Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రావి రంగారావు కవిత్వం- ''కొత్త క్యాలెండర్‌'' | కవర్ పేజీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ పేజీ
  • ➲
  • స్టోరి
  • Jul 04,2021

రావి రంగారావు కవిత్వం- ''కొత్త క్యాలెండర్‌''

ఏది ఏమైనా చలించకుండా ముందుకు పయనించేది కాలం. కాలానికున్న ప్రత్యేకత ఏంటంటే అది సంతోషంలోను, దుఃఖంలోను సమతూకంగానే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. అలాంటి కాలం విలువ తెలిసిన కవి రావి రంగారావు.
     క్యాలెండర్లు ఏ మాత్రం జీవితాలకు ప్రామాణికం కాదంటారు, ఎన్ని క్యాలెండర్‌లు మారినా బతుకులు మారవంటూ మనుషుల బాధ్యతను గుర్తుచేస్తాడు. ప్రస్తుత మనుషుల జీవన స్థితిని దష్టిలో పెట్టుకొని నేటి సమాజాన్ని చైతన్యపరిచే అంశాలను కవితల్లో జోడిస్తాడు.
     ఈ కొత్త క్యాలెండర్‌ లో ప్రేరణను పెంపొందించేవి, జీవిత పరమార్థాన్ని తెలియజేసేవి, అన్యాయాన్ని ఎదురించేవి, స్వచ్చమైన జీవితానికి దారిచూపేవి, పరిమళాన్ని నింపేవి, పిట్టను చెట్టును మరిచిపోకుండా చేసేవి, ప్రశ్నలై మొలిచే మొదలగు అంశాలతో కూడిన కవితలు రాశారు.
     పుస్తకానికి పెట్టిన ''కొత్త క్యాలెండర్‌'' శీర్షికే కాక ఇందులో ఎన్నో వినూత్నమైన కవితా శీర్షికలున్నాయి.ఎండను తాగే రాత్రి, డాక్టర్‌ సూర్యుడు, కంపు పూలగాలి, ఒక్క కుక్క అరవటం లేదు వంటివి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. చక్కని భావుకత, సామాజికత, తాత్వికత, మానవీయత కలగలిసిన చిక్కని కవిత్వంగా ''కొత్తక్యాలెండర్‌''ను చెప్పవచ్చు.
     వెంటాడే వాక్యాల్లోకి..
      1. ఒక్క క్షణం చాలు-కళ్ళు మూతపడితే
       వెలుతురు కుంటిది కావచ్చు
      చీకటి కుర్చీ ఎక్కొచ్చు (ఒక్క క్షణం చాలు, పేజీ12)
      ఈ వాక్యాల్లో వెలుతురును అభివద్ధికి చిహ్నంగా, చీకటిని అర్హతలేని నాయకునికి గుర్తుగా ఉపయో గించారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్న ప్రజా స్వామ్య వ్యవస్థను కవిత్వంగా చెప్పటం కోసం కవి రాసిన ఈ వాక్యాలు సులువుగా పాఠకునికి చేరుతాయి. ఇందులో సాధారణ పదాలతో కూడిన బలమైన వ్యక్తీకరణ ఉన్నది.
      2. ఔషధమైనా విషమైనా
      మనసులోంచే తయారయ్యేది!
      మనసులో పుట్టేదే
      బతుకుంతా పాకేది! (మనసు,పేజీ 59)
      మనసనేదే అన్నింటికి మూలం. మనిషి చెడుమార్గంలో నడవాలన్న, సన్మార్గంలో నడవాలన్న మనసే ముఖ్యం. మనసు భాష అంత సులువుగా అర్థం కాదు. ఒక్కసారి అర్థమయితే చివరివరకు వదిలిపోదు. అందుకే కవి మనసు తీవ్రతను తెలియజేసే ఈ వాక్యాలనుంటాడు. మనసులో పుట్టిన చెడు ఆలోచనలే విషంగా మారి నష్టాన్ని కలిగిస్తాయని, మనిషిని బాగు పరిచే మందుగా కూడా మనసే పనిచేస్తుందని.
      3. పుస్తకాన్ని తెరవటమంటే
      ఇంట్లో ఉన్నా కోట్ల జనాల్లోకి వెళ్ళటమే
      కాదు కదలకుండానే
      కమనీయ ప్రపంచాన్ని చుట్టి రావటమే..
      (పుస్తకం ఒక సముద్రం,పేజీ 86)
      పుస్తకం విశిష్టతను మూడే వాక్యాల్లో ఎంతో గొప్పగా చెప్పారు.పుస్తకాన్ని ప్రపంచంలోపలికి వెళ్ళటానికి ద్వారంగా అభివర్ణించారు. పుస్తకాలను చదివితే ఇంట్లో కూర్చొనే ప్రపంచాన్ని చుట్టిరావచ్చొంటారు. పుస్తకం విలువను తెలియజేసే ఈ వాక్యాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో దగినవి. ఈ వాక్యాలు పుస్తకాలు చదువుతున్న వారికి బలాన్నిచ్చేవి, చదవని వారికి కనువిప్పు కలిగించేవి.
      4. ప్రశ్న ఒక అగ్గిపుల్ల
      సరిగా వినియోగించు
      ప్రశ్న ఒక ఆడపిల్ల
      సున్నితంగా గౌరవించు!
      (ప్రశ్న ఒక వెలుతురు,పేజీ 94)
      ప్రశ్న అనేది ఎంతో గొప్ప సాధనం. అది లేకపోతే జవాబు చెప్పే వాడెవడు ఉండడు. జీవితం ప్రశ్నగానే మిగిలిపోతుంది. కవి కూడా మొదటి వాక్యంలో ప్రశ్నను అగ్గిపుల్ల అన్నారు. నిజంగా అది అక్షరాల సత్యం. ప్రశ్నై పేలని మనుషులన్నంత కాలం అవినీతే రాజ్యమేలుతుంది. ఈ రోజుల్లో ప్రశ్నగా మిగులుతున్న ఆడపిల్లల జీవితాలనుద్దేశించి ప్రశ్నొక ఆడపిల్లన్నారు. ఈ వాక్యాల్లో సున్నితత్వం కనిపించిన కాస్త లోతుల్లోకి వెళితే బలమైన ప్రశ్నించే గొంతుక కనబడుతుంది.
      వీరు కవిత్వమే కాకుండా మినీ కవితలు, బాల గేయాలు, కిరణాలు, పద్యాలు, వ్యాసాలు కూడా రాశారు. మినీ కవితల పితామహుడుగా ప్రసిద్ధి గాంచారు. ఉత్తమ పరిశోధకులు కూడా.
- తండ హరీష్‌ గౌడ్‌,
సెల్: 8978439551

