Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పుస్తక మహోత్సవం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

పుస్తక మహోత్సవం

Sat 24 Dec 23:48:40.742473 2022

              నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధీరత్వం. సాయుధ రైతాంగ పోరాట నాయకత్వం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంకేతం. వందేండ్ల ఉస్మానియా విద్యాలయం. అన్నింట్లోనూ తెలంగాణ గర్వకారణం. ఎంతో మందిని మేధావులుగా తయారు చేసిన ప్రాంతం. ఇక్కడి సాహితీవేత్తలు, ఉద్యమకారులు, సృజనశీలురు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పుస్తక విశిష్టతను నిరంతరం చాటుతూనే ఉన్నారు. దీంతో పాటు ఎన్నో పోరాటాలకు గుమ్మంగా నిలిచిన ఖమ్మం, సాహిత్యరంగంలో కదం తొక్కుతున్న కరీంనగర్‌, చారిత్రక వారసత్వాన్ని నిలుపుకుంటున్న వరంగల్‌, ఉద్యమాల ఉక్కు పిడికిలి నల్లగొండ, మెతుకు సీమగా పేరొందిన మెదక్‌, నల్లమల ఆలవాలం పాలమూరు, ఆదివాసి బిడ్డల ఆదిలాబాద్‌, వ్యవసాయానికి వన్నె తెచ్చిన నిజామాబాద్‌, పరిశ్రమలకు నెలవైన రంగారెడ్డి అన్నింటిదీ చరిత్రే. ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు తిరగబడిన పల్లెలే. ఒక్కో ఊరిది ఒక్కో గాథ. అన్నింటినీ సమగ్ర అధ్యాయనం చేసేందుకు ఉపయోగపడే ఒకే వేదిక 'బుక్‌ఫెయిర్‌'.
              పుస్తకమంటే విషయ పరిజ్ఞానం.. పుస్తకమంటే విజ్ఞాన సర్వస్వం.. పుస్తకమంటే మేథో సంపత్తికి నిలయం.. పుస్తకమే ఒక సమస్త చారిత్రక గ్రంథం. బాధ, దిగులు, ఒంటరితనానికి పుస్తకమే దివ్వ ఔషధం. పుస్తకానికి ఉన్న విశిష్టత అలాంటిది. అందుకే అన్నారు 'ఒక మంచి పుస్తకం.. వందమంది మిత్రులతో సమానం' అని. మనిషి అనుభవాల సారాంశమే పుస్తకమని చెబుతారు. అది మానవ మస్తిష్కంలోకి ఎంత లోతుగా వెళ్తే అంత అందలం ఎక్కిస్తుంది. చదవాలన్నా, రాయలన్నా సహకరిస్తుంది. వినాలన్నా, చెప్పాలన్నా తోడ్పడుతుంది. మానవ జీవన పరిణామంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. పుస్తకం గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రస్తుతకాలంలో అనివార్యం. ఎందుకంటే దేశంలో ఎన్నో రకాల ఎగ్జిబిషన్‌లు పెడతారు. అందులో వ్యాపార కోణం దాగుంది. కొన్ని ఈవెంట్‌లు నిర్వహిస్తారు, అందులో ఉపాధి కనిపిస్తుంది. కానీ పుస్తకాలకే ఒక ప్రదర్శన పెడితే అందులో లాభాపేక్ష లేని దృక్కోణం ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆరంభమైంది. ఈ నెల ఇరవై రెండు నుంచి జనవరి రెండు వరకు నిర్వహిస్తున్న 'నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌' సరికొత్త ప్రపంచానికి దారులు తెరిచింది. విజ్ఞాన సమపార్జన కోసం పెట్టిన ప్రదర్శన నూతన ఆవిష్కరణలకు వేదికైంది.
మానవ జీవన ప్రయాణంలో పుస్తకం ప్రాముఖ్యతను వేరుగా చూడలేం. ప్రశ్నించడానికి ఈ పుస్తకమే హక్కుగా నిలబడుతుంది. అన్యాయాలపై అక్షర గొంతుకవుతుంది. చేసే పనిలో, ప్రతిఘటనలోనూ సూర్యునిలా ప్రకాశిస్తుంది. అయితే పుస్తకానిది సమాజంతో విడదీయరాని అనుబంధం. శతాబ్దాలుగా నిరక్షరాస్యతలో చిక్కుకుని బానిసత్వంలో మగ్గిన వారికి ఒక దిక్సూచిగా నిలిచింది. చీకట్లు అలుముకున్న బతుకుల్లో వెలుగులు నింపింది. నేటికీ నిత్యచైతన్యాన్ని