Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డోసుల సంబురాలు... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 30,2021

డోసుల సంబురాలు...

ఒక పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు, దానిపై పోరాడే క్రమంలో చిన్నపాటి విజయాన్ని కూడా ఘనంగా చెప్పుకోవాలనేది మానసిక నిపుణుల సూచన. అలా చెప్పుకోవటం ద్వారా మున్ముందు అలాంటి ఉపద్రవాలెన్నొచ్చినా వాటిని ఎదుర్కోవటానికి వీలుగా మానసికంగా సంసిద్ధులవుతామన్నది వారి అభిప్రాయం. ఇదే కోవలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం...'రాష్ట్రంలో నూటికి నూరు శాతం కరోనా మొదటి డోసు...' పూర్తయిందంటూ సంబురాలు నిర్వహించింది. ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలోనే రికార్డు సృష్టించిందంటూ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇదంతా ఒప్పుకోవాల్సిందే. వాస్తవానికి ప్రపంచంలో కరోనా సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. తెలంగాణకు అది మిగిల్చిన ఆర్థిక నష్టం రూ.లక్ష కోట్ల వరకూ ఉంటుందంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో వైద్య శాఖ ఉన్నతాధికారుల దగ్గర్నుంచి ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, స్వీపర్లు, అటెండర్లు కరోనా కట్టడిలో సైనికుల్లా పని చేశారు. వీరికితోడు క్షేత్రస్థాయిలో టీకాలు వేయటంలో ఆషాలు, హెల్త్‌ వర్కర్ల కృషి కూడా తక్కువేం కాదు. ఇలాంటి ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల పట్టుదల, అంకితభావం వల్లే నూటికి నూరు శాతం మొదటి డోసు పూర్తయిందనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా మొదటి డోసు పూర్తయిన గణాంకాలను పరిశీలిస్తే... అది ఇంకా 37 శాతం వద్దే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో తెలంగాణకు కూడా ఆ శాతాన్ని అన్వయించి చూసుకుంటే...చెప్పుకోదగ్గ సంఖ్యలో కాకపోయినా ఎంతోకొంత మందికి ఇంకా తొలి డోసు అందలేదన్నది నిర్వివాదాంశం. మరోవైపు సర్కారు చెబుతున్న నూటికి నూరు శాతం జాబితాలో 15 నుంచి 18 ఏండ్ల వయస్సున్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్న పెద్దవారు లేరు. 15 ఏండ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు టీకా గురించి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతోపాటు గర్భిణీలు, ఇతరత్రా రుగ్మతలున్న వారూ వైద్యుల సలహా మేరకు టీకాలు తీసుకోలేదు. ఇప్పుడు వీరందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు డోసుల సంబురాల నేపథ్యంలో తెలంగాణలోని 2.77 కోట్ల మందికి మాత్రమే మొదటి డోసు టీకా అందినట్టు లెక్కలు చెబుతున్నాయి. దీన్నిబట్టి మూడున్నర కోట్ల మందికిపైగా జనాభా ఉన్న రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మందికి పైగా (చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, గర్భిణీలు వగైరా కలుపుకుని...) తొలి డోసు అందలేదు. ఈ సంఖ్యను కూడా మనం గమనంలో ఉంచుకోవాలి.
మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు దేశంతోపాటు రాష్ట్రంలోనూ రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళకర అంశం. తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటికి 62 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ (గుంపు రోగ నిరోధకశక్తి) అనేది కీలకమనే విషయాన్ని మనం గుర్తించాలి. అప్పుడే కరోనా నుంచి గానీ, దాని కొత్త వేరియంటైన ఒమిక్రాన్‌ నుంచి గానీ మనం ఎక్కువ తీవ్రత లేకుండా బయటపడగలం. వాస్తవానికి రెండు డోసులు వేస్తేనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టు లెక్క. చైనా జనాభాలో 99.1 శాతం, అమెరికా జనాభాలో 60 శాతం ప్రజలకు రెండు డోసులు పూర్తి చేశారు. అయినా ఆయా దేశాల్లో కూడా హెర్డ్‌ ఇమ్యూనిటీ ఇంకా పూర్తి స్థాయిలో వచ్చినట్టు చెప్పలేకపోతున్నారు. అలాంటిది మన రాష్ట్రంలో ఒక్క డోసే వేసి పండగ చేసుకోవటం సబబుకాదు. ఆ రకంగా చూసినప్పుడు ఇండియా మొత్తంలో మొదటి డోసు 37 శాతమే పూర్తి కావటం కలవరపరిచే అంశం. ఈ నేపథ్యంలో మున్ముందు వరస పండగలు, ఆ తర్వాత పెండ్లిడ్ల సీజన్లను దృష్టిలో ఉంచుకుని... రాష్ట్రంలో మొదటి డోసును పరిపూర్ణం చేయాలి. రెండో డోసును అత్యధిక మందికి ఇవ్వాలి. 60 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్‌ డోసును కూడా పూర్తి చేయాలి.
నూతన సంవత్సరంలోకి తొంగి చూసేందుకు ఇంకా ఒక్కరోజే వ్యవధి ఉన్న తరుణంలో... 'కుర్రకారుకు జోష్‌- న్యూ ఇయర్‌ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌...' అనే వార్తలు కొంత గుబులు పుట్టిస్తున్నాయి. అసలే శీతాకాలం, ఇది ఒమిక్రాన్‌ వ్యాప్తికి అనుకూలమైన కాలం. కానీ ఆదాయమే పరమావధిగా, లిక్కర్‌ అమ్మకాలే లక్ష్యంగా నిబంధనలను పక్కనబెట్టి కొత్త సంవత్సరం వేడుకలకు సర్కారు ఇబ్బడి ముబ్బడిగా అవకాశమిస్తే తర్వాత తలెత్తే పరిణామాలకు మనందరం బాధపడాల్సి వస్తుంది. కోవిడ్‌తో కుదేలైన ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, వాణిజ్య రంగాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థల కార్యక్రమాలు ఊపందు కుంటున్నాయి. ఒమిక్రాన్‌ పెరిగితే ఇవన్నీ కుంటుపడతాయి. మరోవైపు ఎట్‌ రిస్క్‌ (ఒమిక్రాన్‌ ముప్పు ఎక్కువగా ఉన్నవి) దేశాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కూడా ఒమిక్రాన్‌ సంక్రమించినట్టు తెలుస్తున్నది. ఇలాంటి అంశాలన్నింటినీ సర్కారు నిశితంగా పరిశీలించి, పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు పోవాలి. తద్వారా కరోనాతోపాటు ఒమిక్రాన్‌ను సైతం మనం కట్టడి చేయగలిగితే మున్ముందు మరిన్ని సంబురాలు చేసుకోవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...
అప్రమత్తతే ఆయుధం
వివక్ష మీద వివక్ష...
మహాప్రమాదం
గాజు కొంపలోనుండి...!
రామా కనవేమిరా!
దొంగ భక్తి...
చదువులకు కంచెలు
'నీచు' రాజకీయం
హిందీ - హిందూత్వ

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.