం...
కళాతపస్వి విశ్వనాథ్‌
అందాల చంద‌మామ‌...తెలుగుతెర స‌త్య‌భామ‌...
రాజ్యాంగ స్ఫూర్తి ఏది?

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.