Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సరికొత్త చరితకు 'నాంది' పలికిన పాట | కవర్ పేజీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ పేజీ
  • ➲
  • స్టోరి
  • Jul 25,2021

సరికొత్త చరితకు 'నాంది' పలికిన పాట

మన భారతదేశ న్యాయవ్యవస్థ అందరికీ ఆదర్శప్రాయమైనది. మన రాజ్యాంగంలో రాయబడిన శాసనాల ఆధారంగానే మన హక్కులు, అధికారాలు నిర్ణయించబడతాయి. అన్యాయం జరిగినపుడు ఏ శిక్షలు విధించాలో కూడా అందులోనే రాయబడ్డాయి. అయితే - న్యాయానికి రక్షణ, అన్యాయానికి శిక్షణ అనేది అనాదిగా జరుగుతున్నదే. జరగాల్సింది కూడా అదే. కొన్ని సందర్భాల్లో న్యాయానికి రక్షణ లేకపోవచ్చు.
     ఇక్కడ - 'నాంది' (2021) సినిమాలో ఒక సగటు మనిషికి కూడా జరిగిన అన్యాయం అదే. ఏ పాపం తెలియని, ఏ నేరం చేయని, ఎవ్వరికీ హాని తలపెట్టని ఒక నిజాయితీ గల పౌరుడికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుందీపాట. తనకు జరిగిన అన్యాయానికి, తన మీద పడ్డ నిందని తానే తుడిచివేసుకోవడానికీ ఆ పౌరుడే ప్రతిఘటించడం ఇక్కడ ప్రత్యేకమైన విషయం. ఈ న్యాయ, అన్యాయాలకు మధ్య జరిగే ఈ సంగ్రామంలో న్యాయం వైపు నిలబడి మోగే ఈ మహౌజ్జ్వల గీతాన్ని రాసిన కవి చైతన్యప్రసాద్‌. భాషావేశంలోను,భావ ప్రకటనలోను ఆయనకు ఆయనే సాటి. అధ్యయన శీలంతో ఎంతో అనుభవాన్ని పొంది, వినూత్న అభివ్యక్తితో సన్నివేశాలకనుగుణంగా పాటను కవిత్వీకరించడంలో చైతన్యప్రసాద్‌ దిట్ట.
     సినిమాకథ పరంగా చూస్తే... కథానాయకుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి తనవైపు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ తాను పెట్టుకున్న దరఖాస్తు సెక్షన్‌ - 211 కు చెందినది. అంటే ఐదేళ్ళు తాను అన్యాయంగా శిక్షను అనుభవించిన బాధితుడనని, నిందితుడిని కానని తాను చెప్పుకుంటూ పెట్టుకునే దరఖాస్తు ఇది.
      ఈ దౌర్జన్యం ఇంకా ఎన్నాళ్ళు? తరతరాలుగా న్యాయానికి జరిగే ఈ అన్యాయాన్ని ఎవరూ ఆపలేరా? ధర్మం కోసం ఇలాగే నిరంతరం పోరాడుతూనే ఉండాలా? ఆశలు తొలగిపోయి నిరాశల చీకట్లు నిన్ను చుట్టుముట్టినా నువ్వు చతికిలబడిపోకుండా తొలి వెలుగులా ప్రకాశిస్తూ, ప్రశాంతమైన బాటలో నువ్వనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని హెచ్చరిస్తుందీ పాట. న్యాయం కోసం ఎన్నేళ్ళైనా, ఎన్నాళ్ళైనా సాగమని ప్రబోధిస్తుంది.
    నువ్వనుకున్న గమ్యాన్ని ఈరోజే చేరాలి. ఈ యుద్ధంలో న్యాయానికి గెలుపు ఉన్నదో, లేదో అన్న సందేహాన్ని విడిచి పెట్టాలి. నీ ప్రయత్నం ఫలించాలంటే నీ సంకల్పం బలంగా ఉండాలి. ఒకవేళ నీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, నీ దారులన్నీ ఎడారులై మూసుకుపోయినా, విధి నీ ప్రాణాలతో చెలగాటమాడినా, నీ సంకల్పమే, నీ ఆశయమే సందేశమై, ఒక సంఘర్షణై నిలవాలి.
      ఈ అవినీతి చర్యలను గోతిలో పాతడానికి నీ సంకల్పమే నాంది కావాలి. నిద్రలేని రుద్రవీణ ఎలుగెత్తి వినిపించడానికి, గాయపడిన న్యాయమనే సింహం తిరిగి గర్జించడానికి, రాక్షసాన్ని కూల్చడానికి ఇదే నాంది కావాలి.
     అడుగు ముందుకు వేశాక భయపడితే ఇక భవిష్యత్తు లేదు. అది బతుకే కాదు. యుద్ధంలో ఆయుధాలు మాత్రమే కాదు నీ సాహసమే నీకు తోడు కావాలి. వెనుకడుగు వేస్తే అది సమరమనిపించుకోదు. సవాళ్ళను ఎదుర్కొంటూ, అరాచకాల్ని ధిక్కరిస్తూ సాగిపో. ఇక సహనంతో నువ్వు ఆగిపోతే మార్పు రాదు. మంచి జరగదు. ఇన్ని రోజులు భరించిన బాధల్ని గుర్తుచేసుకో. దగాలు ఇక కుదరవని చెప్పు. దిగులు ఇక వదలమని జగతికి చాటి చెప్పు. నీ నిజాయితీ గెలిచి ప్రపంచాన్ని మేల్కొలిపే తీర్పు ఇదే రోజని తెలియజెప్పు.
      నీ కంటినీరు మంటలాగ మారడానికి, నువ్వు రక్తాన్ని ధారవోసి, నీలా అన్యాయమైపోతున్న ఎందరెందరికో కొత్తబాటను వేయడానికి, నువు కోరుకున్న సరికొత్త చరిత్రను రాయడానికి, చేవచచ్చిన శాసనాన్ని నీ సంకల్పంతో మార్చడానికి ఇదే నాంది కావాలి. ఒక్క ఉక్కు గుండె తలచుకుంటే సాధించలేనిదేదీలేదని నువు నిరూపించాలి. నువు పోరాటంలో జయిస్తే, న్యాయం ఎప్పటికీ గెలుస్తుందన్న నమ్మకాన్ని నిలబెట్టినట్టు. అందుకే పొరాటం చేసి విజయాన్ని సాధించమని మహౌన్నత సందేశాన్నిస్తుందీపాట. అన్యాయం జరిగినప్పుడల్లా న్యాయం వైపు నిలబడి శంఖారావమై నినదిస్తుందీపాట.
పాట :-
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా దౌర్జన్యాలా జ్వాలా?
న్యాయం కోసం ధర్మం కోసం సాగాలమ్మా మీలా?
నిరాశలా నిశీథులే నిరంతరం ఆవరించినా
ప్రభాతమై ప్రకాశమై ప్రశాంతమై సాగుమా

