Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తలవంపులు! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 07,2022

తలవంపులు!

ఈ తలవంపులకు కారణమెవ్వరు! డెబ్భయి ఐదేండ్ల స్వాతంత్య్ర భారతావని జీవన విధానానికి కళంకమద్దుతున్నదెవ్వరు? భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకుని, సత్యాహింసల శాంతి ప్రబోధాన్ని ప్రపంచాన చాటిన తరతరాల నేలను కల్మషమయం చేస్తున్నదెవరు! 'వసుధైక కుటుంబకం' అన్న నినాదముద్భవించిన భూమిలో విద్వేష కోరలు చాస్తున్నదెవరు? 'భారతీయులందరూ నా సహౌదరులు' అనే ప్రతిజ్ఞకు తూట్లు పొడుస్తున్న వేర్పాటువాదులెవ్వరు? సహనశీల మనస్సులలో విధ్వంసాల నెగళ్లనెగదోస్తున్నదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పాలక పార్టీవైపునకు వేళ్లు తిరుగుతాయి. ఇప్పటికి ఇంకా స్పష్టపడని వాళ్ళు ఇకనైనా తెలుసుకోవలసిన అవసరముంది. ఎందుకంటే ప్రపంచం ముందు తలవంపులు అందరికీ వర్తిస్తాయి. మహమ్మదు ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది మామూలు వ్యక్తులు కాదు. ఒక దేశానికి నాయకత్వం వహిస్తున్న అధికార పార్టీ అధికార ప్రతినిధులు. అందుకనే ఇస్లామిక్‌ దేశాలు ప్రతిస్పందిస్తున్నాయి.
మనం అప్పుడే వాళ్ళ చేతులకు తాళాలెయ్యాల్సి ఉండె. గుజరాత్‌లో మైనార్టీలపై రాక్షసదాడులు చేసి వేలాదిమందిని హతమార్చిననాడు, మహాత్ముని బొమ్మలపై తూటాపేల్చి ఆనందించిననాడు, గాడ్సేను దేశభక్తుడని పొగిడిన నాడు, గొడ్డుమాంసం పేరుతో అఖ్లాక్‌ను కొట్టి చంపిన నాడైనా, గుజరాత్‌ మోడల్‌తో ఢిల్లీలో మత ఘర్షణల హత్యాకాండనాడైనా విద్వేషపు దుష్టత్వానికి చెక్‌పెట్టి ఉండాల్సింది. భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోకుండా మనం మానవీయంగా మనుగడ సాగించలేమనే విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇదొక ఉన్మాదస్థాయికి చేరుకో బోతున్నది. అందుకు నిలువెత్తు సాక్ష్యాలు నుపూర్‌ శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ వ్యాఖ్యానాలు. ఇవ్వేదో దొర్లిన మాటలు కాదు. మెదళ్లలో పేరుకొన్నవే. పరమత విద్వేషం ఈ ఇద్దరికి సంబంధించినదేనా! వీరికి ఆ వొరవడినద్దిన ఆరెస్సెస్‌ పాఠశాలవి కావా? ఆ పాఠశాలలోనే నాటి వాజ్‌పేయి నుండి నేటి మోడీ వరకు చదువుకుని, నేర్చుకుని ఎదిగినవారు కాదా? నేటి పాలకులంతా ఆ వరవడిలో ఎదిగినవారే! క్షమాపణలు చెప్పి, మాటలను వెనక్కు తీసుకున్నా బహిష్కరణ వేటు పడినా, నుపూర్‌ శర్మ చెబుతున్నదేమిటి? నాకు ప్రధాని, హౌంమంత్రి, పార్టీ ఛీప్‌ నడ్డా ప్రముఖులతో సంభాషణలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించింది కదా!
తమ దేశంలో యూదుల హననానికి పాల్పడి, జర్మన్‌జాతి దురహంకారంతో ప్రపంచంపైబడిన హిట్లర్‌ వీరికి ఆదర్శనీయుడు. కానీ ప్రపంచం అతన్ని కుక్కచావు చచ్చేలా చేసింది. ఎందుకంటే అధికారం కోసం జాతిదురహంకారం తోడ్పడుతుందేమో కానీ, పెట్టుబడి, దాని చలనానికి హద్దులు గీస్తే బద్ధలు కొడుతుంది. సరుకుల విస్తరణకు, లాభాలకు, జాతుల గిరిగీతలను పెట్టుబడి సహించబోదు. అయితే ఏకపక్ష దోపిడీకి ఆయా దేశాల్లో నియంతృత్వ, ఫాసిస్టు శక్తులకు అది కాపుకాస్తుంది. అందుకేమరి ఇస్లామిక్‌ దేశాలలో కొన్ని అదానీ, అంబానీ సరుకులను ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారని తెలవగానే తీవ్రంగా బెంబేలెత్తి పోయారు. వ్యాపార లావాదేవీలకు దెబ్బ తగులుతుందని తల్లడిల్లి నష్టనివారణ చర్యకు పూనుకున్నారు. వారు ఏ ఉద్దేశాలతో చేసినా భారతదేశ ప్రజాస్వామిక, లౌకిక సంప్రదాయానికి విఘాతం కలిగించే వారి చర్య గర్హనీయమైనది. చాలా ఆలస్యంగా ప్రభుత్వం స్పందించింది. అప్పటికే అరబిక్‌ దేశాలు, 56 దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కంట్రీస్‌, భారతదేశంలోని పాలక పార్టీని నిలదీసాయి. ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌ దేశాలు భారత రాయబారులను పిలిచి వివరణ కోరాయి. ఉప రాష్ట్రపతి తన ప్రెస్‌మీట్‌ను చివరికి అధికారయుత విందును కూడ రద్దుచేసుకోవాల్సి వచ్చిందంటే మన ''దౌత్య దౌర్భాగ్యం'' అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆరెస్సెస్‌ భావజాలపు ప్రతిబింబమైన బీజేపీ విధానం వలన భారతదేశం ఇంతటి ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఇది వారిలో చక్కబడే విధానం కాదు. మనం ప్రక్కన పెట్టాల్సిన విధానం. మన రాష్ట్రంలోని ఆపార్టీ నేత కూడా మసీదులు తవ్వాలని పిలుపునిచ్చాడు. వారి శాసనసభ్యుడైతే మా ధర్మాన్ని నిలబెట్టటం కోసం ఎవరినైనా చంపుతామని బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. వీరిపై రాజ్యాంగం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా! రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ నిర్బంధ కాండను ప్రశ్నించిన రిహానా, గ్రేటాథన్‌బర్గ్‌లను, ఇది మా దేశ అంతర్గత విషయమని పెద్ద ఫోజులిచ్చిన భారతరత్న సచిన్‌, సునీల్‌ శెట్టి, అక్షయ కుమార్‌, కంగనా రనౌత్‌లు ఇప్పుడు మాట్లాడరేమి?
ప్రపంచ వ్యాపితంగా ఇంత చర్చకు కారణమైన, దేశం క్షమాపణలు చెప్పాల్సి వచ్చిన కారకులను కేవలం పార్టీ నుండి బహిష్కరించి ఊరుకున్నారు. వాళ్లకు తెలుసు, తాము ఆర్నెళ్ళలో తిరిగి పార్టీలోకి వస్తామని, కానీ చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రధాని నోరువిప్పాలి. దేశంలో జరుగుతున్న ఏ విద్వేషపు ఘటనలకు, మాటలకు ఆయన స్పందించటం లేదు. రాజ్యాంగం ఆధారంగా గద్దెనెక్కిన ప్రభు త్వాలు, ఆ విలువలను కాపాడకుంటే ఇలా తలవంపులకు గురవుతూనే ఉంటాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సత్యం వధ.. ధర్మం చెర..!
ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు!
వైద్యమో.. చంద్రశేఖరా...
పాడిందే పాట...
ప్రహసనంగా పార్లమెంటు!
ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...

