Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గిలిగింతలు పెట్టే ప్రేమ పాట | కవర్ పేజీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ పేజీ
  • ➲
  • స్టోరి
  • Jun 12,2021

గిలిగింతలు పెట్టే ప్రేమ పాట

ప్రేయసీప్రియుల మధ్యన ఎన్నెన్నో అలకలు అల్లర్లు చేస్తుంటాయి. వలపులు సందళ్ళు చేస్తుంటాయి. అప్పుడే ముసిముసి నవ్వులతో కిలకిలలాడుకుంటారు. అప్పుడే అలకల్లో మునిగి రుసరుసలు రువ్వుకుంటూ ఉంటారు. ఒకరిని మించి ఒకరు బెట్టు చేస్తుంటారు. ఏది ఏమైనా వారి హదయాల నిండా మాత్రం ప్రేమను నింపుకుంటారు. ఇలాంటి గిలిగింతలు రేపే ప్రేమపాటను 'భీష్మ' (2020) సినిమాలో కష్ణచైతన్య రాశాడు. దోబూచులాడే రెండు హదయాల వలపుగాథను ఎంతో చక్కగా వివరించాడీపాటలో కష్ణచైతన్య.
     ప్రేమ మొదలయ్యేది చూపులతోనే. మాటలతో కాదు. చూపులతో మొదలైన ఈ తీయని కథ ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో మనకే తెలియదు. ఉరకలేసే వయసులో చూపులు కొంటె బాటలో కొత్త తీరాన్ని చేరుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రేయసి చూపు ప్రియున్ని తనివితీరా చూసింది. అది కూడా ప్రియుడు తనను చూడనంతసేపే. ఈ దోబూచులాటలో ఉన్న తీయందనం ప్రేమికుల మనసులకే తెలుసు కదా! ఆ ఆనందాన్ని, తీయందనాన్ని తాను పొందుతున్నానని ప్రేమికురాలు చెబుతుందిక్కడ. తన ఇష్టాన్ని చూపుల ద్వారా తెలుపుతుంది. కాసేపు మాత్రమే పైపైకి కోపంగా నటిస్తుంది. ఈ కోపం అనే తెరవెనుక అంతులేని ఆశ, నిండైన ప్రేమ దాగుందన్న విషయాన్ని ప్రేమికునికి తెలియజేస్తుంది ప్రేయసి. ఏదైనా అడిగినా,అలిగినా నీ దానినేనని, సంతోషంతో మురిసినా, ప్రేమగా మెరిసినా అది నీ వల్లెనేనని, తలచినా లేక తరిమినా నీ ధ్యాసలోనే అది జరుగుతుందని, ఆ ప్రేయసి ప్రేమికునికి తెలుపుతుంది. ఆమె గుప్పెడు మనసులో చెలరేగే తొందరకు కారణం తన ప్రియుడే. ఆ తొందరయే ప్రేమ. అద్భుతమనేది తన ముందు తన ప్రియుడిలా నిలబడి ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తుందామె.
తను ప్రాణంగా ప్రేమించే ప్రియుడు తనను కూడా ప్రాణంగా భావిస్తున్నాడని, తన కోసమే ఆరాటపడుతున్నాడని తెలుసుకున్న ప్రేయసికి ఎక్కడాలేని ఆనందం కలుగుతుంది. అప్పుడు కొంగ్రొత్త మొహమాటంతో ఆ ప్రేయసి మనసు వయసు ఉరకలేస్తుంది. ఆ ప్రేమికుడు ప్రేయసి ఎదలో రేపిన గిలిగింతలే, పులకింతలే ఆ మొహమాటానికి కారణమని చెప్పాలి. ప్రేమ వయసును బట్టి చిగురు తొడిగినా, దానికి మనసు తోడై పరుగులు తీసినా ప్రేయసీప్రియులు ఆటల్లో,పాటల్లో మునిగినప్పుడు ఒక్కోసారి వయసును గుర్తించరు. చిన్నపిల్లలైపోతారు. నిర్మలమైన మనసుల్లోనే ప్రేమ పుడుతుంది కదా! ప్రేమకు కల్మషమెరుగని మనసే చిరునామా కదా! అందుకే పసిమనసులతో ఒకరినొకరు వెంటపడి తరుముకోవడం, వెంటపడినా కంటపడకుండా తప్పించుకోవడం ఇలాంటి చిత్ర విచిత్రమైన ఆటలు, అల్లర్లు ఎన్నో ప్రేమ ప్రయాణంలో. అయినా మన సొంత వాళ్ళనుకున్నప్పుడు వారితో చేసే ప్రయాణం ఎంతో వింత వింతగా కవ్వింతగా ఉంటుంది కదా మరి.
     మనవాళ్ళు అనుకున్నప్పుడు వారితో చేసే ప్రయాణం సుదీర్ఘమైనా, క్షణకాలమైనా మధురంగా ఉంటుంది. అది ప్రేమలో అయితే మధురాతిమధురంగా ఉంటుంది. ఈ పాట ద్వారా ప్రేమికులు సాగించే ఎంతో అందమైన ప్రయాణాన్ని అంతే అందంగా వివరించాడు కష్ణచైతన్య.
పాట :-
హే చూశా నేను నీ వైపు
నువ్వు నన్నే చూడనంత సేపు
దోబూచులాటేదో నీతో బాగుందిరా
నా ఇష్టం దాచుకుంది చూపు
నా కోపం పైకి కాసేపు
అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా
అలిగిన అడిగినా నీ దానినే
మురిసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే.. ఓహౌ.. ఓహౌ.
గుప్పెడు గుండెలో ఓ తొందరే
నువ్వనే అద్భుతం నా ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరి.. ఓహౌ.. ఓహౌ..

