Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇదేమి తిరకాసు సారూ..! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Apr 30,2022

ఇదేమి తిరకాసు సారూ..!

             విధ్వంసాన్ని ఆపకుండా నిర్మించడం ఎలా సాధ్యం! విపత్తులు నిలువరిస్తేనే భవిష్యత్తుకు బాట పడుతుంది. ఉన్మాదాన్ని తరిమికొట్టటమే నేటి కర్తవ్యం కావాలి. అంతే కాని ఇది వదిలేసి నిర్మాణమేదో చేపడతానని, ఇంకేదో కొత్తమార్గం చూపెడతానని ఎన్ని హీరోచిత పిలుపులిచ్చినా, తక్షణావశ్యక ఆచరణను విస్మరించడమే అవుతుంది. అప్పుడు కొత్తదారులు కాదు, నిలబడటమే కష్టమవుతుంది. మొన్న జరిగిన ప్లీనరీ సమావేశాలలో మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్‌గారు నేడు దేశంలో విస్తరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజల్లో విభేదాలు సృష్టిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టని చాలా వాస్తవిక విషయాలను వెల్లడించారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లకయినా ఎరుక గలిగినందులకు అభినందించాలి.
             కానీ చివరన ఏమన్నారు. ఒకరిని గద్దె దించడం, మరొకరిని గద్దెనెక్కించడం ఒట్టి చెత్తపని అని కొట్టేశారు. ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని దేశం ముందుంచి, ప్రజలనే గద్దెనెక్కిస్తామని చాలా వినసొంపయిన మాటల్ని వినిపించారు. అందరం కలిసి బీజేపీని ఓడించాలన్న వామపక్షాల పిలుపు మాకు సమ్మతం కాదనీ సెలవిచ్చారు. ఇది నేలవిడిచి సాము చేయటమే అవుతుంది. రాజ్యంపై విరుచుకుపడే శత్రువును ముందుగా ఓడించకుండా, రాజ్యాభివృద్ధికీ, రక్షణ వ్యవస్థ నిర్మాణానికి ప్రణాళికలేస్తూ కూర్చుంటామా? అసలు ప్రత్యామ్నాయ విధానాలంటే ఏమిటి? ఏ వ్యవస్థలను రక్షించుకుంటే ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు పోగలుగుతాము!
             గత డెబ్బయ్యేండ్లుగా స్వతంత్ర భారతదేశం కొనసాగించిన జీవన విధానానికి పూర్తి విరుద్ధంగా, మత రాజ్యంగా మార్చాలని చూస్తున్న హిందూత్వ విద్వేషం రెచ్చగొట్టబడుతున్నది. రాజ్యాంగపు విలువలు అయిన ప్రజాస్వామిక లౌకిక విధానాలు విధ్వంసానికి గురవుతున్నవి. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ హిందూత్వకు అనుకూలంగా మార్చివేసే ప్రయత్నం ఆరెస్సెస్‌, బీజేపీలు వేగవంతం చేస్తున్నాయి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లు తీసుకువచ్చి మత విభజనకు పూనుకొంటున్నవి. భాష, వేషం, ఆహారం మొదలైన సాంస్కృతిక వైవిధ్యాలనూ ధ్వంసమొనరుస్తూ మునుపెన్నడూ లేని విధంగా విద్వేషాలను పెంచుతున్నవి. ప్రశ్నించినవారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నవి. చంపుతాం, చెరుపుతాం, కూల్చుతాం అంటూ బహిరంగంగానే బుల్డోజర్‌ రాజకీయాల్ని ఉసిగొల్పుతున్నవి. దీన్ని ముందుగా నిలువరించాలి కదా! దీనికి ప్రత్యామ్నాయం ఇంకేముంటుంది. మత సహన జీవనం, సామరస్యం, లౌకిక ప్రజాస్వామిక విధానం తప్ప.
             భారతదేశ ఫెడరల్‌ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి, కేంద్రీకృత నియంతృత్వ విధానాలకనుగుణంగా పన్నులు (జీఎస్‌టీ), వ్యవసాయ, విద్యుత్‌, విద్య మొదలైన వ్యవస్థలపై అధికారం చేస్తూ, గవర్నర్ల వ్యవస్థతో రాష్ట్రాలను నియంత్రించే కేంద్రం చర్యలను ఎదుర్కోవటానికి, ఆ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించి, ఫెడరల్‌ స్ఫూర్తిని కాపాడుకోవటం కంటే ప్రత్మామ్నాయం ఇప్పటికేమున్నది! ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఉపాధి, పేదరికం, ఆకలి, రైతుల ఆత్మహత్యలు, సామాజిక వివక్షతలు, కుల దురహంకార దాడులు మొదలైనవన్నీ ఉండగా వీటిపై నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు మతాన్ని, మత సంస్కృతిని విద్వేషంగా మార్చి ప్రయోగిస్తున్న బీజేపీని నిలువరించటం, ఓడించటం కన్నా ప్రధానాంశం ఏమున్నది.
             ఇక ఆర్థిక విధానాలు, కార్పొరేటు శక్తులకు దోచిపెడుతున్న తీరుకు భిన్నంగా ఉదారవాద ఆర్థిక విధానాలను వ్యతిరేకించే ఎజెండా టీఆర్‌ఎస్‌ దగ్గర ఏమయినావున్నదా! పన్నుల విధానాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు రాష్ట్రాల వాటాకు వాళ్లు ఎగనామం పెట్టారు. నోట్లు రద్దు చేసి ప్రజలను కష్టాలకు గురిచేసినా, అంతెందుకు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పినా మాట్లాడలేదు. రైతులను నిర్బంధించి, చంపి, నానా ఇబ్బందులకు గురిచేసినప్పుడూ నోరెత్తలేదు. కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడూ గొంతు విప్పలేదు. ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నా చూస్తూ ఊరకున్నారు. ఇవన్నీ ఉదారవాద ఆర్థిక విధాన దుప్ఫలితాలు. పోనీ ఇప్పుడైనా మాట్లాడటాన్ని ఆహ్వానించాలి. కానీ వాళ్ళను గద్దెదించడం మాపని కాదంటే ఎలా? మన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరిగిన చైనా గురించి ప్రస్తావించారు నాయకుడు. చైనా కమ్యూనిస్టు దేశమనే విషయం స్పష్టపరుచుకోవాలి. వామపక్షాలు ఎప్పటి నుండో ప్రజల ఎజెండాతో, ప్రత్యామ్నాయ విధానాలను వినిపిస్తూనే ఉన్నాయి. నేడు ఫాసిస్టు తిరోగమన విధానం ముంచెత్తుతున్నప్పుడు దాన్ని తిప్పికొట్టటమే ప్రధాన కర్తవ్యం కావాలి. అందుకు ప్రజాస్వామిక, లౌకిక, సామాజిక శక్తులన్నీ ఐక్యంగా నిలబడి వైవిధ్యభరితమైన భారతీయ జీవనాన్ని, మత సామరస్యాన్ని, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలి. ఈ అవసరాన్ని గుర్తెరగాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాటో కూటమి రణోన్మాదం!
ఇంటర్‌ తిప్పలు...
మహారాజ రాజశ్రీ...!
హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!
ప్రధాని వంచనా శిల్పం
గన్‌కల్చర్‌

తాజా వార్తలు

08:15 PM

5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

07:59 PM

రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:57 PM

హైదరాబాద్ లో నాని 'దసరా' కోసం భారీ సెట్

07:55 PM

అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.