Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీకి చెంపపెట్టు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 06,2021

బీజేపీకి చెంపపెట్టు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు లాంటివి. నరేంద్రమోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయి. బీజేపీ అధికారంలో కొనసాగుతున్న హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, కర్నాటకలో ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు డిపాజిట్లను కూడా ఆ పార్టీ కోల్పోయింది. 3 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 30న జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తరువాత లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలంలో ఒకటి తగ్గింది. అనేక రాష్ట్రాల శాసనసభల్లో సిట్టింగ్‌ స్థానాలను కోల్పోయింది. ఉప ఎన్నికలు జరిగిన ఈశాన్య రాష్ట్రాల్లో వ్యక్తమైన సానుకూలత బీజేపీ బలానికన్నా స్థానిక ప్రాంతీయ పార్టీల దన్ను, ప్రతిపక్షాల వ్యూహ రాహిత్య ఫలితాలేనని విశ్లేషణలు వస్తుండటం గమనార్హం. ఈ ఉప ఎన్నికలను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందుబాటులో ఉన్న అన్ని వనరులను ప్రయోగించింది. సినిమా నటులను తిప్పింది. పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేసినట్లు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అనేక హామీలను ఎరగా వేసిందని, ఆ పార్టీకే ప్రత్యేకమైన ప్రజలను చీల్చే ఎత్తుగడులకు కూడా అనేక చోట్ల దిగిందని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని ప్రజలు ఏకోన్ముఖంగా తిరస్కరించడం ఈ ఎన్నికల ప్రత్యేకత.
    వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడుతూ నరేంద్రమోడీ ప్రభుత్వం రూపొందించిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది కాలంగా రైతాంగం చేస్తున్న పోరాట ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించింది. దీంతో పాటు చుక్కలను దాటి దూసుకుపోతున్న పెట్రో, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ప్రజలను ప్రభావితం చేశాయి. కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మొండి చేయి చూపడం, కార్పొరేట్ల మీద రాయితీల వర్షం కురిపించడం వంటివి కూడా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫలితంగా పశ్చిమబెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అన్ని చోట్ల టిఎంసి అభ్యర్థులు గెలవగా, సీపీఐ(ఎం)కు గతంతో పోలిస్తే గణనీయంగా ఓట్లు పెరగడం ఒక సానుకూల పరిణామం. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి హర్యానాలో ఏకంగా మాజీ సైనికుడిని రంగంలోకి దించి, దేశభక్తి పేరుతో ఓట్లు చీల్చడానికి బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. రైతు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన ఐఎన్‌ఎల్‌డీ నేత అభరు చౌతలా వైపే అక్కడ ప్రజానీకం నిలబడింది. ఒక లోక్‌సభ, మూడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సమయంలోనే అధిక ధరల అంశం ఒక ఎజెండాగా ముందుకొచ్చింది. ఘోర ఓటమి తరువాత బీజేపీ నాయకత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందంటూ ప్రచారం ప్రారంభమైంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ కొంచెం అటు, ఇటుగా ఇదే పరిస్థితి!
    మొత్తంమీద దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉప ఎన్నికలతో నరేంద్రమోడీ మీద, బీజేపీ మీద ప్రజలకు వ్యతిరేకత పెరుగుతోందన్న విషయం స్పష్టమవుతోంది. మోడీకి దీటైన ప్రత్యామ్నాయం లేదు గనుక మాదే గెలుపని విర్రవీగడం ఇక మీదట కుదరదు. తెలంగాణలో హుజురాబాద్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్‌ గెలుపొందారు. బీజేపీ బలం కన్నా ఈటలపై వ్యక్తమైన సానుభూతి, ఆయనకు స్థానికంగా ఉన్న పలుకుబడి ఇక్కడ విజయానికి దారి తీశాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవడంలో అధికార టీఆర్‌ఎస్‌ విఫలమైంది. రాష్ట్రాల హక్కులపై చేస్తున్న దాడి, సమైక్య రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయం, రైతాంగ వ్యతిరేక చర్యలు వంటి అంశాలను నామమాత్రంగా కూడా ప్రస్తావించకుండా ప్రజలను ప్రలోభపెట్టే వ్యూహానికి పరిమితం కావడం టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసింది. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఈ విషయాన్ని గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బరిలో లేనందున వైఎస్‌ఆర్‌సిపి గెలుపు ముందే ఖరారైపోయింది. అందుచేత ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలు తమ పాలనకిచ్చిన తీర్పు అని వైసీపీ భావిస్తే అది పొరపాటు అవుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలోనైనా బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారం చేయకుండా ఉపేక్షించడం, తెలుగుదేశం, జనసేనలు బీజేపీకి సహకరించడం, పోలింగ్‌ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు వ్యవహరించడం మనం చూశాం. దేశవ్యాప్తంగా అపప్రధ మూటగట్టుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బీజేపీ పట్ల రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వైఖరి మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టాన్నే కలుగచేస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...
అప్రమత్తతే ఆయుధం
వివక్ష మీద వివక్ష...
మహాప్రమాదం
గాజు కొంపలోనుండి...!
రామా కనవేమిరా!
దొంగ భక్తి...
చదువులకు కంచెలు
'నీచు' రాజకీయం
హిందీ - హిందూత్వ

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.