Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వెనక్కి నడుద్దామా? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 19,2021

వెనక్కి నడుద్దామా?

ఎన్ని సవాళ్ళెదురైనా వాటన్నింటిని అధిగమిస్తూ ముందుకు అడుగేయటమే ప్రగతి. వ్యత్యాసాల, అసమానతల నుంచి సమభావన, సమానతలవైపు ఆలోచించడం, ఆచరణకు పూనుకోవడమే పురోగతి. మనిషి వానర స్థితికి తిరిగి మళ్ళడు. ఎన్నో పోరాటాల పరిణామంలో సమత సాధన నాగరికత. అలాంటిది తిరోగమన ఆలోచనలు చర్చకు తేవడం అత్యంత అమానవీయమవుతుంది. ముఖ్యంగా స్త్రీల పట్ల వారి జీవనమూ, వ్యక్తిత్వాల నిర్దేశిత, నీతులూ, విధి విధానాలపై ఇష్టా రాజ్యంగా మాట్లాడటం గర్హనీయం.
   మాట్లాడటమే కాదు, రేపటి తరాన్ని తయారు చేసే విద్యా వ్యవస్థనూ ఆరకంగా మార్చాలనుకోవడం దుర్మార్గం. మొన్న సి.బి.ఎస్‌.ఇ. పదో తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్నాపత్రంలో పదిమార్కులకు సంబంధించి ఇచ్చిన వ్యాసభాగంలో 'మహిళలు చదువుకోవడం, స్వేచ్ఛను అనుభవించడం వల్ల కుటుంబంలో, సమాజంలో క్రమశిక్షణ దెబ్బతింటున్నదని' వ్యాస రచయిత అభిప్రాయపడ్డాడు. అంతే కాదు, భార్యకు గృహ బానిసత్వం నుండి విముక్తి కలిగించడం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు నాశనమవుతున్నాయని, గతంలో వారు భర్తలకు విధేయులుగా ఉండేవారని, దానితో పిల్లలు కట్టుతప్పకుండా క్రమశిక్షణతో మెలిగేవారని పేర్కొన్న వ్యాసాన్ని ఇచ్చి, కొన్ని ప్రశ్నలు దానికింద వేసి సరైన సమాధానాలను విద్యార్థులను వెతికి రాయమన్నారు. ఇంతకంటే ఘోరం ఇంకేమయినా ఉందా? ఇలాంటి వాటితో రేపటి తరానికి ఏం బోధిస్తున్నారు.
   మహిళలు వంట ఇంటికే పరిమితమై పతికి సేవలు చేస్తూ పిల్లల్ని కని వారి బాగోగులు చూస్తూ జీవనం సాగిస్తే కుటుంబంలో క్రమశిక్షణ వర్థిల్లుతుందనే భావనను నేటి 21వ శతాబ్దంలో తీసుకురావటం ఎంత వెనక్కి మళ్లటం! మహిళ అన్నింటా మగవారితో సమానంగానే కాక అంతకు మించి రాణిస్తున్న ఆధునిక కాలంలో ఇలాంటివి నేర్పుతారా? ఇది బానిస సమాజపు ఆలోచనలోకి భవితను తీసుకుపోవటం కాదా! స్త్రీలు విద్యతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిత్యం అభివృద్ధి చెందుతూ కాస్మోనాట్స్‌గా అంతరిక్షంలోకి పరిశోధనలో పయనిస్తున్న తరుణంలో, దేశపు రక్షణరంగంలో మిలటరీ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్న కాలంలో స్త్రీ ఇంటికే పరిమితం కావాలని ఆలోచించడమంత తుప్పుపట్టిన భావం మరేముంది!
   పార్లమెంట్‌లో, పౌర సమాజంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో సి.బి.ఎస్‌.