Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చేపల కూర | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

చేపల కూర

Sun 15 Jan 03:46:22.042431 2023

చాలా ఏళ్ల కిందట కొమరగిరి గ్రామంలో ఊదయ్య అనే చేపలు పట్టి జీవించే జాలరి ఉండేవాడు. తను స్వార్థం తెలియని నిజాయతీ గల మనిషి. ఓ పొడవాటి వెదురు కర్రకు చివరన గాలం కట్టి, దానికో చిన్న చేపను కుచ్చి బావుల్లో, కుంటల్లో, చెరువుల్లో వేట వేస్తూ, దగ్గరలోని పల్లెల్లో తిరిగి అమ్మేవాడు. ఏమీ పడని రోజు గృహస్థుల ఇండ్ల ముందుకు వెళ్ళి, అన్నం అడుక్కొని తింటూ పొట్ట పోసుకునేవాడు. ఎక్కువగా చేపలుపడ్డ రోజు పట్నంలో నర్సయ్య అనే వ్యాపారికి అమ్మేవాడు.
ఒకసారి గాలంతో ఎప్పటిలాగే చేపలు పట్టుకోవడానికి చెలకలో గల బావి వైపు వెళ్ళాడు. ఎరను కుచ్చి బావిలో గాలం వేయగా గట్టిగా ఏదో గాలానికి తగిలినట్లనిపించింది. పెద్ద చేపే పడిందనే సంతోషంతో మెల్లగా ఒడ్డుకు లాగాడు. ఆశ్చర్యంగా... గాలానికి చేపకు బదులుగా శవము తేలింది. భయ పడ్డాడు. అయినా మెల్లగా వొడ్డుకు లాగి చొక్కాకు చిక్కుకున్న గాలాన్ని ఒడుపుగా తీసి పదేళ్ళ బాలుడి శవాన్ని ఒడ్డున పడుకోపెట్టాడు. మెడలో పులిగోరుతో బంగారు హారం, చేతులకు బంగారు గాజులు, చెవులకు వజ్రంతో కూడి ఉన్న బంగారు తీగలు, వెండి మొలతాడు కనిపించాయి. బాలుడు ఎవరి వాడో తెలియదు. ఎలా పడ్డాడో తెలియలేదు. ఏమి చేయాలో తెలియలేదు ఊదయ్యకు.
ఇంతలో గుర్రం మీద బట్టల వ్యాపారి ఒకడు పక్కనున్న దారినపోతూ కనపడ్డాడు. చేయెత్తి పిలిచాడు. దగ్గరికి వచ్చాడు గురప్ప. తను చుట్టుపక్కల గ్రామాల్లో బట్టలు వాయిదాలకు ఇచ్చి, రోజూ వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటుండేవాడు. చాలా సార్లు ఊదయ్య, అతన్ని చూసి ఉండడంతో పేరుతో సంభోధించి దగ్గరికి పిలిచాడు. ''చేపలకు గాలం వేస్తే, తట్టుకుని తేలాడు. వొంటిమీద విలువైన ఆభరణాలు ఉన్నాయి. పాపం ఎవరి కొడుకో..? ఇలాగే వదిలివేస్తే జంతువులు పీక్కుతినే అవకాశముంది. కాబట్టి నేను ఊరిలోకి వెళ్ళి చెబుతాను. అప్పటి వరకూ, శవం దగ్గర కాపలా ఉండు. నా దగ్గర చేపలు కూడా ఉన్నాయి. వాటిని పట్నంలోని మార్కెట్లో నరసయ్యకు ఒప్పజెప్పి వస్తాను. లేదా నేను శవం దగ్గర ఉంటాను. ఈ చేపలు కాస్తా వ్యాపారికి ఇచ్చి, పిల్లవాడి సంగతి గ్రామంలో చెప్పు'' అన్నాడు. శవం మీది ఆభరణాలు చూడగానే గురప్పకు వాటిని కాజేయాలనే దుర్బుద్ది పుట్టింది. ''నాకు చేపల వాసన పడదు. స్వచ్ఛమైన శాఖాహారిని. ఆ నర్సయ్య ఎవరో కూడా తెలియదు. నేనే ఇక్కడ ఉంటాను. నువ్వే వెళ్ళి, నీ పని చూసుకొని, త్వరగా రా. నాకు చాలా తొందర పని ఉంది. పాపం ఏ తల్లి కన్నా బిడ్డడో..'' అని సానుభూతి నటించాడు. భుజాన గాలం, దానికి మరో వైపు చిట్టి చేపలను నిలువ ఉంచే ముంత, ఎడమ చేతిలో వెదురు బుట్ట నిండా చేపలతో గ్రామంలోకి వెళ్ళి నర్సయ్యకు