Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం'' | కవర్ పేజీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ పేజీ
  • ➲
  • స్టోరి
  • Sep 04,2021

''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం''

తెలంగాణ మకుటం రామప్ప దేవాలయం. కాకతీయుల శిల్పకళకు నిదర్శనం ఈ ఆలయం. తెలంగాణ ప్రాంతంలో అనేక చెరువులు నిర్మించి వ్యవసాయాన్ని అభివద్ధి పరచిన కాకతీయులు శిల్పకళకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. వీటిలో స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన వేయి స్థంభాల గుడి, గణపతి దేవుని కాలంలో నిర్మించిన ఓరుగల్లు కోట, రామప్ప దేవాలయం ప్రముఖంగా చెప్పుకోదగినవి. రామప్ప శైవ సాంప్రదాయానికి చెందిన ఆలయం. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ సామాన్య శకం 1213 నాటి శాసనం ప్రకారం ఆలయాన్ని కాకతీయ గణపతి దేవుని సేనాపతి రేచర్ల రుద్రుడు నిర్మిస్తే, రామప్ప అనే శిల్పి రూపొందించాడు. అతని పేరుతోనే ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. కాకతీయుల పరిపాలనా కాలంలో తెలుగు నేలను సందర్శించిన ఇటలీ యాత్రికుడు మార్కోపోలో రామప్ప దేవాలయాన్ని ''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం'' అని వర్ణించాడు. ఈ దేవాలయంలో చెక్కిన పేరిణీ శివతాండవం నత్య శిల్పాలు చూసి నటరాజ రామకష్ణ కాలగర్భంలో కలిసిపోయిన ఆ నత్యాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఈ అద్భుతమైన దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కటం, తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి గర్వకారణం. ప్రజారంజక పరిపాలన అందించిన కాకతీయ ప్రభువులకు ఈ గుర్తింపు ఒక గొప్ప సత్కారం. ఈ దేవాలయంలోని గర్భాలయం తేలికైన ఇటుకలతో నిర్మితమ వ్వటం వల్లన అవి నీటి మీద కూడా తేలియాడుతాయి. అవి సామాన్య ఇటుకలతో పోలిస్తే కేవలం వాటిలో ఇరవై అయిదు శాతం మాత్రమే బరువు ఉంటాయి అని పరిశోధకుల అంచనా. దేవాలయాన్ని ప్రధానంగా ఎర్రని ఇసుక రాయితో నిర్మించారు. శిల్పాలు నల్లరాయితో నిర్మించారు. చివరి కాకతీయ రాజైన ప్రతాప రుద్రునికి ఢిల్లీ చక్రవర్తి ప్రతినిధి అయిన ఉలుఫ్‌ు ఖాన్‌ (ముహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌) మధ్య జరిగిన ఆరు నెలల భీకర యుధ్ధంలో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఈ ఓరుగల్లు ముట్టడిలో భాగంగా తురుష్కులు పరిసర ప్రాంతాల్లోని అనేక దేవాలయాలు ధ్వంసం చేశారు. ఈ సమయంలోనే ఢిల్లీ సైన్యాలు రామప్ప దేవాలయం మీద దాడి చేసి గుడిలో ఉన్న సంపదను కొల్లగొట్టి దేవాలయాన్ని పాడు చేశాయి. ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్‌గా మార్చారు. ఢిల్లీ పాలనలోకి వెళ్ళిపోయిన తెలంగాణ ప్రాంతం సాంస్కతిక విధ్వంసానికి గురయింది. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణాకు స్వాతంత్రం తీసుకురావటానికి ముసునూరి కాపయ నాయకుడు అనే మహావీరుడు ముందుకు వచ్చి పది సంవత్సరాలకు పైగా నిరంతర యుద్ధాలు చేసి చివరికి సామాన్య శకం 1336 ప్రాంతంలో ఓరుగల్లు కోటను జయించి తెలంగాణ ప్రాంతం నుండి ఢిల్లీ సుల్తానులను తరిమి వేశాడు. ఓరుగల్లు మహాచక్రవర్తిగా తెలంగాణ ప్రాంతాన్ని ముప్పరు సంవత్సరాలకు పైగా కాపయ పరిపాలించాడు. తురుష్కులు నాశనం చేసిన రామప్ప దేవాలయన్ని అభివద్ధి చేయటానికి విశ్వప్రయత్నం చేశాడు కాపయ. రామప్ప దేవాలయం పూర్తిగా కూలిపోకుండా ఈనాటికీ నిలబడి ఉంది అంటే ఆనాడు కాపయ నాయకుని కషి కూడా ఒక కారణం. కాపయ నాయకుని కుటుంబానికి చెందిన ప్రస్థుత వారసుడైన మాక్రోమీడియా డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత ముసునూరి రామకష్ణ ప్రసాద్‌ తన పూర్వీకుల చరిత్రను భావితరాలకు అందించటానికి విశిష్ట కషి చేస్తున్నారు. కాపయ నాయకుని తరువాత రామప్ప దేవాలయం బహమనీ, కుతుబ్‌ షాహీ, నిజాం పాలకుల ఏలుబడిలోకి వెళ్ళటం వల్ల ఏ మాత్రం అభివద్ధికి నోచుకో లేదు. కాకతీయ యుగంలో వైభవోపేతంగా వెలిగిపోయిన రామప్ప దేవాలయం ఆ స్థాయిని మళ్ళీ ఏ నాడూ అందుకోలేక పోయింది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఈ దేవాలయన్ని ప్రభుత్వాలు మరింతగా అభివద్ధి చెయ్యాల్సిన బాధ్యత ఉంది.
- యడ్లపల్లి అమరనాథ్‌, 9398245804

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెర్సోప్ప జలపాతం
స్ప‌ర్శ‌లోంచి వ‌చ్చిన దృశ్యాలు
యువతా.. నీ దారెటు?
రాక్‌ బీచ్‌
ఏది సులువుగా దొరకదు
ధోలావిర...
చిత్రంలో చిత్రం...!!
అహిల్యబాయి కోట
కళాకృతులు
లేక్యున్‌ సెక్యా
కలాడియో జాతీయ పక్షుల పార్కు
సముద్ర కోట
నల్లపాముల గద్ద
దృశ్య క‌థ‌
శిధిలాల్లో ఒదిగిన పెరూరు చారిత్రక వైభవం
అల‌నాటి ప‌ల్లె...
ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అరుదైన పక్షి... అచ్చం కర్రపుల్లలా...
ముంగిట్లో ముత్యాలు
కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు...
రంగులే ప్ర‌తీక‌
కుట్టు పిట్ట...
బాల్యం మళ్లీ చిగురించాలి !
వింత గ్రామం
డ్యాన్సింగ్‌ ట్రీస్‌
బతకమ్మా! బ్రతుకు!
కాలగర్భంలో కలిసిపోతోన్న తెలంగాణ చారిత్రక నిర్మాణాలు
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి
భారత స్వాతంత్రోద్యమం
స్నేహాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదేమో...

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.