తాజా వార్తలు

08:48 PM

ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు

08:35 PM

నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

08:27 PM

భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

07:06 PM

కేంద్ర నిఘా సంస్థల దుర్వినియోగం : సీపీఐ(ఎం)

07:04 PM

నారాయ‌ణ కాలేజీకి ప్ర‌భుత్వం షోకాజ్ నోటీస్

06:44 PM

టాలీవుడ్ లో విషాదం..

06:37 PM

రామోజీ ఫిలిం సిటీకి అమిత్ షా

06:04 PM

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

05:33 PM

సీజేఐ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ

05:13 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

05:10 PM

మునుగోడులో మా ముందు మూడు ఆప్ష‌న్లు: సీపీఐ నారాయ‌ణ‌

05:10 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:08 PM

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

04:47 PM

చంద్ర‌బాబుకు ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స‌వాల్‌

04:35 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

04:06 PM

పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..

03:34 PM

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

03:26 PM

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!

03:07 PM

నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

02:32 PM

బాలికపై లైంగికదాడి చేయించిన స్నేహితురాలు

01:25 PM

సీబీఐ దాడుల్లో ఏం దొరకదు : అరవింద్ కేజ్రీవాల్

01:14 PM

200 కిలోల గంజాయి, ఏకే 47 పట్టివేత

01:09 PM

పాత యాదగిరిగుట్టలో రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

01:04 PM

ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

12:49 PM

ట్రాఫిక్ పోలీసులపై రాళ్లతో మందుబాబు దాడి

12:44 PM

20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

12:38 PM

హైదరాబాద్‌లో 1500లకు పైగా మల్టీనేషనల్ కంపెనీలు : కేటీఆర్

12:26 PM

తిరుమలను సందర్శించిన కర్ణాటక సీఎం

12:19 PM

ఫెర్రీ ఘాట్‌లో నీటమునిగిన ఐదుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు

12:06 PM

తెలంగాణ జవాన్ ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.