చేపలని ఒప్పజెప్పి డబ్బులు తీసుకొని, వ్యాపారికి సంగతి చెప్పాడు. తను చుట్టుపక్కల వారికి బావిలో బాలుడి మరణం గురించి చెప్పాడు. గ్రామంలో వార్త గుప్పుమంది. జనాన్ని తీసుకొని నరసయ్య, ఊదయ్య బావి వద్దకు వెళ్ళారు. విచారంగా శవానికి దూరంగా గురప్ప కూర్చొని ఉన్నాడు. ''ఆయ్యో, ఇది నా మనమడి శవం. వొంటిమీది నగలేవీ? ఎవరో కాజేసి, చంపి బావిలో పడేశారు'' అని భోరుమని ఏడ్వ సాగాడు పరంధామయ్య. ''ఎవరో కాదు, ముందుగా చూసింది వీళ్ళు ఇద్దరే. వీళ్లలోనే హంతకుడు, దొంగ ఉన్నారు. చితక బాదండి. నిజమేమిటో తెలుస్తుంది'' అన్నాడు జనంలోని ఓ యువకుడు.
''అయ్యో.. నాకేమీ తెలియదు. దారిన పోతుంటే, ఇతను పిలిచి కాపలా ఉండమన్నాడు. ఉన్నాను అంతే. ఆ నగల సంగతి కానీ, చనిపోయిన బాలుడి గురించి కానీ ఏమీ తెలియదు. కావాలంటే, అతన్నే అడగండి.'' అన్నాడు గురప్ప.
''నేను చేపలకు గాలం వేస్తే, చిక్కుకొని పైకి లేసింది బాలుడి శవం. ఒడ్డున పడుకో పెట్టి, శవం పాడు కాకుండా ఇతన్ని కాపలాపెట్టి, చేపలను అమ్ముకునేందుకు గ్రామంలోకి వెళ్ళి చెప్పాను. నేను తీసినప్పుడు నగలు వున్నాయి. ఇప్పుడు లేవు. నాకంతా మాయగా ఉంది. తను కూడా మంచి వాడేననుకుంటా'' అన్నాడు ఊదయ్య.
''వీళ్ళిద్దరూ నాటకాలు ఆడుతున్నారు. న్యాయాధికారి దగ్గరకు తీసుకు పదండి'' అని, ఊదయ్యను, గురప్పను నారాయణ మూర్తి వద్దకు తీసుకుపోయారు ప్రజలు. పిల్లవాడి బంధువులు, గ్రామస్తులు, ఊదయ్య, గురప్ప చెప్పిన విషయం విని, ''ఇద్దరినీ చెరో గదిలో ఉంచండి. రేపు విచారిస్తాను'' అన్నాడు. తెచ్చిన బాలుడి శవాన్ని పరీక్షగా చూశాడు. ఒంటిమీద, నగలున్న అవయవాల దగ్గర ఎటువంటి గాయాలు లేవు. వ్యాపారికి ఒక కాలు కాస్తా తక్కువ అనే సంగతి, అతని నడకలో కనిపెట్టాడు న్యాయాధికారి. ఇద్దరికీ చేపల కూర వండి పెట్టగా, ప్రియంగా తిని నిద్రపోయారు ఇద్దరూ.
మరుసటి రోజు పట్నంలోకి వెళ్ళి నరసయ్యను పిలిచి, ఊదయ్య గుణ గణాల గురించి విచారించాడు. నిజాయితీకి మారు పేరని చెప్పాడు నరసయ్య. గురప్ప గురించి అడిగాడు. బట్టల వ్యాపారంతో పాటు, పిల్లలకు చెవులు, ముక్కులు కూడా కుట్టడం వచ్చు. అలా కుట్టి తృణమో, ఫణమో తీసుకుంటాడు. అంత నిజాయతీ పరుడేమీ కాదు. డబ్బు వసూలు కాడ కనికరము ఉండదు'' అని చెప్పారు. బాలుడి తల్లిదండ్రులనూ విచారించాడు. బాలుడు మరణించిన బావి, ఆ చుట్టూ పక్కల ప్రదేశం చూసి, దగ్గరలోని పొదలో ఏదో వస్తువు దొరికితే జేబులో వేసుకున్నాడు.
మరుసటి రోజు, ఇద్దరూ సభకు తీసుక రాబడ్డారు. వెంటనే కొరడా అందుకొని గురప్పను నాలుగు అందుకున్నాడు. భయంతో కంపిస్తూ ''అయ్యా. క్షమించండి. బుద్ది పొరపాటై, నేనే నగలు దొంగిలించాను, కానీ బాలుణ్ణి చంపింది మాత్రం ఊదయ్యే. అతన్ని శిక్షించండి'' అన్నాడు. వెంటనే, న్యాయాధికారి కొరడా పక్కన వేసి, జేబులోంచి బంగారం నగలున్న పొట్లం తీసి చూపాడు. అవి తమ బాబువే అని బాలుడి తల్లిదండ్రులు గుర్తించారు.
