Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ అర్బన్‌
           జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి సీపీఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్ముడు గాంధీజీ అని అన్నారు. స్వాతంత్య్ర అనంతర మతదురహంకారి గాడ్సే చేతిలో హతమయ్యారని అన్నారు. ప్రస్తుతం దేశంలో గాడ్సే వారసులే రాజ్యమేలుతున్నారని, హింసాద్వేషాలు రగిలిస్తూ దేశ విభజన నాటి పరిస్థితులను సృష్టి స్తున్నారని అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ బడా కార్పొరేట్‌ సంస్థలకు దేశాన్ని దోచిపెడ్తున్నారని తెలియజేశారు. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ అన్ని రాజ్యాంగ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకొని దేశంలో రాక్షస పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి కంకణ బద్దులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అరుణ్‌ కుమార్‌, రతన్‌, దేవిదాస్‌ పాల్గొన్నారు.
నిర్మల్‌:గాంధీజీ చూపిన బాటలో పయనిద్దామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గాంధీజీ చూపిన బాటలోనే సీఎం కేసీఅర్‌ అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తూ, గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్‌ కొరిపల్లి విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కడెం :మండలంలోని నచ్చన్‌ ఎల్లాపూర్‌లో గాంధీ జయంతి సందర్బంగా గాందీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ బొడ్డు గంగన్న మాట్లాడుతూ స్వచ్ఛతకు మీవంతు కృషి చేయాలని, ఇంటి పరిసరాలను, నీటి వనరులను శుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు లేని వారు నిర్మించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బొడ్డు గంగన్న, కార్యదర్శి రమాదేవి, ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కిషన్‌ నాయక్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కమలాకర్‌, కారొబారి మహేందర్‌, స్పందన స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్‌ వెంకటేష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.
కడెం:మండలంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని ధర్మాజిపేట్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ ఓర్స వెంకటేష్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా గాందీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబారిపేట్‌ గ్రామంలో సర్పంచ్‌ లక్ష్మి లచ్చన్న ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మండలంలోని నవాబ్‌పేట్‌ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడారు. అందరు కూడా గాంధీ మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు, ఉపసర్పంచ్‌ అవునూరి రాజేష్‌, టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ జక్కుల శ్రీను వార్డు సభ్యులు, వీఓ లీడర్స్‌ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముధోల్‌:మండలంలోని ఆయా గ్రామాల్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయంలో, వివిధ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగించి శ్రమదానం చేశారు. ఆయా గ్రామపంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అఫ్రోజ్‌ ఖాన్‌, ఎంపీడీఓ సురేష్‌ బాబు, సర్పంచ్‌ వెంకటాపూర్‌ రాజేందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఎండీ అసిఫ్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఖాలీద్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
కాసిపేట:మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదివారం గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, వైస్‌ ఎంపీపీ పూస్కూరి విక్రందావు, ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఎంపీఓ నాగరాజు, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్‌, అక్కెపల్లి లక్ష్మీ, ఉప సర్పంచ్‌లు బోయిని తిరుపతి, పిట్టల సుమన్‌, ఆగ్గి సత్తయ్య, భూక్య రాంచందర్‌, అట్టిపల్లి శ్రీనివాస్‌, అక్కిపల్లి బుగ్గ రాజు, ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మంచిర్యాల:జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆ మహనీయుని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, జిల్లా కలెక్టర్‌ భారతి హోలీకేరి అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్‌లో గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా కలెక్టర్‌ భారతి హోలికేరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్య్రాన్ని అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. అహింస మార్గంలో తెల్లదొరలని తరిమికొట్టిన అఖండ భారతావనికి విముక్తి కలిగించిన అహింసావాది గాంధీజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ పెంట రాజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ పల్లె భూమేష్‌, నడిపల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌ విజిత్‌రావు, కమిషనర్‌ బాలకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్‌ ఎర్రం తిరుపతి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు పల్లపు తిరుపతి, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వాంకిడి:మండలకేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆదివారం మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. అందరూ మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని, ఆయన చూపిన స్పూర్తితో ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నారాయణ, నాయకులు భీంరావు, శంకర్‌, కిషన్‌ పాల్గొన్నారు.
