Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదొక సమ్మోహక కవిత్వం... | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Mar 28,2022

అదొక సమ్మోహక కవిత్వం...

          వైష్ణవిశ్రీ మూడవ కవిత్వ సంపుటి వర్తమాన సమాజాన్ని బలంగా చిత్రించిన ఒక ముఖ చిత్రం. స్త్రీల పట్ల, స్త్రీ సమస్యల పట్ల స్పష్టమైన, సైద్ధాంతిక నిబద్దత, సామజిక అవ్యవస్థ పట్ల అవగాహనా దక్పథమూ ఈ సంపుటిలో బలంగా కనిపిస్తాయి. వస్తువు ఎన్నికలో, ఎన్నుకున్న వస్తువును కవిత్వంగా మలచడంలో ఆమెకు ఉన్న నేర్పు పాఠకుడిని పుస్తకం వదలకుండా చదివేలా చేస్తాయి. ఆమె కవిత్వంలో ఒక సమ్మోహనత్వం వున్నది. మామూలుగా వచనంలో అయితే రీడబిలిటీ అంటాము. కవిత్వంలో దాన్నే సమ్మోహనత్వం అంటున్నాను నేను. ఒక కవిత చదివిన తరువాత వెంటనే మరొక కవిత చదవాలనే కోరిక కలగడం ఆ సమ్మోహనత్వం మూలంగానే.
          అటుగా వంగిన ఆకాశం పేరుతో ఈ పుస్తకంలో ఒక్క కవిత కూడా లేదు. కానీ ఆ శీర్షికను జస్టిఫై చేసే కవిత ఐదూళ్లు చాలవు. ఇది స్త్రీ దక్పథంతో రాసిన రాజకీయ కవిత. భారత పార్లమెంట్‌లో బహుకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉమెన్‌ రిజర్వేషన్స్‌కి సంబంధించిన కవిత ఇది.
వెలుగు రేఖలు ప్రసరించని చీకటిలో
ఏ ఉదయ కుసుమమూ విచ్చుకోదు
నిరాశా నిస్పహలను తరిమి వేసి
దిగంతాలను తాకి వచ్చే
వేకువ పిట్ట నొకదాన్ని ఈ భూమి పైకి వదలాలి

తానుగా నడవలేని నేలపై నిలబడి
ఏ స్వేచ్ఛా గీతమూ గొంతు విప్పే సాహసం చెయ్యదు
పంజరాన్ని బద్దలు కొట్టి
గురికుదిరిన బాణాన్నొకదాన్ని
కుటిల రాజనీతిపై సంధించాలి

మూడింతుల నీటితో లేని భూమిని ఊహించలేనట్టే
కనీసం మూడో వంతు మా హక్కు నివ్వకుండా
కుదిరే పనికాదు
మాకు ఐదు ఊళ్లు చాలవు
యావద్దేశంలో సగం అడుగులు మావే కావాలి
మా సంతకాలకు మీ ఫోర్జరీలను రద్దు చేస్తున్నాం
          ఆ చట్టంలో ప్రతిపాదించినది కూడా 33 శాతం రిజర్వేషన్లు మాత్రమే. కానీ ఆ చట్టం ఆమోదం పొందడానికే దిక్కు లేదు. ఇవాల్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా ఆ చుట్టుకున్న అడ్డుకునే రాజకీయ అంగుష్ఠా మాత్రుల దగ్గర నుండి అత్యన్నత పదవిని అధిరోహించిన ప్రధాన మంత్రుల దాకా అందరూ ఆకాశంలో సగం అంటూ స్త్రీల గురించి ఉపన్యాసాలు దంచుతారు. తాము చేయవలసినవి మాత్రం చేయరు.
ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన ఇంకో కవిత 'చీకటి పార్శ్వానికో ప్రేమలేఖ'. ఈ కవితలో తను స్త్రీ పురుష సమానత్వం సాధించటానికి ఎదురయ్యే అడ్డంకుల గురించి చెప్తుంది.
ఓ నా ప్రియశత్రువా
వ్యవస్థల అండ దండలతో
నీ కుయుక్తులు కత్తులు పాతుకు పోతూనే వుండు
అని మొదలవుతుంది
రోజుకు ఒక్కో కత్తిని హత్తుకుంటూ
యుద్ధం చెయ్యటం నేర్చుకుంటాను

