Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బియ్యం రాకున్నా వ‌చ్చిన‌ట్టే | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

బియ్యం రాకున్నా వ‌చ్చిన‌ట్టే

- ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో భారీ కుంభకోణం
- తప్పుడు రికార్డులతో రూ.2కోట్లకు పైగా స్వాహా
- రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలో వెలుగులోకి
- ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు
- అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో విస్తృత తనిఖీలు
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
            కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎంఎల్‌ఎస్‌ (మండల్‌ లెవల్‌ స్టాక్‌) పాయింట్‌లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులు ఈ అవినీతి భాగోతానికి తెర తీశారు. రైస్‌ మిల్లు నుండి బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు సరఫరా కాకున్నా సరఫరా జరిగినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఏకంగా రూ.2కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేశారు. ఇది రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వచ్చి తనిఖీ చేసే వరకు కూడా బయటకు రాకపోవడం గమనార్హం. వారం రోజుల క్రితం హైదరాబాద్‌ నుండి వచ్చిన రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో తనిఖీలు చేపట్టింది. రికార్డులు సక్రమంగా లేకపోవడం, రికార్డులకు తగ్గట్లుగా బియ్యం నిల్వలు లేకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దీనిపై 24 గంటల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులు సత్వరమే విచారణ చేపట్టగా 8,400 క్వింటాళ్ల బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో తక్కువగా ఉన్నట్లు తేలింది. వాస్తవానికి ఈ బియ్యం రైస్‌ మిల్లు నుండి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కే సరఫరా కాలేదని విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. దీంతో వెంటనే ఉన్నతాధికారులు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి గోపినాథ్‌ను సస్పెండ్‌ చేశారు.
ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత?
            ఈ భారీ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత అనే విషయంలో జోరుగా చర్చ సాగుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని బాధ్యుడిని చేసి సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు దీని వెనుక అసలైన సూత్రదారులు ఎవరనే విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరముంది. జిల్లాలోని రైస్‌ మిల్లుల నుండి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లకు బియ్యం సరఫరా చేస్తారు. ప్రతి రైస్‌ మిల్లు నుండి ఎంత మేర బియ్యం సరఫరా చేయాలనేది ముందుగానే నిర్దేశిస్తారు. ఆ నిర్దేశం మేరకు ఆయా రైస్‌ మిల్లర్లు తమకు కేటాయించిన ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు నేరుగా బియ్యం సరఫరా చేస్తారు. ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సిర్పూర్‌(టి) మండలంలో ఉన్న ఒక రైస్‌ మిల్లు నుండి బియ్యం సరఫరా జరుగుతోంది. ఈ రైస్‌ మిల్లు నుండే బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు సరఫరా చేయకపోయినా, సరఫరా చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. ఈ రికార్డులను జిల్లా పౌరసరఫరాల అధికారి, జాయింట్‌ కలెక్టర్‌లు వెరిఫై చేసిన తర్వాతే సదరు రైస్‌ మిల్లు యజమానికి బిల్లు చెల్లింపు జరుగుతుంది. లెక్కల్లో లేని 8,400 క్వింటాళ్లకు సంబంధించిన బియ్యం బిల్లులు రూ.2కోట్లకు పైగా అధికారులు ఇప్పటికే చెల్లించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు కూడా తనిఖీలు చేపట్టకుండా బిల్లుల చెల్లింపు ఎలా చేశారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. తప్పుడు రికార్డులు సృష్టించి బిల్లు కాజేయడంలో రైస్‌ మిల్లు యజమాని పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు సరఫరా అయ్యే బియ్యం, రైస్‌ మిల్లర్లకు చెల్లించిన బిల్లుల వివరాలను అందజేయాలని గతేడాది డిసెంబర్‌ నుండి ఇప్పటి వరకు జాగృతి యువమంచ్‌ వ్యవస్థాపకులు ఎండి అష్రఫ్‌ మూడు సార్లు దరఖాస్తు చేశారు. అయినా సమాచారం ఇవ్వలేదు. నాలుగు సార్లు జిల్లా కలెక్టర్‌కు కూడా అప్పీలు చేసుకున్నారు. అయినా దీనిపై ఎలాంటి విచారణ జరపకపోవడం పట్ల సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అన్ని పాయింట్లలో విస్తృత తనిఖీలు
            ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఉదంతంతో నిద్ర నుండి మేల్కొన్న అధికారులు జిల్లాలోని ఐదు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో విస్తృత తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా మండలాల తహసీల్దార్‌లను విచారణాధికారులుగా నియమిస్తూ ఈ నెల 27న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో రెబ్బెన తహసీల్దార్‌, జైనూర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో సిర్పూర్‌(యు) తహసీల్దార్‌, కాగజ్‌నగర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఆసిఫాబాద్‌ తహసీల్దార్‌, సిర్పూర్‌(టి) ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌, బెజ్జూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో చింతలమానెపల్లి తహసీల్దార్‌లు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు తనిఖీ చేశారు. బియ్యం నిల్వలను పరిశీలించారు.
ఎంఎల్‌ఎస్‌. పాయింట్‌ ఇన్‌చార్జి గోపీనాథ్‌ సస్పెండ్‌
            ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డ ఎం.గోపీనాథ్‌ను విధుల నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న రెబ్బెన తహసీల్దార్‌తో సహా పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం నిల్వల్లో తేడా అధికంగా ఉండడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బియ్యం కుంభకోణం వాస్తవమే : ఆర్‌.రాజేశం, జాయింట్‌ కలెక్టర్‌
            ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో జరిగిన బియ్యం కుంభకోణంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేశాం. రికార్డుల తనిఖీలో 8,400 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం
జాతిపితకు ఘన నివాళి
పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్‌గా ఉండాలి
గని కాలపరిమితి పెంచాలి
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అచరించాలి
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులు
క్రీడల్లో రాణించేందుకు గిరిజన విద్యార్థులకు చేయుతనిస్తాం
సింగరేణి ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
గాంధీజీ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
ఘనంగా గంగనీళ్ల జాతర
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
అందరి క్షేమం కోసమే కార్డెన్‌ సెర్చ్‌
సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలి
మున్సిపల్‌ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం
మన ఊరు-బడి పనుల్లో వేగం పెంచాలి
అంగన్‌వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ముగిసిన నాలుగు రోజుల శిక్షణ
సీపీఎస్‌, ఎన్‌ఈపీను రద్దు చేయాలి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ కృషి
దిగుడుపై...దిగాలు ధ‌ర‌పైనే ఆశ‌లు
మస్కాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
తీగ లాగితే..డొంక కదిలేనా..?
సహకార సంఘం కార్యాలయంలో మహాసభ సమావేశం
ఆటపాటలతో అలరించిన బతుకమ్మ వేడుకలు
రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.