Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పుస్త‌క‌మేవ జ‌య‌తే | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

పుస్త‌క‌మేవ జ‌య‌తే

Sun 25 Dec 04:40:47.389762 2022

            తెలంగాణలో ఎక్కడైనా మనుషులు గుమ్మిగూడి గుంపులుగా కనపడితే అదో పండుగ జాతరగా సంబరపడతాం. సమ్మక్క సారక్క జాతర నుండి మొదలుకుని గొల్లగట్టు జాతర, ఉర్సు పండుగ, పీరిల పండుగ, క్రిస్మస్‌, బతుకమ్మ, బోనాలు ఇవన్నీ మన నమ్మకలైనప్పటికీ అవి మన సంస్కృతికి ప్రతిబింబాలు. మనుషులు తీసివేతల్లోంచి కూడికల్లోకి చేరుతున్న కొత్తరూపాలు. అదే తరుణంలో ఒక చైతన్యవంతమైన రూపంతో మనుషులు ఒకే దగ్గర చేరుతున్న పండుగే హైదరాబాద్‌ పుస్తక మహోత్సవం. ఎవరికివారు తమ అస్తిత్వాన్ని, గుర్తింపును చాటాలని అనుకోవడం సహజమే. కానీ దశాబ్దాల నుంచి ప్రజలకు ప్రేరణగా ఉపయోగపడింది పుస్తకం. మనిషి తనను తాను తెలుసుకుంటూ సమాజాన్ని తెలుసుకోడానికి, ఆలోచనను విస్తత పరుచుకోవడానికి, సృజనాత్మకతకు రంగులద్దుకోవడానికి పుస్తకాలు చాలా ఉపయోగపడుతాయి.పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ పుస్తకాలు చిక్కు ముళ్ళని విప్పుతాయి.కొత్త ఆలోచనలకు పురుడు పోస్తాయి.సరికొత్త ఆచరణలకు దారులు వేస్తాయి. అలాగే యువతకు మరోసారి ఆలోచనల సరళిని, చైతన్య ఒరవడిని అందించడానికి ఆరంభమైనదే 'హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ఫెయిర్‌'. పదిరోజుల పాటు జరిగే ఈ పుస్తకాల పండగ గురించి ఆదివారం అనుబంధం 'సోపతి' కవర్‌ పేజీ కథనం..
             నగరంలోని తెలంగాణ కళా భారతిలో (ఎన్‌.టి.ఆర్‌ స్టేడియం)లో ఈ నెల 22న ప్రారంభమైన 'హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌' రోజురోజుకూ సందర్శకులు, పాఠకులు, రచయితల తాకిడి పెరుగు తోంది. జనవరి 2వరకు జరగనున్న ఈ పుస్తక ఉత్సవం ఒక ఉద్యమంలా సాగు తోంది. మొదట్లో చిన్నగా ప్రారంభమై ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఊపందుకుంది. ఈ పుస్తక ప్రదర్శన 1987 సంవత్సరంలో ప్రారంభమైంది. నాటి నుండి నిజాం కాలేజ్‌ గ్రౌండ్స్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌, పీపుల్స్‌ ప్లాజాలలో గతంలో ఈ పుస్తక మహో త్సవం జరిగేది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన నాటి నుంచి ఎన్‌.