అందిస్తూ మార్గదర్శకంగా ఉంటోంది. పుస్తక ప్రతిష్టను పెంచే కృషిలో అక్షరం మమేకమైంది. ఎదగడానికి, మంచి స్థానంలో ఉండటానికి, ఉద్యోగం సాధించడానికి దోహద పడేది పుస్తకం. అందుకే మనిషి జీవితంలో వెలకట్టలేని స్థానం. భావిభారత పౌరులను తయారు చేసేందుకు ఉపయోగపడే ఓ సాధనం. వారి మేధస్సును పెంచడానికి, భాషా నైపుణ్యం అలవర్చడానికి మార్గదర్శకం. పుస్తక అవశ్యకతను గుర్తించిన మేధావులు, సాహితీవేత్తలు సమాజంలోని అసమానతలు రూపుమాపడానికి అక్షరాలను విల్లంబులా ఎక్కుపెట్టి సాహిత్యవిజ్ఞానాన్ని అందిస్తున్నారు.
నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధీరత్వం. సాయుధ రైతాంగ పోరాట నాయకత్వం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంకేతం. వందేండ్ల ఉస్మానియా విద్యాలయం. అన్నింట్లోనూ తెలంగాణ గర్వకారణం. ఎంతో మందిని మేధావులుగా తయారు చేసిన ప్రాంతం. ఇక్కడి సాహితీవేత్తలు, ఉద్యమకారులు, సృజనశీలురు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పుస్తక విశిష్టతను నిరంతరం చాటుతూనే ఉన్నారు. దీంతో పాటు ఎన్నో పోరాటాలకు గుమ్మంగా నిలిచిన ఖమ్మం, సాహిత్యరంగంలో కదం తొక్కుతున్న కరీంనగర్‌, చారిత్రక వారసత్వాన్ని నిలుపుకుంటున్న వరంగల్‌, ఉద్యమాల ఉక్కు పిడికిలి నల్లగొండ, మెతుకు సీమగా పేరొందిన మెదక్‌, నల్లమల ఆలవాలం పాలమూరు, ఆదివాసి బిడ్డల ఆదిలాబాద్‌, వ్యవసాయానికి వన్నె తెచ్చిన నిజామాబాద్‌, పరిశ్రమలకు నెలవైన రంగారెడ్డి అన్నింటిదీ చరిత్రే. ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు తిరగబడిన పల్లెలే. ఒక్కో ఊరిది ఒక్కో గాథ. అన్నింటినీ సమగ్ర అధ్యాయనం చేసేందుకు ఉపయోగపడే ఒకే వేదిక 'బుక్‌ఫెయిర్‌'.
ఆనాడే పుస్తకం విలువను గ్రహించిన అంబేద్కర్‌, మహాత్మాజ్యోతిరావు పూలే లాంటి మహానాయకులు అట్టడుగు వర్గాలకు విద్యనందించేందుకు ఎంతో కృషి చేశారు. అదే కోవలో అజ్ఞాన అసమానతలు తొలగించేందుకు వట్టికోట ఆళ్వార్‌ స్వామి గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపాడు. గంపలో పుస్తకాలు పెట్టుకుని గ్రామాల్లో తిరిగి చదివించాడు. ప్రజాస్వామ్య దేశంలో రాచరికపు నిరంకుశత్వాన్ని అడ్డుకునేందుకు షోయబుల్లాఖాన్‌ అక్షరాన్ని ఎక్కుపెట్టాడు. ప్రజల్లో చైతన్యస్ఫూర్తిని పెంపొందించాడు. సమాజానికి ప్రతిబంధకాలుగా ఉన్న కులం, మతం, అంటరానితనంపై ఇంకా ఎంతోమంది కవులు, రచయితలు అక్షర సమరం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కొత్త పుస్తకాలు ఆవిష్కరిస్తున్నారు. సమాజ మార్పునకు, విజ్ఞాన వికాసానికి దోహదపడుతున్నారు. అందుకే ఎంతోమంది జీవిత చరిత్రలు, సాహితీకారుల నవ్య రచనలు, జనరల్‌ నాలెడ్జ్‌ను పెంపొందించే పుస్తకాలు చదవడం, తెలుసుకోవడం ద్వారా మనకు మనమే సానపెట్టుకుని కొత్తగా తయారవుతాం. ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చే లక్షల మందిలో మనమూ భాగస్వాములమవుదాం.. సమస్త పుస్తకానికి జై కొడదాం..

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భావ సం'ఘర్షణ'!
మనలోక సహవాసి
కీచక పర్వం!
హృదయం పదిలమేనా?
పసివాడి ప్రాణం
వివక్ష
తిరస్కరణ!
బహిష్కరణ!
రాజ్యాంగ శోకం
ఆంక్షల కత్తి

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.