చేరాలమ్మా చేరాలమ్మా నీ గమ్యాన్నే నేడూ
సమరం మధ్య సంకోచాలా సందేహాలే వీడూ
నీ దారులే ఎడారులై ప్రాణాలతో ఆటలాడినా
సంకల్పమే సందేశమై సంఘర్షణై సాగుమా.
ఇదే నాంది ఘాతుకాల్ని గోతిలోన పాతడానికీ
ఇదే నాంది నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికీ
ఇదే నాంది గాయపడ్డ న్యాయసింహ గర్జనానికీ
ఇదే నాంది రాక్షసాన్ని కూల్చడానికీ.
భయపడితే భవిత లేనే లేదు
పిడికిలినే వీడరాదు
సమరములో సాహసాలే తోడు
వెనుకడుగే వేయరాదు
సవాలు కెదురుపడూ సయ్యంటు తిరగబడూ
సహించి నిలబడితే మార్పే రాదూ
దగాలు కుదరవనూ దిగాలు వదలమనూ
జగాన్ని మేల్కొలిపే తీర్పే నేడూ.
ఇదే నాంది కంటినీరు మంటలాగ మారడానికీ
ఇదే నాంది రక్తమోడ్చి కొత్తబాట వేయడానికీ
ఇదే నాంది చేవలేని శాసనాన్ని మార్చడానికీ
ఇదే నాంది ఒక్క ఉక్కు గుండె శక్తి చాటడానికీ.
- తిరునగరి శరత్‌ చంద్ర

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెర్సోప్ప జలపాతం
స్ప‌ర్శ‌లోంచి వ‌చ్చిన దృశ్యాలు
యువతా.. నీ దారెటు?
రాక్‌ బీచ్‌
ఏది సులువుగా దొరకదు
ధోలావిర...
చిత్రంలో చిత్రం...!!
అహిల్యబాయి కోట
కళాకృతులు
లేక్యున్‌ సెక్యా
కలాడియో జాతీయ పక్షుల పార్కు
సముద్ర కోట
నల్లపాముల గద్ద
దృశ్య క‌థ‌
శిధిలాల్లో ఒదిగిన పెరూరు చారిత్రక వైభవం
అల‌నాటి ప‌ల్లె...
ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అరుదైన పక్షి... అచ్చం కర్రపుల్లలా...
ముంగిట్లో ముత్యాలు
కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు...
రంగులే ప్ర‌తీక‌
కుట్టు పిట్ట...
బాల్యం మళ్లీ చిగురించాలి !
వింత గ్రామం
డ్యాన్సింగ్‌ ట్రీస్‌
బతకమ్మా! బ్రతుకు!
కాలగర్భంలో కలిసిపోతోన్న తెలంగాణ చారిత్రక నిర్మాణాలు
''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం''
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి
భారత స్వాతంత్రోద్యమం

తాజా వార్తలు

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.