ఇ. ఆ వ్యాస భాగాన్ని తొలగించివేసింది. కానీ యేదో యాదృచ్ఛికంగా చోటు చేసుకుంటున్న అంశాలు కావివి. కేంద్రంలో ఛాందస మనువాద భావాలు గల పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఆ పార్టీ వెన్నెముక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు అధినేత మోహన్‌భగవత్‌ బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువని ఆయన సెలవిచ్చారు. ఇంటి పనుల కోసమే ఇల్లాలు అని పేర్కొన్నారు. లౌకిక విలువలకు, స్త్రీ పురుష సమానత్వాలకు వ్యతిరేకమయిన ఆలోచనలకు, రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమయిన ఆలోచనాపరులు వీళ్ళు. వీళ్ళ నుండి మనం ఇంతకన్నా ఏమీ ఆశించలేము. ఇలాంటి భావాలున్న అధికార పార్టీలు స్త్రీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తాయా! స్త్రీల సాధికారత కోసం కృషి చేస్తాయా! బేటీ బచావో, బేటీ పడావో నినాదాలు ప్రచారార్భాటాలకే పరిమితమయిన సత్యాన్ని కళ్లారా కంటున్నాము కదా!
   ఈ బూజుపట్టిన ఛాందస భావాలకు స్త్రీలలోనూ కొంత భాగం సమ్మతి తెలియజేయటం, సంప్రదాయం పేరుతో మూఢత్వాన్ని, అశాస్త్రీయతను ప్రచారంలోకి తెచ్చిన ఫలితం. ఈ మధ్యన ఒక సర్వే ప్రకారం తేలిన అంశమేమంటే భర్తలు భార్యలను కొట్టటం సహజమేనని, కొట్టవచ్చని అనేకమంది తెలిపినట్టు నివేదిక వెల్లడించింది. అదికూడా మహిళలే ఆ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు వివరించారు. ఇందులో ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ చాలామంది మహిళలు పితృస్వామిక వ్యవస్థలోని పురుషాధిపత్యానికి సమ్మతిగానే ఉన్నారు. తరాలుగా కుల, స్త్రీ పురుష అసమానతలు సహజమైనవిగా, దైవ నిర్ణయాలుగా ప్రచారం చేసి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సమాజం మనది. ఆధిపత్య వర్గాల ఆలోచనల్లోంచి బయటపడటానికే జ్యోతిబాఫూలే, సావిత్రబాయిఫూలేలు, సంఘ సంస్కర్తలు తీవ్ర కృషి చేశారు. వారి దారులమేరకే మహిళలు ఈమాత్రమయినా చైతాన్యాన్ని పొంది పురోగమిస్తున్నారు.
   ఈ మధ్య ఓ మనువాద భావాలుగల మహిళా ప్రముఖరాలే రేప్‌లు మన భారతీయ సంప్రదాయంలోనే ఉన్నాయని, అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉంటాయని చాలా తేలికగా చెప్పేసింది. మొన్న కర్నాటకలో ఓ ఎమ్మెల్యే ''రేప్‌ను ప్రతిఘటించలేనప్పుడు ఆ ఆనందాన్ని అనుభవంచటమే మంచిదని'' తన దుష్టత్వాన్ని వెల్లగక్కి వెనక్కు పీక్కున్నాడు. అసలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఈ అసమానతలకు ఆజ్యం పోస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తూన్నవారిని, తిరోగమన ఆలోచనలను తిప్పికొట్టాలి. చైతన్య వంతమై ఎండగట్టాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...
అప్రమత్తతే ఆయుధం
వివక్ష మీద వివక్ష...
మహాప్రమాదం
గాజు కొంపలోనుండి...!

తాజా వార్తలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

04:52 PM

అండర్‌వేర్‌తో వెళ్లి ఓటేసిన ప్రజలు

04:43 PM

రాజకీయాలపై 'మెగా`అభిమానుల కీలక నిర్ణయం

04:36 PM

పెట్రోల్‌పై రూ. 18 పెంచి రూ. 8 త‌గ్గించారు : ఉద్ధవ్‌ థాకరే

04:31 PM

దావోస్‌లో ఏపీ పెవిలియ‌న్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

04:28 PM

శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

04:21 PM

భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని మోడీ సమావేశం

04:13 PM

పరిగి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.