Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గతి తప్పుతున్న పాఠాలు... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 05,2022

గతి తప్పుతున్న పాఠాలు...

చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్విలేక చతురతగలుగున్‌
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ! అని హిరణ్యకశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ చెప్పిన మాటలు. చదువుకోవాలి, ఎందుకంటే చదివితే మంచీ చెడుల మధ్య తేడా ఏంటో తెలుస్తుంది అని చెప్పాడు. మన పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతంలోని పద్యమిది. బాగానే ఉంది. హిరణ్యకశ్యపుడు రాజు. తన ఆలోచనలకు, రాజ్యానికి అనుకూలమైన, మద్దతుపొందే చదువును, శైవసంప్రదాయాన్ని అందించాలనే తలంపుతో చదవమన్నాడు. కానీ వాడు నేర్చుకున్నది వేరు. అసలు విషయమేమిటంటే, పాలకులు ఎప్పుడయినా అది రాజుల కాలమైనా ఆధునిక కాలమైనా, తమకు పనికివచ్చే, తమను సమర్థించే విద్యనే నేర్పాలనుకుంటారు. సత్యాసత్యాలతో వారికి పనిలేదు. మన విద్యావిధానం కూడా ఆంగ్లేయుడు మేకాలే రూపొందించినదే. సేవకులుగా తీర్చిదిద్దే విద్యను ఎంచక్కా అమలు పరిచారు. భారతీయ రక్తం కలిగున్నా, ఆలోచనల్లో ఆంగ్లేయుల ననుసరించాలని భావించారు. అయితే మన ప్రహ్లాదుడిలాగానే కొందరు భారతీయులు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి విముక్తి పోరాటానికి పూనుకొన్నారు. వాస్తవిక చైతన్యంలోకి వచ్చారు.
ఇదంతా చరిత్ర. డెబ్బయియేండ్లు దాటిన స్వాతంత్య్రంలో మనం ఎలాంటి విద్యను గరుపు తున్నాము. మనశక్తిని మనం పెంచుకోవటానికి, సాధికారతను సాధించుకోవటానికి, సొంత ఆలోచనతో శాస్త్రసాంకేతికరంగంలో, పరిశోధనలో ప్రగతిని పొందేందుకు విద్యను మలచుకున్నామా! స్పష్టంగానే కాదు, లేదు అని చెప్పవచ్చు. మార్కెట్‌లో మహావ్యాపారులకు లాభాలను ఎలా తెచ్చిపెట్టాలనే పరిశోధనలే ఉన్నత విద్యా లక్ష్యాలుగా మారాయి. మార్కెటింగ్‌ నైపుణ్యాల కోసమే విద్య బోధించబడుతోంది. గత పది సంవత్సరాలలో పరిశోధనలో ఒక్క ముందడుగూ లేదు. అంతే కాదు, మూడు దశాబ్దాలుగా పరిశోధన ఫలితాలేవీ లేక పోవడం, వాటి కోసం ప్రయత్నమూ, వ్యయమూ, కేటాయింపులూ జరగకపోవడం ఒక విషాదం. అసలు ఉన్నత విద్యలో ప్రభుత్వ ప్రమేయాన్ని తొలగించుకుంటూ ప్రయివేటుకు ప్రోత్సాహాన్ని పెంచటాన్ని చూస్తున్నాము. ఎదుగుతున్న ప్రపంచానికి భారతదేశం ఆదర్శమనే ప్రచారం వెనకాల ఉన్న చేదునిజాలివి. కేవలం మాటలకు, ప్రచారానికి మాత్రమే పరిమితమైన పాలకవర్గాల ఆలోచన ఫలితాలు ఇలానే ఉంటాయి.
ఇదలా ఉంచితే, 'చదివిన వాడజ్ఞుండగు' అని పోతనగారిని తిరగేసి చదువుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు విద్యారంగానికి మరో పెద్ద ప్రమాదం ఎదురవుతున్నది. అదేమంటే మత పరమైన, మనువాద భావజాలాన్ని విద్యలోకి తెస్తున్నారు. పురాణాలు, వేదాలు, భగవద్గీతలు, జ్యోతిష్యం, హస్త సాముద్రిక జ్ఞానం, చిలుక జ్యోస్యాలు మొదలైన వాటిని ప్రవేశపెట్టి, విద్యార్థుల మెదళ్లను వికసించకుండా, మూఢత్వాన్ని నింపుతున్నారు. ఇవన్నీ కూడా ఇష్టమైనవాళ్ళు ఇంట్లోవుండి చదువుకోవచ్చు. వీటికి విద్యాలయాలు అవసరం లేదు. అంటే భావితరాలు మూఢత్వంలో మునిగిపోయి, నమ్మకాల్లో కూరుకుపోవాలని పాలకులు కోరుకుంటున్నారు. ఇకపోతే చరిత్రకు సంబంధించిన విషయాలను కూడా మత ప్రాతిపదికన వక్తీకరించి అందించే ప్రయత్నం ఆరంభమయింది. ఇటీవల కర్నాటక రాష్ట్రంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం, పాఠశాల పాఠ్యాంశాల పునర్‌పరిశీలనకు కమిటీని వేసి పాఠాలను మారుస్తున్నది. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన భగత్‌సింగ్‌ పాఠాన్ని, టిప్పు సుల్తాన్‌, సంఘ సంస్కర్తలు బసవన్న, పెరియార్‌, నారాయణ గురు వంటివారి చరిత్రను సిలబస్‌ నుండి తొలగించింది. స్వాతంత్య్రోద్యమానికి ఏ సంబంధమూ లేని ఆరెస్సెస్‌ వ్యవస్థాపక నేత హెడ్గేవార్‌ చేసిన ప్రసంగాన్ని పాఠంగా చేర్చారు. వీరుల త్యాగాల చరిత్రను మరుగుపరచి మతతత్వాన్ని పాఠ్యాంశాల్లోకి తెస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. అందుకనే కర్నాటకలోని రచయితలు, కవులు దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మేధావులు, విద్యావేత్తలు, రచయితలు తమ తమ పదవులకూ రాజీనామా చేసి, రాజ్యాంగానికి విరుద్ధంగా విద్వేషాలు పెంచే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఖండించారు. విద్యను కాషాయీకరించే చర్యను సహించబోమని హెచ్చరించారు. మేథోవర్గాల నుండి ఈ రకమైన స్పందన రావటం శుభపరిణామం. భవిస్యత్‌ తరాలు ఛాందసత్వంలో, మత మూఢత్వంలో కూరుకుపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. తిరోగమన చర్యలను అడ్డుకోకపోతే, ఆధునిక వెలుగుల భారతాన్ని కలగనలేము. మేధావులు, ప్రజలు మేల్కోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సత్యం వధ.. ధర్మం చెర..!
ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు!
వైద్యమో.. చంద్రశేఖరా...
పాడిందే పాట...
ప్రహసనంగా పార్లమెంటు!
ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...

