Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వచన కవితా క్రాంతిదర్శి కుందుర్తి | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Dec 13,2021

వచన కవితా క్రాంతిదర్శి కుందుర్తి

వచన కవితను ఒక ప్రక్రియగా సుస్థిర పరచడమే కాకుండా, దానిని ఒక ఉద్యమంగా మలిచి అభ్యుదయ ప్రగతిశీల ప్రజస్వామ్య భావాలకు వేదికనిచ్చిన కవి 'కుందుర్తి ఆంజనేయులు. అభ్యదయ వైతాళిక కవి శ్రీశ్రీ ఛందోబందోబస్తుల్ని తెంచమన్నాడే తప్ప తాను స్వయంగా తెంచలేకపోయాడు. గురజాడ ఇచ్చిన మాత్రాఛందస్సులోకి మారి మహా ప్రస్థానాన్ని దేదీప్యమానంగా వెలిగించి దృక్పథ బలాన్ని శ్రీశ్రీ ఇస్తే ప్రక్రియాబలాన్ని కుందుర్తి తెలుగు సాహిత్యానికి బహుకరించాడు. 1944లో నయాగారా కవితా సంపుటిలో మొదలై ఒక మహౌద్యమాన్ని ఆయన నడిపాడు. అందుకే 'పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం' అని స్పష్టంగా తన కవితామార్గాన్ని ప్రకటించుకున్నాడు.
   వచన కవిత్వాన్ని ప్రజాస్వామ్యీకరించడంలో కుందుర్తి పాత్ర అమోఘం అందుకే ఆయ నను వచనకవితా పితామహుడిగా గుర్తించి గౌరవించింది సాహితీ లోకం. ఆ పితామహుడి శత జయంతి సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఆయనను తలచుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. ఈనాడు వచన కవిత్వం ఇంత విస్తృతిని పొందడానికి కుందుర్తి చేసిన కృషి సదా గుర్తు చేసుకోవాల్సందే. ఆ దిశగా మనల్ని ఆలోచింపజేసేందుకు వచన కవిత్వం ఒక ప్రక్రియగా నిలదొక్కుకునేందుకు దోహదం చేసిన కుందుర్తిని ఆయన చేసిన సాహిత్య ప్రయాణాన్ని గమనించాల్సిన సమయ సందర్భం కూడా ఇదే. కవిత్వం ఏ రూపంలో ఉండాలి, వస్తువు, దృక్పథం సరళత, స్పష్టత, ప్రాసంగికత అనే మాటల్ని మనం ఇప్పటికీ చాలా సందర్భాల్లో, అల
   వోకగా పలుకు తుంటాం. చర్చి స్తుంటాం. 'కుందుర్తి'కి కవిత్వ నిర్మాణం పట్ల స్పష్టత ఉంది. తన కాలం నాటి సాహిత్య వాతావరణంలో వచన కవిత్వ అవసరాన్ని గుర్తించాడు. ఏది ఎలా చెప్పాలో మర్మమెరిగిన సృజనకారుడు కావడం వలన అనేకాంశాల్లో తన కాలం కంటే ముందున్నట్టుగా గమనించవచ్చు.
   'సాధారణంగా నేనెన్నుకొనే కావ్య వస్తువులు, చైతన్యవంతమైన ప్రజోద్యమాలకు సంబంధించినట్టివిగా ఉంటాయి ఏదో ఒక రూపంలో ఆనాటి పాలక వ్యవస్థ మీద ప్రజలు చేసిన తిరుగుబాట్లు నా హృదయంలో చైతన్యస్ఫోరకములై నన్ను అపాదమస్తకం కదలిస్తాయి. నాటి జయా పజయాలతో నిమిత్తం లేదు. ప్రతి సంఘటనలో కొంత జయము కొంత అపజయము మిళితమై వుంటాయి
   ద్వితీయ ప్రపంచ సంగ్రామాల సమయంలో హిట్లరు సైన్యాలను ఎదుర్కొన్న ప్రజాసైన్యాల వీర విజయ విన్యాసాలూ, బ్రిటీష్‌ వారిని గడగడ లాడించిన అల్లూరి సీతీరామరాజు మన్య విప్లవము, తెలంగాణలో నవాబు ఫ్యూడల్‌ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ప్రజోద్యమమూ రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యమమూ దాని చేతనున్న సమస్త మారణాయుధాలనూ కేవలం నైతిక బలం వల్లనే ఎదిరించి నిల్చిన గాంధీజీ ఉద్యమాలు మొదలగు చరిత్రలో చెరగని స్థానంసంపాదించిన అనేక మహౌద్యమాలు నాకు కావ్యవస్తువులు ''కుందుర్తి క్రతులు 'ఇదీ నా దారి'- పుట3లో తన కవితా నిర్మాణ ఉద్దేశాన్ని నిబద్దతని లక్ష్యాన్ని స్పష్టం చేశాడు
