Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చెమట చుక్కల వాసన వెలుగుపూలు | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 09,2022

చెమట చుక్కల వాసన వెలుగుపూలు

రమేష్‌ సంఘర్షణ నుండి ఉద్భవించిన భావ తరంగాల ప్రతిబింబాలు. ఈ పుస్తకంలో వెలుగు పూలను తల్లిదండ్రుల ఆత్మీయతకు, భార్యపై ప్రేమకు, శ్రమైక జీవన సౌందర్యానికి, సాంఘిక చైతన్యానికి, సామాజిక స్పృహ‌ అన్వయించి కవిత్వీకరించారు.
ఈ కవితా సంపుటి ప్రారంభంలోనే మనసు గిటారు మీటింది నా ఎదని పొక్కిలి చేసింది పాదరసంలా జారిపోకు వంటి కవితా శీర్షికలతో తొలి ప్రేమ మాధుర్యం నుంచి ప్రణయాన్ని కొత్త బావ ప్రతీకలతో మనసును హత్తుకునే విధంగా ఉంటాయి.
పచ్చి కొమ్మను మెలి పెట్టినట్లు/ నా మనసుని మెలిపెట్టి ఉంది. ఒక అమ్మాయి తన మనసును మెలి పెట్టింది. అది పచ్చి కొమ్మను మెలి పెట్టినట్లు మనసు కడలిలో ఆటుపోట్లు రేపి మనసును కదిలించింది అని హద్యంగా చెబుతాడు. పెదాల పర్వతాలపై నుండి /జారిన మాటలు/ నా తనువు పుష్పం పై/ భ్రమరంలా వాలిపో అంటాడు.
'నా మనసు కడలిలో సునామీ సష్టించింది' అనే కవితలో స్వచ్ఛమైన ప్రణయం తొలి సంబరం ఎంత బాగా ఉంటుందో తెలుపుతాడు, 'ప్రేమ పక్షులను బ్రతకనిద్దాం' అనే కవితలో పువ్వు వికసించినా అంత సహజంగా ప్రేమ వికసిస్తుంది సమాజంలోని కులమతాల కారణంగా పరువు హత్యలు జరుగుతున్నాయి కంప్యూటర్‌ యుగంలో కూడా ఈ పాశవిక చర్యలను ఖండించి ప్రేమను బతికిద్దాం. ప్రేమపక్షులు స్వేచ్ఛగా ఎగరనిద్దాం అంటూ నిలదీస్తాడు.
మాటల మధుర బంతులను విసిరి మనసు పొరల్లో పెనవేసుకున్న అర్ధనారి తన జీవిత భాగస్వామి గురించి ఎదపై గువ్వలా వాలి సప్తపదులు నడిచింది అంటాడు ధనలక్ష్మీ దరిచేరి కనక వర్షం కురిపించింది అంటాడు.
కవి అమ్మలో పరమాత్మను చూసు కుంటాడు. రక్తాన్ని పాలుగా మార్చిన అమ్మ మాటలకందని మహాకావ్యం, సష్టికి మూలాధారం అమ్మేనని అమ్మ కడుపు తీపిని అక్షరీకరించాడు. చిన్ననాటి నుండి నాన్నను గమనిస్తూ చెమట బిందువుల త్యాగాలను ఆకలింపు చేసుకుని నాన్న గుండె ధైర్యాన్ని త్యాగశీలి తను కొనియా డుతూ మా నాన్నే నా రోల్‌ మోడల్‌ అంటాడు.
స్వతహాగా ఉపాధ్యాయుడైన రమేష్‌ పిల్లల పట్ల అమితమైన ప్రేమను ప్రకటిస్తాడు. నవ్వుల నెలవంకలు రేపటి భావిభారత నిర్మాతలు జాతి మురిసిపోయే అగ్గిపిడుగులు జ్ఞానాన్ని వెదజల్లే పరిమళాలు అని మురిసిపోతాడు. కరోనా విలయతాండవంలో పాఠశాలలు మూతపడి పిల్లలందరూ ఇళ్లకే పరిమితమై బోసిపోయిన పాఠశాలను చూసి బాధపడతాడు. కరోనా అనంతరం పాఠశాలలు తెరుచుకోగానే పిల్లలందరూ పాఠశాలకు రావడంతో గేట్లన్ని తెరుచుకొని స్వాగత తోరణాలుగా ఆహ్వానం పలకడం పక్షులన్నీ ఏకమై పిల్లలతో జాతీయ గీతం బందగానం చేయడం, మైదానమంతా పిల్లల పాదాలు తాకిడితో మురిసిపోవడం మురిపంగా కవిత్వీకరించారు. ఆ తర్వాత సామాజిక సమస్యలు కరోనా వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు, బాధలు, రాజకీయ వ్యవస్థలోని ప్లాస్టిక్‌ నవ్వుల రహస్యాన్ని విప్పి చెబుతాడు, ఈ దేశానికి ఆయువు పట్టులాంటి యువత మత్తు మందుకు బానిస కావడం డ్రగ్స్‌, హెరాయిన్‌, గంజారు వంటి మత్తు పదార్థాల వల్ల జీవితం నాశనం అయిపోతుంది అని ఆవేదన చెందుతాడు. 'తరువు' కవిత ఖండికలో చెట్టు ప్రాధాన్యతను మన కళ్ళ ముందుంచుతాడు.