హా.. నా కోసం ఆరాటం
ముద్దుగానే ఉంది చాలా..
ఓ కొత్త మొహమాటం వేళ కాని ఈ వేళ
హా.. వెంటపడి మరి కంటపడనుగా..
విచిత్రమో వింత వైఖరి..
సొంతవారితో ప్రయాణము
అలిగినా అడిగినా నీ దానినే
మురిసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహౌ.. ఓహౌ
గుప్పెడు గుండెలో ఓ తొందరే
నువ్వనే అద్భుతం నా ముందరే
అందుకే ఇంతగా ఈ అల్లరే ..
ఓహౌ.. ఓహౌ..
- తిరునగరి శరత్‌ చంద్ర
6309873682

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెర్సోప్ప జలపాతం
స్ప‌ర్శ‌లోంచి వ‌చ్చిన దృశ్యాలు
యువతా.. నీ దారెటు?
రాక్‌ బీచ్‌
ఏది సులువుగా దొరకదు
ధోలావిర...
చిత్రంలో చిత్రం...!!
అహిల్యబాయి కోట
కళాకృతులు
లేక్యున్‌ సెక్యా
కలాడియో జాతీయ పక్షుల పార్కు
సముద్ర కోట
నల్లపాముల గద్ద
దృశ్య క‌థ‌
శిధిలాల్లో ఒదిగిన పెరూరు చారిత్రక వైభవం
అల‌నాటి ప‌ల్లె...
ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అరుదైన పక్షి... అచ్చం కర్రపుల్లలా...
ముంగిట్లో ముత్యాలు
కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు...
రంగులే ప్ర‌తీక‌
కుట్టు పిట్ట...
బాల్యం మళ్లీ చిగురించాలి !
వింత గ్రామం
డ్యాన్సింగ్‌ ట్రీస్‌
బతకమ్మా! బ్రతుకు!
కాలగర్భంలో కలిసిపోతోన్న తెలంగాణ చారిత్రక నిర్మాణాలు
''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం''
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి
భారత స్వాతంత్రోద్యమం

తాజా వార్తలు

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.