Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాటల సమాధి | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • పోయెట్రీ
  • ➲
  • స్టోరి

పాటల సమాధి

Sun 05 Feb 00:54:56.793756 2023

ఆ సాయంత్రం
వేదిక ముందు నిల్చొని ఆమె పాటను విన్నాను
అంతా ఆమె గొంతును మెచ్చుకుంటుంటే నవ్వొచ్చింది
వాళ్ళకు తెలీదు కదా
పాట ఆమె గుండెలోంచి ఉబికే కన్నీటి గతమనీ

మా వాళ్ళంతా కలిసి
ఆమె చుట్టూ పోలికలు పేర్చారు
జానకమ్మలాంటి గొంతు అని
సుశీలమ్మలాంటి రాగమనీ
ఒక్కరికీ
ఆమె పాట ఆమెదిలా అనిపించలేదు
అదీ విషాదం

నేను ఎన్నో సార్లు
ఆమె పాట సాయం తీసుకున్నాను
ఊపిరి తీసుకోవడం కష్టమైనపుడు
కిటికీ రెక్క తెరవడానికి
బయట ఉక్కపోత మరీ ఎక్కువైనపుడు
వెనక్కి వెళ్ళి ఉమ్మ నీట్లో ఈదడానికి
చీకటి అరణ్యంలో దారి తప్పిపోయినపుడు
గుప్పెడు ధైర్యాన్ని వెలిగించుకోవడానికి

చాలా సార్లు
నిద్రలోంచి హఠాత్తుగా లేచి
ఆమె పాట కోసం లోపలంతా వెతికేవాణ్ణి
ఏదో చరణాన్ని కావలించుకుని పడుకుంటే
నిద్రపట్టేది

అవకాశం పేరు చెప్పి
ఒక ఊడిగం నన్ను
నగరానికి ఎగరేసుకుపోయినపుడు
వెళ్తే వెళ్ళాను కానీ
ఉత్తి చేతులతో పోలేదు
ఆమె పాటను సూట్‌ కేసులో సర్దుకుని పోయాను

ఏళ్ళు గడుస్తున్నాయి
నగరం నా వెనకాల వలలు పన్నింది
పాటతో అల్లుకున్న ప్రపంచం
ప్రవరుడు కళ్ళ చుట్టూ దిద్దుకున్న కాటుకలా కరిగిపోయింది
ఎముకలు మూలిగినపుడల్లా
ఆమె పాట నన్ను జోకొడుతూనే వుంది

ఆ రోజు
నాన్న ఆఖరి చూపు కోసం
ఊరు నన్ను పిలిస్తే వెళ్ళినప్పుడు
వీధి వీధిలో గాలించాను
ఇల్లు ఇల్లూ తిరిగాను
ఏ లాలిపాటలోనో
ఏ పొలం గట్టు మీదో
ఏ రాత్రి కంచంలో బువ్వ మెతుగ్గానైనా
ఆమె పాట దొరుకుతుందని

కొన్నాళ్ళ తర్వాత
నేను ఊరమ్ముకుని వెళ్ళిపోతుంటే
పొలిమేర పరుగెత్తు కొచ్చి వగరుస్తూ చెప్పింది
ఇదిగో ఇది ఆమె సమాధి వుండే అడ్రస్సు
తవ్వుకో... పాటలేమైనా దొరుకుతాయేమో
చీటీలో 'ఫలానా పాట' ష/శీ వంటిల్లు అని రాసుంది
అవును! పాటలన్నీ సమాధి చేయబడేది అక్కడేగా

నా చిటికెనవేలికి నిప్పంటుకుంది
త్వరగా వెళ్ళాలి
కనీసం ఒక్క పాటనైనా మిగుల్చుకోవాలి


- సామూ, 9642732008

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'కన్నీరు'
ఇదే...కవిత్వమంటే
జయహౌ శోభకృత్‌!!
మరుజన్మంటూ ఉంటే...!
డిస్కనెక్ట్‌
మహిళా శిరోమణి
బలవంతపు గదిలో ..
ఉరి పడని మెడలు ??!!
స్త్రీ
ఓ వనితా నీకు వందనం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.