నా సమానత్వ కాంక్ష నీలో ద్వేషాన్ని పుట్టిస్తుంది లే
          ముఖ్యంగా ఈ వాక్యాలు చూడగానే మనకు ఏం అనిపిస్తుంది. నా సమానత్వం కాంక్ష నీలో ఎందుకు ద్వేషాన్ని పుట్టించాలి అని కదా. మరి ఎందుకంటే ఒక రకమైన సమాజం నుంచి నడిచి వచ్చిన వాళ్ళం మనమంతా. ఎప్పుడో మనువు చెప్పాడు. స్త్రీ చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో వుండాలి. యవ్వనంలో భర్త సంరక్షణలో వుండాలి. వద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో వుండాలి అని. ఎందుకంటే స్త్రీ ఒంటరిగా పురుషుడి తోడు లేకుండా జీవించటం అసాధ్యం అని. కానీ ఇప్పుడు ఈ నాగరిక యుగంలో కనీసం ఆ సంరక్షణ కూడా స్త్రీకి లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ స్త్రీకి తండ్రి సంరక్షణ వున్నట్లయితే ఈ రోజు ఇన్ని భ్రూణ హత్యలు జరిగి ఉండేవే కావు. ఒకవేళ భర్త సంరక్షణ వున్నట్లయితే నేడు ఇంత మంది సింగిల్‌ పేరెంట్స్‌ వుండేవాళ్లే కాదు. ఒకవేళ కొడుకు సంరక్షణ వున్నట్లయితే నేడు ఇన్ని వద్ధాశ్రమాలు కూడా వుండి వుండేవి కాదు. యుగాలు మారినా తరాలు మారినా స్త్రీ పట్ల పురుషుడి భావ జాలంలో మార్పు మాత్రం రావటం లేదు.
ఇంకా ఎంత కాలం ఓడిపోతు బతుకుతుంటావు
నువ్వు నేను సమాంతర రేఖలపై ప్రయాణం చేసిన నాడే కదా
జీవితం ఒక సంబరమయ్యే ది
నీ దరి దాపుల్లో నిలబడే సాహసం చెయ్యని నిజం కళ్ళలోకి
ఒక్కసారి తొంగి చూడు
నువ్వు పోగొట్టుకున్న వన్నీ నీకు దొరుకుతాయి
అప్పుడు
నిండు సముద్రానికి స్నేహ హస్తాన్ని అందిం చు
పవిత్ర పారదర్శక ఆచారాల బలిపీఠం మీద
నిలబెట్టిన అగ్నిహౌత్ర స్తోత్రాన్ని అయితేనేమి
లోలోపల దహించుకు పోతున్న
నిన్ను మనిషిగా నిలబెట్టే ప్రయత్నం లో
ఎన్నో సార్లు మంచు పర్వతంగా మారిపోతుంటాను.
          ఈ లైన్లు చదువుతుంటే... నిజానికి ఒక సాధారణ స్త్రీ ఒక రకంగా అధీనత్వాన్నే కోరుకుంటుంది అన్పిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ అధీనత్వం అనేది అణచివేతగా రూపు మార్చుకుంటుందో అప్పుడు స్త్రీ సమానత్వం కోసం తిరుగుబాటు చేస్తుంది.
ఆమె నొసటన ఉదయాలు

ప్రపంచమెపుడో నాగరికత నేర్చుకుందట
ఆమె అక్కడే ఆగిపోయింది
అమ్మతనంతో
దాచుకున్న నెమలి పింఛం అలాగే వుంది
కళ్ళు మూసి తెరిచేంతలో
బాల్యం వెళ్ళిపోయింది