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెర్సోప్ప జలపాతం
స్ప‌ర్శ‌లోంచి వ‌చ్చిన దృశ్యాలు
యువతా.. నీ దారెటు?
రాక్‌ బీచ్‌
ఏది సులువుగా దొరకదు
ధోలావిర...
చిత్రంలో చిత్రం...!!
అహిల్యబాయి కోట
కళాకృతులు
లేక్యున్‌ సెక్యా
కలాడియో జాతీయ పక్షుల పార్కు
సముద్ర కోట
నల్లపాముల గద్ద
దృశ్య క‌థ‌
శిధిలాల్లో ఒదిగిన పెరూరు చారిత్రక వైభవం
అల‌నాటి ప‌ల్లె...
ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అరుదైన పక్షి... అచ్చం కర్రపుల్లలా...
ముంగిట్లో ముత్యాలు
కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు...
రంగులే ప్ర‌తీక‌
కుట్టు పిట్ట...
బాల్యం మళ్లీ చిగురించాలి !
వింత గ్రామం
డ్యాన్సింగ్‌ ట్రీస్‌
బతకమ్మా! బ్రతుకు!
కాలగర్భంలో కలిసిపోతోన్న తెలంగాణ చారిత్రక నిర్మాణాలు
''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం''
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి
భారత స్వాతంత్రోద్యమం

తాజా వార్తలు

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.