Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధికి ఊతమేది...? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 01,2022

ఉపాధికి ఊతమేది...?

'మనిషికి తినటానికి తిండి, కప్పుకోవటానికి బట్ట, తలదాచుకోవటానికి ఓ కొంప అవసరం. వీటిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది...' ఒకానొక సందర్భంలో కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన మాటలివి. వీటితోపాటు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించటం ద్వారా ప్రజలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టు చేయగలగటం కూడా పాలకుల బాధ్యతే. ముఖ్యంగా రెక్కాడితేగానీ డొక్కాడని పేదలకు పని కల్పించటం అత్యంత ఆవశ్యకం. ఇదే ఉద్దేశంతో వామపక్షాల ఒత్తిడి మేరకు 2005లో ఉపాధి హామీ చట్టా(నరేగా)న్ని ఆనాటి యూపీఏ-1 ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా బడుగు జీవులకు ఎంతో కొంత ఉపశమనం లభించింది. అప్పటి నుంచి పని దొరకటమే కాదు.. దేశంలోని పేదల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి.
కానీ కేంద్రంలో యూపీఏ పోయి ఎన్డీయే వచ్చిన తర్వాత 'ఉపాధి'కి తూట్లు పొడవటం ప్రారంభమైంది. రకరకాల కొర్రీలు వేస్తూ కండీషన్లు పెడుతూ ఆ పథకాన్ని నిర్వీర్యం చేయటానికి మోడీ సర్కార్‌ కంకణం కట్టుకుంది. మరోవైపు సహకార సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తూ రాష్ట్రాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని, వివక్షనూ ప్రదర్శిస్తున్న కేంద్రం... నరేగా నిధులకూ గండి కొడుతున్నది. రాష్ట్రాలకు సంబంధిత డబ్బును సకాలంలో విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నది. ఇదే క్రమంలో తెలంగాణలో ఈ చట్టం అమలు కోసం ఇప్పటి వరకూ రూ.11,711 కోట్లను ఖర్చు చేశారు, అందులో ఇంకా రూ.1,100 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. బకాయిపడ్డ ఈ నిధులను సత్వరమే విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. ఎన్ని లేఖలు రాసినా కేంద్రం వైపు నుంచి స్పందన కరువైంది. నూతన ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమై రెణ్నెల్లు పూర్తవుతున్నా ఆ నిధులకు అతీగతీ లేకపోవటం ఆందోళనకరం. దీంతో కిందిస్థాయిలోని పేద కూలీలు సకాలంలో డబ్బులు అందక విలవిల్లాడుతున్నారు. కరోనాతో జీవితాలు కకావికలమై.. ఉపాధి కరువై అల్లాడుతున్న పేదలకు ఇది గోరు చుట్టపై రోకటిపోటులా మారింది. వారికి మరిన్ని రోజులపాటు పని కల్పించాల్సిన కేంద్రం... అందుకు భిన్నంగా ఉన్న ఉపాధినే ఊడగొట్టేందుకు ప్రయత్నించటం శోచనీయం.
మరోవైపు నిధుల విషయంలో కేంద్రం వైపు వేలెత్తి చూపుతున్న టీఆర్‌ఎస్‌ సర్కారు... ఒక విషయంలో మాత్రం అదే కేంద్రం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి మద్దతు పలుకుతుండటం విస్మయపరిచే అంశం. అదే వ్యవసాయానికి ఉపాధి హామీ చట్టాన్ని అనుసంధానించటం. బీజేపీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ అనుసంధానాన్ని గులాబీ పార్టీ కూడా కోరుకుంటున్నది. అదే జరిగితే ఇప్పటిదాకా నరేగా ఉద్దేశాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో... వాటన్నింటికీ తిలోదకాలు ఇచ్చేనట్టే అవుతుంది. ఇప్పటి వరకూ పేదలు, కూలీలు 'ఉపాధి' ద్వారా ఒకడి కింద ఊడిగం చేయకుండా తమ సొంత కాళ్ల మీద తాము నిలబడ్డారు. ఇది వారిలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఇతర బూర్జువా పార్టీలు కోరుకున్నట్టు... ఆ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానిస్తే అవి రెండూ పూర్తిగా తొక్కేయబడతాయి. ఈ పేరుతో గ్రామాల్లోని భూస్వాములు, పెత్తందార్ల భూములు, ఇండ్లలో పేదలు చాకిరీ చేయాల్సి వస్తుంది. ఇదిప్పుడు అందర్నీ ఆందోళనపరిచే అంశం. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా... బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీలేవైనా సరే... 'ఉపాధిని వ్యవసాయానికి అనుసంధానం...' చేయాలని చూస్తే దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించాలి. ఇందుకోసం పేదలు, వ్యవసాయ కార్మికులతో కలిసి మేధావులు, అభ్యుదయవాదులు నడుం బిగించాలి. దీంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఇదే సమయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల తొలగింపు, పని ప్రదేశాల్లో తాగునీరు అందుబాటులో ఉంచకపోవటం, ప్రాథమిక వైద్య సౌకర్యం కల్పించకపోవటం, ఐదు కిలోమీటర్ల దూరం దాటితే ప్రయాణ ఖర్చులు భరించాలన్న నిబంధనను అమల్జేయక పోవటం, పలుగు, పార, తట్ట, బుట్ట తదితర వస్తువులను ఏడేండ్ల నుంచి ఇవ్వకపోవటం, టెంట్లు వేయకపోవటం తదితర సమస్యలు 'ఉపాధి'ని వెంటాడుతున్నాయి. వీటికితోడు కూలీలకు మస్టర్ల సమస్య ప్రధానంగా ఎదురవుతున్నది. అంటే పనికి వెళ్లిన కూలీల ఫొటోలు, వేలి ముద్రలను ఏ పూటకాపూట వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి పై అధికారులకు పంపాలన్నమాట. అనేక గ్రామాలకు ఇప్పటికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేని క్రమంలో... ఇది ఆచరణ సాధ్యం కాని పని. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలోని ఇలాంటి సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించటం ద్వారా 'ఉపాధి'ని మరింత పటిష్ట పరచాలి. లేదంటే పేదలు, వ్యవసాయ కార్మికులు తమ పోరాటాల ద్వారా ఆ పనికి పూనుకోవాల్సి వస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సత్యం వధ.. ధర్మం చెర..!
ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు!
వైద్యమో.. చంద్రశేఖరా...
పాడిందే పాట...
ప్రహసనంగా పార్లమెంటు!
ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...

