Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏకాంత మనో సంభాషణల 'డియర్‌ జిందగీ' | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

ఏకాంత మనో సంభాషణల 'డియర్‌ జిందగీ'

         'థూ దీనె... జీవితం, దీనెబ్బ జీవితం...' ఆధునిక కాలంలో మనిషి ఎక్కువ తిట్టుకుంటున్నది ప్రభుత్వాల్నో, రాజకీయ నాయకుల్నో కాదు. తనతో తనకు సమన్వయం కుదరని జీవితాన్నే ఎక్కువగా తిట్టుకొంటున్నాడు. గ్రౌండులేని పాఠశాల కిటికీ చువ్వల మధ్య చిక్కుకొన్న బాలుడు నుంచి రెంట్‌, ఇంటరెస్ట్‌, ఈ.ఎం.ఐల భారంతో చెమటోడుస్తున్న వేతనజీవిదాకా అందరికీ జీవితంతో అంతర్యుద్ధం జరుగుతూనే వుంది. మరి ఈ కల్లోల కాలంలో శాంతి చర్చల బాధ్యతలెవరివి? ఖచ్చితంగా రచయితవే. 'బతుకు' బురదలో ఇరుక్కు పోతూ 'జీవించడా'న్ని అందుకోలేకపోతున్న తరుణాలే అందరివి. ఇటువంటి జీవితాలతో పొసగక 'అసలు జీవితమంటే ఏమిటి? వాస్తవానికి అదేలా ఉండాలి? మనకు దానికి మధ్యన ఎందుకంత రాపిడి?' అంటూ తనతో తాను జరిపిన మనో సంభాషణల్ని లేఖల రూపంలో 'డియర్‌ జిందగీ' కవిత్వంగా రచించారు మెర్సీ మార్గరెట్‌.
               ఆధునిక తెలుగుసాహిత్యంలో తనదైన శైలి ఏర్పరు చుకుంటూ ప్రయాణిస్తున్న యువ రచయితల్లో మెర్సీ మార్గరెట్‌ ఒకరు. 'మాటలమడుగు'తో రచనారంభం చేసి 'కాలం వాలిపోతున్న వైపు' వంటి కవితా సంపుటా లతో పాఠకాదరణ పొందారు. ఫలితంగా 2017లో 'కేంద్ర యువపురస్కార సాహిత్యం' అందుకొన్నారు. ఒకవైపు రచనలు చేస్తూనే మరోవైపు ఏ కవితా గోష్టులు, కవి సంగమాలు రచయితగా ఎదగాడానికి దోహద పడుతు న్నాయో అలాంటి వాతావరణం తనవంతుగా వర్తమాన రచయితలకు అందిచే ప్రయత్నాలు చేస్తుంది. 'దర్శన' ద్వారా రచయితలతో ముఖాముఖిలు, 'క్రియేటివ్‌ థియేటర్‌' అజరు మంకెనపల్లితో కలిసి రవీంద్రభారతి వేదికగా నాటకాలకు ప్రోత్సాహంగా నిలవడం వంటి కార్యకమాలు సైతం నిర్వహిస్తుంది.
'డియర్‌ జిందగీ' 43 లేఖలతో కూడుకొన్న కవిత్వం. తెలుగులో అన్ని కాలాల్లోను లేఖాసాహిత్యం వచ్చింది. అందివచ్చిన ఆధారాలను బట్టి చూస్తే 'సృహుల్లేఖ' మొదలుకొని చలం 'ప్రేమలేఖలు', గోపీచంద్‌ 'పోస్టు చేయని ఉత్తరాలు' వయా కుప్పిలి పద్మ 'అమృత వర్షిణి', 'ఎల్లో రిబ్బన్స్‌' నిన్నమొన్నటి కడలి సత్యనారాయణ 'లెటర్స్‌ టూ లవర్‌' వరకు తెలుగులో లేఖాసాహిత్య పరంపర కొనసాగుతూ వచ్చింది.