   ఆధునిక తెలుగు సాహిత్యంలో మన కవితా ప్రక్రియలో గత అరవైయేండ్లుగా అనేక వాదాలు, సిద్ధాంతాలు, ఉద్యమాలు వచన కవిత్వమ్మీద బలమైన ముద్రను వేశాయి. ఒక రకంగా అభ్యుదయ కవిత్వాన్ని పర్యాయపదంగా వచన కవిత్వం మారిపోయింది.. అదొక బలమైన ప్రక్రియగా రూపొందడంలో, తాను నమ్మిన సమసమాజ విలువల్ని వచన కవితామార్గాన్ని పరిపుష్టం చేయడంలో కుందర్తి పాత్ర అనిర్వచనీయమైనది.
  'కోటీశ్వరులు సోషలిజం కావాలని గోలపెడుతున్న దేశం నాది ఉన్నవాడు లేనివాడు యిల్లు
  కాల బెడుతున్న దేశం నాది
  ఈ దేశం నాది
   అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా వుంది.
చుట్టూ జరుగుతున్న వ్యవహారం
   బోడిగుండు కనిపించకుండా కప్పిన 'విగ్గులా' వుంది (ఇది నా దేశం కవిత కుందుర్తి కృతులు పుట 594)
   ఆకలి పేదరికం, అవమానాలు, దిగువ మధ్యతరగతి ప్రజల ఆర్థిక సామాజిక సాంస్కృతిక జీవన విధానం తన కవిత్వంలో సృజనాత్మకంగా వ్యక్తీకరించారు. దేశభక్తి, నగర జీవనం కవితా వస్తువులుగా కవిత్వాన్ని ప్రజాభ్యుదయం కోసం వనకవిత్వాన్ని ఉద్యమం చేసిన ఘనత కుందిర్తిదే.. 'కవి జీవితానికి అతని సాహిత్యానికీ తేడా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని (కుందుర్తి వ్యాసానికి) గుర్తించినదీ కుందుర్తే.. అనేక సందర్భాలలో తన దృక్పథాన్ని వెల్లడిస్తూ వచ్చారు.
  'నేను మొదట్నించీ మార్క్సిస్టు అవగాణ పరిధికి స్థూలంగా లోబడివుంటూ ఆర్యరచనా విధానాలను గురించి ధీర్ఘంగా ఆలోచించినవాణ్ణి. దానికి సంబంధించిన కొత్త కొత్త ప్రయోగాలు చేయటానికి ప్రయత్నించిన వాణ్ణి (కుందుర్తి కృతులు పుట-2)లో తెలిపాడు. సామాన్య మానవుడి చుట్టూ ఉన్న చీకటి పొరలను తొలగించే ప్రయత్నంలో వచన కవితా మార్గాన్ని ఆయుధంగా మలుచుకున్నారు.మానవ సంవేదనల కేంద్రంగా వనచ కవితకు ప్రణమిల్లిన కవి కుందుర్తి.
   ఫ్రీవర్‌ ఫ్రంట్‌ అవార్డును స్థాపించి యువ కవులను ప్రోత్సహించి, కవిత్వానికి ఒకింత ఉన్నతి కల్పించారు. అవార్డు ఒక ప్రతిష్టను తీసుకొచ్చారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రరాష్ట్రం నుంచి ఇప్పటి రెండు రాష్ట్రాల కవులు ఈ అవార్డు పొందితే వచనకవిత్వంలో గొప్పస్థాయిని పొందినట్టుగా భావిస్తుంటారు. ఇదంతా కుందర్తి వేసిన అడుగే ఇప్పటికీ అడుగుజాడగా ఉంది.
కుందుర్తిపై రెండు రోజుల జాతీయ సదస్సు
   కుందుర్తి శతజయంతి ప్రారంభోత్సవ సందర్భంగా.. 'వచన కవితా పితామహుడు- కుందరి' అంశంపై ఈ నెల 16, 17 తేదీలలో జాతీయ సదస్సును, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కమీషనర్‌ కళాశాల విద్య రూసా సౌజన్యంలో ఖమ్మం ఎస్‌.ఆర్‌.బి.జి.ఎన్‌.ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ Ê సైన్స్‌ కళాశాల తెలుగు విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నది. ఇందులో 75 సాహిత్య కారులు, అధ్యాపకులు, పత్ర సమర్పణలు చేయనున్నారు. వివిధ రంగాల ప్రముఖులు, పరిశోధకులు, పాత్రికేయులు పాల్గొంటారు.
-డా|| సీతారాం కార్యనిర్వాహక కార్యదర్శి,
- డా|| జె. రమేష్‌, డా|| అనురాధ, డా|| రవికుమార్‌ సమన్వయకర్తలు

(వచన కవితా పితామహుడు కుందుర్తి జాతీయ సదస్సును ఈనెల 16,17 తేదీలలో ఖమ్మం కళాశాల నిర్వహిస్త్ను సందర్భంగా)

డా|| ఎం. వెంకటరమణ
9989000265

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.