తాజా వార్తలు

08:48 PM

ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు

08:35 PM

నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

08:27 PM

భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

07:06 PM

కేంద్ర నిఘా సంస్థల దుర్వినియోగం : సీపీఐ(ఎం)

07:04 PM

నారాయ‌ణ కాలేజీకి ప్ర‌భుత్వం షోకాజ్ నోటీస్

06:44 PM

టాలీవుడ్ లో విషాదం..

06:37 PM

రామోజీ ఫిలిం సిటీకి అమిత్ షా

06:04 PM

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

05:33 PM

సీజేఐ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ

05:13 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

05:10 PM

మునుగోడులో మా ముందు మూడు ఆప్ష‌న్లు: సీపీఐ నారాయ‌ణ‌

05:10 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:08 PM

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

04:47 PM

చంద్ర‌బాబుకు ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స‌వాల్‌

04:35 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

04:06 PM

పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..

03:34 PM

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

03:26 PM

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!

03:07 PM

నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

02:32 PM

బాలికపై లైంగికదాడి చేయించిన స్నేహితురాలు

01:25 PM

సీబీఐ దాడుల్లో ఏం దొరకదు : అరవింద్ కేజ్రీవాల్

01:14 PM

200 కిలోల గంజాయి, ఏకే 47 పట్టివేత

01:09 PM

పాత యాదగిరిగుట్టలో రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

01:04 PM

ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

12:49 PM

ట్రాఫిక్ పోలీసులపై రాళ్లతో మందుబాబు దాడి

12:44 PM

20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

12:38 PM

హైదరాబాద్‌లో 1500లకు పైగా మల్టీనేషనల్ కంపెనీలు : కేటీఆర్

12:26 PM

తిరుమలను సందర్శించిన కర్ణాటక సీఎం

12:19 PM

ఫెర్రీ ఘాట్‌లో నీటమునిగిన ఐదుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు

12:06 PM

తెలంగాణ జవాన్ ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.