Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లోపల కూడా తోటను పెంచుకోవచ్చు! | పోయెట్రీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • పోయెట్రీ
  • ➲
  • స్టోరి
  • May 01,2022

లోపల కూడా తోటను పెంచుకోవచ్చు!

బయటే కాదు
నీ లోపల కూడా నువ్వు ఒక తోటను పెంచుకోవచ్చు

అందుకు లోపల కొంచెం సారవంతమైన జాగా వుండాలి
లేదా నువ్వే ఏర్పాటు చేసుకోవాలి
చేతులకు మట్టి పని తెలియాలి లేదా నేర్చుకోవాలి
తెలిసీ లేదా నేర్చుకుని బయట పని చేస్తున్నపుడే
నీ లోపలి జాగాలో మట్టి కూడా చదునవుతుంది
మట్టి అసలే పట్టని వాళ్ళకు బహుశా లోపల జాగా
సంగతి కూడా తెలియక పోవచ్చు

బయట మట్టిని నువ్వో వానో తడిపే వేళల్లో నీ కళ్ళల్లోకి
రహస్యంగా చెమ్మ చేరుతుంది చెలిమిలా!
అపుడే నీ లోపలి మట్టి కూడా తడవుతుంది
అపుడే నీ వొంటి మొత్తానికి ఎంతో కొంత మెత్తదనం అబ్బుతుంది
అపుడే లోపల ఒక తోట రాబోతుందని
నీ మనసుకు ముందస్తు సమాచారం అందుతుంది
అందిన క్షణమే అది స్వాగత రంగవల్లులల్లుతుంది

బయట నువ్వు పూల మొక్కల సరసన కూర్చుని
వాటితో కళ్ళతో సంభాషించేటప్పుడు
అవి నిన్ను కరుణించే సంగతిని నువ్వు గుర్తించక పోవచ్చు
కరుణతో అవి నీ లోపలికి కొన్ని లేలేత కొమ్మల్ని
జారవిడుస్తాయి ఒడుపుగా
సరిగ్గా నీ లోపలి మట్టిలో నాటుకునేట్టుగా!

బయట గాలికి వొయ్యారంగా కదిలే రెల్లు సొగసును
నువ్వు చూసే తన్మయ ఘడియల్లో
నీ లోపల కూడా శాఖలూ ఆకులూ వూగుతూ చేసే
ఒక వింత సవ్వడిని నువ్వు వినక పోవచ్చు

నలుగురితో కూర్చుని నవ్వే వేళలోనో
నలుగురి కోసం నువ్వు నడిచే వేళలోనో
నాలుగు శుభాలోచనలు నీలో వెలిగే వేళలోనో
నీ లోపల కొమ్మలు విస్తరిస్తూ పోయే సజనాద్భుతాన్ని
నువ్వు వెంటనే పట్టుకోలేక పోవచ్చు

నువ్వు వాకిట్లోనో బాటల పక్కనో మళ్ల లోనో
మొక్కల్ని ఏకాగ్ర ధ్యాసతో నాటుతున్నపుడో
ఏ లేవలేని చేతులకో ఆసరా అవుతున్నపుడో
శిశువుల రేపటి కోసం ఒక పూల దారిని వేస్తున్నపుడో
నీ లోపల లతలు జనించి మెల్లగా అల్లుకుపోయే సంగతి
నువ్వు గబుక్కున గమనించకపోవచ్చు

నువ్వు పని గట్టుకుని ఏ వాగు దగ్గరికో,నది సన్నిధికో వెళ్లి
దాని దయాపూరిత దర్పణంలో చూసుకుంటూ
నిన్ను శుద్ధి చేసుకుంటూ నీ దోసిలిలోకి నిర్మల జలాన్ని తీసుకుని
గొంతులోకి వొంపుకుంటున్నపుడు
ఒక నీటి పాయ చటుక్కున నీ లోపలి తోటలోకి
మళ్ళే లలిత దశ్యాన్ని
నువ్వు వెంటనే దర్శించలేక పోవచ్చు