జీవితంలో అన్ని వేళలా ఒకేవిధమైన భావస్థితిని కలిగి ఏ మనిషి ఉండలేడు. సుఖ- దుఃఖ డోలనాలు సహజమైనవి. సంతోషంలో కలిగితే 'నిబిడాశ్చర్యంతో నింగికి... బాధలో ఎదురైతే 'నెత్తురు కక్కుతూ నేలకు... జారిపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటి నిరాశల్లో కురుకుపోయినప్పుడు జీవితం పట్ల ధైర్యం సన్నగిల్లి నప్పుడు ఏవో ఫిలాసఫీలు అందించే సహకారం కంటే తనకు తాను చేసుకొనే ఆత్మ ప్రోత్సాహం (Self-motivation) చాలా దృఢమైనది. ఇదే విషయాన్ని మెర్సీ లేచి ముఖం కడుక్కో రెండు కదిలించే వాక్యాలని తిను. శక్తి తెచ్చుకో... నా చేతిని వెలుగుతో కాల్చుకొచ్చా ఇప్పుడది కాగడా మనకి. ఇక మనం తడబడొద్దు అంటూ తిరిగి జీవితంతో భుజం కలపమంటున్నారు.
మత సంప్రదాయాల రీత్యా చూసుకొన్న, డార్విన్‌ సిద్ధాంత రీత్యా చూసుకొన్న ప్రస్తుతం ఉన్న మానవుడి జీవితం మును పటికంటే ఉన్నతమై నదే. ఎవో కొన్ని అలజడులను భూతద్దం లో పెట్టుకొని చూస్తూ జీవితాన్ని ఆస్వాదించే సోయిని కోల్పోపోతున్నాం. మనసు పెడితే జీవితంలో కన్నీరుని కూడా ప్రేమించవచ్చు. ఇదే భావనతో మెర్సీ ''ఎవరన్నారు ఎడవద్దని? ఏడువు గుండె బరువు దిగిపోయేదాకా ఏడువు. కావాలా? భుజంపై తలవాల్చుకొని ఏడ్చేరు. కళ్ళ తలుపులు తేటపడు తారు. శ్వాసమీద ఘనీభవించిన బరువు మెల్లిగా కరిగిపోతుంది. ఆకాశం కింద ఏదైనా పవిత్రమైనదుందా? అంటే అది కన్నీరే జిందగీ'' అంటూ అశ్రుధారలో కూడా ఆనందం వెతికే స్థాయిప్రేమను జీవితమంపై వ్యక్తపరిచారు.
మనిషి ఎక్కువగా నలిగిపోయేది కష్టాల తోనో నష్టాలతోనో కాదు. తనలో తనకు రేగే భావ గాఢతల వాళ్ళ ఏ భావాన్ని ఎంతవరకు, ఎక్కడివరకు తీసుకో వాలన్న స్పష్టత కొరవడింది. వాటివల్లే అసలు సమస్య ఎక్కువవుతుంది. ఆ గందరగోళం గురించి మెర్సీ.. ''ముఖాన్ని గుండెల్లో నాటుకొంటారు కొందరు. మెదుడులో నాటుకొంటారు కొందరు. ఎదురైనా జ్ఞాపకాన్ని నేను హృదయంలో లోలోతుల రక్తపు జల ఊరే దగ్గర దాచుకొంటాను నేను. జిందగీ దాచుకోవడం ఒక కళ''గా పేర్కొంటున్నారు.
ప్రతి కాగితంలో కవిత్వాన్ని సంగీతం లా ఆస్వాదిద్దాం.., కాలం దయలేనిది కసా యిది గుండె మీద పచ్చబొట్టు నిర్దయగా పొడిచి గుర్తుచేసుకోకుండా బతికేయమం టుంది... ఓ పాత జ్ఞాపకం నా గది ముందు గిటార్‌తో నిలిచి ఉంటుంది... రా జిందగీ తలుపులు మూయబడే లోపు చాలా పనులు చక్కబెట్టుకోవాలి... కాగి తాల నడుమ కొన్ని కన్నీళ్లను ఒంపి దాచి