'అంబేద్కర్‌ మహాశయుడు' 'చెడును చెరిపేద్దాం 'ఊరి చివర గుడిసెలు' 'నేటి మగువ' అనే కవితా ఖండికలో భారతదేశంలో స్వేఛ్చ, సమానత్వం, సౌభ్రాతత్వం ప్రబోధించి దేశానికి మార్గదర్శిలైనా అంబేద్కర్‌ మహానీయుడి జయంతులు, వర్ధంతులు జరుపుకోవడం వదిలి వేయడం కాదు ప్రతి గుండెలో అనునిత్యం అతని ఆదర్శాలతో జీవించాలని ప్రబోధిస్తాడు. భారతదేశంలో వేళ్ళూనుకొనిపోయిన మనువాద సిద్ధాంతాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని స్వార్థపరులు సోమరిపోతులు కుల వ్యవస్థను కాపాడుకుంటారని, సమాజంలో అలాంటి కలుపు మొక్కలను ఏరి పారేయ్యాలి అంటాడు. ప్రస్తుతం రాజ్యాంగం మార్చాలనే చర్చ చేసే వాళ్ళకి రాజ్యాంగానికి తూట్లు పొడవడం మానేయాలని హెచ్చరిస్తాడు. భారత రాజ్యాంగం చేసిన శాసనాలు చట్టాల పట్ల గౌరవం లేకపోవడం కుల వ్యవస్థను కాపాడేవాడే చేస్తారని అంటాడు. రాజ్యాంగానికి పునాది సమానత్వం. కుల వ్యవస్థకు పునాది అసమానత్వం. రాజ్యాంగం మానవ నిర్మితమైనది. కుల వ్యవస్థ దేవుళ్ల ద్వారా నిర్మించారని చెబుతారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తుంది. కుల వ్యవస్థ నియంతత్వాన్ని పోషిస్తుంది. రాజ్యాంగం అన్ని మతాల వాళ్లకి ఆచరించదగ్గ గ్రంథం. కుల వ్యవస్థను కాపాడుకోవాలనే వారే రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం, వక్రీకరించడం, నిర్వీర్యం చేయడం వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారిని తీక్షణంగా గమనించ వలసిన అవసరం ఉంది అంటారు. 'చరవాణి' కవితలు సెల్‌ ఫోన్ల వలన పిల్లలు యువత అశ్లీలత ఆదరించే స్థాయికి వచ్చారని వారిని కనిపెట్టుకుని ఉండాలంటారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఖండించాలి అంటారు. సూర్యుని నిద్రలేపే అడ్డా కూలీల దుఃఖాన్ని తెలుపుతారు.
కవి రమేష్‌ ప్రతి కవితలో ప్రారంభంలో సమస్యను కవితాత్మకంగా చెప్పుకుంటూ చివరిలో పాఠకుడికి పదునైన ప్రశ్నలు వేస్తారు మరి కొన్ని కవితలు సమాధానాలు ఉంటాయి కవికి పాఠకునికి మధ్య నిరంతరం ఆలోచనల ప్రవాహం సాగుతుంది. ఈ గ్రంథానికి 'వెలుగు పూల పరిమళం' అనే ముందుమాట రమేష్‌ అంతరంగాన్ని పట్టి చూపించారు సాహితీ ప్రపూర్ణ ఆచార్య బన్న ఐలయ్య గారు. నిజాయితీతో కూడుకున్న ప్రజాపక్షం కవిత్వమని ప్రముఖ కవి రామా చంద్రమౌళి మలినం అంటని కవిత్వమని సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్‌ ముందు మాటలు ఈ గ్రంథాన్ని ఆసాంతం చదవడానికి ఉపయోగపడతాయి.

- డాక్టర్‌ కర్రె సదాశివ్‌, 9949424726

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.