Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నీల పుల్ల | పోయెట్రీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • పోయెట్రీ
  • ➲
  • స్టోరి
  • Jul 31,2022

ఎన్నీల పుల్ల

ఆకాశ మైదానమంతా చంద్రుడొక్కడే
ఆడుకొంటున్నడు
ఏవో ఏవో బాణాలు విడుస్తూ
ఎవరి కెవరికో గాయాలు మండిస్తూ
ఊష్ణ గోళాలని రగిలిస్తూ
ఒక్కోసారి-
శీతల మండలాలని విసిరేస్తూ
మరొకసారి-
విచిత్రంగా...
వినూత్నంగా...
విచ్చలవిడిగా...
మబ్బుల కందేల్లు ఆ ధాటికి మాయం
చుక్కల సీతాకోకలు ఆ వరవడికి దూరం
పహరా ఫెన్సింగ్‌ వున్నదనీ,
మరో దురుసు పురుగైనా దూరలేదనే ధీమా నేమో
ఇష్టారాజ్యానికి చక్రవర్తిగా చెలరేగిపోతున్నడు
చీమ చిటుక్కుమంటే
పిక్కటిల్లే దిక్కులు కూడా
మూతి బిగించి, సుమతీ పద్యాలు మననం
చేసుకొంటున్నయి
గగనానికి రాజులుంటరా
ఏకఛత్రాధిపత్యాలుంటయా
మనో సీమల ఆహ్లాదపరిచే వెన్నెల
స్టెన్‌ గన్‌లా నిలువరించటం
చారిత్రాత్మక విచిత్రమేమో
కాల మార్పుల విజృంభణమేమో
ప్రేయసీ ప్రియుల మధ్య దూరి
చక్కిలి గింతలకు చంద్రకాంతుల పన్నీరు లేదే
డాబామీద కొత్తజంట విహారాలకు
వసంతాల వెన్నెల పవనాలు లేవే
అడవిలో పూచే గోగుపూల పరిమళాలకు
వెన్నెల వాకలు లేవే
ఉయ్యాల్లో పాప నోటినిండా నవ్వుకు
చెంపలు ముద్దాడే లేత శశి కిరణం లేదే
విల్లంబులు ధరించిన కోయపిల్ల పోరాటానికి వెన్నెల శంఖారావం లేదే
వేకువా, వెలుగూ, మిరుమిట్ల బాణసంచా బాగానే
అరివీర భయంకరాలూ, హుంకారాలు,
బతుకుపై కత్తి వాదరలు బాగానే
చలనాలు, చైతన్యాలు నుయ్యిలోకో, గొయ్యిలోకో
తెలియడం లేదు
మనిషితనం తల వంచుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందో
జాడ జవాబు దొరకదు
కరెంట్‌ స్తంభమేదో పచ్చని వేపగున్న యేదో
కనిపెట్టడానికి మస్తిష్కం మాయకు గురౌతున్నది
చేతిరాతల పద్యానికి అలవాటు పడ్డ వాళ్ళం
లాషిగా పిల్చుకొని, బడబడా నవ్వుకున్న వాళ్ళం
జందెం పోగుల్ని అగ్గి పొగలకు ఆహుతిచ్చిన వాళ్ళం
కడప దాటి సోంచాయించిన వాళ్ళం
కడుపాకలి తెలిసి, నడుం బిగించినం, గజ్జె గట్టినం
చంద్రుడంటే వెన్నెల
వెన్నెలంటే చంద్రుడు
గుర్తుకు రావాలె
వెన్నెల జలపాతంలో లోకం పాపాయిలా చెంగలించాలె

చిన్నప్పటి ఆట
అప్పుడు వేసిన వేషం
మళ్ళా వేద్దాం
తలపై రుమాలు
జబ్బ పై గొంగడి పేగు
చేతిలో ఎన్నీల పుల్ల

జుట్టు విరబోసుకున్న నిశికాయంపై
పుల్లాడిస్తూ....

- దాసరాజు రామారావు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనోబలాన్ని గుండెల్లో లిఖించాలి
సమానత్వపు పద్యం
నండూరి ఎంకి
యాదోం కీ బరాత్‌..
నిశీధి కాంతులు
తప్పెవరిది
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌
పునరావాసం
అస్తమించని ప్రభాకరుడు
గాజుబొమ్మ
వేకువ పువ్వు పూసేదాకా ..!
అక్షర సమరం
బడి గీతం
వెన్నెలవి నువ్వు
అనుభవాల జీవితం
వింత వస్తువు
మనిషిని చూడాలని కోరిక
మరో పాత జీవితం
త్యాగాల గానం
ఒక దేశద్రోహి మరొక ప్రాంతీయ శత్రువు
పెదవితోటలో మాట కోసం
యాంటీ వైరస్‌..!!
పుస్తకం...
రైతక్క పేరు లేదు
అంతా సముద్రమే చెబుతుంది...
నేను... పుడమి.
ప్రభంజనమై
కుందుర్తికి శతజయంతి కవితాంజలి
వెలగాలంటే...
ఆ టేపు రికార్డర్‌

తాజా వార్తలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.