పెడుదాం... కన్నీళ్లు మనిషి చుట్టూ సజీవంగా తొణికిస లాడే ఉమ్మనీళ్ళు మొదలైన పద చిత్రాల వంటి వాక్యాలు కవితా ప్రేమికులను ఆక ట్టుకొంటాయి. ఇవే కాక మనుషులు మాట్లాడు కోలేని పరిస్థితులు, గాయాల్ని, జ్ఞాపకాల్ని దాచుకో వాలనే మమత, ప్రకృతి అందించే ఉత్తేజం, మానవ సంబంధాల్లో కలుగు తున్న డిజిటల్‌ కాలుష్యం, నిద్రరాని రాత్రిళ్ళు మనతో మనం జరిపే మోనోలాగ్స్‌... మొదలైన వాటి గురించి మెటా ఫర్లతో కూడుకొన్న గట్టి గింజల్లాంటి కవితాలేఖలు ఉన్నాయి.
'నిజానికి ఎవరి జీవితంతో వారైనా సరే సంభాషిం చుకోవాలంటే జీవన గణితం తెలిసుండాలి' అంటూ కుప్పిలి పద్మ గారి ముందుమాట విలువైనది. మెర్సీ నిరాశలో ఉన్న ప్పుడు తోడు నిలిచిన మిత్రుడు హరి కృష్ణ బండారుకి న్యాయమైన అంకితమే ఇచ్చిందని చెప్పాలి.
ప్రతి పాఠకుడికి తనదైన పుస్తకం ఉంటుంది. ప్రతి పుస్తకానికి తనదైన పాఠకుడు ఉంటారు. ఈ పుస్తకం అన్ని వర్గ సహృదయ పాఠకులను ఆకట్టుకోగలదు. అలాగే ఈ 'డియర్‌ జిందగీ' కవిత్వానికి సాఫ్ట్‌ టార్గెట్‌ పాఠకులు కొందరు ఉన్నారు. తొందర గా ఇంటికి వెళ్ళాల్సి వుండి ట్రాఫిక్‌లో ఇరుక్కున్న మహిళా ఉద్యోగి, సంపా దిస్తున్నా పెళ్ళి చేసుకోవడంలో అభద్ర తాభావం ఎదుర్కొంటున్న టేకీ, మంచి సంబంధాల కోసం కొడుకు జీతాన్ని 'రౌండ్‌ ఫిగర్‌' చేసి చెప్పే తల్లి, పిల్లలకి ఉన్నత జీవితమి వ్వడానికి జీతం చాలక జాబ్‌తో పాటు పార్ట్‌ టైం జాబ్‌లో కూడా నలుగుతున్న తండ్రి, సొంత నివాసం నుంచి వనవాసం ఎదుర్కొంటున్న వృద్ధులు... ఇలా మెట్రోపాలిటన్‌ సిటీలో అసహనపు గడియలు అను భవిస్తున్న వారంద రికీ మోనోలాగ్‌లా ఉంటుంది. ఒంటరి తనాన్ని ఏకాం తంగా మార్చుకొని జీవితాన్ని ఆస్వాదించమని గురి చూసి చెప్పే కవిత్వం ఇది.
గొప్ప కవిత్వానికి నిర్వచానాలు 'కలాన్ని కత్తిలా... పెన్నుని గన్నులా...' ఇలా ఏవైనా ప్రమాణాలు ఉండొచ్చుగానీ మంచి కవిత్వమంటే మనిషి అసహ నంతో ఉన ప్పుడు ఒక ఊరట, పరిస్థితులు భారంగా ఉన్నప్పుడు ఒక బాసట, మనోసంఘర్షణ రేగినప్పుడు ఒక స్వాంతన, కాలాన్ని వెచ్చించినందుకు న్యాయం చేసే పదచిత్రాలు... వాటినే ప్రమాణంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి నేటి మెట్రో పాఠకులు అలాంటి సాహిత్యమే కోరుకుంటున్నారు. అటువంటి సాహిత్యం చదివే తమ 'యాంత్రిక', 'శూన్య' గాయాల నుంచి కోలుకుంటు న్నారు. మనస్తా పాల్లో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ చేస్తున్న నేటి తరానికి జీవితం విలువని, వినియోగాన్ని సెంటర్‌ చేస్తూ రాసే ఇటువంటి కవిత్వం ఎంతైనా అవసరం.
