Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వర్క్‌ఫ్రం హోం'ను క్యాష్ చేసుకొంటున్న హ్యాకర్లు
న్యూఢిల్లీ: ఓ పక్క ప్రపంచం మొత్తం కరోనావైరస్ (కొవిడ్-19)తో భయభ్రాంతులకు గురవుతుంటే.. కొందరు కేటుగాళ్లు దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా భయాలను, గందరగోళాన్ని క్యాష్ చేసుకొనే పనిలోపడ్డారు. ఇందుకు ముఖ్యంగా కంప్యూటర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొన్నట్టు బెంగళూరుకు చెందిన 'సుబెక్స్' అనే సంస్థ పేర్కొంది. ఇది టెలికం కంపెనీలకు అనలటిక్స్ సేవలను అందజేస్తుంది.
ప్రస్తుతం కరోనావైరస్ భయంతో చాలా కంపెనీలు ఉద్యోగులను ఇండ్ల నుంచే పనిచేయాలని ప్రోత్సహిస్తున్నాయి. ఇది హ్యాకర్లకు అనువుగా మారింది. ఉద్యోగులు ఇండ్ల దగ్గర నుంచి పనిచేస్తున్నప్పుడు ఆఫీస్‌లో ఉన్నంత సైబర్ సెక్యూరిటీ ఇండ్ల వద్ద ఉండే నెట్‌వర్క్‌లకు ఇవ్వడం కుదరదు. దీనిని హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకొని వారి డివైజ్‌లు, రౌటర్లను హ్యాక్ చేసి మాల్వేర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సుబెక్స్ పేర్కొంది.