టి.ఆర్‌ స్టేడియంలో విస్తృతంగా జరుగుతూ జాతీయ పుస్తక ప్రదర్శన స్థాయికి చేరింది. నేడు లక్షల సంఖ్యలో పాఠకులు, పిల్లలు, యువకులు సాహిత్య ప్రేమికులు, కవులు, రచయితలు అధికారులు సైతం మేమంటూ మమేక మవుతున్నారు. గంపనిండా పుస్తకాల్ని సర్దుకుని పంచుకుంటూ నడిచిన కాలం నుండి, ఎడ్ల బండిలో పుస్తకాలు నింపుకుని రైతులకు పంచుతూ చదివించి రైతు ఉద్యమాల్ని కదిలించిన రోజుల్లోంచి చాలా ముందు కొచ్చాము. ఆ క్రమంలోనే గ్రంథా లయాలు జ్ఞాన కేంద్రాలుగా నిలబడ్డాయి. బస్సుల్లో పుస్తకాలు, కార్లలో ఊరూరా పుస్తకాల్ని అందించే తరుణం లోంచి చదువు, ఈ మాట, వంటి అనేక యాప్‌ల ద్వారా కావాల్సిన పుస్తకాల్ని చదువు తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడే నిలబడి పుస్తకాల్ని ఆన్లైన్‌ ద్వారా కొనుగోలు చేసుకుంటూ చదువు తున్నాం. ఎక్కడ ఏ మార్పు జరిగిన పుస్తకం ఒక విప్లవమే. ఏది ఏమైనా ఏ తరానికి ఆ తరం సాహిత్య పాఠకుల్ని తయారు చేసు కుంటుంది అనేది మాత్రం వాస్తవం. ఆయా పుస్తకాలకు ఆయా కాల స్థితిగతులకు అద్దం పడుతాయి అనేది నిజం. ఆయా దు:ఖం సంబంధిత పొరలు పుస్తకాల్లో రికార్డు చేయబడుతుంది. అందుకే రచయితలు పాఠకులకు కనెక్ట్‌ అవుతున్నారు. నడుస్తున్న ప్రపంచంలో ఒకేసారి అనేక సంఘటలు ఎదురవు తుంటాయి. అలా ఎదురయ్యే వాటిని వాళ్లకు వాళ్లుగా చలించి, అనుభూతి చెంది, రచయితలు, కవులు తమ నేపథ్యం,నైపుణ్యంలోంచి రచనలు చేస్తున్నారు. అంతే కాకుండా తమ హక్కుల నుంచి అస్తిత్వం నుంచి గొంతువిప్పుతున్నారు. తమ గాయాల్ని, తమ చిరికల్ని, తమ అణిచివేతను ప్రకటిస్తున్నారు. కారణాల్ని విశ్లేషిస్తూ సమాజాన్ని ఆలోచింపజేయిస్తున్నారు. ఎందుకంటే కాలాను గుణంగా మనిషి మాట్లాడం అవసరం కూడానూ. ఏకాలం ఏ చిక్కుల్లో ఇరుక్కుని పోయిందో తెలుసు కోవడం కూడా ముఖ్యమే. ఆ కాల చరిత్రను పుస్తక రూపంలో రికార్డుచేయడం కూడా అత్యవసరం. ఆ పని ఇవ్వాల్టి రచయితలు, కవులు చేస్తుండడం అభినందించాల్సిన అంశం.
