Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఒకటి చీల్చేది - మరోటి కూర్చేది | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 11,2022

ఒకటి చీల్చేది - మరోటి కూర్చేది

5,6,7 & 7,8,9. ఇది అంకెల గురించీ, సంఖ్యల గురించీ కాదు, తేదీల గురించి మాత్రమే కాదు. రెండు ఆలోచనల గురించి. రెండు ప్రాపంచిక ధృక్పథాల గురించి. రెండు వర్గ ప్రయోజనాల గురించి. మొదటిది, మత ప్రాతిపదికన దేశాన్ని నిలువునా చీల్చేది. ఆ రకంగా కార్పొరేట్లు తమ లాభాల పంట పండించుకునేది. రెండవది, నాడు బిటిష్‌ సామ్రాజ్య దోపిడీని ప్రతిఘటించిన రీతిలోనే నేడు దేశ, విదేశీ కార్పొరేట్ల దోపిడీ దౌర్జన్యాలపై పోరు జెండా లెత్తేది. కార్మికుల్ని, కర్షకుల్ని, ఇతర శ్రమజీవుల్ని ఐక్యం చేసేది. స్థూలంగా ఒకటి చీల్చేది. మరోటి కూర్చేది.
   మొదటిది, హైదరాబాద్‌ శివార్లలో జరిగిన ఆరెస్సెస్‌ ''అఖిల భారతీయ సమన్వయ బైఠక్‌'', సర్‌ సంఘ్ చాలక్‌, సహ కార్యవాహ్‌లు మొదలు 36 వివిధ సంస్థలకు చెందిన 216మంది ఆరెస్సెస్‌ ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరైన సమావేశం అది. రెండవది, సీపీఐ(ఎం) అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ, కేంద్రకమిటీ సమావేశాలు.
   ఆరెస్సెస్‌ సహకార్యవాహ డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య విలేకర్ల సమావేశంలో చెప్పిన దాని ప్రకారం ''తమ అంతిమ లక్ష్యం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు సర్వశ్రేష్ట దేశంగా తీర్చిదిద్దటమ''ట. అంటే ఏమిటో అడగడానికి విలేకర్లూ సాహసించలేదు. ఆ డాక్టర్‌ సాబ్‌ కూడా చెప్పలేదు. దేశంలో పేదరికాన్ని మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పట్నించీ లెక్కించలేదు. ప్రపంచ బ్యాంక్‌ డేటాను వినియోగించి ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ 2019-20 నుండి 2020-21కి ఒక సంవత్సరంలోనే దేశంలో నిష్టదరిద్రుల సంఖ్య ఆరుకోట్ల నుండి 13.4కోట్లకు పెరిగిందని, ఇది 45సంవత్సరాల క్రితం పరిస్థితికి చేరిందని తేల్చింది. 2021 ముగిసేలోగా అదనంగా మరో 15 నుండి 20కోట్ల మంది గర్భదారిద్య్రంలోకి నెట్టబడతారని కూడా ఆ నివేదిక తేల్చింది. అదంతా విదేశీ శక్తుల కుట్ర అని అరెస్సెస్‌ కొట్టేసినా, మన నిటి ఆయోగ్‌ మల్టి డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ ప్రకారం బీహార్‌ జనాభాలో సగానికి మించి (51.91శాతం) పేదరికంలో మగ్గుతున్నారు. దాని వెనుకే ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, అసోంలు ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే! ప్రపంచ దేశాల ముందు సర్వోత్కృష్ట దేశంగా తీర్చిదిద్దటమంటే ఇదేనా? గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జీహెచ్‌ఐ)లో 116దేశాల్లోనూ భారతదేశం 101వ స్థానానికి చేరింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్లో మనదేశం టాప్‌లో ఉందని కూడా జీహెచ్‌ఐ పేర్కొంది. ఇది కూడా విదేశీ కుట్ర అని కొట్టేసేవారికి తాజా నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 చిన్న పిల్లల పోషకాహార లేమిగురించి, శిశు మరణాల గురించి మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పింది. బహుశా ఆరెస్సెస్‌ వారి లెక్కల్లో ఇదంతా ప్రపంచ దేశాల ముందు సర్వశ్రేష్టంగా నిలపడమేనేమో! అయినా మోడీ సర్కార్‌ మధ్యాహ్న భోజనానికి, ఐ.సి.డి.ఎస్‌.కు కేటాయింపులు తగ్గిస్తోంటే దానిపై ఆర్‌ఎస్‌ఎస్‌ నోరెత్తదెందుకో?!