వేమనపల్లి :మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని ఎంపీపీ ఆత్రం గణపతి గాంధీజీ చిత్రపటానికి పులామాలలువేసి నివాళులర్పించారు. అదేవిధంగా గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించి, గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అల్లూరి లక్ష్మయ్య, ఎంపీఓ శ్రీపతి బాపురావు, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆకుల లక్ష్మీనారాయణ, కంప్యూటర్‌ ఆపరేటర్లు సునీల్‌, రాజు కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్‌:నస్పూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం జాతిపిత, మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మున్సిపల్‌ చైర్మెన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, కౌన్సిలర్లు పంబాల గంగ ఎర్రన్న, భౌతు లక్ష్మి, బెడిక లక్ష్మి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
దిలావర్‌పూర్‌:మండల కేంద్రంలోని సర్పంచ్‌ వీరేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వీరేష్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌, అనీల్‌, కొప్పుల శ్రీనివాస్‌, యూసుఫ్‌, కట్కం రాజారెడ్డి, శైలేశ్వర్‌, బోజరామ్‌ పటేల్‌, కుంట గంగారెడ్డి, నామయి సాయన్న, కుర్మే ముత్యం, మెట్టు రాజు, హరి పటేల్‌, జగన్‌, వినోద్‌ రెడ్డి, రాజు, సంతోష్‌, కుంట శ్రీను పాల్గొన్నారు.
నార్నూర్‌:మండలంలోని తాడిహత్నూర్‌, నాగల్‌ కొండా, మాన్కాపూర్‌ తదితర గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో గాంధీ జయంతినీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడిహత్నూర్‌ గ్రామంలో పదో తరగతి 2000 బ్యాచ్‌కు సంబందించిన పూర్వ విద్యార్థుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీచౌక్‌ వద్ద మహనీయుడికి గ్రామస్తులు పూర్వ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ విష్ణు, గ్రామ మార్కెట్‌ కమిటీ సభ్యుడు కోటగిరీ విశాల్‌, పూర్వ విద్యార్థులు చకొర్‌ శివాజీ, సుభాష్‌, దిలీప్‌, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్‌ :జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల కరుణాకర్‌, టిప్పు సుల్తాన్‌ యూత్‌ అధ్యక్షుడు వసీం ఖాన్‌ అన్నారు. తోషంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్వంలో గుడిహత్నూర్‌లో టిప్పు సుల్తాన్‌ యూత్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం మహాత్ముని సేవలను స్మరించుకున్నారు.
ఆదిలాబాద్‌రూరల్‌:మండలంలోని తంతోలి, అర్లి, చించుఘాట్‌, అంకోలి, చాందా(టి), యాపల్‌గూడ, ఆయా గ్రామాల్లో ఆదివారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌ మడవి లక్ష్మి మాట్లాడుతూ గాంధీ కలలు నిజం చేయాలన్నారు. గాంధీ అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, వినోద్‌, శ్యామ్‌ రావు, ఎంపీటీసీ జంగుబాపు, ఉప సర్పంచ్‌ జగదీష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద:మండలంలో మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ అడ్వాల పద్మ రమేష్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో చెత్తని తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. పొట్టపెల్లి (కె) గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని సర్పంచ్‌ ఉల్వాజీ హైమావతి ఆధ్వర్యంలో వీధులను శుభ్రం చేశారు. మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, ఎంపీడీఓ శేఖర్‌, ఎంపీఓ నసీరుద్దీన్‌, ఎంపీఓ ప్రమీల, ఏపీఓ వాణిశ్రీ, ఎంపీటీసీలు అనిత సురేష్‌, నర్సారెడ్డి, గణేష్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జాతిపితకు ఘన నివాళి
పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్‌గా ఉండాలి
గని కాలపరిమితి పెంచాలి
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అచరించాలి
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులు
క్రీడల్లో రాణించేందుకు గిరిజన విద్యార్థులకు చేయుతనిస్తాం
సింగరేణి ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
గాంధీజీ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
ఘనంగా గంగనీళ్ల జాతర
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
అందరి క్షేమం కోసమే కార్డెన్‌ సెర్చ్‌
సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలి
మున్సిపల్‌ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం
మన ఊరు-బడి పనుల్లో వేగం పెంచాలి
అంగన్‌వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ముగిసిన నాలుగు రోజుల శిక్షణ
సీపీఎస్‌, ఎన్‌ఈపీను రద్దు చేయాలి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ కృషి
దిగుడుపై...దిగాలు ధ‌ర‌పైనే ఆశ‌లు
మస్కాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
తీగ లాగితే..డొంక కదిలేనా..?
సహకార సంఘం కార్యాలయంలో మహాసభ సమావేశం
ఆటపాటలతో అలరించిన బతుకమ్మ వేడుకలు
రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం
బియ్యం రాకున్నా వ‌చ్చిన‌ట్టే

తాజా వార్తలు

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.