Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్తకాంక్ష | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

కొత్తకాంక్ష

Sun 01 Jan 01:06:52.463879 2023

             కొత్త సంవత్సరం రాగానే సెల్‌ఫోన్‌లో ఓ చిన్న మెసేజ్‌. 'హ్యాపీ న్యూఇయర్‌'. ఇది అందరూ కోరుకునేదే. కానీ ఏడాదంతా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?.మెసేజ్‌ పెట్టినవారు చెప్పరు. చూసిన వారు ఆలోచించరు. ఇదంతా రోటిన్‌ వ్యవహారం. కానీ సమాజానికి ఏం చేయాలి? కుటుంబానికి ఏమివ్వాలి? ఉద్యోగంలో గుర్తింపెలా తెచ్చుకోవాలి? తోటివారిని ఎలా ప్రేమించాలి? అన్నిటికంటే ముఖ్యమైనది జీవితంలో ఏం సాధించాలి? ఇదంతా ఒక పెద్ద వ్యాయామం. అదే మనలోని చెడును తుడిచేందుకు, మంచిని ఆచరించేందుకు 'నూతన' సందర్భం ఒక వేదిక కావాలి.
               తడారని జ్ఞాపకమేదో మధురభావాలు పంచింది.. తడిసిన తనువేదో అలజడిని సృష్టించింది.. తగిలిన గాయమేదో నెమ్మదిగా నడవాలని చెప్పింది.. ఆ స్మృతి చెక్కు చెదరని భావంగా నిలిచింది.. ఆ చీకటి ఎంతగానో బాధించింది.. ఆ రేయి మళ్లీ రమ్మని ఆహ్వానించింది.. ఒక సంతోషం.. ఒక విషాదం.. ఒక సమయం.. ఒక కాలం.. ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు గడిపాం. వాటిని నెమరువేసుకుంటూనే కొత్త ప్రపంచంలోకి ప్రవేశించాం. అవును.. మనం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఇది కొత్తదేం కాదుకదా అనే భావన చాలామందికి కలగడం సహజం. పాతదాని స్థానంలో వచ్చిందే కొత్త సంవత్సరం. ప్రతి ఏడాది వచ్చేదేగా.. మరో సందేహం?. సెకను మారితే నిమిషం. నిమిషం మారితే గంట. గంట మారితే రోజు. రోజు మారితే కాలం. ఇదే కాలచక్రం. ఇది చిన్న విషయంగానే చూస్తాం. కానీ దీంతో ముడిపడి ఉన్నదే మనిషి గమ్యం. సాధించాలనే తపన, చేరువవుతున్న ఆశయం, ఆచరణకు పూనుకునే ఆలోచన, గతం పునాది మీద భవిష్యత్తు కలలసౌధం. దాన్ని నిర్మించుకోవడం కోసం ఆవిర్భావించినదే ఈ కాలగమనం. అందుకే 'క్షణం ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం.. దశాబ్ద కాలం ఎదురుచూసినా రాదు' అంటారు. కాలానికున్న శక్తి అలాంటిది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నవారే కాలం పెట్టే పరీక్షలో విజేత.
సమాజంలో అంతరాలు, అవరోధాలు, అవహేళనలు నిత్యకృత్యం. యంత్రం కన్నా వేగంగా మనిషి పయనం. తనకు తానే పట్టించుకోని దుర్భరం. వేరే గ్రహంలో బతుకుతున్న చందం. బంధం, అనుబంధం అన్నింటా కలిసి ఉన్నదే ఈ మానవ సంబంధం. దీన్ని అంటిపెట్టుకోకుండా ఏ పనిచేయలేం కాదుకదా. వద్దనుకున్నా నీడలా వెంటాడేదే కాలం. మనిషికి చికాకు కలిగితే ఏ సినిమాకో వెళ్తాడు. లేదంటే ఫ్రెండ్స్‌తో దమ్ము కొడతాడు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తాడు. విందూవినోదాల పేరుతో వేల రూపాయలు ఖర్చు పెడతాడు. కాదనలేం.. ఎవరి ఇష్టం వారిది. మానసికోల్లాసానికి అవసరం కూడా. కానీ తోటివారికి కష్టం వస్తే ఆదుకునేందుకు ఆలోచిస్తాడు.