ఏ విపినానికో వెళ్ళినపుడు వెదురు వినిపించే అనాది గానం
నీ చెవిన పడుతుందనే విషయం నీకు తెలుస్తుంది కానీ
అది అటు నుంచి అటే సాగి నీ లోపలి తోటకు
అడవి పాటను నేర్పే సంగతి అప్పటికప్పుడు
అడవికి తెలుస్తుందేమో కానీ నీకు తెలియక పోవచ్చు

స్వీకరించే చేతులతోనే నువ్వు బహిః ప్రాణులకు
జీవన ద్రవ్యాలను ఇష్టంగా అందిస్తున్న సమయాల్లో
నీ లోపల దట్టంగా దర్పమెరుగని దర్భలు మొలకలెత్తి
తివాచీలుగా పరుచుకునే హరితోత్సవాన్ని
నువ్వు అప్పటికప్పుడు కాంచలేకపోవచ్చు

నువ్వు తీరిక వేళల్ని ఆటలుగా పాటలుగా మలుచుకుని
ఆకాశంలోకి పతంగిలా ఆహ్లాదయాత్ర చేస్తున్నపుడు
ఏ వర్ణమయ మనోజ్ఞ లోకాల నుంచో దిగొచ్చిన సీతాకోకలు
నీ లోపలికి వాలి తోటను అలంకరించే కళాకార్యాన్ని
నువ్వు వెంటనే కనిపెట్టలేకపోవచ్చు

కానీ
ఒక వసంతోదయాన నువ్వు వూరి బయట తోట ముందు
ఖాళీ చేతులతో నిల్చుని ఒక పువ్వునూ, ఒక పాటనూ
భిక్షగా అడిగినపుడు తోటను పాడిస్తున్న
కోయిల నీతో రాగ భాషలో అంటుంది కదా!
''నీలో ఒక తోట వుంది, తెలియదా
నేనూ అపుడపుడు వొచ్చి పాడాను కూడా,
నీకు నువ్వే సమద్ధివి, మరి భిక్షనెందుకు అడుగుతావు?''

అపుడు నువ్వు ఆశ్చర్య చిత్తంతో చేతుల్ని చూసుకుంటావు
మట్టి జాడలగుపడుతాయి,
వడివడిగా నువ్వు నీ లోపలికి వెళ్ళీ వెళ్ళగానే
ఫల పుష్ప భరితమైన తోట నిన్ను పలకరిస్తుంది
పరవశంతో నువ్వు పాటెత్తుకుంటావు

పాడుతూంటే అపుడు నీకు అర్థమవుతుంది
తోట నీకు చెందడం కాదు
నువ్వే తోటకు చెందుతావని!

- దర్భశయనం శ్రీనివాసాచార్య,
  94404 19039

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాదోం కీ బరాత్‌..
నిశీధి కాంతులు
తప్పెవరిది
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌
పునరావాసం
అస్తమించని ప్రభాకరుడు
గాజుబొమ్మ
వేకువ పువ్వు పూసేదాకా ..!
అక్షర సమరం
బడి గీతం
వెన్నెలవి నువ్వు
అనుభవాల జీవితం
వింత వస్తువు
మనిషిని చూడాలని కోరిక
మరో పాత జీవితం
త్యాగాల గానం
ఒక దేశద్రోహి మరొక ప్రాంతీయ శత్రువు
పెదవితోటలో మాట కోసం
యాంటీ వైరస్‌..!!
పుస్తకం...
రైతక్క పేరు లేదు
అంతా సముద్రమే చెబుతుంది...
నేను... పుడమి.
ప్రభంజనమై
కుందుర్తికి శతజయంతి కవితాంజలి
వెలగాలంటే...
ఆ టేపు రికార్డర్‌
ఆలోచనల పడవ
మంచు తాకిన పదం
'కౌలు' గోడు

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.