వాస్తవానికి ఏదో కొత్త పుస్తకం వచ్చిందన్న వేడిలో కాకుండా కొంతకాలం పాఠక సమాజంలో మాగినాక తర్వాత ఆ పుస్తకం విలువని లెక్కగట్టాలి. ఏ రచనకైనా పాఠకులే అంతిమ నిర్ణీతలు. ఆ కాల పరీక్షలో నెగ్గి పాఠకులతో పాస్‌ మార్కులు వేయించుకోగల రచనల కోవలో ఈ 'డియర్‌ జిందగీ' నిలుస్తుందనడంలో ఎటు వంటి సందేహంలేదు. చివరగా ఈ 'డియర్‌ జిందగీ' కవిత్వం గురించి ఏకవాక్య తీర్మానంగా పేర్కొంటే 'నువ్వు ఎవరితోనైనా గలాట పెట్టుకో నీతో నీకొద్దు, ఎవరినీ ప్రేమించకుండానైనా ఉండు కానీ నీతో నువ్వు ప్రేమలో పడు'. ఇదే ఈ పుస్తకానికి ట్యాగ్‌ లైన్‌.
- బి. మదన మోహన్‌ రెడ్డి, 998989 4308.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమాజపు డి.ఎన్‌.ఏ. - జన్యులిపి
సాహిత్యపు అస్తిత్వాన్ని చూపే దర్పణమే 'తెలుగు సాహిత్యం-మరో చూపు'
ఎద్దు కాలిగిట్టెల శబ్దం
సంపుడు పందెం...
ఒంటరి బతుకు ..
ఆమె నిశ్శబ్దం
ఆశల పల్లకివై వస్తావని...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలంగాణ సాహితి ఉమెన్‌ ఫెస్ట్‌లో ఉద్వేగపూరిత 'అంతరంగ ఆవిష్కరణ'
21న ఉగాది కవి సమ్మేళనం
డా|| ఎన్‌. గోపికి భారతీయ భాషా పరిషద్‌ పురస్కారం
'కలుంకూరిగుట్ట'కు రజనీశ్రీ పురస్కారం
వచన కవితలకు ఆహ్వానం
'దేశభక్తి'పై కథల పోటీ
జరగబోయేది
నియంత
నిర్నిద్ర
నిషిద్ధ వస్తువుపై నిర్భయ ప్రకటన 1818
సర్వ సమతా సత్యవాదం - బాపురెడ్డి కవితానాదం
మన కాలం గొప్ప పాత్రికేయ విమర్శక నవలాకారిణి కె.రామలక్ష్మి
కావ్యాలంకారం
పొయ్యిమీదనే ఆకలి కాలిపోతున్నది
16న 'అనార్కలి' ఆవిష్కరణ
17న 'మూడు గుడిసెల పల్లె' ఆవిష్కరణ
జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ - పాలపిట్ట
జీవితం వయా కవిత్వం
పదాలకు పూల పరిమళాలద్దిన కవిత్వం - చిగురించిన చెట్టు
'గ్రంథాలయం' కవితలకు ఆహ్వానం
12న స్ఫూర్తి పురస్కారాలు
11న ''శ్యామ'' ఆవిష్కరణ

తాజా వార్తలు

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

10:20 AM

చరిత్ర సృష్టించిన ఖలీల్ అహ్మద్..

10:10 AM

కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

09:30 AM

రేపు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.