ఈరోజు ఎంతోమంది కాలే కడుపులతో బతుకులీడుస్తున్నారు. పుట్‌పాత్‌లను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఎంతోకొంత సహాయం చేయడంలో ఉండే సంతృప్తి ఎందులోనూ దొరకదు. ఇలా ఆలోచించే నేటితరమే సమాజానికి కావాలిప్పుడు. అందుకే పోయిన ఏడాది 'ఇలా చేయాల నుకున్నాం. కానీ ఇప్పుడు చేస్తాం.అలా వద్దనుకుంటే ఇలా జరిగిందే'అని వంద ప్రశ్నలు వేసుకుని సమాధానాలు వెతుక్కునే బదులు కొత్త ఆలోచనకు పురుడు పోసి నూతన ఒరవడికి బీజం వేస్తే అంతకుమించి ఆనందం పొందగలం.
కొత్త సంవత్సరం రాగానే సెల్‌ఫోన్‌లో ఓ చిన్న మెసేజ్‌. 'హ్యాపీ న్యూఇయర్‌'. ఇది అందరూ కోరుకునేదే. కానీ ఏడాదంతా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?.మెసేజ్‌ పెట్టినవారు చెప్పరు. చూసిన వారు ఆలోచించరు. ఇదంతా రోటిన్‌ వ్యవహారం. కానీ సమాజానికి ఏం చేయాలి? కుటుంబానికి ఏమివ్వాలి? ఉద్యోగంలో గుర్తింపెలా తెచ్చుకోవాలి? తోటివారిని ఎలా ప్రేమించాలి? అన్నిటికంటే ముఖ్యమైనది జీవితంలో ఏం సాధించాలి? ఇదంతా ఒక పెద్ద వ్యాయామం. అదే మనలోని చెడును తుడిచేందుకు, మంచిని ఆచరించేందుకు 'నూతన' సందర్భం ఒక వేదిక కావాలి. నవసమాజాన్ని కాంక్షిస్తే గనుక దాన్ని చేరుకునే మార్గాన్ని అన్వేషించాలి. కొత్త పుస్తకాలను ఆధ్యాయనం చేయాలి. మంచి భావజాలాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే ఈ ఏడాదిలో మనం తీసుకున్న నిర్ణయాలకు ఒక విలువ.
కొత్త సంవత్సరం రాగానే 'ఇక సిగరేట్‌ మానేస్తాను. మద్యం జోలికి పోను.జూదం ఆడను.అది చేయను.ఇది చేస్తాను' ఇలాంటి శపథాలు చేస్తుంటారు. మళ్లీ వారం రోజులు కాగానే షరా మామూలే. ఇది కాదు ఆలోచించే తీరు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రయత్నిస్తే వచ్చే ఫలితం భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఇందులో ఒకవేళ గెలిస్తే ఏం చేయాలో తెలుసుకుంటావు. ఓడితే ఏం చేయకూడదో నేర్చుకుంటావు. దేశంలో నేడు కులం, మతం అడ్డుగోడలుగా ఉన్నాయి. లైంగికదాడులు, దోపిడీలు పెరుగుతున్నాయి. ఆత్మహత్యలు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. అన్నిటికంటే పేద, ధనిక మధ్య అంతరాలు తలెత్తుతున్నాయి. వీటిని బద్ధలుకొట్టే సరైన ఆయుధం మన మెదడు. మస్తిష్కానికి మంచిని నేర్పి, కొత్త సంవత్సరాన సరికొత్త లక్ష్యానికి రూపాన్నిచ్చి, మనిషిని మనిషి దోచుకోలేని సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేయాలని ఆశిస్తూ...

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భావ సం'ఘర్షణ'!
మనలోక సహవాసి
కీచక పర్వం!
హృదయం పదిలమేనా?
పసివాడి ప్రాణం
వివక్ష
తిరస్కరణ!
బహిష్కరణ!
రాజ్యాంగ శోకం
ఆంక్షల కత్తి

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.