Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వాణిజ్య విభాగం :ప్రముఖ ఐటీ ఫెరిఫరల్స్ వినియో గదారుల ఎలక్ట్రానిక్స్, సర్వైవలెన్స్ ప్రొడక్ట్‌ల సరఫరాదారుడు జెబ్రోనిక్స్ తమ ఆడియో సెగ్మేంట్‌లోని పోర్టుఫోలియోకు మరో ప్రొడక్ట్‌ను జతచేసింది. కొత్తగా జెడ్‌ఈబీ-బీటీ 361 ఆర్‌యూసీఎఫ్‌గా పిలవబడే 2.2 మల్టీమీడియా స్పీకర్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.4,242 మాత్రమే అని పేర్కొంది. ఈ కొత్త ప్రొడక్టు సంగీత అభిమానుల మనసు దోచుకుంటుందని తెలిపింది. 4 అంగుళాల సబ్‌వూఫర్ డ్రైవర్లు సింగిల్ క్యాబినెట్‌లో అమర్చబడి ఉంటాయని, లివింగ్ రూమ్‌లో థియేటర్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయని జెబ్రోనిక్స్ డైరెక్టర్ ప్రదీప్ దోషి పేర్కొన్నారు. దీంతో పాటు కొత్త స్పీకర్ బ్లూటూత్ కనెక్టివిటీ, యుఎస్‌బీ పోర్ట్, ఎస్‌డీ సపోర్ట్, బిల్ట్ ఇన్ ఎఫ్‌ఎమ్ ట్యూనర్‌తో వస్తుందని ఆయన తెలిపారు. సబ్‌వూఫర్ అవుట్‌పుట్ పవర్ 24 వాట్లు కాగా ప్రతి శాటిలైట్ కూడా 12 వాట్ల పవర్‌ని అందిస్తుందని వివరించారు. అలాగే 2.2 స్పీకర్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుందని పేర్కొన్నారు. ఈ మల్టీమీడియా స్పీకర్ ఆన్‌లైన్‌లోను, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా లభ్యమవుతుందని తెలిపారు.