Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మట్టి ఉప్పెనై ఎగసిన అక్షరాలు | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Nov 22,2021

మట్టి ఉప్పెనై ఎగసిన అక్షరాలు

నిరంతర కవన కూజితమైన కవితాఖని... కవి పోతగాని ఆయన ఒక విశిష్టమైన సజన కారుడు. ఆయన అక్షరాలలో కవిత్వాన్ని నింపి తుటాలుగా పేల్చగలడు. ఆయన నిత్యం ఉద్యమాలకు అక్షరాలతో వెన్నుదన్నుగా నిలవగలడు. అక్షరాల మాగాణిలో అద్భుత శిల్పాలతో హదయంలోకి చొచ్చుకుపోయే నేర్పుతో అక్షరాలతో వినూత్న భావాలను ఆవిష్కరించే కవితా ఖని. ఆయనే కవి పోతగాని. 'ప్రవాహ స్పర్శ'గా ప్రవహించి 'మట్టి ఉప్పునై' ఈనాడు రైతు జీవితాన్ని మట్టి మనుషుల యొక్క సంఘర్షణలను, సమైక్యతను నినదిస్తున్నాడు. అతడు అక్షరాలను పోత పోసి ''అక్షరాల కల కండలు సష్టించగలిగిన తెలుగు సాహిత్యపు గీటురాయి.
   ''ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి. అది కన్నీరు కార్చాలి. క్రోదాగ్నులు పుక్కిలించాలి. పీడితుల పక్షం వహించాలి. మనిషి ఋణం తీర్చుకోవాలి''అని గుంటూరుశేషేంద్ర శర్మగారు అన్నట్టుగా పోతగాని కవిత్వంలో ఇవన్ని కూడా పుష్కలంగా కనిపిస్తాయి అనడం' అక్షరాల సత్యం.
   మట్టి మనుషుల గురించి రాయవలసి వస్తే ఆ మట్టిలో ఒక మాణిక్యం పుట్టాలి. కన్నీళ్ళు కష్టాలను గూర్చి రాయాల్సి వస్తే ఆ కనీళ్లనే సిరా చుక్కలుగా చేసుకొని అక్షరాలతో చెమట చుక్కల సువాసనకు చాటి చెప్పాలంటే ఆ చెమట చుక్కల్లోనే ఒక వేగుచుక్క అయ్యి పొడవాలి. చిల్లులు పడ్డ గుడిసైనా ఆకాశాన్ని కప్పుకొని పేదవాడికి అద్దాల మేడవుతుంది. ఇది మట్టి వాసనల పుస్తకం. మట్టి మనుషుల జీవన సంఘర్శణలే ఈ ''మట్టి ఉప్పెన''. ఊరంచు వాగులో వూరే స్వచ్ఛమైన ఊటనే పోతగాని కవితలు. అందుకే ఇది మట్టి మనుషుల కవన వాటిక.
   అందుకే కవి తన కవిత్వంలో...
   ''ఆకాశమంత ఎత్తైన శిఖం ఒక్కసారిగా ఇలా
    చట్టుబండలా ముడుచుకు పడుకుందేమిటి! అంతరిక్షం కన్నా విశాలమైన నేత్రాలిలా కోడి నిద్ర పోవడం నేను భరించలేను!''
    జీవితంలో ఎన్ని సమస్యలనైనా భరిస్తాం. నెట్టుకొని ముందుకు సాగుతాం. మళ్ళీ సంపాదించు కుంటాం. మన జీవితాన్ని నిలబెట్టిన తండ్రి శరీరం ఆకాశమంత శిఖరం. ఒక్కసారిగా కూలిపోయి చట్టు బండలా నిరామయంగా ముడుచుకుంది. అంతరిక్షం కన్నా విశాలమైన నేత్రాలు దీర్ఘనిద్రలోకి పోయాయి. భరించడం ఎవరి వల్ల అవుతుంది. అని దిగమింగిన దుఃఖంతో మళ్ళీ ఇలా అంటాడు.
  ''ఎంతటి గుండె ధైర్యం నీది....
   నీ కసలు ఓటమే లేదనుకున్నాను!
   ఎందుకిలా అకస్మాత్తుగా అపజయాన్ని ఆహ్వానించావో
   అంతు చిక్కడం లేదు...
   నాన్నా! నీవు చాలా ధైర్యవంతుడివి కదా! నీకు ఓటమి లేదు అనుకున్న ఎందుకు నీవు ఈరోజు అపజయాన్ని ఆహ్వానించావో నాకు అర్ధం అవ్వడం లేదు అని నాన్నను ప్రశ్నించాడు. దిగులు మేఘంలా గర్జిస్తూ రోదిస్తున్నాడు.
