Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ

అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా (ఏఐసీ)తో భాగస్వామ్యం చేసుకుని కనీస మద్దతు ధర హామీని విస్తరిస్తోన్న సిన్జెన్టా ఇండియా వెజిటెబుల్‌ సీడ్స్‌

గుంటూరు మార్కెట్‌లో మే 2022లో 2వేల మంది రైతులతో పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులను కాపాడే ప్రభావంతమైన మార్గంగా నిలుస్తుంది

గుంటూరు, 22 జూన్‌ 2022 : చిన్న, సన్నకారు రైతులకు తగిన సాధికారితను అందించడంతో పాటుగా ఊహాతీత మార్కెట్‌ పరిస్ధితుల కారణంగా ఎదురయ్యే మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి వారిని కాపాడే వినూత్న ప్రయత్నంలో భాగంగా సిన్జెన్టా ఇండియా ఇప్పుడు అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా (ఏఐసీ)తో ప్రత్యేకమైన ఒప్పందాన్ని గుంటూరులోని మిర్చి పంట రైతుల కోసం చేసుకుంది. ఈ ఒప్పందంతో రైతులు తమ పంట దిగుబడికి సహేతుకమైన ధరలను పొందగలరు. దానితో పాటుగా మార్కెట్‌లో ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ నష్టాల బారిన పడకుండా కాపాడుకోగలరు.

'రైతుల కష్టాలను మేము అర్ధం చేసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని చిన్న కమతాల రైతులకు మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దాము. దీని ద్వారా వారు తమ ఆదాయానికి భద్రత పొందగలరు మరియు వారు కోరుకున్న పంటను సాగు చేసుకునే అవకాశమూ లభిస్తుంది` అని డాక్టర్‌ కె సీ రవి , చీఫ్‌ సస్టెయినబిలిటీ ఆఫీసర్‌, సిన్జెన్టా ఇండియా అన్నారు.

'సిన్జెన్టా వెజిటేబుల్‌ సీడ్స్‌ డివిజన్‌ తో పాటుగా అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రారంభించిన ఈ పథకం మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఓ గేమ్‌ ఛేంజర్‌గా నిలువనుంది. గుంటూరు ఏపీఎంసీ వద్ద, దాదాపు 80 శాతం ఎండుమిర్చి వేలం జరుగుతుంది. అందువల్ల ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించడానికి ఇది సరైన ప్రాంగణం` అని రవి జోడించారు

సిన్జెన్టా వెజిటెబుల్‌ సీడ్స్‌ గత కొద్ది కాలంగా చిన్న కమతాల రైతులకు నిలకడతో కూడిన వృద్ధిని అందించేందుకు సరైన భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది . 'సిన్జెన్టా వెజిటేబుల్‌ సీడ్స్‌ ఎంతోమంది సాగుదారులకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఎందుకంటే, అత్యుత్తమ నాణ్యత కలిగిన విత్తనాలు మరియు సేవలను టీమ్‌ సభ్యులు అందించగలరు. మా దగ్గర విస్తృత శ్రేణిలో వెజిటేబుల్‌ హైబ్రిడ్స్‌ ఉన్నాయి. ప్రతి హైబ్రిడ్‌కూ వినూత్నత ఉంది. వారు కోరుకునే నాణ్యతలు ఉండటం వల్ల సాగుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. మా పెంపకం దారులు కమోడిటీ విక్రయాల సమయంలో మార్కెట్‌ ధర గురించి ఆందోళన చెందుతుండటంతో పాటుగా ఆదాయపరంగా తమకు జరుగుతున్న నష్టాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గమనించి వారికి అవసరమైన మద్దతును అందించాలనుకుంటున్నాము` అని సంజయ్‌ సింగ్‌, టెర్రిటరీ హెడ్‌, సౌత్‌ ఆసియా వెజిటేబుల్స్‌, సిన్జెన్టా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అన్నారు.

'గుంటూరులోని అచ్చంపేట మండలంలోని ఓ చిన్న గ్రామంలో 2వేల మందికి పైగా రైతులు సిన్జెన్టా హాట్‌ పెప్పర్‌ హైబ్రిడ్‌ హెచ్‌పీహెచ్‌ 5531 సాగు చేస్తున్నారు. హాట్‌ పెప్పర్‌ రైతులు సరాసరిన రెండు ఎకరాల భూమి కలిగి ఉండటంతో పాటుగా ఎకరాకు 1.5 లక్షల రూపాయల పెట్టుబడిని పంట సాగు కోసం పెట్టారు. పంట సాగు సమయంలో మార్కెట్‌ ధరల కారణంగా వీరు నష్టపోకుండా చేసేందుకు, తమ పెట్టుబడుల నష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు, తరువాత సీజన్‌లో పంట సాగు కోసం మరలా పెట్టుబడి పెట్టేందుకు తోడ్పడేలా తగు చర్యలు తీసుకున్నాము` అని సంజయ్‌ అన్నారు.