పుస్తకానికి తగిన ఆదరణ
             ఇవ్వాళ డిజిటల్‌తనం ఉట్టిపడుతున్న క్రమంలో సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది రచయితలకు చాలా పాఠకులకు డైరెక్ట్‌గా దగ్గరవుతున్నారు. 'పఠనం మనకు తెలియని స్నేహితులను తెస్తుంది.' - హోనోరే డి బాల్జాక్‌ అన్నట్లు మనుషుల్ని దగ్గరగా పుస్తకం చేస్తున్న కాలం ఇది. పాఠకులు వాళ్ళ వాళ్ళ నిజమైన తడిని తెలుసుకుని పుస్తకాల్ని మరింత ఇష్టంతో చదువు తుండడం గమనించవచ్చు. అట్లా పాఠకుల సంఖ్య తగ్గడం లేదు పెరుగుతుంది అనేది నిరూపణ అవుతోంది. గతంలో కొన్ని సమూహలకే పరిమితమైన పుస్తక ప్రదర్శన నేడు సామూ హికం అయింది.కోవిడ్‌ అంతరాలను సైతం అదిగమించి పుస్తకం పాఠకులు చేరువైంది. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు వచ్చే సంద ర్శకుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. గతేడాది లక్షల మంది పుస్తక ప్రదర్శనను సందర్శించడమంటే మామూలు విషయమేమి కాదు. పుస్తకాల మీద ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే యువత పుస్తకాలవైపు ఎక్కువగా మళ్ళడం కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యుగంలో ఏమైపోతున్నామో అని కలవర పడుతున్న తరుణంలో పుస్తకాల్ని చదవడం ఫ్యాషన్‌గా మారడం సంతోషించాల్సిన పరిణామం. దీంతో పాఠకులు కొత్త రచయితలుగా, కవులగా మారడం మరింత శుభపరిణామం. అయితే ఇంటర్నెట్‌పై ఆధారపడి సమాచారం తెలుసుకునేవాళ్లు కూడా పుస్తకాల్లో నిక్షిప్తమైన రచనలు నమ్మడం పుస్తకానికి ఉన్న ఆదరణ, దానికున్న గొప్పతనాన్ని చాటుతోంది. ఆన్‌లైన్‌లో తచ్చాడుతున్న మనుషుల్ని పుస్తకాలవైపు కదిలిస్తూ వేరు వేరు చోట్ల మనుషుల్ని ఒక్కటిగా కలుపుతుంది ఈ పుస్తక ప్రదర్శన. పుస్తకాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే. పుస్తకాల్ని చూడాలని ఇష్టమైనవి కొనుక్కోవాలని చిన్నారులు, యువత నుంచి మొదలై రిటైర్‌ మనుషుల దాకా అందరూ ప్రదర్శనలో తహతహలాడు తున్నారు. సందడి చేస్తున్నారు. బిజీ లైఫ్‌ మనుషులు కొత్త లుక్‌తో కన పడుతూ పుస్తకాలకు బ్రాండ్‌ ఇమేజ్‌ అందిస్తున్నారు. మనుషుల్ని ప్రేమించినట్టే పుస్తకాన్ని ప్రేమిస్తూ పుస్తకాల లోపలి తనాన్ని ఇష్టంగా తడుముతున్నారు. మనుషులు వాళ్ళకి వాళ్ళు ఒక తెలి యని జీవితాన్ని అనుభవిస్తున్న వేళ, అనేక జీవితాల సారాన్ని తెలుసుకునేందుకు పుస్తకం వెంట పడుతున్నారు. ఎక్కడెక్కడో విహారయాత్రలకు వెళ్లలేక పుస్తకాల ప్రయాణాలకు ఆసక్తి చూపి స్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శనలో అనేక మంది భాగస్వాముల వుతున్నారు. కొత్త కొత్త సాహిత్యపు రుచిని తెలుసుకుని పుస్తకాల కోసం బారులు కడుతున్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులను ఎక్కువగా భాగస్వాములు చేస్తున్నారు. దీనిలో కొత్త కొత్త పుస్తక ఆవిష్కరణలు, పిల్లల ఆట పాటలు కూడా నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థులు రాసిన పుస్తకాల్ని వాళ్ళే స్టాల్‌లో ఉండి నలుగురికి తెలుపుతున్నారు. కొంత మంది వాళ్ళకి సంబంధి ంచిన పుస్తకాల్ని రాసుకొని వచ్చి వెతుకుతున్నారు. ఎవరి లైఫ్‌ స్టయిల్‌ కి సంబంధించిన పుస్తకాల్ని వాళ్లు వెతుక్కొనే పనిలో తారస పడుతున్నారు. అయితే ఇందులో చాలా రకాలైన స్టాల్స్‌ కనిపిస్తు న్నాయి. సినిమా సంబంధిత పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, భక్తి, జీవితం, విప్లవం, సాహిత్యం నవలలు, కథలు ఇలా ఎన్నో పుస్తకాలు ఈ ప్రదర్శనలో కనిపిస్తున్నాయి. ఇది లుక్‌ కల్చర్‌ కాదు గురు బుక్‌ కల్చర్‌ అన్నట్లుగా మనకు కనిపిస్తుంది.
