నవతెలంగాణ-కంఠేశ్వర్
కన్నీళ్లకు స్సేహహస్తం చాచడం కఠినమైందా? అనే మీమాంసలో ఇప్పటి ఈతరం కూడా ఆలోచన రహితంగా శూన్యంలోకి చూస్తే సమా జానికి అతీగతీ లేకుండా పోతు ందనే కలాల మధ్య నిరంతరం నలుగుతూ పేదల కలల్ని మనం కూడా మార్చ లేమా? అనే ప్రశ్నకు తనకు తానే సంపాదించుకున్న ఓ ఆధునిక వర్తమాన కవి, అలసిన అక్షరాల మధ్య నలిగే ప్రపంచానికి వెలుగుచూపే ప్రయత్నమే ''ఈ గోసంగిలు ఎవరు''. వారి జీవనశైలి ఎలాంటిది.. అని ఈ తరానికి పరిచయం చేసే క్రమమే ఈ పుస్తకం. దీనిని ముందుకు తెచ్చిన అభ్యుదయ కవి గనిశెట్టి రాములు. ఇంటిపేరులానే గని ఉన్నది కాస్తా అది గన్‌గా మారి వేసిన ప్రశ్నే గోసంగీల చరిత్ర.
నిరుపేద కుటుంబంలో జన్మించిన రచయిత తన కులాల వారసత్వాలను కూలంకషంగా చూడటం, వారికి జరుగుతున్న అన్యాయాలను గమనించడం వలన తాను నిలదొక్కుకుని ఉన్నతాధికారిగా పనిచేసినప్పటికీ అసమానతల మధ్య నలిగిన కులాల చరిత్రను పరిశీలించి ప్రయోగాత్మక సిద్ధాంతంగా పంచే క్రమంలో ''గోసంగిలు ఎవరు'' చీకటి బతుకుల్లో గోసంగిలు అనే పుస్త కాలను సమాజం ముందుకు తెచ్చారు. దళిత సాహితీవేత్తల ఆలోచనలు, వారి సూచనలు తీసు కుని ద్రవ్య శ్రవణ గీతంగా దీవాంతాల రేఖల్ని అధిగమిస్తూ ఈ అద్భుత సామాజిక పుస్తకానికి రూపకల్పన చేశారు.
అసలు గోసంగిలు ఎవరు? వారి జీవన వృత్తి ఏమిటి? వారి సంప్రదాయం, నాగరికత ఎలాంటిది? వారు నిత్యం చేసే పనులేంటి? అనే ఊహాజనిత ప్రేరణలకు శ్రీకారం చుడుతూ కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రచయిత. దీనికి ఉత్ప్రేరకాలుగా చిందుల ఎల్లమ్మ, జాంభవ పురా ణం, శూద్రవర్ణన, అస్పృశ్యులెవరు, ఆముక్త మాల్య ద లాంటి పుస్తకాలను తీసుకోని గోసంగిల చరిత్ర కు పాదులు వేశానని రచయితే చెప్పుకున్నారు!
జానపద కళా రక్షకులు గోసి, గీత జీవనోపాధి కోసం హార్మోనియం, తాళాలు, మద్దెల, దమికి, సితార, తంబూర సహాయంతో పల్లెల్లో రామాయణ, భారత, భాగవత, బొబ్బిలి యుద్దం, పల్నాటి యుద్దం, జగదేకవీరుని కథ, అల్లూరి సీతారామరాజు, కాటమరాజు, అంబేద్కర్ కథలను బుర్రకథ రూపంలో చెప్పడం వీరి ప్రత్యేకత. శారదకాళ్లు గోసంగీలుగా వీరు సమాజానికి సుపరిచితులే. కళలను ఆశ్రయంగా జీవించే కులంగా చెప్పబడ్డది. ప్రజల వద్ద భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీరి పరిస్థితి నేటికి దారుణంగానే ఉన్నది. వీరి జీవితాలను బాగుపరిచే కార్యక్రమాలు ఇప్పటికీ జరగడం లేదు. ఊరికి చివర నివాసం, అంటరానితనం, చెట్లకింద జీవితం, చౌరస్తాలలో కథలు చెప్పడం వీరి నిత్య కృత్యం. ఇలాంటి అణిచివేయబడ్డ, అసమానతలకు, వివక్షకు గురి అవుతున్న గోసంగిల జీవనశైలి మార్చడంలో కవి అనేక ఉదాహరణలతో కూడిన విశ్లేషణను ఇందులో పొందుపర్చారు. మాదిగకు పర్యాయ పదంగా గోసంగీ లను పరిగణిస్తారని విశ్లేషిం చారు రచయిత. జాంభవంతుని 100 కుమారుల్లో పెద్దవాడు గోసంగి.
వెలివేతకు గురైన జీవితాలు, హీనమైన స్థితిగతులు, దేశదిమ్మరి తనం, జీవనోపాధికి అనేక మార్గాలను దిద్దుకోవడంతోనే సరిపో యింది. వీరికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని, విద్య, వైద్య, సాంఘీక, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వీరికి పెద్దపీట వేయాలని, ఉద్యోగ, ఆరోగ్య, జీవన, రక్షకలిగించినపుడే వీరిలో మార్పు వస్తుందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో వీరి కోసం ప్రయత్నించిన నాడే గోసంగీల రాత మారుతున్న రచయిత ఆశావాహ దృక్పథాన్ని అంగీకరిద్దాం. వారి అభ్యున్నతి పెరగాలని ఆకాంక్షిద్దాం. గోసంగీల చరిత్ర భవిష్యత్‌లో మారుతుందని విశ్వసిద్దాం.
- సమీక్షకులు :పడాల రామారావు
కవి, రచయిత, సామాజికవేత్త
సాహితీ విమర్శకులు
సెల్ నం.9848833081
Authorization