Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గోడదెబ్బ.. చెంపదెబ్బ... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2021

గోడదెబ్బ.. చెంపదెబ్బ...

ఒకవైపు గోడదెబ్బ, మరోవైపు చెంపదెబ్బ... ఇదీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి. ముఖ్యంగా రెక్కాడితేగాని డొక్కాడని వారు, వ్యవసాయ కూలీలు, పారిశుధ్య కార్మికులు, ఇతర బీదాబిక్కీ... గత రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలను చూసి తీవ్రంగా కలత చెందుతున్నారు. వీటిలో ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ ఛార్జీలను పెంచుతామనే ప్రకటన కాగా... రెండోది ఆదాయ లోటు పేరుతో కరెంటు ఛార్జీలను వడ్డించేందుకు రంగం సిద్ధం చేయటం. ఇందులో మొదటిది సామాన్యుడిపై 'టిక్కెట్‌' రూపంలో పడే భారం... ఇక రెండోది కేంద్రంలోని మోడీ సర్కార్‌ రూపొందించిన 'విద్యుత్‌ సవరణ బిల్లుల' వల్ల జేబుకు పడనున్న చిల్లు. ఒక్కరోజు వ్యవధిలో వచ్చిన 'ఈ మోతల' ప్రకటనలతో మున్ముందు సామాన్యుడు మరింతగా విలవిల్లాడటం ఖాయం.
    కరోనా సృష్టించిన విలయం నుంచి యావత్‌ దేశం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో కోవిడ్‌ దెబ్బకు ఉపాధి పోయి, ఉద్యోగాలు ఊడిపోయి, కనీస వేతనాల్లేక, ఉన్నా అవి రాక జనాలు నానా అవస్థలూ పడుతున్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఇలాంటి బాధితులేనన్న విషయాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌వో సర్వే సైతం తేల్చింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా పెంచిన పెట్రో, గ్యాస్‌ ధరలతో వారు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు వ్యక్తిగత వాహనాలను వాడాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత, ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌ నగరంలోని అనేక కాలనీలు, బస్తీలకు బస్సులను నడపాలనే డిమాండ్‌ ఊపందుకుంది. పాలకుల విధానాల పుణ్యమాని.. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాలకు ఎర్రబస్సు గగన కుసుమంగా మారింది. అయినా అత్యధిక మంది పల్లె ప్రజలు ఆర్టీసీ బస్సునే తమ ప్రయాణ సాధనంగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో డీజిల్‌ ధరలు పెరిగాయి, నిర్వహణ కష్టమవుతున్నది, సంస్థను లాభం కంటే నష్టాలే ఎక్కువగా వెంటాడుతున్నాయంటూ చెప్పటం ద్వారా రవాణా శాఖ మంత్రి జనంపై భారాలు మోపుతున్నామంటూ చెప్పకనే చెప్పారు. పైగా నెలక్రితమే సీఎంకు సంబంధిత దస్త్రాన్ని పంపాం... అది ఆయన పరిశీలనలో ఉందంటూ వక్కాణించటం ద్వారా, సీఎం ఆమోదమే తరువాయి, ఆ వెంటనే ఛార్జీలను పెంచుతామని చెప్పకనే చెప్పారు. అసలు ప్రజా రవాణా వ్యవస్థ అంటేనే లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించే వ్యవస్థ అనే విషయాన్ని ప్రభుత్వాధినేతలు విస్మరించటం ఇక్కడ గమనార్హం. సంస్థను నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు వీలుగా ప్రత్నామ్నాయ మార్గాలను అనుసరించాల్సిన సర్కారు... అందుకు భిన్నంగా ఛార్జీలను పెంచటమే ఏకైక మార్గమని చెప్పటం అత్యంత శోచనీయం.
   తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ టారిఫ్‌లను భారీగా పెంచడానికి రంగం సిద్ధం చేస్తోంది. సుమారు రూ.11వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిన తరువాత కూడా 2021-22, 2022-23 సంవత్సరాలకు కలిపి రూ.21వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఉంది. దీనిని ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందో, ఏం చేస్తుందో చూడాలి. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్న విద్యుత్‌ సవరణ బిల్లు, దాని వల్ల జరగబోయే డిస్కాంల ప్రయివేటీకరణ దీనికి అదనం. త్వరలోనే కరెంట్‌ ఛార్జీల పెంపు రూపంలో జనాలకు షాక్‌నివ్వబోతున్నారన్నమాట. మరోవైపు వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ బండ ధరను కేంద్రం రూ.100 పెంచటంతో దాని రేటు ఏకంగా రూ.రెండు వేలు దాటింది. ఇప్పటికే సామాన్యుడు తాగే ఛారు ధర సైతం రూ.ఎనిమిది నుంచి రూ.పది వరకూ పెరిగిన దరిమిలా... ఇప్పుడు సిలిండర్‌ రేటు పెరగటంతో కప్పు 'ఛారు...' కూడా మనకు అందని ద్రాక్షగా మారే దుస్థితి నెలకొనబోతున్నది. పట్టణాలు, నగరాల్లోని చిన్న చిన్న టీ బండ్లు, కాఫీ, కాకా హోటళ్లు, గల్లీలు, వీధుల పక్కన ఉండే టిఫిన్‌ బండ్ల దగ్గర అడ్డా మీద కూలీల దగ్గర్నుంచి మధ్యతరగతి వారి వరకూ తింటూ ఉంటారు. పెద్ద పెద్ద హోటళ్లతో పోలిస్తే తక్కువ ధరకే అక్కడ తిండి దొరుకుతుండటమే ఇందుకు కారణం. కానీ కొన్ని నెలలుగా నూనెలు, కూరగాయలు, ఉప్పులు, పప్పుల ధరలు పెరగటం, సిలిండర్‌ ధర పైపైకి ఎగబాకుతుండటంతో వాటిని నడిపే నిర్వాహకులు... రెండు రకాల పద్ధతులను పాటిస్తున్నారు. ఒకటి ఛారులు, టిఫిన్లు, భోజనాల ధరలను పెంచటం, రెండోది అలా పెంచితే జనం కొనరని భావిస్తే... నాణ్యతతోపాటు పరిమాణాన్ని (ఉదాహరణకు ప్లేటుకు నాలుగు ఇడ్లీలివ్వాల్సిన చోట మూడే ఇవ్వటం, వాటి సైజు తగ్గించటం లాంటివి) తగ్గించటం. దీంతో ఆయా పేదలు అర్థాకలితోనే మూతి తుడుచుకోవాల్సిన దుస్థితి. ఒకవైపు ఆర్టీసీ, కరెంటు ఛార్జీల మోత, మరోవైపు గ్యాస్‌ బండల వాతలతో పాలకులు ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లనివ్వబోతున్నారన్నమాట. అందువల్ల ఈ భారాలకు వ్యతిరేకంగా ఒక్క పేదలేగాక అందరూ ఏకమై పోరాడాల్సిన తరుణం ఆసన్నమైంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భాగవతార్‌ ప్రవచనం - పత్రికా స్వేచ్ఛ
జీఎస్టీ ఓ భారాల కుంపటి
నాటో కూటమి రణోన్మాదం!
ఇంటర్‌ తిప్పలు...
మహారాజ రాజశ్రీ...!
హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.