యువ రచయితలకు ప్రోత్సాహకం
             35వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు ఒగ్గుకథ కళాకారుడు 'మిద్దెరాములు' స్మారక ప్రాంగణంగా నిర్వాహకులు నామకరణం చేశారు. ఈ పేరు తెలంగాణ పల్లెలోని మట్టివాసనకు అద్దం పట్టింది. ఎంతో మంది కవులు, రచయితలకు పేరెన్నికగా ఉన్న ప్రాంతంలో భూమి పొరల్లోంచి ఉద్భవించిన మొలకలా ఎంతోమంది యువతరం కవులు, రచయితలు పుట్టుకొస్తున్నారు. ఈ సారి బుక్‌ ఫెయిర్‌లో దాదాపు 150కి పైగా కొత్త పుస్తకాలు ముద్రణకు నోచుకున్నప్పటికీ, ఇంతకు ముందే ముద్రితమైన రచనలు పున ముద్రణలు చేశారు. చాలా రకాలైన పుస్తకాలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలకు సిద్ధమవ్వడానికి కావాల్సిన పుస్తకాలు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. యువత రచనల ద్వారా వైవిధ్య మైన సాహిత్యం వెలుగులోకి వస్తోంది. పల్లె తనం గొంతుతో మాట్లాడే వాళ్ళు కొందరైతే, సమాజాన్ని వడబోసేవాళ్ళు కొందరు. బాల్యపు జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ వాస్తవ స్థితిని ప్రకటించడం కూడా ఆయా రచనల్లో కనిపిస్తోంది. నిరుద్యోగం, ఆర్థిక కోణా ల్లోంచి, ప్రేమ, విరహం వంటి అనేక కోణాల్లో యువత ముందుబడి సృజన పాఠకులను మెప్పిస్తుం దనడంలో సందేహం లేదు. అందుకు అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందున్నాయి. ఒక పరిశీలనతో గమనించినట్లేతే పాతతరం రచనలను పాఠకు లను ఎక్కువగా అడుగుతునట్లు తెలుస్తోంది. వాళ్ళతో పాటుగా నేటి తరం రచయితల కూడా అధ్యయనంపై మక్కువ పెంచుకోవడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ప్రపంచ పుస్తక ప్రదర్శనలు
             ప్రపంచంలో పుస్తక ప్రదర్శనలు ప్రతి యేడాది జరుగుతుంటాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పుస్తకాలను అమ్మకానికి ప్రదర్శన పెడతారు. జర్మనీ దేశం బుక్‌ ఫెయిర్‌లకు పెట్టింది పేరు. బంగ్లాదేశ్‌లో బుక్‌ ఫెయిర్స్‌ విరివిగా జరుగు తుంటాయి. లండన్‌ బుక్‌ ఫెయిర్‌, ఫ్రాంక్ఫర్ట్‌ బుక్‌ ఫెయిర్‌, ఢిల్లీ బుక్‌ ఫెయిర్‌, కలకత్తా బుక్‌ ఫెయిర్‌, చెన్నరు బుక్‌ ఫెయిర్‌, విజయవాడ బుక్‌ ఫెయిర్‌, ముంబై బుక్‌ ఫెయిర్‌, హాంకాంగ్‌ బుక్‌ ఫెయిర్‌, కైరో బుక్‌ ఫెయిర్‌, మాస్కో బుక్‌ ఫెయిర్‌, పారిస్‌ బుక్‌ ఫెయిర్‌, నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌,వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌, జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌, బెంగుళూరు బుక్‌ ఫెయిర్‌, తిరువనంతపురం బుక్‌ ఫెయిర్‌, పూణే బుక్‌ ఫెయిర్‌, కొచ్చి బుక్‌ ఫెయిర్‌ మొదలు ప్రపంచ వ్యాప్తంగా అనేక పుస్తకోత్సవాలను ఆయా బుక్‌ ట్రస్ట్‌లు నిర్వహిస్తూ గొప్ప గొప్ప పుస్తకాల్ని పాఠకులకు అందించడంలో ప్రసిద్ధి కెక్కాయి. డిసెంబరు జనవరి మాసాల్లో మన దేశంలో ప్రధాన నగరాల్లో బుక్‌ ఫెయిర్స్‌ నడుస్తుంటాయి. అలాగే మన రాజధానిలోనూ అనేక ఏండ్లుగా 'హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌' ప్రజల ప్రశం సలు అందుకుంటున్నది. ప్రతియేటా పది లక్షల మంది దాకా పుస్తకాభిమానులు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను సందర్శి స్తారంటే అతిశయోక్తి కాదు. పలుమార్లు బుక్‌ ఫెయిర్‌లో కలుసుకున్న వాళ్లంతా నిజజీవితంలో 'రీడర్స్‌ కమ్యూనిటీ' గా ఏర్పడతారు. పుస్తక స్నేహం, పఠన మైత్రి వ్యక్తుల మధ్య చక్కటి సాంస్కృతిక బాంధవ్యానికి దోహదం చేస్తుంది. బుక్‌ ఫెయిర్‌ సందర్శిస్తున్న జనాల్లో అత్యధికులు అధ్యాపకులు విద్యార్థులు తల్లి దండ్రులే కావడం విశేషం. విదేశీ టూరి స్టులు కూడా మన బుక్‌ ఫెయిర్‌ను సంద ర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, చలన చిత్ర దర్శకులు, మీడియా జర్నలి స్టులు, విద్యావేత్తలు బుక్‌ ఫెయిర్‌ విజిటర్స్‌లో తప్పక ఉంటున్నారు. పాఠ శాలలు కాలేజీలు విద్యార్థులతో 'విజిట్‌ బుక్‌ ఫెయిర్‌' కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తు న్నాయి. విద్యారంగం పట్ల అవగాహన ఉన్న పేరెంట్స్‌ తమ పిల్లల ఆసక్తిని గమ నించి బుక్‌ఫెయిర్‌ కోసం బడ్జెట్‌నూ కేటా యించడం సంతోషించాల్సిన విషయం.
- పేర్ల రాము, 9642570294

ప్రపంచం చేతిలోఉన్నట్టే...
              చదివేవాళ్ళు ఇంత మంది ఉన్నారా అనే ఆశ్చర్యాన్ని ప్రతీ యేట పొందుతూనే వున్నాం. పిల్లలు, యువత ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. అలాగే రిటైర్డ్‌ పర్సన్స్‌ వస్తున్నారు. పుస్తకాన్ని కొనడం హాబీ లాగా అయిపోయింది. ప్రతీ మనిషికి మనిషి కావాలనుకునే ఈ రోజుల్లో మారుతున్న మానవ విలువల మధ్య పుస్తకం మన చేతిలో ఉన్నట్లయితే ప్రపంచం కూడా మన చేతిలో వున్నట్లే. నగలు, ఆస్తుల కంటే పుస్తకం లేనటువంటి ఇల్లు ఎందుకు పనికిరానిదనే కొత్త సామెత కొందరిలో కనపడు తుంది. పుస్తకాన్ని రిచ్‌ లుక్‌గా, జ్ఞాన సంపదగా ఇంట్లో స్టోర్‌ చేసుకుంటూ తద్వారా ఆలోచన పరిణామం, జీవన విధానం మార్చుకునేందుకు ఈ పుస్తకాలు ఉపయోగపడుతాయి అనిపించింది. ఇంత రేటా అని ఆలోచించకుండ నచ్చిన పుస్తకాన్ని కొన్న వాళ్ళ మొహంలో ఆనందం చూసి ఇంకా పుస్తకం బతికే ఉంది.. అక్షరం బతికే ఉందని అనిపిస్తుంది. ఆరు నెలల కొకసారి ప్రదర్శన పెట్టినా కూడా వచ్చే అంత మోబిలైజ్‌ చెయ్యగలిగాం అనిపించింది.
