Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రమాదంలో గోప్యత | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 29,2021

ప్రమాదంలో గోప్యత

ఓటర్‌ గుర్తింపు కార్డుకు ఆధార్‌ కార్డును అనుసంధానించే ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు 2021 భారత పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు నివేదించాలని ప్రతిపక్ష ఎంపీలు ఎంతగా మొత్తుకున్నా పార్లమెంటు ఉభయసభల్లో దాన్ని ప్రభుత్వం అతి నిరంకుశంగా ఆమోదింపజేసుకుంది. ఈ చర్య ద్వారా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల పట్ల తన అసహనాన్ని మరోసారి బయటపెట్టుకుంది. లోక్‌సభ డిసెంబర్‌ 20న కేవలం 25నిమిషాల చర్చతోనే ఆమోదించడం దారుణం. అంతకుముందే 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసిన రాజ్యసభలో డిసెంబర్‌ 22న మూజువాణీ ఓటుతో ఆ బిల్లును ఏకపక్షంగా ఆమోదింపజేశారు. ఈ బిల్లు వల్ల ఓటరు కార్డు ఆధార్‌ కార్డు అనుసంధానతతో పాటు ఓటు నమోదుకు ఏడాదిలో ఒక తేదీ కటాఫ్‌ బదులు నాలుగు తేదీలలో అవకాశం ఇవ్వడం, సర్వీస్‌ ఓటర్లు భార్యాభర్తలిద్దరూ ఓటెయ్యొచ్చుననడం తప్ప విశాల ప్రజానీకానికి ఒరిగేదేమీ లేదు.
   అయితే ఆధార్‌ అనుసంధానాన్ని చట్టబద్ధం చేయడంతో గోప్యంగా ఉన్న ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఇక బహిరంగమవుతుంది. వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచుకోవడం ప్రాథమిక హక్కు అని పుట్టుస్వామి కేసులో సుప్రీం కోర్టు 2015 ఆగస్టులో తీర్పు చెప్పింది. ఏ పౌరుని వ్యక్తిగత డేటానైనా తెలుసుకోవాలంటే అందుకు చట్టపరమైన ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా సుప్రీం చెప్పింది. కనుక ఈ బిల్లు రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఇంత హడావుడిగా నిరంకుశంగా ఈ బిల్లును ఆమోదింపజేసిన మోడీ ప్రభుత్వం చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు ఊసెత్తడం లేదు. నిజంగా ఎన్నికల సంస్కరణలు జరగాలంటే ఆ చట్టం రావాలి.
   దేశ పౌరుల నుండి సేకరించిన వ్యక్తిగత డేటాను వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించడానికి దోహదం చేసే వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే డేటా రక్షణ చట్టాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం పౌరుల ఆధార్‌, పాన్‌ నెంబర్‌ వంటివి తప్పనిసరిగా అనుసంధానం చేస్తేనే వివిధ ప్రభుత్వ సేవలు గాని, ప్రభుత్వ రంగ సంస్థల సేవలు కాని అందుతాయని షరతులు విధించింది. ఇప్పటికే టెలికాం కంపెనీల, బ్యాంకుల సేవలు పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ఆ సమాచారం బడా వ్యాపార సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. ప్రయాణాలకు ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరి చేశారు. ఆ విధంగా వచ్చే సమాచారాన్ని ఇన్సూరెన్స్‌ సంస్థలు, కార్పొరేట్‌ వైద్య సంస్థలు తమ వ్యాపారం కోసం వినియోగించుకుంటాయి. వ్యాక్సినేషన్‌ కోసం కో-విన్‌ యాప్‌ను వాడివున్నట్టైతే మన ఆమోదంతో నిమిత్తం లేకుండానే మన సమాచారం ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు చేరిపోయి వుంటుంది. ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలు దాని ఆధారంగా మనకు ఇన్సూరెన్స్‌ డబ్బుల్ని ఎగనామం పెట్టొచ్చు. ఉద్యోగుల కార్యకలాపాలను మానిటర్‌ చేసే యాప్‌లను ఆ ఉద్యోగుల ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హర్యానాలో అంగన్‌వాడీ ఉద్యోగులు ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటారో సూచించే యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. మునిసిపల్‌ వర్కర్ల ఫోన్లలో యాప్‌ వారి కదలికలనే గాక వారి మాటలను సైతం రికార్డు చేస్తుంది. ఇవన్నీ ఆ కార్మికుల, ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కదా!
   ఇజ్రాయిల్‌ నిఘా వ్యవస్థ ఎన్‌ఎస్‌వో గూఢచర్య సాధనాలను మోడీ ప్రభుత్వం ఉపయోగించి వాటి ద్వారా చట్టవిరుద్ధంగా మొబైల్‌ ఫోన్లను, లాప్‌టాప్‌లను హ్యాక్‌ చేసింది. పాత్రికేయులు, ప్రజా జీవితంలో ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు, ఆఖరుకు న్యాయమూర్తులతో పాటు అధికార పార్టీ నాయకులను సైతం పెగాసస్‌ విడిచిపెట్టని విషయం తెలిసిందే. వ్యక్తిగత సమాచారాన్ని మన అనుమతి లేకుండా మనకు తెలియకుండా సర్కారు వారు వినియోగించడం (దొంగిలించడం) గురించి ఇలా ఎన్నైనా పేర్కొనవచ్చు. దేశంలోని ఓటర్లందరి వ్యక్తిగత సమాచారానికి ఇకపై గోప్యత ఉండదు. ఈ దుష్ట చట్టాన్ని తిప్పికొడితేనే ప్రజాస్వామ్యానికి రక్ష.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...
అప్రమత్తతే ఆయుధం
వివక్ష మీద వివక్ష...
మహాప్రమాదం
గాజు కొంపలోనుండి...!

తాజా వార్తలు

04:43 PM

రాజకీయాలపై 'మెగా`అభిమానుల కీలక నిర్ణయం

04:36 PM

పెట్రోల్‌పై రూ. 18 పెంచి రూ. 8 త‌గ్గించారు : ఉద్ధవ్‌ థాకరే

04:31 PM

దావోస్‌లో ఏపీ పెవిలియ‌న్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

04:28 PM

శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

04:21 PM

భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని మోడీ సమావేశం

04:13 PM

పరిగి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.