   ''హిందూత్వ వేరు హిందూ మతం వేరు'' అని వేరెవరో చెప్పడం కాదు, సాక్షాత్తూ 1978లో ఆనాటి ఆరెస్సెస్‌ అధ్యక్షుడు (సర్‌సంఫ్‌ుచాలక్‌) రాజేంద్రసింగ్‌ నాగపూర్‌జిల్లా న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ''ఆరెస్సెస్‌ మతపరమైనదీ కాదు, సేవాదృష్టి కలిగినదీ కాదు'' అన్నారు. ఈనాడు ఆరెస్సెస్‌ వందలాది సంస్థలను నిర్వహిస్తున్నది. వాటిలో ఈ దశలో అవసరమైన 36 సంస్థలను మాత్రం ఆహ్వానించి మొన్న మీటింగ్‌ జరిపారు. రానున్న రోజుల్లో ఏ రూపంలో ఉపద్రవం ముంచుకొస్తుందో!? ఇప్పటికే ఆవుపేరున ముస్లింలు, దళితులపై 2015నుండి దాడులు జరుగుతున్నాయి. అంతకు ముందు స్థానికంగా ఎన్నో జరిగుంటాయి. మత మార్పిడుల పేరున క్రైస్తవులపై దాడులు సాగుతున్నాయి. మొన్న మోడీని పంజాబ్‌లో అడ్డుకున్నారనే మిషతో మోడీ ఒంటిపై చిన్న గీతపడ్డా 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు మించి చూస్తారని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఆకలి, నిరుద్యోగం, పేదరికం వంటివి వారికి పట్టవు.
   బ్రిటిష్‌ సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో సంపూర్ణంగా విలీనమైన శక్తుల వారసురాలు సీపీఐ(ఎం). దేశ స్వాతంత్ర పరిరక్షణకు, దాని ఆర్థిక స్వాలంబనకు సమగ్రతకు అంకితమైన పార్టీ సీపీఐ(ఎం). అమెరికా విషకౌగిల్లోకి ఈ దేశాన్ని మోడీ సర్కార్‌ తీసుకుపోతున్న విషయం 7 - 9 తేదీల్లో జరిగిన కేంద్ర కమిటీ చర్చలోకొచ్చింది. మన ప్రభుత్వరంగ పరిశ్రమలను బఠాణీల్లా అమ్మేస్తున్న విధానాన్ని, రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్న విధానాలను సమీక్షించింది. ఆ విధానాల ప్రతిఘటనకు అవలంబించాల్సిన వ్యూహానికి తుదిరూపమిచ్చింది. ఆసేతుహిమాచలం సభ్యులు, సామాన్య ప్రజలు సైతం చర్చించి రూపొందించే విధానరూపకల్పనకు హైదరాబాద్‌ కార్యక్షేత్రమయ్యింది. ప్రజాస్వామ్యమంటేనే తెలియని ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ విషయాలేమర్థమవుతాయి? వారికి తెలిసింది మనుషుల్ని చీల్చడం, వ్యవస్థల్ని కూల్చడం!!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...
అప్రమత్తతే ఆయుధం
వివక్ష మీద వివక్ష...
మహాప్రమాదం
గాజు కొంపలోనుండి...!

తాజా వార్తలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

04:52 PM

అండర్‌వేర్‌తో వెళ్లి ఓటేసిన ప్రజలు

04:43 PM

రాజకీయాలపై 'మెగా`అభిమానుల కీలక నిర్ణయం

04:36 PM

పెట్రోల్‌పై రూ. 18 పెంచి రూ. 8 త‌గ్గించారు : ఉద్ధవ్‌ థాకరే

04:31 PM

దావోస్‌లో ఏపీ పెవిలియ‌న్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

04:28 PM

శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

04:21 PM

భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని మోడీ సమావేశం

04:13 PM

పరిగి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.