'ఏఐసీ ఇప్పుడు చిన్న రైతులకు వినూత్నమైన అవకాశం కల్పిస్తుంది. వీరంతా కూడా సిన్జెన్టా హాట్‌ పెప్పర్‌ హైబ్రిడ్‌ హెచ్‌పీహెచ్‌ 5331ను సాగు చేస్తున్నారు. వీరికి ఫసల్‌ భావాంతర్‌ కవచ్‌ మద్దతు ఉంది. ఏఐసీ యొక్క ఈ భీమా పథకంతో రైతులకు మార్కెట్‌లో ప్రతికూల ధరల సమయంలో కూడా తగిన రక్షణ లభిస్తుంది. ఈ ప్రొడక్ట్‌తో పాలసీ హోల్డర్లు మార్కెట్‌లో ధరలు ఊహాతీతంగా పడిపోయినప్పటికీ రక్షించబడతారు. బీమా చేయించిన పంట ధర పడిపోతే అంటే కనీస మద్దతు ధర లేదా థ్రెషోల్డ్‌ ధర కంటే తక్కువగా ఉంటే అతనికి నష్టం జరుగుతుంది. అలా జరగకుండా ఉండటం కోసం పాలసీహోల్డర్‌కు థ్రెషోల్డ్‌ ధర మరియు మార్కెట్‌ మోడల్‌ ధర మధ్య వ్యత్యాసాన్ని అందించడం ద్వారా పాలసీదారుకు పరహారాన్ని ఏఐసీ చెల్లిస్తుంది` అని ఏఐసీ సీఎండీ శ్రీ ఎంకె పొద్దార్‌ అన్నారు.

సాగు చేసిన పంటకు మార్కెట్‌లో అనూహ్యమైన హెచ్చుతగ్గుల కారణంగా రైతులు తరచుగా పంట మార్పిడి విధానం అనుసరించే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ విధంగా చేస్తున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోక పోవచ్చు. ఇది పెట్టుబడిపై తక్కువ రాబడికి దారి తీయవచ్చు.

మద్దతు కోసం పాలసీని ఎంచుకునే రైతులు ఊహించని విధంగా ధరల పతనం వల్ల ప్రభావితం కాలేరు. ఎందుకంటే వారు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి నష్టాన్ని నివారించుకోగలరు.

'మార్కెట్‌లో డిమాండ్‌ - సరఫరా నడుమ ఉన్న అంతరాల కారణంగా మార్కెట్‌లో నిత్యావసరాల ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రైతులు నష్టపోయే అవకాశాలూ ఉన్నాయి. అలా జరుగకుండా ఉండాలంటే తాము పెట్టుబడి పెట్టిన డబ్బును సురక్షితంగా ఉంచడం ద్వారా ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు. రైతులు తాము పండించిన పంటను సుదీర్ఘకాలం పాటు విక్రయించకుండా ఉండలేరు. వారు తమ వర్కింగ్‌ క్యాపిటల్‌ను త్వరగా పొందడంతో పాటుగా పంట ఉత్పత్తిలో ఎదురయ్యే ఖర్చులనూ సెటిల్‌ చేయాల్సి ఉంది. స్థిరమైన మార్కెట్‌ ధరను పొందడం ద్వారా రైతులు పంట ఎంపికలో సరైన నిర్ణయాలను తీసుకోగలరు` అని పొద్దార్‌ అన్నారు

అత్యున్నత నాణ్యత కలిగిన విత్తనాలను రైతులకు అందించడానికి సిన్జెన్టా వెజిటేబుల్‌ సీడ్స్‌ తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రతి దశలోనూ విలువను సృష్టించేందుకు, సస్టెయినబల్‌ వృద్ధికి భరోసా అందించేందుకు ఉత్పత్తి ఆవిష్కరణలనూ చేస్తుంది.

సిన్జెన్టా ఫౌండేషన్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) సైతం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. రైతులకు భీమా విస్తరించేందుకు సరైన మద్దతు భాగస్వామిని గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌
హిమాలయా కంపెనీ కొత్త ఈక్విటీ క్యాంపెయిన్
బజాజ్‌ ఆటో రూ.2500 కోట్ల షేర్ల బైబ్యాక్‌
సీబీడీటీ నూతన ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా
చిన్న మొత్తాలపై వడ్డీ రేట్ల పెంపు..!
గెయిల్‌ ఆర్థిక పరిస్థితి భేష్‌
తెలంగాణాలో తమ సభ్యులకు విలువ, సౌకర్యాన్ని కల్పిస్తున్న అమేజాన్ ప్రైమ్
చిన్న వ్యాపారుల స్టే ధరలను తగ్గించిన ఓయో
పవర్‌హౌస్ చిప్‌సెట్ తో POCO F4 5G రంగ ప్ర‌వేశం
కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.