తాజా వార్తలు

08:48 PM

ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు

08:35 PM

నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

08:27 PM

భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

07:06 PM

కేంద్ర నిఘా సంస్థల దుర్వినియోగం : సీపీఐ(ఎం)

07:04 PM

నారాయ‌ణ కాలేజీకి ప్ర‌భుత్వం షోకాజ్ నోటీస్

06:44 PM

టాలీవుడ్ లో విషాదం..

06:37 PM

రామోజీ ఫిలిం సిటీకి అమిత్ షా

06:04 PM

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

05:33 PM

సీజేఐ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ

05:13 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

05:10 PM

మునుగోడులో మా ముందు మూడు ఆప్ష‌న్లు: సీపీఐ నారాయ‌ణ‌

05:10 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:08 PM

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

04:47 PM

చంద్ర‌బాబుకు ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స‌వాల్‌

04:35 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

04:06 PM

పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..

03:34 PM

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

03:26 PM

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!

03:07 PM

నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

02:32 PM

బాలికపై లైంగికదాడి చేయించిన స్నేహితురాలు

01:25 PM

సీబీఐ దాడుల్లో ఏం దొరకదు : అరవింద్ కేజ్రీవాల్

01:14 PM

200 కిలోల గంజాయి, ఏకే 47 పట్టివేత

01:09 PM

పాత యాదగిరిగుట్టలో రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

01:04 PM

ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

12:49 PM

ట్రాఫిక్ పోలీసులపై రాళ్లతో మందుబాబు దాడి

12:44 PM

20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

12:38 PM

హైదరాబాద్‌లో 1500లకు పైగా మల్టీనేషనల్ కంపెనీలు : కేటీఆర్

12:26 PM

తిరుమలను సందర్శించిన కర్ణాటక సీఎం

12:19 PM

ఫెర్రీ ఘాట్‌లో నీటమునిగిన ఐదుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు

12:06 PM

తెలంగాణ జవాన్ ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.