Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం'' | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 09,2022

సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''

ఒక అక్షరం సజనాత్మకతతో కలం నుండి సమాజంలోకి జారనంత వరకే వ్యక్తిగతం. ఒక్కసారి సమాజాన్ని తాకిందా అప్పుడు ఆ సజనాక్షరం కచ్చితంగా సమాజికమే. ఇది సాహిత్య ప్రాధమిక సూత్రం. అప్పుడే కదా అభినందనల వెల్లువ, నిర్మాణాత్మక విమర్శా మయూఖ మేఖలై స్వతంత్రంగా, నిర్భయంగా వెలువడుతాయి. ఏ కవిగానీ పాఠకుల నుండి ఆశించేది ఇదే. కవిగా తను ఎక్కడున్నది తెలుసుకొనే గొప్ప వాహకం, అవకాశం కూడా ఇదే కవి ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌కు.. నిలువెల్ల గాయాల బాధలే ''పరావలయం'' కవిత్వతత్వమైంది.
కవి ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ 2014 లోనే 'దుఃఖానంతర దశ్యం' తొలి కవిత్వంతో పాఠకుల మన్ననలందుకున్నారు. తర్వాత 2021లో 'పరావలయం' తన ద్వితీయ కవితా సంకలనం 2022లో సాహిత్య లోకం ఒడిలోకి వచ్చింది. కరోనా పాండమిక్‌ కారణంతో లేటుగా. ఇది ''లేట్‌ కాదు లేటెస్ట్‌'' అని సినారే అన్నట్టుగా...
ఇక పరావలయం ప్రతి పేజీ నా వేళ్ళకొనలను తిప్పేసింది. ఈ కవిత్వ సంకలనంలో 52 కవితలు పాఠకులను పలకరిస్తాయి. మొదటి కవిత 'నిజం నిలకడ మీద' నుండి చివరిగా 'హామి' కవిత వరకూ సాగే కవిత్వ యానం సుదీర్ఘం. అన్ని కవితలూ 2015 -2021 మధ్య వివిధ పత్రికల్లో ప్రచురించబడినవి. లోతైన భావ సాంద్రత, విశాలమైన సామాజిక పరిధిలో మానవీయ కలంచేత రాయబడ్డవే కాకుండా ప్రతి పంక్తిలోనూ నిబధ్ధతతో కూడిన నిజాయితీ కనిపిస్తుంది. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. జీవితంలో విలువలతో కూడిన నిజాయితీ గల కలాలకే సాధ్యం. ఆ కోవకే చెందిన సజనశీలి ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ అక్షరాలా.
ప్రవీణ్‌ కవిత్వాన్ని తరచి చూస్తే ఎందరో కవుల ప్రభావం ఉన్నట్టు తెలుస్తుంది. తిలక్‌, శ్రీశ్రీ, అజంతా మొదలగు కవుల డిక్షన్‌తో పాటు తాత్వికతలో సమాజిక పరిశీలన పరిశోధనాసక్తీ కనిపిస్తుంది. అలాగే నేటి అనుభవమున్న కవులూ, వర్తమాన వర్ధమాన కవుల ప్రభావం కూడా కనిపిస్తుంది. సమాజాన్ని ప్రేమించే ఏ కవి గానీ వ్యక్తి గానీ మొదట మనిషినీ, ఆ మనిషి బాధనూ కన్నీటినీ దుఃఖాన్నీ ప్రేమిస్తాడు. అతడే ఇలాంటి వస్తువులను తన కవిత్వంలో ప్రతిక్షేపించగలడు. ఆ కవిత్వాన్ని పరావలయం ప్రతి కవితలోనూ ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ అందిపుచ్చుకున్నారు. పూర్వ వర్తమాన సీనియర్‌ కవులే కాకుండా వర్ధమాన కవుల స్ఫూర్తినీ ఒంపుకున్న ప్రవీణ్‌ కవిత్వం చరిత్రలో నిలబడుతుందని చెప్పొచ్చును.
సలపరింతల గాయాల పలవరింతే పరావలయంలో వస్తువు. అభివ్యక్తి ప్రతి కవితలోనూ కొత్తగా మెత్తగా కనిపించేవి రక్తచారల గాయాలే.. ఇక పుస్తకంలోకి చూస్తే ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌లో విషయం బాగా ఉందని తెలుస్తుంది. అలాగే పరావలయం కవిత్వంలో కూడా. ముఖ్యంగా ఎత్తుగడ, ముక్తాయింపు చాలా గంభీరంగా, బలంగా ఉండి కవిత్వానికి ప్రాణం పోస్తున్నాయి. ఇక శిల్పం, అభివ్యక్తి చాలా పొందికగా, హూందాగా ఉండి కవిత్వానికి వన్నెతో కూడిన జీవం తెస్తున్నాయి. మచ్చుకు కొన్ని కవితలను పరిశీలిద్దాం.