వచ్చిన వారి నందరినీ కూర్చోమని చెప్పి ఈ విధంగా తీర్పు చెప్పాడు.
''బాలుడికి తాతయ్యంటే పిచ్చి ఇష్టం. తల్లిని అడిగితే, పండుగకు పోదామని నచ్చజెప్పి ఆపింది. తాతను ఎలాగైనా వెళ్ళి కలవాలని, గతంలో దారి చూసి ఉన్నాడు కనుక, ఇంట్లో చెప్పకుంటా ఒంటరిగా బయలు దేరాడు. మధ్యకు వచ్చేసరికి దాహమయింది. దారి పక్కన బావిలో నీళ్ళు కనిపించే సరికి దిగాడు. దరి జారి బావిలో పడ్డాడు. ఈత రాని కారణాన చనిపోయాడు. ఎవరూ చంపలేదు. ఇంతలో చేపలు పట్టి జీవించే ఊదయ్య వచ్చి చేపల కోసం గాలం వేయగా, గాలానికి బాలుడి చొక్కా తట్టుకొని వెలుపలకు వచ్చింది. మృగశిర కార్తే కావడం వల్ల, చేపలకు గిరాకీ ఉండడం వల్ల, గురప్పను శవం దగ్గర ఉంచి ఊళ్ళెకి వెళ్ళాడు. ఊరి జనంతో వచ్చే సరికే, నగలని ఒడుపుగా తీసి, మోదుగు ఆకుల్లో చుట్టి బుర్జింక పొదలో పెట్టాడు గురప్ప. ఎవరూ తెలుసుకోలేరు, చేపలు పట్టే వాడిమీద నేరం పోద్దనే పిచ్చి నమ్మకంతో, ఊదయ్య మీద నేరారోపణ చేశాడు. నేను ఈ నగలను ఎలా కనుక్కున్నాననే మీకు సందేహం రావచ్చు. గత రాత్రి వర్షం పడి, నేలంతా తడిగా ఉంది. బావి దగ్గర నుంచి, ఒక మనిషి దూరంగా నడిచి వెళ్ళిన గుర్తులు ఉన్నాయి. ఒక పాదం సాధారణంగా, మరో పాదం బరువుగా పడడంతో, లోతుగా గుర్తు కనిపించింది. ఇతనికి ఒక పాదం ఎత్తు తక్కువ అనే విషయం వీళ్ళను సభలోనిక తీసుక వచ్చిన రోజే గమనించాను. పాదాల వెంట వెళ్ళి చూడగా పొదలో పొట్లం కనిపించింది. చూస్తే నగలు. వ్యాపారి, శాఖాహారినని మీతో అబద్ధం చెప్పి, నమ్మించాడు. కానీ నేను చేపల కూర పెట్టించగా చక్కగా తిన్నాడు. అతను అబద్ధం ఆడుతున్న విషయం భోజనంలోనే కనిపెట్టాను. అక్కడి నుంచి ఒక్కో విషయమే, వెదుక్కుంటూ వెళ్ళగా బాలుడు చనిపోయిన విషయం, నగలు శవం మీద నుంచి, ఒలిచి దాచి పెట్టిన సంగతి బోధపడింది. తనకు బంగారంతో చెవులు, ముక్కులు కుట్టడం వచ్చు కనుక, బాలుని శవానికి చిన్న గాయం కూడా కాలేదు. పైగా తను చూసినప్పుడు శవం వొంటిమీద నగలులేవని అబద్ధమాడాడు. నేరం తను చేసి, అమాయకుడిని ఇరికించాలనే దుష్ట పన్నాగం పన్నినందుకు కోపమొచ్చి కొట్టాను. దెబ్బతో భయపడి, నేరం ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా నిజాయతీ పరుడైన, ఊదయ్యను అభినందిస్తున్నాను. అల్లాగే నేరం చేసిన గురప్పను కారాగారంలో వేయవలసినదిగా రాజ భటులకు అప్పగిస్తున్నాను.'' అని తీర్పు చెప్పాడు.
న్యాయాధికారి తీర్పును ప్రజలంతా మెచ్చుకున్నారు.

- పుప్పాల కృష్ణమూర్తి, 99123 59345

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆఅ
సమయం మించిపోలేదు
రెండు కాళ్ళ కుక్కలు
నడిసొచ్చిన తొవ్వ
''అడవికి మేల్కొలుపు కొక్కొరోకో''
గిది నల్ల పోచమ్మ అడ్డ
తెలివైన ఎలుక
యువ నాయ‌క‌త్వం
భలే ఎంపిక!
జ్ఞాపకం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.