Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఐదో సారి వడ్డింపు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

ఐదో సారి వడ్డింపు

- రెపోరేటు మరో 0.30% పెంపు
- అప్పులు మరింత భారం
- జీడీపీ తగొచ్చు
- ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ నిర్ణయాలు వెల్లడి
ముంబయి : రుణ గ్రహీతలపై మరింత భారం పడనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఐదో సారి వడ్డీ రేట్లను పెంచేసింది. మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ ద్వైమాసిక మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీలో రెపో రేటును మరో 35 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన సాగిన ఈ భేటీలో భారత వృద్థి రేటు అంచనాలకూ కూడా కోత పెట్టింది. అంతర్జాతీయ ప్రతికూల అంశాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. కీలక వడ్డీ రేట్లను మరోమారు పెంచడం ద్వారా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 225 బేసిస్‌ పాయింట్లు (2.25 శాతం) పెంచినట్లయ్యింది. ఆర్‌బిఐ ఇంతక్రితం మేలో 0.40 శాతం, జూన్‌లో 0.50 శాతం, ఆగస్టులో మరో 0.50 శాతం, అక్టోబర్‌లో 0.50 శాతం చొప్పున పెంచేసింది. దీంతో మే నెలలో 4.4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు తాజాగా 6.25 శాతానికి పెరిగింది. దీంతో రెపోరేటు 2018 ఆగస్టు నాటి స్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగ్గానే ఉందని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. డిసెంబర్‌ 5-7 తేదిల్లో సాగిన భేటీ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంగా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచిందన్నారు.
వృద్ధి రేటుకు కోత..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత వృద్ధి రేటు 6.8 శాతానికి తగ్గొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇంతక్రితం సమీక్షాలో ఇది 7 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. దీనికంటే ముందు ఎంపిసి భేటీలో 7.2 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుతం డిసెంబర్‌తో ముగియనున్న త్రైమాసికంలో, వచ్చే త్రైమాసికంలో జీడీపీ వరుసగా 4.4 శాతం, 4.2 శాతం చొప్పున మాత్రమే పెరుగొచ్చని విశ్లేషించింది. 2023-24 జూన్‌తో ముగియనున్న తొలి త్రైమాసికంలో మళ్లీ 7.1 శాతం.. ఆ తర్వాత త్రైమాసికాల్లో 5.9 శాతం చొప్పున పెరుగొచ్చని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ మెరుగ్గానే రాణిస్తుందని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.
యుపిఐ చెల్లింపుల పరిధి పెంపు
భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ పరిధి (బీబీపీఎస్‌), యూపీఐ సేవలను విస్తరించనున్నట్టు శక్తికాంత దాస్‌ తెలిపారు. పన్ను చెల్లింపులు, అద్దె నుంచి పాఠశాల ఫీజుల వరకు ఏ రకమైన చెల్లింపునైనా చేయడానికి వినియోగదారులు త్వరలో బిబిపిఎస్‌ ఉపయోగించుకోవచ్చన్నారు. ఇందుకోసం బీబీపీఎస్‌ను మరింత ఆధునీకరించనున్నట్టు పేర్కొన్నారు. యుపిఐలో సింగిల్‌ బ్లాక్‌ అండ్‌ మల్టీపుల్‌ డెబిట్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులు ఇకపై తమ ఖాతాల్లోని నిధులను ఒక ప్రత్యేకమైన అవసరం కోసం వేరుచేసి బ్లాక్‌ చేసి ఉంచుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. ఇది సెక్యూరిటీలలో పెట్టుబడులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌, హోటల్‌ బుకింగ్‌లకు సంబంధించిన చెల్లింపులను మరింత సులభతరం చేస్తుందని దాస్‌ తెలిపారు.
హెచ్చు ద్రవ్యోల్బణమే..
దేశంలో మరికొంత కాలమూ ద్రవ్యోల్బణం ఎక్కువగానే నమోదు కానుందని శక్తికాంత దాస్‌ తెలిపారు. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలని ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎగువనే నమోదు కానుందన్నారు. అయితే రానున్న రోజుల్లో తగ్గుముఖం పడుతుందని దాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ పోరాటం మాత్రం ఇంకా ఆగలేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 6.7 శాతానికి ఎగువనే ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో 6.6 శాతం, వచ్చే ఏడాది జనవరి-మార్చిలో 5.9 శాతం, ఏప్రిల్‌-జూన్‌లో 5 శాతం, జులై- సెప్టెంబరులో 5.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు.
రియాల్టీపై ప్రతికూల ప్రభావం..
వడ్డీ రేట్ల పెంపునతో ముఖ్యంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. ఆర్‌బిఐ వరుస వడ్డింపునతో ముఖ్యంగా నిర్మాణ రంగం దెబ్బతినే ప్రమాదం మెండుగా ఉంది. వడ్డీ రేట్ల పెంపును బ్యాంక్‌లు అతి త్వరలోనే ఖాతాదారులకు బదిలీ చేయనున్నాయి. దీంతో రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తం లేదా రుణం చెల్లింపు కాలం పెరుగనుంది. వడ్డీ రేట్ల పెంపునతో ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. గృహ అమ్మకాలు పడిపోయే అవకాశం ఉందని ఆ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫ్రాన్స్‌ న్యూక్లియర్‌ టర్బైన్లకు విడిభాగాలు
పాల ధరలను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌
హైదరాబాద్‌ నుంచి 150 డైలీ డిపార్చర్లు : ఇండిగో
అత్యధిక సబ్‌స్ర్కైబర్లు గల ఆజ్‌తక్‌ యూట్యూబ్‌ ఛానెల్‌కు సీఈఓ సుపాన్‌ వోజ్‌ అభినందన
ప్యాకెట్‌కు రూ.2లు పాల ధరను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌
నీట్‌ అభ్యర్థులకు ఆకాష్‌ బైజూస్‌ సెల్ఫ్‌ ఇవాల్యుయేషన్‌ టూల్‌ విడుదల
హైదరాబాద్ నుంచి 150+ డైలీ డిపార్చర్ల మైలురాయిని సాధించిన ఇండిగో
ఐటీ వసూలుకు 57 పైసలు ఖర్చు
రాణించిన ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ
దక్షిణ భారతదేశంలో దాని ఉనికిని బలపరుస్తున్న IDP ఎడ్యుకేషన్
విజయవాడలోని వినియోగదారులకు పునరావిష్కరించిన షాపింగ్‌ అనుభవాలను అందిస్తున్న కళ్యాణ్‌ జ్యువెలర్స్‌
అదానీ గ్రూపునకు రుణాలు రద్దు
వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌ అమ్మకాల్లో 28% వృద్థి
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా
ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు
భారతదేశంలో 250 జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌
ఒఎల్‌ఎక్స్‌లో 1500 మందిపై వేటు
బజాజ్‌ అలయన్జ్‌ 'మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌'
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభం
వీఐ నుంచి రూ.99 ప్యాక్‌
అమేజాన్‌ ఫ్రెష్‌పై ఆఫర్స్‌
కోల్‌ ఇండియా లాభాల్లో 70% వృద్థి
అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.