   కవిత్వం ఆహ్లాదంతో మొదలై వివేకంతో ముగియాలి అంటాడు రాబర్ట్‌ ప్రాస్ట్‌. అభినవ గుప్తుని దష్టిలో ఆనందో పదేశములు కావ్య ప్రయోజనాలు. హదయాన్ని రంజింప చేయడమే కవిత్వ రససిద్ధి అని అలంకారికుల అభిప్రాయం. ఈ లక్షణాలు అన్ని కూడా పోతగాని కవిత్వంలో మనకు తారసపడతాయి. ఈ కింది కవితలో....
   ''మూత తెరుచుకోగానే
   గొడుగులా విస్తరించే ఆ కర్పూర సౌరభం....
   నాకు చుక్కల పర్వతం శిఖరాగ్రాన్ని చూపించింది
   నా మనస్సును ఊహల రోదసి యాత్రలు
   చేయించింది నాలో
   మాటలు చాలని మౌనసుధా వర్షాలు కురిపించింది''
   ఈ కవితలో కవి ఆనంద డోలికలలో విహరిస్తున్నాడు. కవి ఆనంద సంభరితుడవుతున్నాడు.
   ''ఆనందాన్ని అనుభూతించే లోగా అత్తరు మధ్యలో లీన మైంది'' అనే కవితా వాక్యంతో...
   ఆనందం అనుభూతి చెందేలోగా అత్తరు మధ్యలోనే మాయమై పోయింది. అన్నీ కాలగర్భంలో కలసి పోవాల్సిందే ఏది కూడా శాశ్వతం కాదు అనే ఒక తాత్విక చింతనను తెలియ చేస్తున్నాడు కవి.
   ఈ కవితలో చివరిగా ఇలా అంటాడు కవి...
   ''ఇదిగో ప్రియా
   ఆఖరి సారిగా చెబుతున్నాను
   నా యవ్వనం నాకిచ్చేరు!''
   ఎవ్వరం ఇక్కడ శాశ్వతం కాదు. అంతా మిధ్యనే, ఎప్పుడూ ఇక్కడ ఎవ్వరమూ స్థిరంగా ఉండం. కాలగర్భంలో కలిసి పోయినవి తిరిగి రావు. యవ్వనం శాశ్వతం కాదు. తిరిగి రాదు కదా! అనే నగ సత్యాన్ని తెలుపకనే తెలియ చేశాడు.
   కవిత్వంలో ఇమెజ్‌ అంటే పదాలతో నిర్మించిన ఒక చిత్రం అది ఇక్కడ కనిపిస్తుంది.
   ''ఇకనైనా
   మర్రిచెట్టుకు మల్లె తీగలా పాకడం నేర్చుకో
   మాను కూలిన రోజు
   పూలు రాల్చడానికైనా పనికొస్తావ్‌''
   ఎంత చక్కని దార్శనికత ఈ కవితా ఖండికలో కనిపిస్తుందో చూడవచ్చు...
   ఒక ఆలోచననో, ఉద్వేగాన్నో అనుభవాన్నో లేక ఈ మూడింటిని కలగలిపో కళాత్మకంగా చెప్పిన భాషారూపమే కవిత్వం అని చెప్పవచ్చును. మన అనుభూతులన్నింటిని ఇంద్రియాల ద్వారానే మనం పొందుతాం. ఆ ఆహ్లాద కరమైన అనుభావాలని, అనుభూతుల్ని ఒక అందమైన జ్ఞాపకంగా మలచుకొని కవితా మయంగా పాఠకుని హదయతీరాలను తాకి పరవశించి పోతాడు.
   ''మిణుగురు కొండమీద
   తెల్లని మల్లెపూలు తరుముకున్న
  నల్లని కురుల పడుచు పిల్లలాంటి రోదసిలో నీవు''
   ఈ కవితలో ఎంత చక్కని హదయానందకరమైన భావా నుభూతి కలుగుతుందో అనుభవించవచ్చు.
   పోతగాని కవిత్వంలో నిత్యం
   సమాజంలో జరుగుతున్న
   అనారోగ్యకరమైన పరి స్థితులను ఎండగట్టి పదునైన అక్షరాల సీసంతో కడిగి పడేస్తాడు. భ్రష్టు పట్టిన మానవనైజాలను ఒక మూసలో పోసి కొలిమి మీద పెట్టి కాల్చి కరిగించి సరికొత్త సమసమాజ స్థాపనకు రూపం ఇవ్వాలని తాపత్రయ పడతాడు. జరిగిన జరుగుతున్న కుల మతాల సంఘర్దనలలో నలిగిన బడుగు జీవులను చూసి తాడిత పీడిత వర్గం వైపు నిలబడి నినదిస్తాడు. తన అక్షరశరాలతో చీల్చి చెండాడతాడు.
  ''ఏ శిక్షాస్మతి నీవు చేసే మారణ హౌమానికి
   ఆజ్యం పోసిందో చెప్పు
