Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జయ'పథం' | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2022

జయ'పథం'

మొన్న 25న తుర్కయాంజాల్‌లో ముగిసిన భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర 3వ మహాసభ అత్యంత జయప్రదమైంది. నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కీలకమైన కార్యదర్శివర్గంలోకి రెండు ప్రధాన వర్గ సంఘాలు రెండు సామాజిక రంగాల నుండి సాపేక్షంగా యువ నాయకత్వం ప్రవేశించింది. సీపీఐ(ఎం)లో సీల్డ్‌కవర్‌లు లేవు. కార్యవర్గాలను నాయకులు ఇష్టానుసారం నియమించుకునే సంస్కృతిలేదు. సమిష్టి నాయకత్వంలో నడిచే పార్టీలో కులాలకు పీటల్లేవు. పీఠాల్లేవు. ఒక కమ్యూనిస్టు పార్టీ జీవితంలో మహాసభలు కొత్తకాకపోయినా జరిగిన సందర్భం కీలకమైంది. నయా ఉదారవాద విధానాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో కమ్యూనిస్టు సిద్ధాంతం అనాకర్షణీయమైంది. ''మనం, మనది'' స్థానంలో ''నేను, నాది'' వచ్చి కూర్చుంది. 'సమిష్టి' స్థానంలో 'వ్యక్తి' వికటాట్టహాసం చేస్తున్నాడు. జావగారి నిర్వీర్యమయ్యే పార్టీలు కొన్ని, ఆశయాలుడిగిపోయి విచ్ఛిన్న మార్గాల్లో నడిచే పార్టీలు మరికొన్ని.. ఇదీ నేటి అనేక కమ్యూనిస్టు పార్టీల స్థితి. ఈ స్థితిలో సుమారు ముప్పయివేల మంది పార్టీ సభ్యులను ప్రాథమిక కమ్యూనిస్టు సిద్ధాంతానికి అంకితమయ్యేలా నిలపడం అపురూపమైన విషయం. కొన్ని చిన్న లోపాలున్నా పార్టీ తెలంగాణ కమిటి దీనిలో జయప్రదమయ్యింది. అవకాశమున్న అంశాలన్నింటిలోనూ ఆయా ప్రజల్ని పోరాటాల్లోకి తేగలిగింది. అది పోడు రైతుల పోరాటమైనా, ధర్నాచౌక్‌ పునరుద్ధరణ అయినా అన్ని పార్టీలను కదిలించగలిగింది. పాలక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వెనక్కి కొట్టగలిగింది. కార్యకర్తల్ని నిలబెట్టుకోగలగడం, ప్రజల్ని పోరాటాల్లోకి దించగలగడం, పాలకుల్ని వెనక్కి కొట్టగలగడానికి మించి ఒక కమ్యూనిస్టుపార్టీ జీవితంలో మిన్న అయిన విజయపథాలేముంటాయి?
   గత నాలుగేండ్లలో రాష్ట్రంలో పార్టీ అవలంబించిన రాజకీయ విధానం కత్తిమీద సాములాంటిది. సీపీఐ(ఎం) వంటి విప్లవ కమ్యూనిస్టుపార్టీ అఖిల భారత స్వభావం కలిగి ఉంటుంది. అఖిల భారత విధానానికి లోబడే రాష్ట్ర విధానం ఉండాలి. 2014లో కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకున్న మనువాద శక్తులు క్రమంగా నయా ఉదారవాద విధానాలను బలంగా అమలుచేస్తూ తమ మతోన్మాద ఎజెండాతో ముందుకు సాగుతున్నది. రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్‌ 370 రద్దయింది. మతం ఆధారంగా పౌరసత్వం నిర్ణయించేందుకు సిద్ధమవుతున్నారు. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా అయోధ్యలో ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన నాయకులే స్వయంగా భూమిపూజ నిర్వహించారు. అంతేనా?! మహాసభలో ప్రకాష్‌కరత్‌ చెప్పినట్టు అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయి. సామాజిక న్యాయానికి ఘోరీకడుతున్నారు. అందుకే బీజేపీని తెలంగాణలో పురోగమించనీయ్యరాదు. కాని మన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన ప్రజావ్యతిరేకంగా ఉంది. దానిలోపాలను చూపించి పెరిగే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ నిర్దిష్ట పరిస్థితిలో సాగర్‌లోనైనా, హుజురాబాద్‌లోనైనా పార్టీ తన విధానాన్ని రూపొందించుకుంది. ఏమైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిష్కర్షగా, నిర్మొహమాటంగా ప్రతిఘటించాలని మహాసభ పిలుపునిచ్చింది.
   తన పొరపాట్లను నిర్మొహమాటంగా అంగీకరించి ఆత్మవిమర్శ చేసుకునే కమ్యూనిస్టు పార్టీ తన వర్గానికి నిజాయితీగా కట్టుబడి ఉంటుందని 'లెనినిజం పునాదులు'లో స్టాలిన్‌ వివరిస్తాడు. అందుకు చక్కటి ఉదాహరణ సీపీఐ(ఎం) తెలంగాణశాఖ. బి.ఎల్‌.ఎఫ్‌. ఏర్పాటు, దానిపై పి.బి. సి.సి. విమర్శ,, దాన్ని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణతో సరిచేసుకోవడంతో కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసింది. ఆ సందర్భంగా జరిగిన లోటుపాట్లను సరిచేసుకుని రాష్ట్రంలో ''వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను, సామాజిక, సాంస్కృతికోద్యమాలను సమీకరించి, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాల''ని 3వ మహాసభ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం యెడల, బీజేపీ యెడల టీఆర్‌ఎస్‌ అవలంబించే మెతక వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని కూడా రాష్ట్ర మహాసభ నిర్ణయించింది.
   ప్రతినిధుల పొందిక ఆశావహంగా ఉంది. 50ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మొత్తం ప్రతినిధుల్లో 55శాతం కాగా, సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నుండి 70శాతం మంది పాల్గొన్నారు. యువతను మరింతగా ఆకర్షించాలని మహాసభ నిర్ణయించింది. 'యంగ్‌ కమ్యూనిస్టు స్టడీ సర్కిల్‌' వంటివి పట్టుదలగా నిర్వహించాలని నిర్ణయించింది.
   మిగతా బూర్జువా పార్టీల్లాగా కాకుండా మన తెలంగాణ సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజల పరిస్థితులు, వాటి కారణాలు, పరిష్కారాలపై 60తీర్మానాలను మహాసభ ఆమోదించింది. వాటిపై రానున్న రోజుల్లో ప్రజల్ని కదిలించి పోరాడాల్సిన ఆవశ్యకతను మహాసభ నొక్కి చెప్పింది.
   సీపీఐ(ఎం) తెలంగాణలో నిర్లక్ష్యం చేయగల్గిన శక్తికాదు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రతిదాన్నీ ప్రజల్లో ఎండగడుతోంది. ఇతరులను కూడగడుతోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టగలుగుతోంది. తన శక్తివంతమైన సిద్ధాంత వెలుగులో సుదూర ప్రాంతంలో ఉన్న ప్రమాదాన్ని కూడా పసిగట్టగలదు. అందుకే, రాష్ట్రంలో పెద్దశక్తిగా లేకున్నా అందరి మన్ననలూ పొందగలుగుతోంది. తలలో నాలుకగా ఉండగలుగుతోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!
ప్రధాని వంచనా శిల్పం
గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.