- శిలాలోలిత, ప్రముఖ రచయిత్రి.

పుస్తక సంక్రాంతి
              చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పినట్లు.. ఇంకా పుస్తకం ప్రాధాన్యతను చెప్పాలి అంటే చిరిగిన చొక్కా ఉన్నా లేకపోయినా ఒక పూట అన్నం మానుకొని అయినా సరే కూడా పుస్తకాలు కొనుక్కున్న రోజులు ఉన్నాయి అంతటి ప్రాముఖ్యత పుస్తకానికి. పుస్తక పఠనం ద్వారానే మానవుడు తనను తాను తెలుసుకుంటూ, గత సమాజ నిర్మాణాన్ని, నాగరికత అభివృద్ధినీ, అవపోసన పట్టి ప్రస్తుత కాలానికి, భవిష్యత్‌కు వారధిగా పునాదులు వేస్తున్నాయి. అనేక సామాజిక మాధ్యమాల ఓరవడిలో పుస్తకం పాతబడిందని పుస్తకం ప్రాముఖ్యత మసక బారిందని చెప్పినప్పటికీ పుస్తకం రూపం మారి ఉండవచ్చు కానీ పుస్తకం ఎప్పటికీ సజీవమే..
- రవికుమార్‌ చేగొని
జనరల్‌ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ అసోసియేషన్‌.

సృజనాత్మక ఆలోచనలకు పునాది
              పుస్తక ప్రదర్శన అంటేనే సృజనాత్మకమైన ఆలోచనలకు పునాది. జ్ఞానవంతమైన, స్ఫూర్తి దాయకమైన దారిని చూపే మార్గం.వాటిని మనుషులు దగ్గర చేసుకుంటున్నకొద్దీ కాలం కొత్తగా ఆవిర్భావిస్తుంది. సరికొత్త వెలుగులో నడవడానికి దారిని చూపుతుంది. ప్రధానంగా నేటి యువతరం, విద్యార్థిలోకానికి అవగాహన పెంచుతుంది. రోజురోజుకూ దేశంలో అఘాయిత్యాలు, లైంగికదాడులు పెరుగుతున్నాయి. అసమానతలు, అంతరాలు విజృంభిస్తున్నాయి. వివక్ష, అంటరానితనం వేళ్లూనుకుంటున్నాయి. అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన దారిని ఎంచుకునే ప్రయత్నంలో భావిభారతం ఆలోచించడం, ఆచరించడం చేయాలి. అది పుస్తకాల ద్వారానే సాధ్యమవుతుంది. అది వ్యక్తిత్వ నైపుణ్యానికి, మేధస్సుకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మెరుగైన సమాజానికి సహకరిస్తుంది. అందుకే ఆలోజింప చేసే ప్రక్రియ పుస్తకాల ద్వారానే సాధ్యం. బోధన ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అయితే మరి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయనే విషయం వారికి తెలియదు.తల్లిదండ్రులకు చెప్పినా అవి దొరకవు. విద్యార్థుల నాలెడ్జ్‌ను పెంపొందించే పుస్తకాలను ఎలా కొనుక్కోవచ్చు?. ఒక వేళ తమకు ఇష్టమైన పుస్తకాలన్నింటినీ ఒకేచోట కొనుక్కోవాలనుకుంటే ఏం చేయాలి?. మంచి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?. ఇలాంటి ప్రశ్నలంటికీ సమాధానం హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌.
- నమిలికొండ అజయ్‌కుమార్‌, జర్నలిస్టు, హైదరాబాద్‌

చదవడం అలవాటుగా మారాలి..
