Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శిలావీ పె(క)న్ను మూత | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jun 06,2022

శిలావీ పె(క)న్ను మూత

ఆరు దశాబ్దాల సాహితీ అనుబంధం తెగిపోయింది. గగనంలోకి కుంచెను మోసుకు మైనా ఎగిరిపోయింది. కొన్ని రంగులద్దిన జ్ఞాపకాలనూ, శిల్పంలా పేర్చిన అక్షరాలనూ మనకొదిలి వీర్రాజు నిష్క్రమించారు.
సాహితీ లోకంలో శిలావిగా ప్రఖ్యాతినొందిన ఆయన 1939 ఏప్రిల్‌ 22న రాజమండ్రిలో జన్మించిన ఆయన విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నాటకాలు వెయ్యడం, కథలు రాయడం, బొమ్మలు వేయడంలో విశేష ప్రజ్ఞ చూపారు. 1959లో ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఇరవై ఏళ్ళ వయస్సుకే కృష్ణా పత్రికలో ఉప సంపాదకులుగా చేరారు. ఆయన సుభద్రాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా తెలుగు నాట ప్రఖ్యాత రచయిత్రిగా పేరు పొందారు. అనువాద రచనలు చేయడంపై ఆయన ఎంతో మక్కువ చూపారు. 1963లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖా కార్యాలయంలో అనువాదకునిగా ఉద్యోగం చేసి 1990లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఎందరో రచయితల్ని ఆయన తీర్చి దిద్దారు. ఎందరో కవుల, రచయితల పుస్తకాలకు ముఖ చిరతాలు వేసారు. చిత్రకారునిగా పలు చిత్ర కళా ప్రధర్శన శాలలు పెట్టారు. (ఆర్ట్‌ గ్యాలరీలు) 'మైనా' నవల ఆయనకు విశేష పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. తమ మిత్రుడు గురు సమానుడుగా భావించే సహోద్యోగి ప్రముఖ కవి, వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు పేర ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రతి యేటా కవులకు 1984 నుండి అవార్డ్‌లు ప్రధానం చేస్తూ వస్తున్నారు. రావూరి భరద్వాజ గారితో అద్భుత నవల రాయించారు. మాయా జలతారు పేరును మార్చి 'పాకుడు రాళ్ళు'గా విడుదల చేయించారు. 2013లో జ్ఞానపీఠ అవార్డ్‌ అందుకొంది ఆ నవల. అభ్యుదయ భావాలతో, వామపక్ష సాహిత్య కారులతో, సంఘాలతో సాన్నిహిత్యం కలిగి వుండే వీర్రాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాహితీ స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
వెలుగు రేఖలు, కాంతి పూలు, కరుణించని దేవత, మైనా అనే నవలలు రాశారు. కొడిగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్ళీ వెలుగు అనే కవితా సంపుటులు రచించారు. 'కలానికి అటూ - ఇటూ' అనే వ్యాస సంపుటి ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.
సమాధి, మబ్బు తెరలు, హ్లాదిని, రంగుటద్దాలు, పగ మైనస్‌ ద్వేషం, వాళ్ళ మధ్య వంతెన, మనసులో కుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది శీలా వీర్రాజు కథా సంపుటాలు. ఆయనకు పేరు తెచ్చాయి. రచనల్లో సౌందర్యాత్మక భావన, అభ్యుదయ దృక్పథం, చిత్ర కళా నవ్య శైలి శిలావిని పాఠకులకు దగ్గర చేసాయి. కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, బతుకు బాస... రచనల్లో 'కిటికి' స్వీయ చరిత్ర.
ఊరు వీడ్కోలు చెప్పింది, సమాధి, మబ్బు తెరలు కథలు పెక్కు బహుమతులొందాయి. కుందుర్తి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డ్‌ తొలిగా శిలావి రాసిన ''కొడిగట్టిన సూర్యుడు'' కవిత్వ సంపుటికి దక్కడం విశేషం. వచన కవిత్వ రచనలో కథాప్రక్రియను సమ్మిళితం చేసి 'కొడిగట్టిన సూర్యుడు' సంపుటిని కుందిర్తి ప్రోత్సాహంతో వచన కవిత్వంపై మొగ్గుతో రాసారు శిలావి.
ఆయన కుంచె నుండి లేపాక్షి శిల్ప లేఖా చిత్రాలు జాలువారేయి. అవి చూసిన నందమూరి తారక రామారావు ముగ్ధుడైనారు. తన ముఖ్యమంత్రి పేషిలో శిలావిని, స్క్రిప్ట్‌ రైటర్‌గా నియమించుకున్నారు. అప్పటికే ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. భీమన్న వచన కవితా పురస్కారం, తెలుగు యూనివర్శిటీ ఉత్తమ కథా పురస్కారం, కొండేపూడి సాహితీ పురస్కారం లాంటివెన్నో ఆయన ప్రతిభకు లభించాయి.
తాను పేద కవి కవితా సంపుటులకు దాదాపు 500కి పైగానే ఉచితంగా (కవర్‌పేజీ) ముఖచిత్రాలు అందించానని ఒకానొక సందర్భంలో శిలావి చెప్పారు. దిగంబర కవిత్వం నుండి నేటి కాలం కవిత్వం - కవులతో సహా కలిసి సాహిత్యోద్యోమాల్లో అడుగులు వేసిన శిలావి తన 83వ ఏట క(పె)న్ను మూసారు. సాహితీ లోకంలో ఆయన జ్ఞాపకాలు అమరం.

- తంగిరాల చక్రవర్తి , 9393804472

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తొణకని కవికి పాకాల యశోదా రెడ్డి పురస్కారం
పాకాల యశోదారెడ్డి కథలు - పల్లె జీవనం
తెలంగాణ కవిత్వానికి ప్రతిబింబం సుంకర రమేశ్‌ Bliss of Breeze
ప్రవాస భారతీయుల నేపథ్యంలో వచ్చిన ''అయిదో గోడ'' - ఆధునిక స్త్రీ జీవితం
నలిమెల భాస్కరోక్తుల శతకం
తాడిమీద మెతుకు యుద్ధం- కల్లంచుల బువ్వ
''తెలంగాణ యక్షగాన సృజనశీలి పనస హనుమద్ధాసు''
నాట‌కంలో ప్ర‌పంచం
శ్రామిక జీవన సౌందర్య ఆవిష్కరిణి మల్లెసాల
ఏడున్నర పదుల నిత్య బాలుడు 'చొక్కాపు వెంకటరమణ'
మేరియో ప్యూజో నవల ''గాడ్‌ ఫాదర్‌''- ఒక పరిశీలన
''సమయమిదే''
లోకం పోకడ
కలలు
కవితలకు ఆహ్వానం
తుమ్మెదల విలాపం
కథకుడుగా విశ్వనాథ
టాగోర్‌ కథల్లో సామాన్యుని ప్రపంచం
సురభి కళా శిఖరం
నాకు ఎన్నికలు అంటే భయం
అనుభవమే జీవితం
అంబ పలకడం లేదు...
''గుర్తుకొస్తున్నాయి!''
10న శబ్ధ్‌ కే పరే గ్రంథావిష్కరణ సభ
తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.