Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తిరుమల గిరి లోయల్లో పల్లవించిన దృశ్య కావ్యం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

తిరుమల గిరి లోయల్లో పల్లవించిన దృశ్య కావ్యం

           నిజమైన మార్క్సిస్ట్‌లకు విశ్వంలో వున్న ప్రతిదీ పరిశీలనార్హం. రాఘవ శర్మ పుస్తకం గురించి విన్నాక ఆసక్తి కలిగింది! ఒక మార్క్సిస్ట్‌ ప్రేమికుడికి తిరుమలగిరుల్లో యేం దొరుకుతుంది అనే సందేహాస్ప దులకు సైతం ఆయన పుస్తకం ఒక కళాత్మక అనుభూతిని మిగుల్చుతుంది. తిరుమలేశుడి గురించో, కోట్ల భక్తులు అనునిత్యం దర్శించే ''పుణ్య'' క్షేత్రాల గురించో కాకుండా (వీటి గురించి ఈ దేశంలో తెలియని వారెవ్వరు?) శేషాచలగిరుల్లో, లోయల్లో, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం రాతి పొరల్లో సుడులు తిరిగి ముడులు వేసుకున్న అవక్షేప శిలా శైథల్యాల లోయల్లో నేరుగా దిగి ఒక జియాలజిస్ట్‌ క్యూరియాసిటీతో అసలు సిసలైన దర్శనీయ ప్రదేశాల్ని ఒక దృశ్య కావ్యంగా మలచారు.
           తిరుమల దృశ్య కావ్యంలో భక్తులు పరమ శ్రద్ధతో వెతుక్కునే బ్రహ్మోత్సవాలో, మాడ వీధుల్లో వూరేగింపులో, పవళింపు సేవల దృశ్యాలో ఇందులో ఎక్కడా లేవు! సర్వాంతర్యామి తాలూకూ ఆనవాళ్లు కూడా ఎక్కడా కనరానే లేదు! భక్తి రస ప్రవాహాలు మచ్చుకు లేవు! భక్తుడు తాను సృజించుకున్న భగవంతుని ముందు తనని తాను పిపీలికంగా భావించుకుంటూ వినమ్రు డౌతాడు. సజీవంగా వున్న అనంత ప్రవృతిముందు ప్రవృతి పరిశీలకుడు అప్రతిభుడౌతాడు. ఇది నూరు పాళ్లూ ''తిరుమల'' కావ్యమే, కానీ ''తిరుమలేశు''ని వూసులేని ''తిరుమల'' కావ్యం.
సెలయేళ్ల గలగలా రావాలూ, సేద తీర్చే చలువరాళ్ల ఆరామాలూ, నింగినంటే ఎర్ర చందనాల వృక్ష రాజాలూ, వైవిధ్యమైన ప్రాణికోటి జీవన రాగాలూ ఒకటేమిటి అనంతమైన భూమి కోటిపై విలసిల్లే సమస్త జీవధార ఈ కొండ కోనల నడుమ విరాజిల్లుతోందన్నట్టు ఆ పర్వత సానువుల్లో మనని నడిపిస్తూ ''అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని'' మరిపించే మరో లోకంలోకి తీసుకెళతారు. సెలయేటి పరవళ్ళు, నెలకోన వెన్నెల్లో గిల్లి తీగలపై వుయ్యాల సంబరాలు, తలకోన వెంటే దివి నుండి భువికి అనంత ఉల్కాపాతంలా జారే గుంజన జలపాతం, అడుగడుగునా పొంచి వుండే గండాలు, బ్రహ్మ గుండాలూ, విష్ణు గుండాలు, సేద తీర్చే అరిమాను బండలు, ఎఱ్ఱొడ్ల మడుగులూ, గుర్రప్ప కొండలూ, 270 అడుగుల ఎత్తు నుండి వెన్నెల్లా జీరాడే తల కోన జలపాతపు హోరు, చిరు మాను చెట్లూ, అల్లిబిల్లిగా అల్లుకుపోయన అల్లి తీవలూ, నల్లబలుసలూ, అనంతమైన ప్రకృతిశోభ నిజంగా హృదయాన్ని రాగ రంజితం చేస్తాయి.
           అంతే కాదు పరిశోధకుడిగా ఇంగువ కార్తికేయశర్మ సాహసం గురించీ, గుడిమల్లం శివలింగం గురించీ, చంద్రగిరి దుర్గం గురించీ, లంకమల రాతి సితారపై జారుతూ వినిపించే జలస్వరాల గురించీ మనోహరంగా అక్షరబద్ధం చేశారు రాఘవశర్మ. ఇందులో వర్ణ చిత్రాలు సమ్మోహనంగా వున్నాయి.
ఎన్నిసార్లు ఎక్కి దిగారో, ఎంత శ్రమించారో, ఎంతగా సాహసించారో ఈ పుస్తకాన్ని చూసిన వారికి తప్పక అర్థం అవుతుంది అది నిజంగానే ఒక దృశ్య కావ్యమని! ఒక విలక్షణమైన అపురూప కానుక అనీ! భక్తులకోసం పుస్తకం ప్రత్యేకించి రాయకపోయినా యే కొండ కోనల్లో నెలవై ఉన్నాడని తాము నమ్ముతున్నారో ఆ తిరుమలగిరుల్లో తాము తెలుసుకోదగ్గ విశేషాలు తాము తెలుసుకోదగ్గ విషయాలు అనేకం వున్నాయని ఈ పుస్తకం చదివిన తరువాత వారికి అర్థం అవుతుంది. భౌగోళిక విశేషాల పట్లా, ట్రెక్కింగ్‌ పట్లా ఆసక్తి గలవారికి ఇదొక చక్కని మార్గదర్శి.

- వి. విజయకుమార్‌, 8555802596

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏకాంత మనో సంభాషణల 'డియర్‌ జిందగీ'
హేతువాద ఉద్యమాద్రి రావిపూడి
ఎర్రజెండా
నేడు 'ఎదురీత' ఆవిష్కరణ
రేపు పెళ్ళిపాటలు పుస్తకావిష్కరణ
కవి జయరాజు, కె శ్రీనివాస్‌లకు మఖ్దూమ్‌ జాతీయపురస్కారం
కె రామచంద్రమూర్తి, కుప్పిలి పద్మలకు అరుణ్‌సాగర్‌ పురస్కారాలు
కొలకలూరి పురస్కారాల గ్రహీతలు
వీరే సఫాయి కార్మికులు
బక్రా
ఎండమావిలో ఈత
నానీలు
'గంగెద్దు' కథలు సిస్మోగ్రాఫిక్‌ కథలు
వైవిధ్య కథల సమాహారం - ఆకాశంలో ఒక నక్షత్రం
మనం మనుష్యులం కాదు
అమ్మా ఆకలైతుందే
అడవి ఆత్మను కోల్పోయాక ..!
నేడు ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్‌ యాత్ర ఆవిష్కరణ
29న నాగలికి నా నమస్కారం ఆవిష్కరణ
జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు
జన రంజక కవి ప్రతిభా పురస్కారాల ఫలితాలు
'మద్దూరి' స్మారక కవితా పురస్కార గ్రహీతలు
నిజాం వేంకటేశానికి అలిశెట్టి పురస్కారం
కందికొండ రామస్వామి స్మారక పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
గురురాజరావు కవితా పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాల ఆహ్వానం
'అక్షరాల తోవ' కథల పోటీ విజేతలు
ఏ రకమైన అనువాదం మంచిది?
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం
నానీలు...

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.