Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్త ఫించ‌న్ డ‌బ్బులొచ్చేశాయ్‌ | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

కొత్త ఫించ‌న్ డ‌బ్బులొచ్చేశాయ్‌

- తాజాగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- నేటి నుంచి గ్రామాల వారీగా పంపిణీకి శ్రీకారం
- ఉమ్మడి జిల్లాలో 70,613మందికి ప్రయోజనం
           ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పింఛన్‌దారుల డబ్బులు విడుదలయ్యాయి. ఎట్టకేలకు లబ్దిదారుల నిరీక్షణ ఫలించనుంది. దసరా పండుగ ముందర తీపి కబురు అందించింది. ఇటీవల నూతన పింఛన్‌ కార్డులు పొందినప్పటికీ డబ్బులు అందజేయలేదు. తాజాగా ప్రభుత్వం వారందరికీ డబ్బులు అందజేసేందుకు జిల్లాల వారీగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పింఛన్‌ డబ్బులను ఆయా జిల్లాలో శుక్రవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. మున్సిపాలిటీల్లో బ్యాంకుల ద్వారా పింఛన్లు అందజేయగా.. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్‌శాఖ అందజేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని కొత్త పింఛన్‌దారులు వారి పరిధిలోని బీపీఎంల వద్ద కొత్త బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. తాజాగా 57ఏండ్లు నిండిన వారితో పాటు వివిధ రకాల పింఛన్లకు అర్హులైన వారికి కూడా మంజూరుచేయడంతో లబ్దిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్త పింఛన్‌దారులు 70,613మందికి ప్రయోజనం చేకూరనుంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
           రాష్ట్ర ప్రభుత్వం 64 ఏండ్లు నిండిన వృద్ధులతో పాటు వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులతో పాటు ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఆసరా పేరిట పింఛన్లను అందజేస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.వెయ్యి చొప్పున అందజేయగా..రెండోసారి అధికారంలోకి వచ్చాక వీటిని రెట్టింపు చేసింది. వీటితో పాటు పింఛన్ల వయసును కూడా కుదించింది. 57ఏండ్లు నిండిన వారికి కూడా పింఛన్లు అందజేస్తామని ప్రకటించింది. దీంతో అనేక మంది లబ్దిదారులు దరఖాస్తులు చేశారు. కానీ ప్రభుత్వం వీటిని మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. దాదాపు మూడేండ్లుగా వీటి కోసం లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. దరఖాస్తులు చేసిన కొందరు తాజా పింఛన్‌ డబ్బులు తీసుకోకుండానే మరణించిన సందర్భాలున్నాయి. 57ఏండ్లు నిండిన వారితో పాటు భర్తలను కోల్పోయిన వారు, ఒంటరి మహిళలు, వికలాంగులు అనేక మంది అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తులు చేసినా ప్రభుత్వం మంజూరుచేయలేదు. తీవ్ర ఆలస్యం కావడంతో లబ్దిదారులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నెల రోజుల క్రితం ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూచేయడంతో పాటు అర్హులైన వారికి పింఛన్‌ కార్డులు కూడా అందజేసింది. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో వారు పింఛన్‌ డబ్బులు అందుకోలేకపోయారు.
ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ
           దాదాపు మూడేండ్లుగా ఎదురుచూసిన లబ్దిదారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించనుంది. నూతనంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 15,474మందికి, కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లాలో 13,436మందికి, మంచిర్యాల జిల్లాలో 22,127మంది, నిర్మల్‌ జిల్లాలో 19,576మందికి మంజూరయ్యాయి. ప్రభుత్వం కొత్త పింఛన్‌దారులకు డబ్బులు విడుదల చేయడంతో అనేక మంది నిరుపేదలకు లబ్ది చేకూరనుంది. ఇన్నాండ్లు ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టిసారించకపోవడంతో అనేక మంది అర్హులైన వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధాప్యం మీదపడటంతో కనీసం పనిచేసుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. నెలవారీ మందులు, ఇతర చిన్న చిన్న అవసరాలకు చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. ముఖ్యంగా భర్తను కోల్పోయి దుఖంలో ఉన్న వితంతువులకు ఆర్థిక అండ లేకుండా పోయింది. వీరితో పాటు వివిధ శరీర అవయవాలు పనిచేయకపోవడంతో ఇతర పనులు చేసుకోలేని అనేక మంది వికలాంగులు కూడా ఆర్థిక సమ స్యలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వీరి పట్ల కనికరం చూపడంతో ప్రతి నెలా వికలాంగులు రూ.3016చొప్పున, వృద్దులు, ఇతర పింఛన్‌దారులు రూ.2016 చొప్పున అందుకోనున్నారు. కొత్త పింఛన్‌ డబ్బులను ఆయా జిల్లాలో నేటి నుంచి లబ్దిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి లబ్దిదారులకు అందజేస్తాం : జాదవ్‌ శేషారావు, ఏపీఓ పింఛన్‌, ఆదిలాబాద్‌
           ప్రభుత్వం 57ఏండ్లు నిండిన వారితో పాటు వివిధ అర్హతలు కలిగిన వారికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఇటీవల పింఛన్‌కార్డులు కూడా అందజేశాం. ప్రస్తుతం వారందరికీ ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. వీటిని మున్సిపాలిటీ, గ్రామాల వారీగా నేటి నుంచి లబ్దిదారులకు అందజేస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత లబ్దిదారులు వారి పరిధిలోని బీపీఎంల వద్ద ఆధార్‌కార్డు, పింఛన్‌ఐడీ, రెండు పాస్‌ఫోటోలతో నూతన బ్యాంకు ఖాతా తెరవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం
జాతిపితకు ఘన నివాళి
పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్‌గా ఉండాలి
గని కాలపరిమితి పెంచాలి
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అచరించాలి
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులు
క్రీడల్లో రాణించేందుకు గిరిజన విద్యార్థులకు చేయుతనిస్తాం
సింగరేణి ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
గాంధీజీ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
ఘనంగా గంగనీళ్ల జాతర
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
అందరి క్షేమం కోసమే కార్డెన్‌ సెర్చ్‌
సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలి
మున్సిపల్‌ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం
మన ఊరు-బడి పనుల్లో వేగం పెంచాలి
అంగన్‌వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ముగిసిన నాలుగు రోజుల శిక్షణ
సీపీఎస్‌, ఎన్‌ఈపీను రద్దు చేయాలి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ కృషి
దిగుడుపై...దిగాలు ధ‌ర‌పైనే ఆశ‌లు
మస్కాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
తీగ లాగితే..డొంక కదిలేనా..?
సహకార సంఘం కార్యాలయంలో మహాసభ సమావేశం
ఆటపాటలతో అలరించిన బతుకమ్మ వేడుకలు
రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం

తాజా వార్తలు

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.