   ఏనాడో జాతి సంకరమైన
   నీ రక్తంలో
   ఏ వంకరాలేని డి.యన్‌.ఏ. ఉందని
   నిరూపించు...''
   అంటూ మత సంఘర్ణణల మారణ హౌమాలకు ఆజ్యం పోసిన బుసకొట్టిన విషనాగుల కోరలు ''పీకేస్తాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తన అక్షరాల చూపుడు వేళ్ళతో...
   ''నా దేశపు అత్యుత్తమ రాజ్యాంగం సాక్షిగా
   హక్కుల్ని కాల రాసిన నీ ఉన్మాదానికి
   ఉరేసరైన శిక్ష''
   అంటూ నిప్పులు చెరుగుతాడు కవి.
   పురాణకాలం నుంచి నేటి ఆధునికయుగం వరకు యుగాలు మారుతున్నా కులాల పునాదుల మీద నిలబడి రాక్షస క్రీడలు సలుపుతూ మారని మనుషుల మౌఢ్యాల మీద విరుచుకు పడతాడు.
   ''నా తలను తెగ నరికితేనే
   నీకు ధర్మ రక్షణ
   నా బొటన వేలును ఖండిస్తేనే
   నీకు గురుదక్షిణ
   నా మర్మంగాన్ని కోసి ప్రాణాల్నిహరిస్తేనే నీ కులానికి పరిరక్షణ''
   ఎంత ఘాటైన మార్మిక సత్యాలో చూడండి అనాదిగా సాగుతున్న అరాచకాలపై కలాన్ని ఝుళిపించాడు.
   కవి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి,..
   ''కులమదంతో ప్రేమను హత్య చేశానని
   వీర్ర వీగుతున్న వెర్రివాడా!
   కులరహిత సమాజానికి
   నీవే కారణామయ్యావని తలంచు
   నీ నమ్మిన కులం పునాదులు
   నేల మట్ట మౌతాయని గ్రహించు!!''
    కులం కూలి పోతుందని, నేల మట్ట మౌతుందని బలంగా నమ్ముతున్నాడు కవి. సమస మాజాన్ని ఆకాంక్షిస్తున్నాడు. ఇక్కడ కవిత ఒకే ధారాప్రవాహమై కొండ చరియల నుంచి దూకుతున్న వాగులా ప్రవహించిందని చెప్పవచ్చు.
    స్వార్ధ చింతనతో సహవాసం చేస్తున్న మనుషులతో సామాన్యులు ఎలా ఆవేదన చెందుతున్నారో హెచ్చరిస్తున్నాడు జనుల్ని.
   ''ఇప్పుడే చెబుతున్నాను
   ఊబిలాంటి స్వార్ధం మధ్యలో
   ఊపిరాడని దీనులం మనం!'' అని అంటాడు.
    జీవితాన్ని అర్థంచేసుకునేందుకు కవిత్వం ఒక బాట, ఆ బాటలో నడుస్తుంటే కవిత్వపు సరుకు దొరుకుతుంది. ఈ కవి సమసమాజపు అన్వేషి, నిత్యం అన్వేషిస్తూ సాగి పోతుంటాడు. మట్టి మనుషుల జీవితాలను తన అక్షరాలతో పచ్చని మాగాణిగా మార్చాలని తపనపడే ఒక చైతన్యపు స్రవంతి. నిరంతర కవన కూజితమై నిలిచిపోయే ఒక అక్షర చిరస్థాయి సంతకం కవి పోతగాని.
- పెద్దోజు నరేష్‌ రచయిత,కవి

9493040665

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు
అనుభవం ముఖ్యం కనుక...
దుఃఖనదిలో అశ్రుపడవ
విలాపం నుండి విలాసంలోకి ... 'కాల ప్రభంజనం'
చెమట చుక్కల వాసన వెలుగుపూలు
సూఫీ తత్వాన్ని వింగడించుకున్న కథలు
హార్పర్‌ లీ రాసిన నవల ''టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌''..!
ముద్దాయి
యదార్థం
రచనలకు ఆహ్వానం
భర్తీ
'తుఫాను'
తల పువ్వులు
పూలకుండి
గజల్‌ అవతరణ - అనుకూలావరణ
''కవిత్వ మినార్‌ హమారా షాయర్‌ ఆశారాజు''
మంచ్చిల్లొచ్చినై
మాటలు మాట్లాడుతున్నాయి

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.