              చరిత్రలో ఘనతకెక్కిన వాళ్ళంతా తరగతి పుస్తకాలే కాకుండా బయటి సాహిత్యం చదవడం వల్లనే వాళ్ళ జ్ఞానం విస్తారం చెందింది. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివద్ధి చెందుతున్నప్పుడూ తప్పని సరిగా సమాజం మారుతుంది. పుస్తకానికి బదులుగా మనం అందరి చేతుల్లో సెల్‌ వుంది. ఇది ఉండవాల్సిందే కానీ దేని ప్రాముఖ్యత దానికుంటుంది. పుస్తకాన్ని తీసుకొని పొందే అనుభూతిని, హాయిని సెల్‌ఫోన్‌ ద్వారా పొందలేము. ఈ రోజుల్లో పాఠనాసక్తి తగ్గుతుంది అనేది చింతిత్తు మాట. నేటితరం యువకులు పుస్తకాల్ని అలవాటు చేసుకుంటే అంతకంటే గొప్ప అలవాటు, అభ్యాసనం ఇంకోటి ఉండదు.
- నలిమెల భాస్కర్‌, ప్రముఖ కవి, బహుభాషా వేత్త.

వికసిస్తున్న విజ్ఞానం..
              పుస్తకమే సమస్త జ్ఞానానికి దర్పణం, పుస్తకమే వికసిస్తున్న విజ్ఞానం. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్‌ వచ్చిన తరువాత పుస్తకాలకు దూరం అవుతున్న తరం మనకు కనిపిస్తుంది. ఆ దూరం నుండి పుస్తకానికి దగ్గరి తనం రావాలి. కొన్ని వేల, వందల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. కొత్త కొత్త పుస్తకాలు వస్తున్నాయి. విలువైన సాహిత్యం లిఖించబడుతుంది. వచ్చి పుస్తకాల్ని ఆలింగనం చేసుకోండి. పుస్తకాలతో షేక్‌హ్యాండ్‌ తీసుకోండి. పుస్తకంతో సెల్ఫీ తీసుకోండి. పుస్తకాన్ని కొనండి. చదవండి.
- అన్నవరం దేవేందర్‌, ప్రముఖ సాహితీవేత్త.

జీవితంలో భాగం కావాలి..
              కొత్త సంకలనాలు, ఆవిష్కరణలు, మనుషుల సందడి కలిస్తే ఒక పుస్తకాల పండుగ. ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్న పుస్తకాలను చదవడానికి ఇదొక వేదిక. ఈ పుస్తకాల పండుగ మన జీవితంలో భాగం కావాలి. వివిధ మాధ్యమాలలో ఎన్నో అన్లైన్‌ పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి.కానీ చేతిలో పట్టుకొనిఒక పుస్తకం చదివిన అనుభూతి ఏది ఇవ్వలేదు.సాహిత్యం ప్రతీ ఒక్కరికి చేరడానికి బుక్‌ ఫెయిర్లు ఎంతో తోడ్పడుతాయి.
- తగుళ్ళ గోపాల్‌
కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రంగ‌స్థ‌ల‌మే ఆయుధం
చైత్రారంభ‌మే ఉగాది మ‌న ఆశ‌ల‌కు కొత్త పునాది
మొదటి అడుగు వినియోగదారునిదే
ఏ వెలుగులకీ పిలుపులు?
సైన్స్- ప్ర‌జ‌ల చేతిలో ఒక ఆయుధం
'రెడ్‌ బుక్స్‌ డే'కు జేజేలు!!
భూ ప్ర‌ళ‌యం... జ‌న విల‌యం...
కళాతపస్వి విశ్వనాథ్‌
అందాల చంద‌మామ‌...తెలుగుతెర స‌త్య‌భామ‌...
రాజ్యాంగ స్ఫూర్తి ఏది?

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.