చావు పల్లకీలో ఊరేగుతూ
అతను వెళ్ళిపోయాడు
గాజులు పువ్వుల నిండా రక్తపు మరకలు
ఇంతగా గాయ పరిచిందేవ్వరో నుదురు బోసి పోయింది
తెల తెలవారుతుండగానే సూర్యుడు ఉదయించాడు
విధవని శంకించలేదు
ఎన్నో రాత్రులు ఆమె శరీరాన్ని అంటి పెట్టుకునే వుంది
భూమి కేమీ కీడు జరగలేదు
ఆమె నాసికాపుటాలు వదిలిన గాలి పచ్చని చెట్టయి మరింత నేలలో పాతుకు పోయింది
తెల తెల వారుతుండ గానే సూర్యుడు ఉదయించాడు
          అవును సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడుకి ఏ మచ్చా మైలా మకీలా అంటదు. స్త్రీ ప్రకతిలో భాగం. ప్రకతిలో సూర్యుడు కూడా భాగమే. ప్రాకతిక శక్తులకు వున్న ఈ జ్ఞానం ప్రకతిని జయించాలనుకునే మనిషికి లేక పోయింది అందుకే ఆమెకు విధవ అని ముద్ర. తిరిగి ఆమె ఏమిచ్చింది. ఆమె శ్వాస ఈ సష్టికి ప్రాణం పొసే పచ్చని చెట్టు అయింది. గాజులు పువ్వుల నిండా రక్తపు మరకలు దేనికి సంకేతం? సున్నితమైన అంతరంగం వున్న స్త్రీ లో నొప్పిని భరించే శక్తికి సంకేతం. ఆమె ఎంత బలమైనదో చెప్పే సంకేతం. ఈ కవిత లో అమ్మతనాన్ని నెమలి పింఛమ్‌ తో పోల్చడం మంచి కవి సమయం. విచ్చుకున్న విప్పారిన నెమలి సప్త వర్ణ శోభితం లా ఎలా ఉంటుందో అమ్మ తనంలోనూ ఆ సప్త వర్ణ మిశ్రమం వుంది. అది అమ్మ అయితే తప్ప తెలీదు. అమ్మకు అమ్మ వై పుడితే తప్ప అమ్మ ఋణం తీరదు అన్నారు కవి గోపి. కానీ అమ్మలా పుట్టాలంటే ఎన్ని సార్లు పురుషుడుగా చచ్చిపోయి బతకాలి
అలాగే ఈ సంపుటిలో నాన్న మీద ఒక కవిత వున్నది. అది చదువుతున్నప్పుడు నాకు ఇటీవల విడుదల అయిన గంగూభాయి కథీయవాడి సినిమా గుర్తొచ్చింది. అందులో ఒక సన్నివేశంలో తల్లి పేరు అనగానే గంగూబాయి అని అలియా భట్‌ చెప్తుంది. వెంటనే తండ్రి పేరు అంటే ''రాసుకో ! దేవానంద్‌'' అంటుంది. దేవానంద్‌ అప్పటి తరం సూపర్‌ స్టార్‌. ఆ సంభాషణ విన్నప్పుడు పెదవుల మీద చిన్న చిరునవ్వు వికసించినా, గంగూబారు చెప్పిన మాట వెనుక వున్న విషాదం మనసును కుదిపేస్తోంది. ఆ సన్నివేశ సారాంశం మొత్తాన్ని వైష్ణవీశ్రీ ఒక్క మాటలో చెప్పింది. ''నాన్న అంటే గౌరవానికి ఒక భరోసా'' అని
అలాగే ఈ కవితని చూడండి
చరిత్ర ఆమెను కేవలం పునరుత్పత్తి ప్రయోగశాలను చేస్తే
మీరు ఆమె చిరునామాను వ్యక్తిగా చెరిపేస్తున్నారు
మూర్ఖుల్లారా!
ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆమె సంతకాన్ని
వంటింటికి పరిమితం చేస్తున్నారు
నష్ట పోతున్నది మీరే!

          ఇది చదవగానే నాకు ముస్సొలిని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఏంటంటే స్త్రీకి మాతత్వం ఎలాగో పురుషుడికి యుద్ధం అలాగ. స్త్రీకి మూడు బాధ్యతలు వుంటాయి అవీ ఏంటంటే పిల్లల్ని కనటం, రొట్టెల తయారీ, వంటిల్లు సర్దుకోవడం అని అందుకేనేమో వైష్ణవి గారు
ప్రపంచానికి నిన్ను పరిచయం చేసిన ఆ మనిషి
ఈ దేశానికి ఒక పౌరురాలు అని గుర్తుందా ?
పొగడ్తల అక్వేరియంలో
చేప పిల్లలా బంధించక వదిలి చూడు
నువ్వు బతికే సమాజానికి
నాయకురాలు కాగలదు
అంటుంది. ఎంత నిజమో కదా. కేవలం స్త్రీవాద కవితలే కాక సమాజంలో ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యల మీద అనేక కవితలు ఇందులో మీరు చూస్తారు.

- నీలిమ
  9866334415

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథకుడుగా విశ్వనాథ
టాగోర్‌ కథల్లో సామాన్యుని ప్రపంచం
సురభి కళా శిఖరం
నాకు ఎన్నికలు అంటే భయం
అనుభవమే జీవితం
అంబ పలకడం లేదు...
''గుర్తుకొస్తున్నాయి!''
10న శబ్ధ్‌ కే పరే గ్రంథావిష్కరణ సభ
తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి

తాజా వార్తలు

09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

07:30 PM

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

07:17 PM

ఒకేసారి యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి, కూతురు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.