Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంసీఎల్‌ఆర్ రేటులో 15 బేసిస్ పాయింట్ల మేరకు కోత విధించినట్టు పేర్కొంది. ఇది మార్చి 10 తేదీ నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడిం చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ వడ్డీరేట్లను తగ్గించడం ఇది పదోసారి కావడం విశేషం.
కొత్త వడ్డీరేట్లు ఇలా..
- ఏడాది ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటు 10బేసిస్ పాయింట్లు తగ్గి 7.75శాతంగా నిలిచింది. గతంలో ఇది 7.85శాతంగా ఉండేది.
- ఒక నెల ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటుపై 15 బేసిస్ పాయింట్లు తగ్గి 7.45శాతం అయింది.
- మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటు 7.65శాతం నుంచి 7.50శాతానికి తగ్గింది.
- ఇక రెండేండ్ల ఎంసీఎల్‌ర్ వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 7.95గా ఉండగా.. మూడేండ్ల ఎంసీఎల్‌ర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.05శాతంగా ఉంది.
- ఎఫ్‌డీలపై కూడా వడ్డీరేట్లను ఎస్‌బీఐ తగ్గించింది. గతంలో ఫిబ్రవరి 10వ తేదీన కూడా ఒకసారి వడ్డీరేట్లను తగ్గించడం విశేషం. కొత్తగా తగ్గిన వడ్డీరేట్లు మార్చి10 నుంచే అమల్లోకి వచ్చాయి.
యూబీఐ కొత్త వడ్డీరేట్లు నేటి నుంచి..
మరోపక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెండు రోజుల క్రితం ఎంఎసీఎల్‌ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. ఇది నేటి నుంచి అమల్లోకి రానుంది. వరుసగా ఇది తొమ్మిదిసారి వడ్డీరేట్లను తగ్గించడం విశేషం.
ఎంసీఎల్‌ఆర్ అంటే..
రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లేవారికి ఎంసీఎల్‌ఆర్‌ను ఆధారంగా చేసుకొని రుణం ఇస్తారు. గతంలో బేస్‌రేట్ ఆధారంగా రుణం ఇచ్చేవారు. ఇప్పుడు ఎంసీఎల్‌ఆర్‌ను ప్రామాణికింగా చేసుకొన్నారు. బ్యాంకులు నిధుల సమీకరణకు అయ్యే ఖర్చు(మార్జినల్ కాస్ట్) ఆధారంగా ఈ ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయిస్తారు. ఆర్బీఐ బ్యాంకులకు నిధులను ఇచ్చే రేటును రెపోరేటు అంటారు. ఈ రేటు తగ్గినప్పుడల్లా ఎంసీఎల్‌ఆర్ తగ్గుతుంది. ఫలితంగా బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీరేటుకు.. బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే వడ్డరేటుకు మధ్య అంతరం తగ్గుతుంది. అప్పుడు ఆర్బీఐ అందించే ప్రయోజనాలు వినియోగదారులకు చేరతాయి.
లాభాలు ఇవే..
- తక్కువ రేటుకే గృహ, వాహన రుణాలు లభిస్తాయి.
- ఇప్పటికే పాతవిధానంలో రుణం తీసుకొన్నవారు ఎంసీఎల్‌ఆర్ పద్ధతికి మారవచ్చు. అప్పుడు -వడ్డీరేట్లు తగ్గి ప్రయోజనం సమకూరుతుంది.
- ఆర్‌బీఐ రేటు తగ్గించగానే ఆ ప్రయోజనం వినియోగదారులకు అందుతుంది.
కనీస బ్యాలెన్స్ అక్కర్లేదు : ఎస్బీఐ
ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు మరో శుభవార్త చెప్పింది. పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను కూడా హేతుబద్దీకరించింది. ఇకపై ఏడాది కాలానికి 3శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఎస్బీఐ 2018 ఏప్రిల్ నుంచి కనీస బ్యాలెన్స్ నిబంధన తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లోని ఎస్బీఐ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం రూ. 5వేలు ఉంచాలని, లేదంటే పెనాల్టీ చార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే దీనిపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడంతో గతేడాది లక్టోబరులో ఈ నిబంధనలో కొంత మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 3వేలకు తగ్గించింది. మెట్రో, సెమీ అర్బన్ ప్రాంతా ల్లో రూ. 2వేలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1000 కనీస బ్యాలెన్స్ తప్పనిసరి చేసింది. అంతకుముందు రుణాలు, డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.
సాధారణ ప్రజలకు ఎస్బీఐ అందించే తాజా ఎఫ్‌డీ రేట్లు
రోజుల నుంచి.. వరకు... శాతం
7 45 4
46 179 5
180 210 5.5
211 1 సంవత్సరం కంటే తక్కువ 5.5
8 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల
కంటే తక్కువ- 5.9
- రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 5.9
- మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 5.9
- ఐదు సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు - 5.9
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అందించే ఎఫ్‌డీ రేట్లు ఇలా..
రోజుల నుంచి.. వరకు... శాతం
7 45 4.5
46 179 5.5
180 210 6
211 1 సంవత్సరం
కంటే తక్కువ 6
- సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 6.4
- రెండు సంవత్సరాల నుంచి- 3 సంవత్సరాల కంటే తక్కువ - 6.4
- మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 6.4
- ఐదు సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు - 6.4