మొదటి కవిత 'నిజం నిలకడ మీద'లో ఎత్తుగడ నెత్తుటి మరకల మీదుగా నిద్రలేచాను అంటాడు. ఒక గంభీరమైన విషయాన్ని మొదటి వాక్యంలోనే రాశాడు. ఇక శిల్పం మనిషికీ మనిషికీ మధ్య / మనిషికీ మనసుకీ మధ్య / తెగిపోతున్న అనుబంధపు గావుకేక..ఎంత చక్కగా శుభ్రంగా ఉందో కవితా గమనం, శిల్పం. అభివ్యక్తి కొత్తగా చెప్పాడు.
అదే వినగలిగినా వినలేని చెవులు, మాట్లాడగలిగినా మాట్లాడని గొంతు..ఎందుకూ అంటే సమూహంలో ఒంటరిగా ఆత్మహత్యనై వెక్కిరించిన సందర్భం అని అంటాడు కవి. కవితను నడిపిస్తూ ముక్తాయింపులో... పుస్తకాల గుండెల్లో, దాస్‌ క్యాపిటల్‌ కై వెతుకుతున్నాను. అంటే ఒక పరిష్కారం వెతుకుతున్నాడు. మార్క్స్‌ దాస్‌ క్యాపిటల్‌ లో ఆర్ధిక రాజకీయ సిధ్ధాంతాల సారాన్ని తెలిసివాడు కవి. అందుకే పీడిత బాధితులకూ కార్మికులకూ ఉపయోగపడేలా కవిత్వంలో వివరించారు. కాబట్టే కవి ముక్తయింపుకు గొప్ప ప్రాముఖ్యం ఉన్నది. ఇలా కవి వివిధ వస్తువులను తీసుకొని రాసిన కవిత్వంలో బాధలు, బాధితులు, సంఘర్షణ, కష్టాలు ఇలా ఎక్కువగా కనిపిస్తాయి.
అలాగే పరావలయం కవిత ఈ కవిత్వంలో హైలైట్‌. ఎత్తుగడలోనే ''నా కలలు ఎవరో ఎత్తుకెళ్ళారు, పున్నమి వెన్నెల్లో, పూదోటల్లో పరిమళమై విహరిస్తున్న నా కలలను ఎవరో ఎత్తుకెళ్ళారు'' అంటాడు. అంటే దొంగిలించారని, దోచుకున్నారని చెప్పుతున్నాడు. కానీ, ఎవరో ఎత్తుకెళ్ళారు అనే అభివ్యక్తి సాంద్రమైనదిగా ఉంది.
ముగింపులో.. ''మొగ్గలు దోసిట్లో పూలౌతున్న సమయాన / నా కలల కన్నులను ఎవరో ఎత్తుకెళ్ళారు'' ..అంటే బతుకంతా పరావలయమనీ, పరాగమనంలో పరావర్తనమని కవి బలంగా నమ్మి చెపుతున్నారు.
ఇలా సంవేదనల సంఘటనల్లోంచి కొంత తేరుకొని ''శ్రీ దేవి'' కవితలో సుందర జీవన సౌందర్యంలోని జీవితంలోని చరమాంక దుఃఖాన్ని స్మతి కవితగా రాసినారు.
''నీ కళ్ళు మా వూరి చెరువులో / కలువ పూవులై వికసించుకున్నవి'' అంటాడు ఎత్తుగడలో. శ్రీదేవి జగదేక సుందరి,మహానటి. ఆమె కళ్ళు ప్రపంచం చెరువులోనే కలువ పూవులై వికసించి ప్రేక్షకుల మనసులలో కొలువైన దేవత ఆమె. కవిత ముగింపులో... ''పువ్వులు నీ వియోగాన్ని తట్టుకోలేక కన్నీటి ధారలై'' అంటాడు. మెలాంఖలిలోని ఆర్ద్రమైన బాధ, దుఃఖాన్ని గొప్పగా, తాజాగా కవితలో చెప్పారు.
ఇలా 52 కవితలు వస్తుపరంగా కవిత్వపరంగా చాలా గొప్పగా ప్రతిభావంతంగా ఉన్నాయనుటలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. దీంతో కవి మెళకువలు, వస్తుతా అవగాహన, మీదు మిక్కిలి కవి కఠోర శ్రమ, తపన, తండ్లాట సమాజం పట్లగల బాధ్యత ప్రస్ఫుటంగా తెలుస్తున్నవి.


- డా.టి.రాధాకష్ణమాచార్యులు
   9849305871

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు
అనుభవం ముఖ్యం కనుక...

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.